Andhra Mahabharata Kathamrutam: Eternal Dharma Lessons from the Greatest Epic-ఆదిపర్వం

ఆంధ్ర మహాభారత కథామృతం

భారత ప్రశస్తి

mahabharatham పంచమవేదం. అంటే నాలుగు వేదాల సారం.

మహాభారతం కార్డ్ల వేదం. అంటే వాసుదేవ తత్వం చెప్పే వేదం.

నాలుగు వేదాలను విభజించిన వ్యాసమహర్షి భారతాన్ని జయకావ్యంగా రాశాడు. దాన్ని జనమేజయ మహారాజుకు వైశంపాయనుణ్ణి వినిపించుమని పంపాడు. వైశంపాయనుడు చెప్పిన కథకు ‘భారతం’ అనేపేరు వచ్చింది. ఆ తరువాత నైమిశారణ్యంలో శౌనకుడు చేసిన సత్రయాగంలో రోమహర్షణుని కుమారుడూ,

ఉత్తమ పౌరాణికుడూ అయిన సూతమహర్షి శౌనకాది మునుల కందరికీ చెప్పాడు. అలా సూతుడు చెప్పిన ‘భారతం’ మరికొన్ని ఉపాఖ్యానాలతో పెరిగి ‘మహాభారతం’ గా లోకంలో ప్రసిద్ధి చెందింది. అలా తరువాత ఎంతమంది ప్రచారం చేసినా మెదట చెప్పిన గౌరవం వేదవ్యాసులదే.

వేదవ్యాసుడే భారత కావ్య విధాత. ఆయన చెపుతూఉంటే గణపతి గంటం ఆపకుండా రాశాడని ప్రసిద్ధి. భారతీయ భాషల్లో భారతం వివిధ రూపాల్లో అవతరించింది. ప్రజలు పాటలుగా పాడుకుంటారు. పాండవులకు గుళ్లుకట్టి పూజిస్తారు. ఇక శ్రీకృష్ణుణైతే పరిపూర్ణ అవతారమూర్తిగా భావించి, జగద్గురువుగా, గీతాచార్యునిగా, రసరాట్టుగా ఆరాధిస్తారు.

కవిత్రయం మహాభారతాన్ని తెలుగులో నిర్మించింది. కవిత్రయం అంటే ముగ్గురు కవులు, వారే – పదకొండో శతాబ్దంలో ఉన్న ‘ఆదికవి” నన్నయభట్టు; పదమూడో శతాబ్దంలో ఉన్న ‘కవిబ్రహ్మ’ తిక్కన సోమయాజి పధ్నాలుగో శతాబ్ది పూర్వార్ధంలో ఉన్న “ప్రబంధ పరమేశ్వరుడు’ ఎఱ్ఱాప్రెగ్గడ.

సంస్కృత మహాభారతం నూరుపర్వాల శాస్త్రేతిహాసం. ఆంధ్ర మహాభారతం పద్దెనిమిది పర్వాల కావ్యేతిహాసం. నన్నయ ఆది, సభా పర్వాలు పూర్తిచేసి అరణ్యపర్వంలోనాల్గో ఆశ్వాసంలోని 142వ పద్యం వరకూ రచించి దివంగతుడయ్యాడు తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణపర్వం దాకా పదిహేను పర్వాలు రచించాడు. ఎఱ్ఱన అరణ్యపర్వశేషాన్ని పూరించాడు. తెలుగు సాహిత్యంలో కవిత్రయంవారి ఆంధ్ర మహాభారతం వంటి భారత కావ్యం మరొకటి లేదు. ‘తింటే గారెలు తినా’, వింటే భారతం వినాలి’ అని తెలుగువారు మోజుపడి చెప్పుకుంటారు.

భారత కథ మనోహరం, అపూర్వం. దానిని వింటే జీవితానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. పాపం తొలగుతుంది; పుణ్యం కలుగుతుంది!

మహాభారతం అందరికీ నచ్చే కావ్యం; అనంత విజ్ఞాన సర్వస్వం.

సీ. “ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని యధ్యాత్మవిదులు వేదాంత మనియు నీతి విచక్షణుల్ నీతిశాస్త్రం బని కవివృషభులు మహాకావ్య మనియు లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహ మని యైతిహాసికు లితిహాస మనియుఁ బరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చ యం బని మహిఁ గొనియాడుచుండ

ఆ. వివిధ వేదతత్త్వ వేది వేదవ్యాసుఁ ” డాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండఁ జేసె భారతంబు.”

ధర్మతత్త్వం తెలిసిన వారికి మహాభారతం ధర్మశాస్త్రంలాగానే కనపడుతుంది. ఆధ్యాత్మిక విషయాలు తెలిసినవారికి వేదాంతంలా గోచరిస్తుంది. నీతిని వివేచించే వారికి మహాభారతం నీతిశాస్త్రంలా స్ఫురిస్తుంది. మహాకవులకు మహాకావ్యంలాగా ప్రత్యక్షమౌతుంది.

లక్షణాలు చెప్పే శాస్త్రజ్ఞులకు అన్ని లక్షణాలకూ ఉదాహరణలు దొరికే సంపుటిలాగా స్పష్టమౌతుంది. ఐతిహాసికులకు మహాభారతం ఒక గొప్ప ఇతిహాసంగా తోస్తుంది. పౌరాణికులకు పురాణ సంపుటిలాగా ముచ్చట గొలుపుతుంది. ఇటువంటి అపూర్వ గ్రంథాన్ని రాసినందుకే వేదవ్యాసుణ్ణి విష్ణువువంటి వాడని భారతీయులు భావిస్తారు. భారతాన్ని విశ్వజనీనమైన సంహితగా ఆరాధిస్తారు.

మహాభారతాన్ని విన్నవారికి కూడా ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆయువును కోరేవారు చిరకాలం జీవిస్తారు. సంపదలు కోరితే సమృద్ధిగా లభిస్తాయి. ధర్మాన్ని కోరేవారికి సదా ధర్మప్రీతి కలుగుతుంది. సంతానం కోరేవారికి ఉత్తమ సంతానం కలుగుతుంది. భక్తితో భారతాన్ని వింటే భగవంతుడైన శ్రీకృష్ణుడు భవభయాన్ని మాన్పి, కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడు.

అందువల్లనే మహాభారతం పారిజాత వృక్షంలాంటి దని భారతీయులు భావిస్తారు. పారిజాత వృక్షం కల్పవృక్షంలాగా కోర్కెలు తీర్చే దేవతరువు. అది వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టింది. ఉపాఖ్యానాలనే కొమ్మలతో విస్తరిల్లింది. వేదార్థాలనే చల్లని నీడలను ప్రసరించింది. ధర్మార్థ కామమోక్షాలనే పూలగుత్తులతో సువాసనలు వెదజల్లింది. నరనారాయణుల గుణకీర్తనమనే ఫలాలతో విరాజిల్లింది. భారత పారిజాతం కోర్కెల వర్షపాతం.

maha baratham భారతీయ భారతిగా ప్రవహించే గంగా ప్రవాహం. దీనిని వింటే అందులో స్నానం చేసినట్లే. పాపాలను ప్రక్షాళితం చేసుకొన్నట్లే. సర్వపాపనివారిణి, సకల పుణ్య సంపాదిని శ్రీ మహాభారత శ్రవణం, శ్రీమహాభారత కీర్తనం.

