The Sacred Til Donation of the Great Sage – A Spiritual Lesson

soul-cleansing message of selfless giving

శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చాడు.

శ్రీరామ పట్టాభిషేకానికి వసిష్ఠుడు మొదలైనవారు ఘనంగా ఏర్పాట్లు చేయించారు.

పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అయోధ్యలో కొన్ని రోజుల దాకా కొనసాగాయి.

రావణుడితో చేసిన యుద్ధంలో అనేకులను వధించిన పాప పరిహారార్థం శ్రీరామ పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని, అందరికీ అన్ని విధాలైన దానాలు ఇవ్వడానికి వసిష్ఠ మహర్షి ఏర్పాట్లు చేయించాడు.

ఈ విధంగా వసిష్ఠ మహర్షి గావించిన ఏర్పాట్ల గురించి, రాజ్యమంతటా చాటింపు వేయించారు.

చాటింపు విని అంతఃపురానికి వచ్చిన జనులందరూ అనేక రకాల దానాలను పుచ్చుకొని వెళ్ళసాగారు.

ఒకటి. వసిష్ఠుడు ప్రకటించిన దానాల జాబితాలో తిల (నువ్వుల) దానం

ఈ దానాన్ని తప్ప, జనులు తక్కిన అన్ని దానాలను పుచ్చుకొని ఆనందభరితులై వెళ్ళిపోతున్నారు.

సజ్జనులు, సంస్కారవంతులు ఎవరూ తిల దానం పుచ్చుకోవడానికి ససేమిరా ముందుకు రారు.

తిల దానం పుచ్చుకున్నాడంటే, ఆ వ్యక్తి అతి పేదవాడుగానూ, సంస్కారహీనుడుగానూ ఉండి ఉండాలి.

‘తిల దానం పుచ్చుకోవడానికి ఎవరికీ ఇష్టం లేనట్లుంది. అందుచేత తిల దానం పుచ్చుకునే వ్యక్తికి బంగారు దిమ్మలు కానుకగా ఇస్తామని ప్రకటిద్దాం. బంగారానికి ఆశపడి ఎవరైనా తిల దానం పుచ్చుకోవడానికి ముందుకు రావచ్చు’ అని వసిష్ఠుడు యోచించాడు.

తన యోచన మేరకు వసిష్ఠుడు ఇలా రాజ్యం అంతటా దండోరా వేయించాడు: “శ్రీరామ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని చేస్తున్న దాన కార్యక్రమాలలో తిల దానం తప్ప, తక్కిన అన్ని రకాల దానాలను జనులు వచ్చి పుచ్చుకొనిపోతున్నారు. తిల దానానికి ఇంకా శ్రీకారం చుట్టబడలేదు. కనుక తిల దానం పుచ్చుకోవడానికి ముందుకు వచ్చే వ్యక్తికి, పెద్ద బంగారు దిమ్మలు కానుకగా ఇస్తాం!”

అయోధ్యా నగరానికి పొలిమేరలో సింగారముని కుటీరం ఉంది.

అక్కడ ఆయన, భార్య స్వర్ణవల్లితో జీవిస్తున్నాడు.

స్వర్ణవల్లి గుణవతి, ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన వ్యక్తి.

సింగారముని దంపతులు కటిక పేదరికంలో జీవిస్తున్నారు.

ముని జపం, ధ్యానం, ప్రార్ధన, తపస్సు వంటి ఆధ్యాత్మిక సాధనల్లోనే జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అశాశ్వతమైన లౌకిక వస్తువుల వంక కన్నెత్తికూడా చూడని ఆ ముని మనస్సు సదా భగవంతుని మీదనే లగ్నమై ఉంటుంది.

తన భర్త మనస్సు ఏ స్థితిలోనూ భగవంతుని తప్ప మరి దేన్నీ ఆకాంక్షించదని భార్యకు బాగా తెలుసు.

అయినప్పటికీ ఇంట్లో దారిద్య్రం గూడుకట్టుకుని ఉండడం స్వర్ణవల్లి భరించలేకపోయింది.

విన్నది.

ఆమె వసిష్ఠ మహర్షి వేయించిన తిల దానం గురించిన చాటింపు

తిల దానం స్వీకరించడానికి ఆమెకు మనస్కరించలేదు. అందుకు కారణం, ‘తిల దానం పుచ్చుకున్న వ్యక్తి, పాపాన్ని కూడా స్వీకరించవలసి ఉంటుంది’ అనే సత్యం ఆమె ఎరుగనిది కాదు.

