1. భక్తి (devotion)అనగా ఏమిటి?
జ. ప్రాపంచిక విషయాలు నుండి మనస్సు ను పరమాత్మ వైపు తిప్పుట భక్తి
2 జీవుడిని సంసారం నుండి దాటించే తత్త్వం ఏమిటి?
జ. పరతత్త్వమైన విజ్ఞానం
3. పరతత్త్వం అర్థం చేసుకున్నవాడి స్థితి ఏమిటి?
జ. సోహం /అహం
బ్రహ్మాస్మి /సర్వం వాసుదేవం/సర్వం శివమయం
4. నాలుగు విధాల భక్తి ఏమిటి?
జ. తామస భక్తి రాజస భక్తి సాత్విక భక్తి నిరుణ భక్తి
5. సాత్విక భక్తి ఏమిటి?
జ. ధార్మిక కోరికలు కలిగి అన్ని ఈశ్వరార్పణం కోసం చేయటం.
6 మన్మధుడు శివుడు పై ప్రయోగించిన 5 బాణముల యొక్క ప్రతీక ఏమిటి?
జ. పరమాత్మని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల వల్ల లోబరచుకోలేము కేవలము నమః శివాయ మంత్రము వలన మాత్రమే గెల్చుకోగలము ఇవియే మన్మధుని బాణములు.
17. పర తత్త్వమైన మోక్షం & పశుపతి నాయనారు
1. నవాంగ భక్తి ఎన్ని విధములు అవి ఏమిటి?
జ. నవాంగ భక్తి 9 విధములు అవి: శ్రవణం, కీర్తనం, స్మరణ భక్తి, సేవనం, దాస్యం, అర్చన, వందనం, సఖ్యం, ఆత్మార్పణ.
2. మహా సాధన లో మొదటిది, ప్రధానమైనది ఏది?
జ. శ్రవణం
3. ఏ మూడు మరణ పర్యంతం చెయ్యాలి?
జ. వేదాంత శ్రవణం, గురు సేవ, ఈశ్వర ఆరాధన
4. నవంగ భక్తి వివరణ లో ఏ భక్తులు జ్ఞానం లేకపోయినా శివుని మీద ప్రేమ ఉంటే మోక్షం పొందవచ్చు అని నేర్పారు?
జ. రుద్రపశుపతి, కన్నప్ప, గజ్జ మహా దేవి.

18. ఉపమన్యు చరిత్ర
1. ఉపమన్యు మహర్షి కధ ఎవరు ఎవరికి చెప్పారు?
జ. సనత్ కుమార స్వామి వ్యాసదేవునికి చెప్పిన కధ.
2 ఉపమన్యు ఎవరి కుమారుడు?
జ. వ్యాఘ్రపాదుడనే మహర్షి కుమారుడు.
3. ఉపమన్యుతపస్సు ఎక్కడ చేశాడు?
జ. హిమవత్ పర్వతం మీద
4. తపస్సు చేస్తున్న ఉపమన్యుడికి శివుడు ఏ రూపంలో ముందు దర్శనమిచ్చాడు?
జ. ఇంద్రుడు
5. ఉపమన్యుడి సోదరుని పేరేమిటి?
జ. ధౌమ్యుడు
6. ఉపమన్యుని తల్లి ఇచ్చిన భస్మము ఏ హెూమంలోనిది?
జ. విరజా హెూమము
7. ఉపమన్యు వృత్తాంత శ్రవణ ఫలితము ఏమిటి?
జ. ఉపమన్య వృత్తాంతశ్రవణము ఫలితము సర్వపాపహరణము.
8. ఉపమన్యు కధ యొక్క నీతి ఏమిటి?
జ. మనము పూర్వజన్మలో శివునికి, విష్ణువుకి ఇచ్చినవే మనకి దక్కుతాయిట.
(ఇదే పెట్టి పుట్టడం అంటే).
9. శివుని గురించి చెప్పగలిగేవారు ఎవరు?
జ. కుమార స్వామి, నందీశ్వరుడు, ఉపమన్యు.