ఆదిపర్వం

మహాభారత యుద్ధానంతరం కౌరవ వంశానిక్ అంకురంగా నిలిచినవాడు ఉత్తరాభిమన్యుల పుత్రుడు పరీక్షితుడు. పాండవుల తరువాత హస్తినాపుర సింహాసనమెక్కి అరవైయేడేళ్ళు నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరీక్షిన్మహారాజు వేటకు వెళ్లాడు. ఒక మృగం మీద బాణం వేశాడు. అది ఆ గుచ్చుకున్న బాణంతోనే పరుగెత్తటం మొదలు పెట్టింది.

రాజు దాని వెంటపడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో శమీకుడనే ముని కనపడ్డాడు. అతన్ని మృగాన్ని గురించి అడిగాడు. ఆ ముని ధ్యానంలో మౌనవ్రతంలో ఉండటం చేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కన చచ్చిపడి ఉన్న ఒక పామును వింటి కొప్పుతో ఎత్తి ఆ ముని మెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్లాడు.

శమీకుడు సమాధిలో ఉండటంచేత పాము మెళ్లో పడ్డా ఒళ్లు తెలియలేదు. అతనికి శృంగి అనే కుమారు డున్నాడు. అతడు తపస్వి అయినా మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని, ఆగ్రహోదగ్రుడై, ఏడురోజుల్లో తక్షక విషాగ్ని దగ్ధుడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోవుగాక! అని శపించాడు.

శృంగి తండ్రి దగ్గరకు వచ్చాడు. పామును తండ్రి మెడనుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియజెప్పాడు. శమీకుడు కోపం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయనీక్షమాగుణం తపస్వికి అలంకారమనీ కొడుకుకు బోధించి శాపాన్ని క్రమ్మరించుమని కోరతాడు. శృంగి దానికి అంగీకరించడు. శమీకుడు విచారపడతాడు. ఒక శిష్యునితో శాపవృత్తాంతాన్ని రాజుకు తెలియపరిచాడు.

శాపవృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు సలిపి ఒంటికంబపు మేడ కట్టించుకొని అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు. భటులు కాపలా కాస్తూ ఉంటే, వారంరోజుల గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూన్నాడు.

పూర్వం బ్రహ్మదేవుడు కాశ్యపుడనే బ్రహ్మర్షికి సంజీవనిని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతనిని తిరిగి బ్రతికించి తన విద్యా బలాన్ని ప్రభువుముందు వెల్లడించాలని కాశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో తక్షకుడు కలుసుకున్నాడు.

కాశ్యపుని శక్తిని పరీక్షించటానికి తక్షకుడు ఒక మర్రిచెట్టును కాటేసి దగ్ధం చేశాడు; వెంటనే కాశ్యపుడు ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలుసుకొని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా అతన్ని తిరిగి పంపించి వేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది.

తక్షకుడు నాగకుమారులతో కలిసి బ్రాహ్మణవేషాలతో వెడలి ఏకస్తంభ హర్మ్యానికి చేరుకున్నాడు. వేదఘోషతో వచ్చిన ఆ విప్రులను రాజు పూజించాడు. ఏడవరోజు సూర్యాస్తమయం అవుతున్నది కదా అని ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒకదానిని పరీక్షిత్తు తినటానికి ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తలయెత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు దగ్ధుడైపోయాడు.

పరీక్షిత్తు చనిపోయేనాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు. పిన్ననాటనే “జ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. తండ్రికి తక్షకునివలన కలిగిన అపకారాన్ని తెలుసుకొని “ముల జాతిమీద మండిపడ్డాడు. సర్పయాగం చేసి తక్షకాదుల నందరినీ అగ్నిలో ఆహుతి కీయాలను కొన్నాడు. యాగం ఆరంభమయింది. అగ్నికుండంలో పాములు వరుసగా వచ్చి డుతున్నాయి. అప్పుడు ఆస్తీకుడనే విప్రుణ్ణి వాసుకి మొదలైన నాగముఖ్యులు సర్పయాగాన్ని ల్పించుమని ప్రార్ధించారు. ఆస్తీకుడు సముచితమైన స్తుతులనుచేసి జనమేజయుణ్ణి ్పంచి సర్పయాగం మాన్పించాడు.

ఆ తరువాత ఒకనాడు జనమేజయుడు విద్వర్గోష్ఠిలో ఉండగా వైశంపాయనాది ష్యులతో వ్యాసమహర్షి అక్కడకు వచ్చాడు. జనమేజయ మహారాజు వ్యాసమహర్షిని అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి వినయంతో నమస్కరించి ఇలా అడిగాడు –

“ఓ మహర్షీ! మీరూ, భీష్మాది కురువృద్ధులూ కలిసి రాజ్య సంపదను విభాగం చేసి ఇచ్చినప్పటికీ కూడా, సుఖశాంతులతో వాటిని అనుభవించకుండా అటు పాండవులూ, ఇటు కౌరవులూ ఏకారణంవలన ఇంత ప్రజాక్షయమైన భారతయుద్ధం చేశారు? ఈ వంశ కలహం అసలు ఎందుకు కలిగింది? మీ ఆజ్ఞలను వారెందుకు పాటించలేదు? లేదా మీరు తెలిసి తెలిసి వారిని ఎందుకు వారించలేదు? పాండవధార్తరాష్ట్రుల విభేదన కథ వినాలని ఉంది. వినిపించండి” – అని జనమేజయుడు వేడుకొన్నాడు. వ్యాసమహర్షి శ్రీ మహాభారత కథాఖ్యానం చెప్పటానికి తన శిష్యుడైన వైశంపాయనుణ్ణి నియోగించాడు. అందువలన కథకుడు – వైశంపాయనుడు. శ్రోత జనమేజయుడు.

మహాభారత కథ చెప్పటానికీ, వినటానికీ ఒక ప్రణాళిక కావాలి. దాన్ని తెలుగులో నన్నయ సూచించాడు. ఆంధ్ర మహాభారతం వినాలనే కోర్కె రాజరాజనరేంద్రుని కుండేది. దాన్ని ఎలా వినాలో కూడా ఒక పద్ధతి ఆయన మనసులో ఉండేది. దాన్ని నన్నయతో చెప్పుకొని మహాభారతాన్ని వినిపించుమన్నాడు.