కాని ఇంట్లో దారిద్య్రం తాండవిస్తోంది. అది ఆమెను మరో కోణంలో యోచించేలా చేసింది.

దాంతో ఆమె, ‘మునివర్యులు తిల దానం పుచ్చుకుంటే, మనకు బంగారు ముద్దలు లభిస్తాయి. పేదరికం దాంతో తొలగిపోతుంది’ అని ఆమె అనుకున్నది. తాను అనుకున్న విషయం వెంటనే మునికి తెలుపడానికి ఆమె ఎంతో సంకోచించింది. తగిన తరుణంలో తన ఆలోచనను ఆయనకు వ్యక్తం చెయ్యాలని నిర్ణయించుకుని, నిరీక్షించ సాగింది.

అటువంటి తరుణం ఆసన్నమైంది.

అప్పుడు స్వర్ణవల్లి ఎంతో సంకోచిస్తూ, “శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని, అయోధ్యలో అనేక రకాల దానాలను ఇస్తున్నారు. తిల దానం ఒకటి తప్ప, తక్కిన దానాలను జనులందరూ వచ్చి పుచ్చుకుంటున్నారట. తిల దానం ఒక్కటి మాత్రమే ఇంకా మిగిలిఉంది. దానిని పుచ్చుకున్నవారికి, బంగారు దిమ్మలు కానుకగా ఇస్తామని ప్రకటించారు.

“మనమో పేదరికంలో మ్రగ్గుతున్నాం. మీరు వెళ్ళి తిల దానం స్వీకరిస్తే, బంగారు దిమ్మలు మనకు లభిస్తాయి. వాటితో మన దారిద్య్రం తీరిపోతుంది” అంటూ ఎలాగో చెప్పగలిగింది.

ఆమె చెప్పింది వినగానే శాంతమూర్తియైన ఆ ముని కంఠం పెంచి, “బంగారానికి ప్రలోభం చెంది నా తపస్సును, తేజస్సును కోల్పోమంటున్నావా? నన్ను పాపిని అవమంటున్నావా?” అన్నాడు. కోపంగా.

అందుకు స్వర్ణవల్లి చేతులు జోడించి నమస్కరిస్తూ వినయంగా హీనస్వరంలో, “స్వామీ! మీరు మీ తపస్సును కోల్పోవడానికి నేను సమ్మతిస్తానా? మీకు పాపం చుట్టుకోవాలని నేను అనుకుంటానా? భర్త ఆచరించే ధర్మానికి తోడుగా ఉండే భార్యే ధర్మపత్ని, భర్తను పాపం చేయడానికి ప్రేరేపించే భార్య ఎలా ధర్మపత్ని అవుతుంది?

“శ్రీరాముడు ఎవరు? ఆయన సాక్షాత్తు పరబ్రహ్మం, పరమాత్మ స్వరూపం, దేవాధిదేవుడు. ఆయన ఇప్పుడు మానవరూపంలో వచ్చి ఉన్నాడు. మీరు తిల దానం పట్టగానే, శ్రీరాముని ముఖారవిందాన్ని చూడండి! అందువలన తిల దానం పుచ్చుకున్నందువలన వాటిల్లే పాపం, మిమ్మల్ని వీడి ఆ క్షణంలోనే తొలగిపోతుంది. ఎంత పెద్ద కొయ్యదుంగను అయినా ఒక చిన్న నిప్పుకణం దగ్ధం చేయడంలేదా! అటువంటప్పుడు పరమాత్ముడైన శ్రీరాముని దివ్యముఖారవింద వీక్షణతో తిల దానం పట్టిన పాపం వెంటనే మిమ్మల్ని విడిచి పోతుంది గదా!

తిల దానం స్వీకరించాలన్నది ఎప్పటికీ నా ఉద్దేశం కాదు. దారిద్య్ర బాధను భరించలేక, సహించలేక ఇలా నేను మాట్లాడవలసి వచ్చింది. నన్ను క్షమించండి” అంది.

వివరణాత్మకమైన స్వర్ణవల్లి జవాబు విన్న మునివర్యుని మనస్సు ఒకింత రాజీపడింది.

