A pair of love birds.అది దట్టమైన ఒక అరణ్యం. ఆ అరణ్యంలో ఒక చెట్టు మీద రామచిలుకలు గూళ్ళు కట్టుకుని జీవిస్తూ వచ్చాయి.
ఒక రామచిలుక తన గూటిలో గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన కొన్ని రోజుల తరువాత ఒక రోజు ఆ రామచిలుక బైటకు వెళ్ళింది. అప్పుడు గాలి కాస్త ఎక్కువగా వీచడంతో గూటిలో ఉన్న గుడ్లలో ఒకటి అటూ ఇటూ కదిలి కిందపడిపోయి విరిగిపోయింది! ఆ గుడ్డు నుండి ఒక చిలుకపిల్ల బైటకు వచ్చింది.
అప్పుడే గుడ్డునుండి పిల్ల బైటకు రావడం వలన దాని ఒంటికి గుడ్డులోని సొన అంటుకొని ఉంది.
కొద్దిసేపటి క్రితమే గుడ్డు నుండి చిలుకపిల్ల బైటకు వచ్చినందున, దాని వల్ల ఎగరడానికీ సాధ్యం కాలేదు, స్వయంగా తానే ఆహారం వెతుక్కోవడానికీ సాధ్యం కాలేదు.
ఈ స్థితిలో ఉన్న ఆ చిలుకపిల్లను, ఆ దారిలో యాదృచ్ఛికంగా పోతున్న ఒక వేటగాడు చూశాడు.
‘ఈ చిలుకపిల్లను మరే పక్షి అయినా చూస్తే, ఎత్తుకుపోయి. ముక్కుతో పొడిచి చంపేస్తుంది! కాబట్టి నేను దీనిని తీసుకుపోయి పెంచుకుంటాను’ అని ఆ వేటగాడు అనుకున్నాడు.
ఆ ఉద్దేశంతో అతడు దారిలో పడి ఉన్న చిలుకపిల్లను, తన వద్ద ఉన్న ఒక బుట్టలో జాగ్రత్తగా ఉంచి, తన గుడిసెకు తీసుకుపోయాడు.
ఇది జరిగిన కొంతసేపటికి….
మళ్ళీ అదే చెట్టు మీద నుండి, అదే గూడు నుండి, మరో గుడ్డు మునుపటి మల్లేనే కింద పడింది. ఆ గుడ్డునుండి కూడా ఒక చిలుకపిల్ల చిలుకపిల్ల కూడా నిరాదరణతో బైటకు వచ్చింది. కొట్టుమిట్టాడసాగింది.
ఆ సమయంలో ఆ దారిగుండా ఒక మునివర్యుడు వెళ్ళడం తటస్థించింది. ఆయనకు ఆదరణలేని ఆ చిలుకపిల్ల పరిస్థితి అర్థమయింది.
‘ఈ చిలుకపిల్ల ఇక్కడ ఇట్లే పడి ఉంటే, తక్కిన పక్షులకు త్వరలోనే ఆహారమైపోతుంది! కాబట్టి దీన్ని నా ఆశ్రమానికి తీసుకుపోయి పెంచుకోవడం ఒక్కటే దీన్ని రక్షించే మార్గం!’ అని ఆయన భావించాడు.

ఆ ప్రకారమే మునివర్యుడు చిలుకపిల్లను తన ఆశ్రమానికి జాగ్రత్తగా తీసుకుపోయాడు.
వేటగాడు తీసుకుపోయిన చిలుకపిల్ల, వేటగాని గుడిసెలో పెరుగుతూ కొంతకాలానికి ఒక పెద్ద రామచిలుక అయింది.
మునివర్యుడు తీసుకుపోయిన చిలుకపిల్ల ఆశ్రమంలో పెరుగుతూ అదికూడా కొంతకాలానికి పెద్ద రామచిలుక అయింది.
ఇలా ఉండగా ఒక రోజు ఈ అడవికి ఒక రాజు వేటాడడానికి వచ్చాడు.
ఆయన మునిగిపోయాడు. మండుటెండలో పగలంతా వేటాడడంలో
దాంతో రాజు బాగా అలసిపోయాడు. దాహంతో ఆయన నోరు. ఎండిపోసాగింది.
‘తాగడానికి నీరు ఎక్కడైనా దొరుకుతుందా?’ అనుకుని వెతుక్కుంటూ నడవసాగాడు.