“”హిమకరుఁదొట్టి పూరు భరతేశ కురుప్రభు పాండుభూపతుల్ క్రమమున వంశకర్త లనఁ గా మహి నొప్పిన యస్మదీయ వం శమునఁ బ్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవో త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెమ్మెయిన్”

జనమేజయుడిలాగానే రాజరాజనరేంద్రుడు కూడా చంద్రవంశజుడు. వేదధర్మాన్ని ఆచరించిన ఆదర్శ ప్రభువుల వంశ చరిత్రలను ప్రధానంగా సూర్యచంద్రవంశగాథలుగా పురాణాలు వర్ణిస్తాయి. పాండవులు చంద్ర వంశజులు. అంటే వారి వంశానికి మూలపురుషుడు చంద్రుడన్నమాట.

ఒక్కొక్క వంశంలో వంశకర్తలని కొందరు ప్రసిద్ధి పొందుతారు. వారి పేర్లమీద ఆ వంశజులు పిలువబడుతూ ఉంటారు. చంద్రవంశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విశిష్ట ధర్మాన్ని పాటించిన వారని పేరుపొందినవారు వరుసగా పూరుమహారాజు, భరత మహారాజు, కురుమహారాజు, పాండు మహారాజు. వారు ఆ వంశకర్తలు. తండ్రికోసం నిండు యౌవనాన్ని త్యాగం చేసిన ధీరుడు పూరుడు; అఖండ రాజ్యాన్ని ఆదర్శవంతంగా పరిపాలించిన ధర్మమూర్తి భరతుడు;

యజ్ఞయాగాదుల నాచరించి ధర్మకర్మ పరిరక్షణం చేసిన కర్మవీరుడు కురుమహారాజు; దిగ్విజయయాత్రలు చేసి రణపాండిత్యాన్ని ప్రకటించిన యుద్ధవీరుడు పాండురాజు. వీరి నలుగురి పేర్లమీదా ఆ వంశజులు ప్రసిద్ధి కెక్కారు. పాండవులను-పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ అందువల్లనే పిలుస్తూ ఉంటారు. మహాభారతంలో విశేషమేమంటే – చంద్రవంశంలో పుట్టిన పాండవులు తమకు పూర్వం తమ వంశంలో పుట్టిన వంశకర్తల ఉత్తమ గుణాలనన్నింటినీ తమలో పండించుకొన్నారు. అందువలన చంద్రవంశం పాండవ చరిత్రలో పరిపూర్ణతను సాధించింది. కాబట్టి, పాండవుల చరిత్రను సవిస్తరంగా వింటే మహాభారతాన్ని అంతా విన్నట్టే.

వ్యాసుని జననం

మహాభారతాన్ని రచించిన వేదవ్యాసులవారే పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర నిర్వహించారు. అందువలన ఆయనను గురించి ముందు తెలుసుకొందాం.

దాశరాజుకు మత్స్యగంధి అనే కూతురు ఉంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మశాపం వల్ల యమునలో చేపగా తిరుగుతున్నప్పుడు ఆమె ఉపరిచర వసువు వీర్యం వలన పుట్టింది.

ఆమెను దాశరాజు పెంచుకుంటున్నాడు కన్న బిడ్డలా. చేపకడుపున పుట్టటం వలన ఒళ్లల్లా చేపవాసన కొడుతుండేది ఆమెకు. అందువల్ల మత్స్యగంధి అని పిలిచేవా రామెను. ఆమెకు యౌవనం వచ్చింది. యమునానదిమీద పడవ నడిపిస్తూ యాత్రికుల సేవ చేసుకోమని తండ్రి మత్స్యగంధిని నియోగించాడు. ఆమె శ్రద్ధా భక్తులతో ఆపని చేస్తోంది.

వసిష్ఠ మహర్షి మనుమడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయిన పరాశరముని యమునానది దాటటానికి పడవరేవుకు వచ్చి మత్స్యగంధిని చూచాడు. ఆమె శరీర సౌందర్యం ఆమహర్షి మనస్సును దోచుకొన్నది. ఆతడు తన కోర్కెను ఏకాంతంగా ఆమెకు తెలియజెప్పాడు. మునిమాట కాదంటే శాపమిస్తాడనే భయంతో పరాశరునితో మెల్లగా ఇలా అన్నది:

“మహర్షీ! నేనా కన్యకను, పైపెచ్చు నా మేనెల్లా చేపలకంపు; మీ మాట నే సంగీకరిస్తే నాకన్యకావ్రతం ముగిసిపోతుంది. అప్పుడు మాతండ్రిగారింటికి నే నెలా వెళ్లగలుగుతాను? కాబట్టి, నా కెటువంటిదోషం రాకుండా నీవు అనుగ్రహిస్తే నాకేమీ అభ్యంతరం లేదు” అని అన్నది మత్స్యగంధి.

పరాశరుడు ఆ మాటలు విని, సంతోషంతో ఆమె కన్యాత్వానికి లోపం లేకుండా వరమిచ్చాడు. ఆమె శరీరంలోని చేపలకంపు పోయి ఒక యోజనదూరం వరకూ పరిమళించే సుగంధాన్ని సహజశరీర వాసనగా ప్రసాదించాడు. దానితో ఆమె ‘గంధవతి’గా ‘యోజనగంధి’గా పేరుపొందింది.

ఆమెకు దివ్యాంబర భూషణాలు అందించాడు మహర్షి పడవ నది నడుమనున్న దీవికి చేరింది. పట్టపగలు బట్టబయలు ఎలా సంగమం సాధ్యం అనిఅనుమానించింది యోజనగంధి. పరాశరుడు పట్టపగలును చిమ్మచీకటిగా మార్చాడు. ఆ ముద్దరాలి అనురాగాన్ని అనుభవించాడు.

ఆమెకు సద్యోగర్భంలో సూర్యతేజుడైన వ్యాసుడు ఉదయించాడు. పుట్టగానే సద్యోయౌవనుడైనాడు. సమస్తజ్ఞానం ఆయనకు స్వాధీనమైంది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని వరాలిచ్చి వెళ్లిపోయాడు. యమునా ద్వీపంలో పుట్టటం వలనా, కృష్ణుడు – అంటే నల్లనివాడు కావటంచేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు. కృష్ణాజినం, కాషాయాలు, కపిలజడలు, దండకమండలాలూ సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు.

“మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకోండి ఆక్షణమే మీ యెదుట ఉంటాను” అని చెప్పి తపోవనానికి వెళ్లాడు. ఘోరతపస్సు చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, చిక్కుపడిఉన్న వేదాలను విడదీసి లోకంలో వెలయించాడు; వేదవ్యాసుడైనాడు. మహాభారతంలో తానూ ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే రచించాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తరువాత కీలక పాత్ర నిర్వహించింది.

భీష్మప్రతిజ్ఞ

వ్యాసుని తరువాత పాండవ కథలో మరో ప్రధానవ్యక్తి భీష్ముడు. శంతన మహారాజుకూ గంగా దేవికీ పుట్టిన మహాబలుడు. వసిష్ఠుని శాపం వలన భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా దీర్ఘాయువుగా, మహావీరుడుగా జీవించిన సత్యవ్రతుడు. యౌవరాజ్య పట్టాభిషేక యోగ్యుడై తండ్రియైన శంతన మహారాజుగారి వాత్సల్యాన్ని చూరగొంటూన్నాడు.