10. ఉపమన్యు దేనికోసం తపస్సుచేశారు?
8. పాలకోసం
19. మూర్తులు ఎందుకు /సాధారణ శివారాధన
1. బ్రహ్మం ని ఆరాధించే విధానములు ఏమిటి?
జ. మూర్తం- మూర్తి రూపంతో & అమూర్తం మూర్తి లేకుండా నిరాకారముగా ఆరాధించడం.
2. మూర్తులు ఎన్ని రకములు, వాటి పేరులు ఏమి?
జ. మూర్తులు 3 రకములు, యోగ మూర్తి, భోగ మూర్తి, ఉగ్ర మూర్తి
3. శివ మరియు విష్ణువుల యోగ, భోగ, ఉగ్ర మూర్తి స్వరూపాల నామాలను(కనీసం ఒక నామమును) తెలుపుడు?
జ. శివుని స్వరూపాలు:
యోగ మూర్తి: దక్షిణామూర్తి భోగ మూర్తి: శివ పరివారం
ఉగ్ర మూర్తి: వీర భద్ర
విష్ణువు స్వరూపాలు:
యాగ మూర్తి: హయగ్రీవ
భోగ మూర్తి: లక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు
ఉగ్ర మూర్తి: నరసింహ
4. ఉగ్రరూప మూర్తి స్వరూపాన్ని పరమాత్మేయే ఎందుకు ధరించారు?
జ. భక్తుల రక్షణార్ధం పరమాత్మ ఉగ్ర మూర్తి స్వరూపాన్ని ధరించారు.
5. శివుని యొక్క త్రినేత్రాలను వీటిలోని సరిసమానంగా పోల్చ బడినవి?
జ. అగ్ని, సూర్యుడు మరియు చంద్రుడు.
6. శివుని యొక్క సూర్య నేత్రం విశేషత ఏమి?
జ. సూర్య నేత్రం ద్వారా భక్తులకు జ్ఞాన మరియు భోగం ప్రసాదించ బడును.
7. శివుని యొక్క చంద్ర నేత్రం విశేషత ఏమిటి?
జ. చంద్ర నేత్రం ద్వారా భక్తులకు శాశ్వత శాంతి మరియు ఆనందం అందుచున్నవి.
8. ఎనిమిది దివ్య నాగకులముల నామాలను తెలుపుడు?
జ. అన్నంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంక, కుళిక, పద్మ, మహాపద్మ.
9. లయకారకునిచే ఎన్ని రకముల “లయములు” జరుపబడుతున్నవి? వాని పేరులు ఏమి?
జ. లయములు మూడు రకములు. నిత్య లయము, మహా లయము, మరియు ఆధ్యాయంతక లయము.
20. దక్షిణామూర్తి స్వరూపం
1. దక్షిణామూర్తి యొక్క అర్ధం ఏమిటి ?
జ. సర్వ సమర్థత / దక్షత కలిగినవాడు, దక్షిణ దిక్కు వైపు అభిముఖముగా వున్నవాడు, భక్తుల యొక్క అజ్ఞానము తొలిగించే వాడు.
2. బ్రహ్మ దేవునికి వేదములు ఇచ్చినది ఎవరు?
జ. దక్షిణామూర్తి
3. దక్షిణామూర్తి కి ఎన్ని స్వరూపములు వున్నాయి?
జ.32
4. దక్షిణామూర్తి రూపం ఎలా ఉంటుంది?
జ. 4 చేతులు, 3 కళ్ళు, నీలకంఠం, పాములు, చిన్ముద్ర, పుస్తకం, అక్షరమాల, అమృతకలశం, ఢమరుకం, జటాజూటములతో వున్నాడు. ఒక కాలుతో రాక్షసుణ్ణి తొక్కుతూ వున్నాడు.
5. లక్ష్మి దక్షిణామూర్తి ఏమి ప్రసాదిస్తాడు?
జ. ఐశ్వర్యము తో పాటు జ్ఞానము ప్రసాదిస్తాడు.