అప్పుడు కాస్త దూరంలో ఆయనకు ఒక గుడిసె కనిపించింది.
‘అక్కడకు పోయి నీళ్ళు అడిగి తాగవచ్చు!’ అనుకుని రాజు గుడిసె వద్దకు వెళ్ళాడు.
అది మన వేటగాడి గుడిసె. రాజు వెళ్ళినప్పుడు వేటగాడు గుడిసెలో లేదు. అక్కడ వేటగాడు పెంచుకుంటున్న చిలుక మాత్రం ఉంది.
ఆ చిలుక రాజు వస్తూండడం చూసీచూడగానే “ఎవరో ఒక దొంగ వస్తున్నాడు! వీడ్డి కట్టిపడేసి బాగా తన్నాలి!” అంటూ సంస్కారహీనమైన పలుకులు పలికింది.
రాజు అనాగరకమైన చిలుక పలుకులను దిగ్భ్రాంతితో విన్నాడు. ఇటువంటి కుసంస్కారుల ఇంట్లోకి ఎవరు పోతారు? ఇక్కడికన్న మరో చోటుకు పోయి నీళ్ళు తాగుతాను!’ అని నిశ్చయించుకుని అక్కణ్ణుండ్ వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
రాజు దప్పిక తీవ్రరూపం దాల్చింది. ‘ఎక్కడన్నా నీళ్ళు దొరుకుతాయా?’ అనుకొంటూ నెమ్మదిగా రాజు నడవసాగాడు.
కాస్త దూరం నడిచిన తరువాత రాజుకు ఒక ఆశ్రమం కనిపించింది. అది మునివర్యుని ఆశ్రమం. ‘బ్రతుకుజీవుడా’ అనుకొంటూ రాజు ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు ముని ఆశ్రమంలో లేదు. మునివర్యుడు పెంచుతున్న చిలుక మాత్రం ఆశ్రమంలో ఉంది.
రాజు రావడాన్ని చిలుక చూసింది. అది రాజును చూసీ చూడగానే, ‘అయ్యా! రండి, రండి! మీకు స్వాగతం! మునివర్యులు బైటకు వెళ్ళి ఉన్నారు. ఆయన కాసేపట్లో వచ్చేస్తారు. మీరు లోపలకు వచ్చి కూర్చోండి. పక్కనే పాలు, పళ్ళు, చల్లని నీరు ఉన్నాయి. సేదతీరడానికి ముందు చల్లని నీరు తాగి, పళ్ళు తిని ఆ తరువాత పాలు తాగండి. పిదప కాసేపు నడుం వాల్చండి” అని సంస్కారం ఉట్టిపడే పలుకులతో రాజును ఆహ్వానించింది.
సంస్కారవంతమైన ఆ చిలుక పలుకులు విని రాజు సంతోషంగా ఆశ్రమంలోకి వెళ్ళాడు.
తరువాత ఆయన చల్లని నీరు తాగి అలుపు తీర్చుకున్నాడు; పిదప పళ్ళు తిని, పాలు కూడా తాగాడు.
బడలిక తీరేదాకా రాజు ఆశ్రమంలో సుఖంగా విశ్రమించాడు.
పై కథలో మనం చూసిన రెండు చిలుకలూ ఒకే తల్లి కన్ను పిల్లలు, ఒకే కొమ్మకు పూచిన రెండు పువ్వులు, కాని రెండు చిలుకల మధ్య ఎంతటి తారతమ్యం!
ఈ తారతమ్యానికి కారణం ఏమిటి? అవి పెరిగిన వాతావరణమూ, పొందిన శిక్షణా అందుకు కారణం.
మొరటు వాడైన వేటగాడి వద్ద పెరిగిన చిలుక సంస్కారహీనమైన పలుకులు పలికింది.
మునివర్యుని వద్ద పెరిగిన చిలుక మధురంగానూ, సంస్కారం ఉట్టిపడే పలుకులను పలికింది.
మనం ఉన్నతులైనవారితో, ఉన్నత సంస్కారాలు గల వారితో సాంగత్యం చేసినప్పుడు మనమూ ఉన్నతులమే అవుతాం.
చెడ్డవారితోనూ, చెడు అలవాట్లు గల వారితోనూ మనం నెరపే సాంగత్యం మనలనూ చెడ్డవారిగా పరిణమింపజేస్తుంది.