ఇలా ఉండగా ఒకనాడు శంతనుడు గంగానదీ తీరంలో యోజనగంధిని చూచాడు. ఆమె పై మరులు కొన్నాడు. ఆమె తండ్రి అయిన దాశరాజుకు తనకోరిక తెలిపాడు. దాశరాజు అందుకు అంగీకరించాడు కాని, ఒక నియమం పెట్టాడు.

శంతనునికీ సత్యవతికీ కలిగిన పుత్రునికే పట్టాభిషేకం చేయాలి అప్పుడే సత్యవతితో వివాహానికి అంగీకరిస్తా నన్నాడు. శంతనుడు భీష్ముని మీది అభిమానంతో సత్యవతి సంబంధాన్ని అంగీకరించలేక హస్తినాపురానికి తిరిగి వెళ్లాడు. కాని, సత్యవతీ విరహంతో కుమిలిపోతుంటాడు. బీష్ముడు తండ్రి మనస్సును తెలుసుకొంటాడు.

దాశరాజు దగ్గరికి వెళతాడు. అతని నియమాన్ని అంగీకరిస్తాడు. దానికోసం రెండు భీషణ ప్రతిజ్ఞలు చేస్తాడు : ఒకటి తాను రాజ్యం స్వీకరించకుండా శంతనునికీ సత్యవతికీ కలిగిన సంతానానికే రాజ్యం లభించేటట్లు చేస్తానని. రెండు :

భవిష్యత్తులో తనకు పుట్టే బిడ్డలు సింహాసనానికి పోటీ పడకుండా ఉండటానికి వీలుగా ఆమరణ బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరిస్తానని. ఈ ప్రతిజ్ఞలు విని దేవతలు పూలవాన కురిపించారు. ‘భీష్ముడు’ అని ప్రశంసించారు. తండ్రి అతనికి ‘స్వచ్ఛందమరణాన్ని’ వరంగా ఇచ్చాడు.

భీష్ముని వలననే సత్యవతికీ శంతనునికీ వివాహమౌతుంది.

వారిద్దరికీ చిత్రాంగద, విచిత్రవీర్యులనే పుత్రులు పుట్టారు. వారి చిన్నప్పుడే శంతనుడు కన్నుమూశాడు.

వారిద్దరి రక్షణభారంతోపాటు రాజ్యరక్షణభారాన్ని కూడా భీష్ముడు స్వీరించాడు. చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు.

అతడు గర్వాంధుడై విహరించాడు. మనుజ గంధర్వాదులను ఆక్షేపించాడు. చిత్రాంగదుడనే ఒక గంధర్వపతికి కోపం వచ్చి అతన్ని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు.

చిత్రంగదులిద్దరూ ఘోరంగా యుద్ధం చేశారు. శంతనుని పుత్రుడు చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోయాడు. ఆ తరువాత భీష్ముడు విచిత్రవీర్యునికి హస్తినాపురి పట్టాభిషేకం చేశాడు.

అతనికి కాశీరాజు కూతుళ్లను ముగ్గురిని స్వయంవరంలో బలవిజితలుగా తెచ్చి వివాహం చేయబోయాడు. వారిలో పెద్దది అంబ సాల్వుణ్ణి వరించింది కావున భీష్ము డామెను సాళ్వదేశానికి పంపాడు.

మిగిలిన ఇద్దరూ అంబిక, అంబాలికలను విచిత్రవీర్యునికి కట్టబెట్టాడు. అతడు ఆ భార్యలతో అహోరాత్రాలు భోగించి నిర్వీర్యుడై అసువులను కోల్పోయాడు. దానితో హస్తినాపురికి నాథుడు లేకుండా పోయాడు.

అదొక విచిత్రమైన పరిస్థితి. కురువంశపుత్రులలో మిగిలింది భీష్ముడొక్కడే. సత్యవతి అతణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుడవు కమ్మనీ, వివాహమాడి సంతానవంతుడవై వంశాన్ని నిలుపుమని వేడుకొన్నది.

భీష్ముడు తన భీష్మప్రతిజ్ఞను జ్ఞాపకం చేసి, పంచభూతాలు వాటి ధర్మాలు తప్పినా నేను నా మాటను మాననని స్పష్టం చేశాడు.

అప్పుడు భీష్ముడు నిండు సభలో ఒక ఆపద్ధర్మాని ప్రతిపాదించాడు. రాజవంశాలలో సంతానం లేకుండా రాజులు మృతులైనప్పుడు దేవరన్యాయంతో రాజులు సంతానాన్ని పొందే ఆచారాన్నీ,

అది అప్పటి సమాజంలో పొందిన ప్రామాణికత్వాన్నీ వివరించి చెప్పాడు.

అది అందరికీ అంగీకారమైంది. సత్యవతి వేదవ్యాసుని తలచి, అతడు తన కోడండ్రైన అంబిక, అంబాలికల యందు పురుష సంతానాన్ని కలిగించేటట్లు భావిస్తుంది.

దేవర న్యాయం వలన అంబికయందు వేయి యేనుగులబలం గల ధృతరాష్ట్రుడు పుట్టాడు.

కాని, అతడు పుట్టుగ్రుడ్డి. అందువలన వ్యాసుడు అంబాలిక యందు మరొక పుత్రుణ్ణి అనుగ్రహించాడు.

అతడు మహాపరాక్రమశాలిక పాండు శరీరం కలవాడు కాబట్టి పాండురాజయ్యాడు.

సలక్షణ సంతానం కలుగలేదన్న అసంతృప్తితో అంబికను మరొక పుత్రుణ్ణి కనమని కోరుతుంది సత్యవతి. కాని వ్యాసుని కపిలగడ్డము,

కవిల జడలు, నల్లని పొడుగైన రూపము చూచి రెండవసారి పొందలేక అంబిక ఒకదాసిని తనస్థానంలో ఉంచుతుంది.

ఆమె వ్యాసుని హృదయాన్ని మెప్పించి ఒక సుతుణ్ణి పొందుతుంది. అతడే ధర్మవిదుడైన విదురుడు. వారిని పెంచి, పెద్దవారిని విద్యావంతులను చేసి,

వివాహితులను చేసే బాధ్యత కూడా భీష్ముడే స్వీకరించాడు.

ధృతరాష్ట్రునికి పెళ్లియీడు వచ్చింది. గాంధార దేశాన్ని పరిపాలించే సుబలుడనే రాజుకు గాంధారి అనే కూతురు ఉన్నదనీ, ఆమె రూపలావణ్యశీలాలలో ఉత్తమురాలనీ,

నూరుగురు బిడ్డల తల్లి కాగలదనీ జ్యోతిష్కుల వలన విని భీష్ముడు స్వయంగా ఆసంబంధాన్ని కుదిర్చాడు. అంతేకాదు గాంధారికి పదిమంది తోబుట్టువులున్నారు.