6. చింతామణి దక్షిణామూర్తి ఏమి ప్రసాదిస్తాడు?
జ. కోరికలు తీరుస్తూ జ్ఞానము ప్రసాదిస్తాడు.
7. జీవ బ్రహ్మ ఐక్యం ఎప్పుడు జరుగుతుంది?
జ. జీవుడు జగత్తుతో ఉండకుండా బ్రహ్మముతో కలిసినపుడు జరుగుతుంది.
8. చిన్ముద్ర దేనికి సంకేతం?
జ. (1) ఏకాగ్రత (2)జీవాత్మ పరమాత్మతో ఐక్యంఅనగా మన నామ రూపం (ప్రపంచం) నుండి వీడి పరమ సత్యమైన ఆస్థి, భాతి, ప్రియంను (పరమాత్మా తెలుసుకొనుట.
9. వీణ దేనికిసంకేతం
జ. అక్షర శక్తికి.
10. వటవృక్షం దేనికి సంకేతం?
జ. జ్ఞానం, విద్య దాని యొక్క కొమ్మలు, విశ్వానికి విశ్వేశ్వరుడు మూలము.
11. పరమ మంత్ర సామ్రాట్ ఏది?
జ. శివాయ గురవే నమః
12. దక్షిణామూర్తి కుడి పాదం క్రిందం వున్న రాక్షస పేరు ఏమిటి?
జ. అపస్మార. స్పృహ లేకుండా ఏది సత్యం అది తెలుసుకోలేక పోవడము

21. shiva స్వరూపాల వివరణ
1. దాక్షిణ్యము అనగా ఏమిటి?
జ. ఏ దయ చూపిస్తే మళ్ళి ఏడుపు రాదో అది
దాక్షిణ్యము.
2. క్షేత్రములు ఏ విధంగా విభజించబడ్డాయి?
జ. జ్ఞాన క్షేత్రములు, ఐశ్వర్య క్షేత్రములు, ఆరోగ్య క్షేత్రములు
3. ఏ వేళ లో ఆది కిరాత స్వామిని పూజించాలి?
8. మధ్యాహ్న వేళలో
4. ఆది కిరాత స్వామిని దేనికి పూజించాలి?
జ. శత్రు వినాశనం

శ్రీ ఆది కిరాత మూర్తి
5. మన్మధుడు మొదటి బాణం ఎవరి మీద ప్రయోగించాడు? ఆ బాణం పేరు?
జ. బ్రహ్మ మీద, బాణం పేరు సమ్మోహిత
6. బ్రహ్మ ఏ రూపం దాల్చాడు సంధ్యా దేవి ని లోబరుచుకోవడానికి?
జ. లేడి రూపం
7. శివుడు ఆది కిరాత స్వామి రూపం ఎందుకు దాల్చాడు?
జ. మృగ ప్రవృత్తిని అంతము చెయ్యడానికి
8. ఆది కిరాత స్వామి యొక్క రూపము ఎలా ఉంటుంది?
జ. వేటగాడు
9. సంధ్యా దేవి ఏ మహర్షి యజ్ఞ కుండములో దూకి ఆహుతి అవుతుంది?
జ. మహర్షి మేధాతిథి
10. సంధ్యా దేవి తిరిగి ఎవరిగా జన్మిస్తుంది?
జ. అరుంధతి దేవి
12. మార్గ బంధు మూర్తి ని దేనికి పూజిస్తారు?
జ. క్షేమమైన ప్రయాణముల కోసం
13. కిరాత స్వరూపం తో స్వామి భారతంలో ఎవరిని అనుగ్రహించారు?
జ. అర్జునుడిని
14. పార్వతీ పరమేశ్వరులకు అభిన్నత చూపించే మూర్తి ఏది?
జ. అర్ధనారీశ్వర మూర్తి
15. శివపరివారం లో ఎవరు, యోగపరం గా మూలాధార శక్తి జాగృతి కలగడానికి సంకేతం?
