Destiny ఒక రాజు తన వీరులతో అరణ్యంలోకి వేటాడడానికి వెళ్ళాడు. ఏదో వింత శబ్దంతో కూస్తున్న ఒక పక్షి రాజు కంటపడింది.
రాజు సైనికులలో పక్షి భాష తెలిసిన ఒక సైనికుడు ఉన్నాడు.
రాజు ఆ సైనికుణ్ణి పిలిచి, “అ పక్షి ఇప్పుడు ఏం చెప్పింది?” అని ప్రశ్నించాడు.
అందుకు ఆ సైనికుడు, “రాజా! ఆ పక్షి మనలను గురించి ఏమీ చెప్పలేదు. ఈ దారిగుండా ఒక రైతు వెళతాడు, అతడు ఈ రోజు పాము కాటుతో మరణిస్తాడని చెప్పింది” అని జవాబిచ్చాడు.
‘ఈ సైనికుడు చెబుతున్నది నిజమేనా?’ అని రాజు తెలుసుకోగోరాడు. అంతే! రాజు, అతడి సైనికులు వేట కార్యక్రమాన్ని కట్టిపెట్టి అక్కడే కాచుకుని ఉండిపోయారు.
వాళ్ళు దాదాపు గంటసేపు అక్కడే నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఆ తరువాత ఆ దారిగుండా ఒక వ్యక్తి వెళ్ళాడు. అతడి చేతిలో ఒక కొడవలి ఉంది.
ఆ రైతును చూసి రాజు తన సైనికులతో, “ఆ పక్షి చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు సగం నిజమైంది. తక్కిన సగమూ నిజమేనాఅన్న విషయం నిర్ధారణ చేసుకోవడానికి సంకం చూద్దాం” అని చెప్పాడు.
ఆ ప్రకారం రాజు, సైనికులు ఎక్కడికీ పోనుంది ఉండిపోయారు.
సాయంత్రం కావచ్చింది. ఉదయం రాజు చూసిన ఆ రైతు. తన తల మీద ఒక పెద్ద పచ్చగడ్డి మోపును మోసుకొంటూ వస్తున్నాడు. ఆ మోపులో ఒక కొడవలి దూర్చబడి ఉంది.

రైతును చూసిన రాజు, తన పక్కనే ఉన్న సైనికుడితో,” “నువ్వు ఈ రైతు ఈ రోజు పాము కాటుతో మరణిస్తాడు’ అని చెప్పావు నువ్వు చెప్పినట్టు జరుగుతుందా అని, నేను ఇక్కడే రోజంతా కూర్చుండిపోయాను. అందువల్ల నాకు ఒక రోజు వ్యర్థమైంది.
“ఇప్పుడు రైతు సజీవుడిగానే తిరిగివస్తున్నాడు! పక్షి అబద్ధం చెప్పిందా? లేక నువ్వు నన్ను మోసపుచ్చావా? ఈ రైతు మరణం నుంచి తప్పించుకొన్నాడనడానికి, నువ్వు సరియైన వివరణ ఇవ్వాలి. లేకుంటే కఠిన శిక్షకు గురి కావలసి ఉంటుంది” అన్నాడు కోపోద్రిక్తుడై.
అప్పుడు సైనికుడు వినయంగా, “రాజా! పక్షి చెప్పింది ఇంతవరకు అబద్ధం కాలేదు! రైతు ప్రాణాలతో ఉండడానికి కారణం ఏమిటో నాకూ తెలియడంలేదు. రైతు వెళ్ళిన చోట ఏం జరిగిందో అతడే పిలిచి అడగండి!’ అన్నాడు.
ఇంతలో రైతు, రాజు ఉన్న చోటుకు దానే వచ్చాడు. అప్పుడు. మన సైనికుడు, “మీ నెత్తి మీద ఉన్న పచ్చిక మూలను కింద పదెయ్యండి!” అని రైతును ఉద్దేశించి చెప్పాడు.destiny
రైతు తన తల మీద దీన్ని పచ్చిగడ్డి మూటను కింద పడవేశాడు. గడ్డిమూట కింద పడ్డ వేగానికి దాన్ని కట్టి ఉంచిన తాడు తెగి, గడ్డి అటూ ఇటూ చెల్లాచెదరయింది. అప్పుడు గడ్డిమోపు మధ్యలో కత్తితో ఖండింపబడి చచ్చిన ఒక పాము శ్రీనిపించింది.
అది చూసి సైనికుడు, రాజుతో, “రాజా! రైతు ఈ పాము కాటుతో మరణించి ఉండి ఉండాలి! అలా జరగకపోవడానికి, రైతు వెళ్ళిన చోట ముఖ్యమైన సంఘటన ఎర్రాన్నా ప్రరిగిందానని అతణ్ణి మీరే విచారించండి” అని విన్నవించాడు.
అప్పుడు రాజు, రైతుతో, “ఏమయ్యా, నువ్వు వెళ్ళిన చోట కొత్త సంఘటన ఏదన్నా జరిగిందా?” అని ప్రశ్నించాడు.
అందుకు ఆ రైతు, “అయ్యా, నేను వెళ్ళిన చోట ఎలాంటి కొత్త సంఘటనా జరుగలేదు. కాని అక్కడకు ఒక మహాత్ముడు వచ్చాడు.
ఆయనకు నేను సాష్టాంగపడి నమస్కరించాను. ఆయన నన్ను చూసి ‘దీర్ఘాయువుతో జీవించు!’ అని ఆశీర్వదించారు. ఇదే జరిగింది, అంతే” అని జవాబిచ్చాడు.
ఈ ఉదంతం విన్న సైనికుడు, రాజుతో, “రాజా! చూశారా! ఈ రైతు పాము వాతపడి మరణించి ఉండాలి! కాని ఒక మహాత్ముని దీవెన కారణంగా, ఈతడి విధి మారిపోయింది. మహాత్ముల దీవెనకు విధిని మార్చే శక్తి ఉంది” అని వివరించి చెప్పాడు.
సైనికుడు ఇచ్చిన వివరణను మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అంతేకాక సైనికుడికి, ఆ రైతుకు కానుకలు కూడా ఇచ్చాడు.