వారందరినీ ధృతరాష్ట్రుని కిచ్చి పెళ్ళిచేయించాడు. అంతేకాక, కులశీలవతులైన నూరుగురు కన్యలనిచ్చి ఆపై వివాహాలు జరిపించాడు.

ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడయినా అతనికి ఎటువంటి లోపం రాకుండా చూచాడు. అతనికి పట్టాభిషేకం చేశాడు.

పాండురాజు అఖిలాస్త్ర శస్త్ర విద్యలను గడించి విస్తృత దేశ దండయాత్రలు చేసి అపార ధనరాసులు తెచ్చి ధృతరాష్ట్రుని వశం చేసేవాడు. బంధువులకు పంచేవాడు.

అతడు స్వయంవరంలో పొందిన కన్య కుంతి; భీష్మానుమతితో పెండ్లాడిన కన్య మాద్రి. పాండురాజు కుంతీ మాద్రులను అమితానురాగంతో చూచుకొంటూ ఉండేవాడు.

కర్ణుని జన్మరహస్యం

ఇక్కడ కుంతి జీవితంలో జరిగిన ఒక రహస్య వృత్తాంతం చెప్పాలి. కుంతి భోజుని యింట కుంతి కన్యగా పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు.

అతనికి ఇష్టమైన పదార్థాలను వండి వడ్డించి భక్తితో సేవించింది కుంతి.

ఆముని సంతసించి ఒక దివ్యమంత్రాన్ని ప్రసాదించా డామెకు. ఆమంత్రంతో ఏ వేల్పునైనా ఆరాధిస్తే అతడు, కోరిన పుత్రుణ్ణి ఇచ్చి సంతోష పెడతాడు. అది ఆపద్ధర్మంగా వాడుకోతగింది మాత్రమే.

ఆ ముని వెళ్లిపోగానే ఆ మంత్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగదరికేగి కుంతి సూర్యుణ్ణి స్మరించి అతని వంటి కొడుకును కోరి మంత్రాన్ని జపించింది.

సూర్యుడు తరుణద్యుతితో ఆ తరుణి దగ్గరకు దిగి వచ్చాడు. సహజ కవచకుండల శోభితుడైన బిడ్డ నిచ్చాడు. అతడే కర్ణుడు.

అయితే కుంతి కోరిక పై ఆమె కన్యాత్వం యథాతథంగా ఉండేటట్లు వరమిచ్చాడు. కుంతి సూర్య ప్రేరితమై వచ్చిన ఒక మందసంలో కర్ణుణ్ణి ఉంచి నదిలో వదిలింది. సూతు డొకడు ఆ పెట్టెను పట్టి కర్ణుని తన పట్టిగా పెంచుకొన్నాడు.

కుంతి కర్ణుని జన్మరహస్యాన్ని బైట పెట్టలేదు. అది దేవరహస్యంగా ఉండిపోయింది.

పాండవ, కౌరవ జననం

ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆరోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు.

విసిగివేసారి పోయాడు. చివరకు ఒకచోట, రెండు మృగాలు క్రీడిస్తుంటే చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందముడనే ముని తన భార్యతో కలసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు.

అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ శాపం పెట్టాడు – ‘నేను నా భార్యతో కూడినప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపోతావు.

నీ భార్యకూడా చనిపోతుంది’ అని శపించి ఆ ఋషి దంపతులు కన్నుమూశారు. పాండురాజు విషణ్ణుడయ్యాడు;

విరక్తుడు కూడా అయ్యాడు. భార్యా సమేతుడై శత శృంగపర్వతం చేరి ఘోరతపస్సు చేయనారంభించాడు. అది బ్రహ్మ లోకానికి వెళ్లేదారి.

కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే పాండురాజు వారితో తానూ వస్తానన్నాడు. కాని, వారు ‘అపుత్రస్యగతిర్నాస్తి అని వినలేదా! నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హతలే’ దని చెప్పారు. వారి మాటలు పాండురాజును మరీ క్రుంగదీశాయి.

సంతానాన్ని గురించి కుంతీమాద్రులతో కలిసి ఆలోచించాడు. దుర్వాస మహర్షి తన కిచ్చిన మహామంత్ర మొకటి ఉన్నదని ఆపద్ధర్మంగా దానిని పుత్రలబ్ధికి వాడుకోవచ్చునని కుంతి చెపుతుంది.

పాండురాజు అంగీకరిస్తాడు. కుంతిని పుత్ర సంతానం కోసం మంత్రమహిమ నాశ్రయించుమని నియోగిస్తాడు. ఆమె భర్తకు ప్రదక్షిణం చేసి సమాహిత చిత్తంతో మంత్రాన్ని జపిస్తుంది.

మొదటగా సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైనవాడు ధర్ముడు; అతనిని స్మరించి ఉత్తమ ధర్మవర్తనుడైన పుత్రుణ్ణి కోరుకుంది.

దిక్కులు కాంతులతో పిక్కటిల్లేటట్లు వెలుగొందే బాలుడు ధర్ముని అంశాన జన్మించాడు. అతడు పుట్టినప్పుడు సర్వభూతములు సంతోషించాయి. ఆకాశవాణి ఇలా పలికింది: “ఇతడు కురుకుల దీపకుడౌతాడు; ధర్మస్థిరమతి కావటంచేత యుధిష్ఠిరుడు” అని పిలువబడతాడు.

యుధిష్ఠిరుడు పుట్టిన సంగతి హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని, గాంధారి అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని కనలేకపోయింది.

ఆ అసూయతో కడుపుపై బాదుకొన్నది. గర్భపాతమైపోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిండ ఖండాలను నూటొక్కటిని లెక్కించి వేరువేరు తైలభాండాలలో భద్రపరిచాడు. నూర్వురు కొడుకులు, ఒక్క కూతురు పుడతారని చెప్పి వెళ్లాడు.

అక్కడ – శత శృంగపర్వతం మీద పాండురాజు మరొక పుత్రుని పొందాలనే కోరికతో కుంతిని – వాయుదేవుని ఆరాధించి ఉత్తమజవసత్త్యుడైన కుమారుణ్ణి పొందుమని అడుగుతాడు.

ఆమె అలాగే చేస్తుంది. వజ్రదేహుడైన విక్రమోన్నతుడైన బాలుడు పుట్టాడు.

దివ్యవాణి అతనికి ‘భీమసేనుడు” అని పేరుపెట్టింది.

అదేరోజున హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్ని, భోకాన్నీ నాశనం చేయగల దుశ్శకునాలు ఎన్నో పొడసూపాయి. అందరూ భయవిహ్వలులైనారు. అలాగే క్రమంగా దుశ్శాసనుడు మొదలైన తొంభై తొమ్మిదిమంది తమ్ములు, దుశ్శల అనే చెల్లెలు దుర్యోధనునికి పుట్టారు.