జ. గణపతి
16. మృత్యుంజయ మూర్తి లో మృగీ ముద్ర, అక్ష మాల దేనికి సంకేతాలు?
జ. మృగీ ముద్ర మనోనిగ్రహానికి, అక్ష మాల జ్ఞానానికి.

22. శైవ సిద్ధాంతాలు, తెలుగు భాష గొప్పతనం, పాశుపత యోగం
1. పశువులు అనగా ఎవరు?
జ. పాశం తో బంధింప బడినవి అన్నీ పశువులే
2. జ్ఞానము అంటే ఏమని పరమశివుడు పార్వతీ దేవికి చెప్పారు?
జ. పశువు, పాశం మరియు పతి గురించి తెలుసుకోవడమే
3. పాశుపతం అనగా ఏమిటి?
జ. పశువులమైన మనం పాశం తో బంధింపబడ్డాం అని గ్రహించి పశుపతిని శరణు వేడడం.
4. ఏవైనా 3 శైవ సిద్ధాంతాల పేరులు?
జ. కాశ్మీర శైవ సిద్దాంతం, వీర శైవం, మిశ్ర శైవం
5. ఆంధ్రులు పాటించే శైవ సిద్ధాంతం ఏది?
జ. మిశ్ర శైవం (అద్వైతం/స్మార్తం)
6. పాశుపత యోగానికి ప్రయత్నిస్తున్న 6000 ఋషులకి శివుడి 8 నామాలు ఉపదేశించినది.
ఎవరు?
జ. వాయుదేవుడు
7. పాశుపత యోగనికి చెప్పబడిన నామాష్టక యోగం చేసేటప్పుడు శివుడి ఏ మూర్తి ని ధ్యానించాలి?
జ. అర్ధనారీశ్వర మూర్తి
8. ఏ ఇద్దరు తెలుగు కవులకి సాక్షాత్తు భగవంతుడు కనిపించి వారి కవితలని అంకితం అడిగారు?
జ. తిక్కనామాత్యులు, కూచిమంచి తిమ్మకవి
9. సృష్టి కార్యాల్లో తిరోధాన కృత్యం చేసే శివ స్వరూపం ఏది?
జ. మహేశ్వరుడు
10. సృష్టి కార్యాల్లో అనుగ్రహ కృత్యం చేసే శివ స్వరూపం ఏది?
జ. సదాశివుడు (శివుడు)
11. ఆది శంకర భగవత్పాదుల వారికి ఇష్టమైన శివనామం ఏది?
జ. పశుపతి
23.అష్టమూర్తితత్త్వము
1. అష్టమూర్తి ఉపాసన అంటే ఎమిటి?
జ. విశ్వమే విశ్వేశ్వరుని రూపం లో భావించి ఆరాధిస్తే, విశ్వం విశ్వేశరుని గా దర్శనమిస్తుంది.అదే అష్టమూర్తి ఉపాసన.
2. విశ్వం లోనే కాకుండా ప్రతి వ్యక్తి లోను కనిపించే ఎనిమిది అంశాలు ఏవి?
జ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు (బుద్ధి, చూపు) చంద్రుడు (మనస్సు) నేను అనే (అహకారం ) అంతఃకరణ చైతన్యమే జీవుడు.
3. ఈ ఎనిమిది శివర్రుపాలుగా పోల్చుకోవడం ఎలా?
. జ. శర్వాయనమః క్షితి మూర్తయే నమః (భూమిగా ఉన్నా శివరూపం, శర్వా)
భావాయ జల మూర్తయేనమః (నీరుగా ఉన్న శివరూపం, భవ )
రుద్రాయ అగ్నిమూర్తయే నమః (అగ్నిగా ఉన్న శివరూపం, రుద్ర)
ఉగ్రాయ వాయు మూర్తయే నమః (గాలిగా ఉన్న శివరూపం, ఉగ్ర)
భీమాయ ఆకాశ మూర్తయే నమః (ఆకాశంగా ఉన్న శివరూపం, భీమ)
ఈశానాయ సూర్య మూర్తయే నమః (సూర్యునిగా ఉన్న శివరూపం, ఈశాన)
మహాదేవాయ చంద్ర మూర్తయే నమః (చంద్రుని గా ఉన్న శివరూపం, మహాదేవ)
పశుపతయే యజనమాన మూర్తయే నమః (క్షేత్రజ్ఞుని గా ఉన్న శివరూపం, పశుపతి).