వర్షపు నీరు మంచినీరు. అది నల్లరంగు మన్నుగల చోట నిలవ ఉంటే నల్లగా ఉంటుంది. అదే నీరు ఎర్రరంగు మన్నుగల చోట నిలవ ఉంటే ఎర్రగా ఉంటుంది. ఈ తారతమ్యం, వర్షపు నీరు నిలవ ఉండే చోట గల మట్టిరంగు కారణంగా ఏర్పడుతుంది. ఈ విధంగానే మనం ఏర్పరచుకునే పరిస్థితి మేరకు మన నైజం మంచిగానో చెడుగానో పరిణమిస్తుంది.
మురికినీరు మురుగు కాలువలలో చేరితే అది మురుకి నీరుగానే ఉంటుంది. అదే మురికినీరు గంగానదిలో చేరితే, అది పావన గంగాజలం అయిపోతుంది.
ఇది చిన్నవారు పెద్దవారితోసాంగత్యం వలన వారు పెద్దవారు అవడం సాధ్యమని చూపుతోంది. అందుకే, “పువ్వుతో చేరిన నార కూడా పరిమళిస్తుంది” అని పెద్దలు చెబుతుంటారు.
జన్మతః రాక్షసుడే అయినప్పటికీ విభీషణుడు, రాముని సాంగత్యం నెరపి శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు.
దుర్యోధనుని సాంగత్యం వలన కర్ణుడు నేర చరితుడుగా నిలిచిపోయాడు.
మనం సజ్జనులుగా జీవించాలని కోరుకోవడం మాత్రం చాలదు;
మనం సజ్జనులతోనూ, పెద్దలతోను సాంగత్యం నెరపడం కూడా. చేయాలి. అదే కాకుండా దుర్జనుల సాంగత్యాన్ని నెరపకుండా, దురలవాట్ల జోలికి పోకుండా అహర్నిశలూ ప్రయత్నిస్తూ ఉండాలి.
పొలంలో వడ్లను నాటితే మాత్రం చాలదు; వరి పంటకు వచ్చినప్పుడు, పొలంలో మొలిచే కలుపుమొక్కలను సముచిత సమయంలో పీకిపారవెయ్యాలి. అప్పుడే పూర్తి ఫలసాయం మనకు లభిస్తుంది.
అలా చెయ్యకుండా పొలంలో పంటతో పాటు కలుపుమొక్కలను కూడా పెరుగనిస్తే, ఫలసాయంలో గంటుపడుతుంది.
జన్మతః అందరూ సమానులే! అయినప్పటికీ వారు వారు చేస్తున్న వృత్తుల తారతమ్యాలను బట్టి స్వభావాలలో మార్పు అనివార్యం నేరిపే సాంగత్యం వలన వారు పెద్దవారు అవడం సాధ్యమని చూపుతోంది.
అందుకే, “పువ్వుతో చేరిన నార కూడా పరిమళిస్తుంది” అని పెద్దలు చెబుతుంటారు.
జన్మతః రాక్షసుడే అయినప్పటికీ విభీషణుడు, రాముని సాంగత్యం నెరపి శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు.
దుర్యోధనుని సాంగత్యం వలన కర్ణుడు నేర చరితుడుగా నిలిచిపోయాడు.
మనం సజ్జనులుగా జీవించాలని కోరుకోవడం మాత్రం చాలదు; మనం సజ్జనులతోనూ, పెద్దలతోను సాంగత్యం నెరపడం కూడా. చేయాలి. అదే కాకుండా దుర్జనుల సాంగత్యాన్ని నెరపకుండా, దురలవాట్ల జోలికి పోకుండా అహర్నిశలూ ప్రయత్నిస్తూ ఉండాలి.
పొలంలో వడ్లను నాటితే మాత్రం చాలదు; వరి పంటకు వచ్చినప్పుడు, పొలంలో మొలిచే కలుపుమొక్కలను సముచిత సమయంలో పీకిపారవెయ్యాలి. అప్పుడే పూర్తి ఫలసాయం మనకు లభిస్తుంది.
అలా చెయ్యకుండా పొలంలో పంటతో పాటు కలుపుమొక్కలను కూడా పెరుగనిస్తే, ఫలసాయంలో గంటుపడుతుంది.
జన్మతః అందరూ సమానులే! అయినప్పటికీ వారు వారు చేస్తున్న వృత్తుల తారతమ్యాలను బట్టి స్వభావాలలో మార్పు అనివార్యం.