కులనాశకుడైన దుర్యోధనుని ఒక్కణ్ణి దూషించటం మంచిదని పెద్దలు ధృతరాష్ట్రునికి సూచించారు. అతడు పుత్రవ్యామోహంతో దాన్ని అంగీకరించలేదు.

ఈ సంగతి విని – పాండురాజు త్రిలోక విజయుడైన పుత్రుని కొరకు ఏకపాదం మీద నిలువబడి ఒక సంవత్సరం కాలం ఇంద్రుణ్ణి గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై శత్రుక్షయాన్ని చేయగల మహావీరుడు నీకు కొడుకుగా పుడతాడని వరమిచ్చాడు.

పాండురాజు, కుంతీదేవిని దేవేంద్రుని ఉపాసించుమని కోరతాడు. ఆమె అలాగే ఆరాధిస్తుంది. స్థిరపౌరుషుడు, లోకోత్తరుడు,

వంశకరుడు అయిన పుత్రుడు ఇంద్రాంశతో పుట్టాడు. ఆ సమయంలో దేవతలు ఆ బాలుని భావి బలవీర్యాలను కీర్తిస్తూ పూలవానలు కురిపించారు. ఉత్తరఫల్గుణిలో పుట్టాడు కాబట్టి ఆ బాలుణ్ణి ఫల్గుణుడని పిలిచారు.

ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు సూడులోకాలు జయించినట్లు పొంగిపోతుండేవాడు. కాని, మాద్రి తనయందు పుత్ర సంతానం పొందే ఉపాయం లేకపోవటంవల్ల విచారిస్తూ ఉండేది.

దీన్ని గమనించి, కుంతితో ఒప్పించి, దూర్వాసుని మంత్ర ప్రభావంతో మాద్రిచేత అశ్వినీ దేవతలను ఆరాధింపజేసి కవలపిల్లలను పొంద గలిగాడు. వారే నకుల సహదేవులు. సౌందర్య పరాక్రమాలలో సాటిలేనివారు. ఇలా పంచ పాండవులు పుట్టి శుక్ల పక్ష చంద్రబింబాల్లాగా పెంపొందుతూ ఉన్నారు.

అంతలో ఒక విపత్తు. వసంత ఋతువు వచ్చింది. ప్రకృతిశోభ మానవుల హృదయాల నుప్పొంగ జేస్తోంది. ఒకనాడు కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలై ఉంది.

మాద్రి ఒక్కతే పాండురాజు ప్రక్కన ఉంది. ఆమె మనోహరరరూపం వసంత ప్రభావంతో అతని మనస్సు నాకర్షించింది. పాండురాజు మాద్రిని సమీపించాడు. మునిశాపం చేత మరణించాడు. శతశృంగీయులందరూ గుమికూడారు. హృదయ విదారకంగా విచారించారు. మాద్రి తాను పాండురాజుతో సహగమనం చేసింది. కుమార రక్షణకు కుంతి దృఢచిత్తంతో జీవించ సంకల్పించింది. మాద్రీ పాండురాజుల అంత్యక్రియల తర్వాత వారి అవశేషాలతో అందరూ హస్తినాపురం చేరారు.

రగిలిన పగలు

హస్తినాపుర రాజమందిరంలో అటు కౌరవులు, ఇటు పాండవులు అందరూ కలి బాలక్రీడ లాడుతుండేవారు. అందరిలో బలాఢ్యుడు భీమసేనుడు. జలక్రీడ లాడేటప్పు భీముడు కౌరవులను బుజాలపై కెక్కించుకొని నీటిలో ముంచి తేల్చి ఉక్కిరి బిక్కి చేసేవాడు.

పండ్లకోసం కౌరవులు చెట్లెక్కితే భీముడు చెట్ల మొదళ్లు బట్టి ఊపి పండ్లతో బా! వారిని కూడా క్రింద పడేసేవాడు. ఇలా భీముని చేతిలో బాధపడలేక దుర్యోధనుడు – శక దుశ్శాసనాదులతో మంతనాలు సలివి, భీముణ్ణి ఒంటరిగా ఉన్నప్పుడు చంపటా: దద్ద কে కువ వరస పన్నాగాలు పన్నాడు. దుర్

ఒకనాడు భీముడు జలక్రీడలలో వేయిమంది వీరకుమారులతో పోటీపడి గెలి పరస బాగా అలసిపోయి, చల్లగాలి వీస్తుంటే నీటి ఒడ్డునే పడుకొని గాఢనిద్రపోయాడు.

దా ద్రో గమనించిన దుర్యోధనుడు భీముణ్ణి లతాపాశాలతో గట్టిగా కట్టించి నీటిలో త్రోయించా కాని, భీముడు ఒళ్ళు విరుచుకుండే సరికి ఆ లతలన్నీ పెటపెటా తెగి పోయాయి. భబద్ధ బంధవిముక్తుడు లాగా నీటినుండి బయటికి వచ్చాడు. ప్రజ

ఒకనాడు బాగా శ్రమించి భీముడు నిద్రిస్తున్నాడు. ఆ అదను కనిపెట్టి దుర్యోధను, వార పల ఒక సారధి చేత పాములను తెప్పించి అతన్ని కరిపించాడు. భీముని శరీరం వజ్రతుల్య కావటం చేత పాముల కోరలు అతని చర్మంలో దిగబడలేదు. కాని, నిద్ర మెలకువ వచ్చిం సారధి నొక్క చరుపుతో చంపివేశాడు, పాములను కాళ్ళతో నలిపివేశాడు. ఒకసారి అన్నం(భుః

విషం కలిపి పెట్టించాడు దుర్యోధనుడు. యయుత్సుడు వద్దంటున్నా ఆకలిగొన్న భీముము ఆ విషాన్నం తిన్నాడు. విషంకూడా ఆకలి వలన అతనికి అమృతంగా మారింది.

ఇలా ఎనచూ ఉపాయాలతో భీముణ్ణి వధించి ధర్మరాజును ఒంటరివాణ్ణి చేసి చంపాలని దుర్యోధను హి ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరకు పాండవులకందరికీ అపాయం కలిగింiకర్ణు ఉపాయమే ఉపాదేయమనుకున్నాడు.

భీష్ముడు బాలురకందరికీ మొదట కృపాచార్యునిచేత విలువిద్య నేర్పించావేశా ఆపై ద్రోణుని కూడా నియోగించాడు. ద్రోణుణ్ణి ద్రుపదుడు అవమానించాడు.

అందు వల ఆర్శ అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు లోలోన నుండిపోతున్నాడు. శిష్యులందరినడ తనకోర్కె తీర్చగలరా అని అడిగాడు. అర్జునుడు ఒక్కడే మాలు ఇచ్చాడు.