ఇంకా సందిగ్ధంలోనే ఉండి ఆయన చివరికి, “తిల దానం పుచ్చుకోవడానికి నాకు సమ్మతమే” అని, అంతఃపుర అధికారులకు వార్త పంపించాడు.

“సింగార మునివర్యులు తిల దానం స్వీకరించడానికి అంగీకరించారు!” అన్న వార్త కార్చిచ్చులా వ్యాపించింది.”సింగార మునివర్యులు తిల దానం పుచ్చుకోబోతున్నారు! ఇదేం చోద్యం! నమ్మలేకపోతున్నాను! ఏం శోచనీయం! ఎంతటి తపశ్శాలి ఆయన! ఆయనకు ఎందుకిలాంటి బుద్ధి పుట్టింది? బంగారానికి ఆశపడి ఆ తపోధనుడు ఇలా తనను హీనపరచుకోకూడదు!” అంటూ, జనులు తమలో తాము మాట్లాడుకోసాగారు.

“సింగార మునివర్యులు తిల దానం స్వీకరించడానికి సమ్మతించారు!” అనే వార్త వసిష్ఠ మహర్షి చెవినపడింది.

సింగార మునివర్యులు గొప్ప తపస్వి అని వసిష్ఠునికి తెలుసు. కాబట్టి లోతుగా ఆలోచించిన తరువాత, ఆయనకు సింగార ముని దంపతులు ఏం అనుకున్నారో అన్న విషయం అవగతమయింది.

‘సింగార మునివర్యులు బంగారానికి ఆశపడే వ్యక్తి కాడు. ఆయన నిరుపేద. కాబట్టి భార్య మాట కాదనలేక, దారిద్య్ర నిర్మూలనకైబంగారం స్వీకరింప తిల దానం పుచ్చుకోవడానికి ముందుకు వచ్చాడు. తిల దానం పుచ్చుకోగానే, శ్రీరాముని ముఖాన్ని దర్శించి పాపం తొలగించుకోవాలని అనుకున్నాడు’ అని వసిష్ఠుడు ఊహించి, గ్రహించాడు.

అంతేకాక వసిష్ఠుడు, ‘తిల దానం పట్టగానే ముని శ్రీరాముని ముఖాన్ని వీక్షిస్తే, తిల దాన ఫలితం దక్కకుండా పోతుంది. కాబట్టి తిల దానం పుచ్చుకోగానే, ముని శ్రీరాముని ముఖాన్ని వీక్షించడాన్ని ఒక తెర దింపి అడ్డుకోవాలి’ అనే నిర్ణయం తీసుకున్నాడు.

ముందే నిర్ణయించిన సమయానికి సింగార మునివర్యులు అంతః పురానికి వెళ్ళాడు.

అక్కడ ఒక వేదిక మీద తిల దాన కార్యక్రమ ఏర్పాట్లు ఘనంగా చేసి ఉంచారు.

తిల దాన స్వీకరణకు సముచితమైన వేదమంత్రాల ఘోష ఒక వైపు వినవస్తోంది.

దానం శ్రీరామచంద్రమూర్తి పుచ్చుకోగానే దివ్యముఖారవిందాన్ని దర్శించుకోవాలి!’ అనే భావనతో, సముచిత సమయంలో సింగార మునివర్యులు వేదిక మీదకు వచ్చాడు.

అక్కడ శ్రీరాముడు, మునికి తిలలు దానం ఇచ్చాడు. అంతే! వెంటనే హఠాత్తుగా శ్రీరామునికీ, మునికీ మధ్య ఒక తెర పడింది. ఇటువంటి సంఘటన జరుగుతుందని శ్రీరాముడుగాని, మునిగాని, సభికులుగాని ఎవరూ ఎదురుచూడలేదు.

శ్రీరాముని ముఖారవిందాన్ని తిలకించడానికి ముందే తెర పడిపోయిందే!’ అని ముని నీరుకారిపోయాడు.

ముని మ్రాన్పడిపోయాడు! ఆయన దిగులులో మునిగిపోయాడు. ‘ఇప్పుడు తిల దానం పట్టినందున, నాకు పాపం చుట్టుకుంటుంది గదా!’ అని తలపోసి ముని హృదయం క్షోభించింది, ఆయన నడక తడబడింది. ఆయన జీవచ్ఛవమే అయ్యాడు! ఎలాగో తన పర్ణశాలకు చేరుకున్నాడు.