24. నటరాజ స్వామి తత్త్వం
1. ప్రదోషం అంటే ఏమిటి?
జ. ప్రదోషం అంటే రాత్రికి మొదటి దశ. రాత్రికి ముఖం లాంటిది. సంధ్యా కాలం కింద భావించ వచ్చు.
2. ప్రదోషాలు ఎన్ని రకాలు? అవి ఏమిటి?
జ. ప్రదోషాలు నాలుగు రకాలు.
a. నిత్య ప్రదోషం – ప్రతి రోజు సాయం సంధ్యా కాలం
b. పక్ష ప్రదోషం – పూర్ణిమ ముందు త్రయోదశి సాయం సంధ్యా కాలం
c. మాస ప్రదోషం – అమావాస్య ముందు త్రయోదశి సాయం సంధ్యా కాలం
d. మహా ప్రదోషం – మహా శివ రాత్రి సాయం సంధ్యా కాలం
3. శ్రావణ మాసానికి మరో పేరు ఏమిటి?
జ. నభో మాసం
4. మహా శివ రాత్రికి ఉన్నంత శక్తి ఏ రోజుకు ఉన్నది?
జ. శ్రావణ సోమవారానికి
5. శివుడి నాట్య సభకి అధ్యక్షులు ఎవరు?
జ. శివుడి నాట్య సభక్తి అమ్మవారు అధ్యక్షురాలు
6. పరమేశ్వర నాట్యానికి నట్టువాంగం ఎవరు?
జ. సరస్వతి దేవి – వీణ
ఇంద్రుడు – వేణువు
బ్రహ్మ దేవుడు – తాళం
లక్ష్మీ దేవి – గానం
నారాయణుడు – మృదంగం
7. శివ నాట్య సభలు ఎన్ని? ఎక్కడ వున్నాయి?
జ. శివ నాట్య సభలు ఏడు
అద్రి సభ – కైలాసం
చిత్ సభ – చిదంబరం
రత్న సభ – తిరు వళంగాడ్
రజత సభ – మధురై
తామ్ర సభ – తిరువనవేలి
చిత్ర సభ – కృత్తాళం
కనక సభ – చిదంబరం
8. రజత సభ (మధురై) ప్రత్యేకత ఏమిటి?
జ. శివుడు మధ్యాహ్న (ప్రదోషంలో కాదు) కాలంలో పాదము అటు తిప్పి చేస్తాడు.
9. శివుడి నాట్యానికి తాండవం అని పేరు ఎలా వచ్చింది?
జ. శివుడి నాట్యాన్ని ప్రమధ గణాలలో ఒకరైన తండు నేర్చుకొని వ్యాపింప చేయటం వలన తాండవం అంటారు.
10. నవ రసాలు ఏమిటి?
జ. శృంగార, హాస్య, భీభత్స, భయానక, రౌద్ర, వీర, అద్భుత, కరుణ, శాంత
11. అమ్మ వారి నాట్యాన్ని ఏమంటారు?
జ. అమ్మ వారి నాట్యాన్ని లాస్యం అంటారు.
12. శివ నాట్యము ఎక్కడ వున్నది?
జ. శివ నాట్యము ప్రతి అణువులో ఉన్నది. శివ నాట్యము బ్రహ్మాడంములో ఉన్నది.
13. శివ నాట్యము అంటే ఏమిటి? శివ నాట్యమును ఎలా దర్శించాలి?
జ. శివ నాట్యము అంటే తాండవ లాస్య సమ్మేళనము. ఈ సమ్మేళనంలో శివ శక్తులు ఉభయులూ ఉన్నారు. అదే దర్శించవలసిన విధానము