అందువలన అత పేర జగదేకవీరునిగా తీర్చిదిద్దుతానని ద్రోణుడు వరమిచ్చాడు. ఏకలవ్యుని వంటి వారి అడ్డున అడి ఉపాయంతో తొలగించాడు. రాత్రియుద్ధం, శబ్దభేది,

అస్త్రశస్త్రాలు, విలువిద్యా రహస్యాల ఎన్నెన్నో అర్జునునికి బోధించాడు. విలువిద్యలో పార్థుడే ప్రథమగణ్యుడు.

రాజకుమారుల అస్త్రశస్త్రపాండిత్యాన్ని పెద్దల ముందు ప్రదర్శింప చేయటానికి ద్రోణుడు ఒక విశాల సమతల ప్రదేశంలో రంగం ఏర్పాటు చేయించాడు.

తెల్లని వస్త్రాలతో ద్రోణుడు అశ్వత్థామ వెంటరాగా క్రీడారంగం మధ్యకు వచ్చి నిలువబడ్డాడు. కురు కుమారులందరూ జ్యేష్ఠానుపూర్వంగా మహాధనువులతో తనుత్రాణాలతో గురువుగారి వెనుక వరసగా నిలిచారు. చూడముచ్చటగా ఉంది దృశ్యం.

మొట్టమొదట భీమ దుర్యోధనుల గదా ద్వంద్వ యుద్ధం ప్రవర్తిల్లింది. భూమి దద్దరిల్లేలా పాద ఘట్టనం చేస్తూ మదపుటేనుగుల్లాగా భయంకరంగా పోరాడ సాగారు భీమ దుర్యోధనులు.

ప్రజలలో వారిరువురి పట్ల అభిమానం గల వారు పెద్ద అరుపులతో పాటు పరస్పర వివాదాలు గూడా చేయటం మొదలు పెట్టారు. దానితో వారిద్దరి పోరును ద్రోణుడు అశ్వత్థామను పంపి ఆపించాడు.

ఆ తరువాత హేమ కవచావృతుడు, ఉన్నత చాపధరుడు, అసితోత్పల వర్ణుడు, బద్ద తూణీరుడు అయిన అర్జునుడు రంగమధ్యంలో నిలిచి జన హృదయాలను ఆకట్టుకొన్నాడు.

ప్రజలు చేసే ప్రస్తుతి మిన్నంటింది. అర్జునుడు ఆచార్యుని అనుమతితో ఆగ్నేయ, వారుణాది మహాస్త్రాలను ప్రయోగించి, పరుగెత్తుతున్న మృగాలపై బాణాలు నాటే పలునేర్పులను ప్రకటించి విలువిద్యలో మేటివీరుడని జయజయధ్వానాలు పొందాడు.

అంతలో సహజకవచకుండలధారియైన కర్ణుడు రంగద్వారం వద్ద నిలిచి భుజాస్ఫాలనం చేసి అర్జునుణ్ణి ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు.

ద్రోణుని అనుమతితో ముందుగా అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ ప్రదర్శించి చూపించాడు. అతని పరాక్రమం చూచి దుర్యోధను డతనిని కౌగిలించుకొని “నాతో స్నేహం చేసి నాకూ నా బంధువులకు హితం చేసి నన్ను కురురాజ్యం ఏలించి, నా ఐశ్వర్యం ఉపయోగించుకో” అని కోరాడు. కర్ణుడు దానికి అంగీకరించాడు.

ఆ తరువాత కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం మొదలైంది. కర్ణుడు పర్జన్యాస్త్రం వేశాడు. అర్జునునిపై మేఘాలు దట్టంగా కమ్మాయి. కుంతి భయపడింది. అంతలో అర్జునుడు వాయుబాణం వేసి మేఘాలను చిమ్మివేశాడు. కుంతి శాంతపడింది.

వారిద్దరి నడుమ పంతాలు పెరుగుతున్నందువల్ల కృపాచార్యుడడ్డంపచ్చి, అర్జునుని తల్లిదండ్రుల పేర్లు కులం అందరికీ తెలుసు, అలాగే నీ వివరాలూ తెలియజెప్పుమని కర్ణుణ్ణి అడిగాడు. కర్ణుడు చెప్పడానికి సిగ్గుపడి తలవంచుకొన్నాడు.

దుర్యోధనుడు రంగప్రవేశం చేసి, రాజైతేనే గాని పార్థునితో యుద్ధం చేయడానికివీల్లేదంటే ఇదుగో అంగరాజ్యాన్నిస్తున్నానని, రంగమధ్యంలో సింహాసనం వేసి అంగరా పట్టాభిషేకం చేసి కర్ణుణ్ణి అంగరాజుగా పిలిచాడు. సూతుడు కొడుకుని చూచి ఉప్పొంగిపో కౌగలించుకొన్నాడు.

కర్ణుడు అతనికి అభివాదనం చేశాడు. దానితో అతడు సూతపుత్రు: అందరికీ తెలిసి పోయింది. భీముడు సూతపుత్రుడు క్షత్రియునితో యుద్ధం చేయ తగదన్నాడు. దుర్యోధనుడు అతని మాటలకు అడ్డువచ్చాడు. “లేడి కడుపున పుడుతుందా? ఇంతటి దివ్యతేజస్సు కలవాడు సామాన్యుడై ఉంటాడా? సూరుల జన్మ: సురల జన్మము, ఏరుల జన్మము ఎవరు చెప్పగలరు? సహజ కవచ కుండలధారియై ఇతడు అంగరాజ్యానికే కాదు అఖిల మహీమండలానికే అధిపతి కాగలిగినవాడు” ప్రశంసిస్తూ ఉండగా ప్రొద్దుక్రుంకింది. అందరూ వారి వారి మందిరాలకు వెళ్లారు.

గురుదక్షిణ

మరునాడు ద్రోణాచార్యులు శిష్యులనందరినీ పిలిచి గురుదక్షిణ ఇవ్వుమన్నా అందరూ గురువుగారిని ఆదేశించుమన్నారు. ‘ఐశ్వర్యమదగర్వితుడైన ద్రుపదుణ్ణి ఓడి పట్టి నాముందు పెట్టండి. అదే నేను కోరే గురుదక్షిణ’ అని ప్రకటించాడు ద్రోణాచార్యు

ఆమాట వినగానే కౌరవులందరూ సైన్యాలను వెంటబెట్టుకొని రథాలె పాంచాలపురం వైపు పయనం సాగించారు.

పాండవులు గురుప్రదక్షిణం చేసి ఆయ వెంట తీసికొని ఆతరువాత బయలుదేరారు. కౌరవుల సేనను ద్రుపదుడు చతురంగ సే ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగింది.

ద్రుపడుని పరాక్రమానికి కౌరవ నిలవలేకపోయారు. వెనుదిరిగి పోసాగారు. పాండవు లెదురుపడ్డారు.

వారి అం నిలిచారు. అర్జునుడు భీముని సాయంతో ముందు నడిచాడు. ద్రోణుణ్ణి, ధర్మజుణ్ణి ఒక నిలిపారు. సైన్యంతో భీముడు ద్రుపదుని గజబలాన్ని మట్టుపెట్టాడు.

