uplifting insight into the beauty of everyday life.(నవ్వుకు ఏది కారణం?)

uplifting insight into the beauty of everyday life

ఒక రాజుకు జీవితంలో ‘నవ్వు’ అన్నదే లేకుండా పోయింది. ఆయనకు నవ్వు కరవయ్యింది. ‘తన నవ్వు తస్కరింపబడింది’ అని రాజు అనుకోసాగాడు.

ఇలా ఉండగా ఒక రోజు రాజు ఇక ఉండబట్టలేక తన మంత్రితో, “నేను నవ్వి ఆనందించడానికి మార్గం ఏమిటి?” అని అడిగాడు.

అందుకు ఏం జవాబు ఇవ్వాలో మంత్రికి పాలుబోలేదు. అయినా ఏదో జవాబు ఇవ్వకుండా ఉండకూడదు కదా! అందుకని వెంటనే, “రాజా! ఇందుకు ఓ ఉపాయం ఉంది. నవ్వి ఆనందిస్తున్న ఒక వ్యక్తి ధరించిన చొక్కా తీసుకుని ధరించండి. దాంతో మీరూ నవ్వి ఆనందభరితులు అవుతారు” అని తడుముకోకుండా సలహా ధోరణిలో జవాబిచ్చాడు.

‘నవ్వుతూ ఆనందంగా ఉన్న ఒక వ్యక్తిని కలుసుకొని, అతడి చొక్కాను అడిగి పుచ్చుకోవాలి’ అని రాజు మనసులో అనుకుని వెంటనే గుర్రం మీద బయలుదేరాడు.

రాజు నగరంలోకి వెళ్ళి కొందరిని కలుసుకున్నాడు. వారిని, “మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటున్నారా?” అని అడగడం ప్రారంభించాడు.

కాని ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరూ, “నాకు ఈ దిగులు, నాకు ఆ దిగులు, నాకు ఆ కొరత, నాకు ఈ కొరత!” అనే జవాబిచ్చారు.

రాజు కలుసుకున్న వ్యక్తుల్లో మచ్చుకు ఒక్కరు కూడా “నేను నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్నాను” అని జవాబు ఇవ్వలేదు.

ఈ జవాబులతో రాజు నైరాశ్యం చెందలేదు. పైపెచ్చు తన ప్రయత్నాన్ని తీవ్రతరం చేశాడు. ‘నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్న వ్యక్తిని ఆరు నూరైనా కనుగొని ఆతడి చొక్కా పొంది తీరతాను’ అనే దృఢ నిశ్చయంతో తన అన్వేషణను కొనసాగించాడు.

రాజు వెళుతున్న దారిలో, కాస్త దూరంలో ఎవరో బిగ్గరగా నవ్వే శబ్దం వినవచ్చింది.

రాజు ఆ వైపుగా వెళ్ళి చూడగా ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతడే బిగ్గరగా నవ్విన వ్యక్తి అని రాజు గుర్తించాడు. కాని ఆనందిస్తూ బిగ్గరగా నవ్విన ఆ వ్యక్తి దిగంబరుడుగా ఉన్నాడు.

అప్పుడు రాజుకు, ‘ధరించిన వస్త్రానికీ, ఆనందానికీ ఎటువంటి సంబంధమూ లేదు’ అన్న వాస్తవం గ్రహింపుకు వచ్చింది.

Leave a Comment