అంతలో అంతఃపుర భటులు ఒక వాహనంలో వచ్చి, సింగార మునివర్యుల పర్ణశాలలో బంగారు దిమ్మలను దింపి వెళ్ళిపోయారు.

స్వర్ణవల్లి మునివర్యులను ఇంట్లోకి ఆహ్వానింప సంతోషభరితయై సిద్ధం కాసాగింది.

నిరుత్సాహంతో, దిగులుతో తిరిగి వచ్చిన మునివర్యులను చూసి స్వర్ణవల్లి విస్తుబోయింది!

జరిగింది తెలిసిన తరువాత ఆమె తన తల మీద పిడుగుపడ్డట్లు వణకిపోయింది.

మునివర్యులు మాటరాని మౌన స్థితిలో ఉండిపోయాడు.

జరిగింది తలచుకుని తలచుకుని స్వర్ణవల్లి మనస్సు క్షోభించింది. ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అని ప్రగాఢ చింతనలో మునిగిపోయింది. మునివర్యుల దిగులును తొలగించే ఒక దారి ఆమెకు స్ఫురించింది.

ఆమె మునివర్యులను సాంత్వనపరచే ధోరణిలో ఇలా పలికింది: “స్వామీ! జరిగింది జరిగిపోయింది! ఇక కొన్ని రోజుల్లో పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాల చివరి రోజున మంగళవాద్యాలుమోగుతుండగా శ్రీరాముడు రథంలో ఊరేగుతూ రానున్నాడు. ఆ సమయంలో మీరు శ్రీరాముని సమీపించి దర్శనం చేసుకోండి. వెంటనే తిల దానం పట్టినందున మీకు వాటిల్లిన పాపం తొలగిపోతుంది! దాంతో మీరు కోల్పోయిన తపశ్శక్తి, తేజస్సు మళ్ళీ పొందుతారు!”

‘పాపం నుండి విడివడే మార్గమే లేదా? అని అప్పటి దాకా ఆలోచిస్తూ దుఃఖసముద్రంలో మునిగిన మునివర్యుల మనస్సుకు, స్వర్ణవల్లి చెప్పిన యోచన సబబుగా తోచింది.

అంతే! అన్నాహారాలు మాని మునివర్యులు శ్రీరాముని రథ ఊరేగింపు రోజుకై నిరీక్షించసాగాడు.

ఆ రోజు రానే వచ్చింది. మునివర్యులు కళ్ళల్లో అశ్రువులు స్రవిస్తుండగా విలపిస్తూ, ‘రామా, రామా!’ అంటూ పరుగెత్తి రథంలో ఆసీనుడై ఉన్న శ్రీరాముని తనివితీర దర్శించుకుని, సాష్టాంగ దండప్రణామం చేశాడు.

ఆప్యాయంగా శ్రీరాముడు తన కరకమలాలతో మునివర్యులను లేవనెత్తాడు.

ఆ తరువాత శ్రీరాముడు మునివర్యులతో, “తిల దానం పట్టిన పాపం కారణంగా మీకు కొద్ది రోజులు దుఃఖం ప్రాప్తించింది. అని ఇప్పుడు ఆ దుఃఖం ఆసాంతం తొలగిపోయింది. ఇక మీ తపోమయ జీవితం సదా నిరాటంకంగా సాగిపోతుంది” అని చెప్పి ఆయనను సాంత్వనపరిచాడు.

ఆ తరువాత మునివర్యులు తన వద్ద ఉన్న బంగారు దిమ్మలను కన్నెత్తి కూడా చూడలేదు. వాటిని ఆయన తన వేలితో సైతం తాకలేక పోయారు.

సింగార మునివర్యుల గురించిన పైన చూసిన సంఘటనను త్యాగరాజస్వామి ఒక కీర్తనలో, ‘సింగార మునివర్యులు తిల దానం ఫలితంగా పొందిన బంగారాన్ని అనుభవించాడా? విభీషణుడు విన్నపం చేసినప్పటికీ శ్రీరంగనాథుడు లంకకు వెళ్ళాడా? ఏ కార్యమూ విధి ప్రకారమే జరుగుతుంది” అని పేర్కొనడం గమనార్హం.

1 thought on “The Sacred Til Donation of the Great Sage – A Spiritual Lesson”

Leave a Comment