అర్జునుడు అశ్వబల మట్టుబెట్టి ద్రుపదునిపై బాణాలు గుప్పించాడు. అంతలో ద్రుపదుడు అర్జునుని విల విరుగకొట్టాడు. అర్జునుడు సింహంలా లంఘించి కత్తితో ద్రుపదుని రథంపైకి దూ మెరపుదాడి చేసి అతన్ని రథాక్షంతో కట్టి ద్రోణుని యెదుటకు తెచ్చి ఉంచాడు. అప్ప అవహేళనగా నవ్వుతూ ద్రోణుడు ద్రుపదునితో ఇలా అన్నాడు –

క. “వీ రెవ్వరయ్య ద్రుపద మ

ఇప్పటికైనా నేను జ్ఞాపకానికి వచ్చానా? అని అధిక్షేపించి ద్రుపదుణ్ణి వదలివేశాడు. _ ఇలా గురుదక్షిణను పాండవులే ఇచ్చారు.

లాక్షాగృహ దహనం

రాజ్యభారాన్ని వహించగలవానిగా భావించి భీష్మ విదురాదులతో విచారించి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యువరాజుగా పట్టంగట్టాడు. ధర్మజుడు నలుగురు తమ్ముల సాయంతో నాలుగుదిక్కులా విజయ యాత్రలు సాగించి అపార ధనరాసులను తెచ్చి హస్తినాపుర వైభవాన్ని పెంచాడు. ధర్మరాజు పేరుకు యువరాజుగాని తీరుకు సార్వభౌముడు.

పాండవుల మీద పెరుగుతున్న ప్రజానురాగం దుర్యోధనుని గుండెలో అసూయాగ్నిని రగిల్చింది. అతడు ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి తన దుఃఖాన్ని వెళ్లగక్కాడు.

“పైతృకమైన ఈ రాజ్యలక్ష్మిని పూర్వం పాండురాజు భరించాడు కాబట్టి ఇప్పుడు ధర్మరాజును యువరాజును చేశారు. ఆ తరువాత అతని కొడుకులు,

మనుమలే రాజ్యాధిపతులౌతారు. మేము వారిని సేవించి బ్రతికే దుర్గతి ఏర్పడుతుంది.

రాజ్యం మీ అధీనంలో ఉంది కాబట్టి మీరే మాకు రాజ్యానికి మార్గం వేసి చూపించాలి. పాండవుల కీర్తి ప్రజలలో పెరిగిపోతున్నది.

ముందు వారిని దూరం చేయండి. వారణావతానికి పంపండి. ఆరు నెలల్లో నేనూ హస్తినాపురి ప్రజలలో నామీద అభిమానం కలిగేటట్లు చూచుకుంటాను” అని వాదించి తండ్రిని ఒప్పించాడు.

ధృతరాష్ట్రుడు నయంతో ప్రేమతో పాండవులను కుంతితో సహా వారణావతానికి పంపాడు.

అక్కడ దుర్యోధనుడు పురోచనునితో లక్కయింటిని కట్టించి సమయం కనిపెట్టి అందులో పాండవులు తగులపడేటట్లు చూడాలని పన్నాగం పన్నాడు.

విదురుడీ రహస్యాన్ని గోప్యంగా ధర్మరాజుకు సూచించాడు. ధర్మజుడు గ్రహించి, భీమునితో చెప్పి, లాక్షా గృహంలో నిపుణంగా జాగరూకతతో ఉంటుంటారు.

విదురుడు ఒక గూఢచారిని పాండవుల చెంతకు పంపించి లక్కయింటినుండి వారు తప్పించుకొని పోవటానికి బిలమార్గాన్ని ఏర్పరచి,

కృష్ణ చతుర్దశినాటి రాత్రి లాక్షాగృహదహన మవుతుందని సూచించాడు. భీముడు ఈ రహస్యాన్ని గమనించి పురోచనుని, ఒకదాసిని, దాని అయిదుగురు కొడుకులను ఆ లక్కయింటిలో ఉంచి,

అన్నదమ్ములను తల్లిని బిలం ద్వారా పంపించి నియమించిన ముహూర్తం కంటే ముందే లక్కయిల్లు మొత్తం దహనమయ్యేటట్లు చూచి తాను బిలం ద్వారా వెడలిపోయాడు.

ఒక్క విదురుడు తప్ప అందరూ పాండవులు లక్క యింటిలో పడి కాలి పోయారని దు:ఖించారు. ధృతరాష్ట్ర దుర్యోధనుల పాప సంకల్పాల ను ప్రజలు గర్తించారు.

బిల ద్వారం కుండా పాండవులు బయటపడి పాదచారులై నడిచి ఒక వనం చేరారు.

భీముడు నీరు తెచ్చే లోపలే ఒక చెట్టుకింద ధర్మజాదులు, కుంతి గాఢనిద్రపోయారు. వారి దీనావస్థకు విచారపడుతూ ఆ రాత్రి భీముడు వారికి కాపలా కాస్తూ ఉంటాడు.

అది హిడింబాసురుడు నివసించే వనం. నరవాసన కొట్టింది అతనికి. పాండవులను చంపి వండి వడ్డించుమని చెల్లెలైన హిడింబను అజ్ఞాపించాడు. ఆమె ఆ చెట్టు దగ్గరకు వచ్చింది.

భీముని సుందర వీరాకారం చూచింది. మనసారా ప్రేమించింది.

అతని తోడిదే తన జీవితమని మొదటిచూపులోనే నిర్ణయించుకొన్నది. అన్నను పోగొట్టుకొన్నా భీముని మాత్రం పొందాలని అనుకొన్నది. అన్ని విషయాలు భీమునికి చెప్పింది.

ఆలస్యమైందని హిడింబుడు వచ్చాడు. భీము డాతనితో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుని అరుపులకు కుంతి నిద్ర లేచింది; ధర్మజాదులు లేచారు.

హిడింబ మానవాకారంలో ఎదుట కనపడింది. కుంతి ఆమెను గురించి అడిగింది.

హిడింబ ఏసంగతీ దాచుకోకుండా మనసు విప్పి కుంతితో చెప్పుకొన్నది. ఆమెకు ఎన్నో మహిమ లున్నాయి. వాటిని ప్రదర్శించి చూపింది. భీముడు హిడింబాసురుణ్ణి చంపాడు.

పాండవులను హిడింబ అనుసరించింది. భీముడు వారించాడు. ధర్మజుడు,

కుంతి భీమునికి నచ్చచెప్పారు. శాలిహోత్రుని ఆశ్రమం గురించి హిడింబ చెప్పిన మాటలు నిజమని తెలిశాయి. భీమునితో హిడింబకు వివాహమౌతుంది. పగలల్లా ఆ దంపతులు అడవుల్లో విహరించేవారు;

రాత్రిళ్ళు ధర్మరాజాదుల వద్ద ఉండేవాళ్లు. కొన్నాళ్లకు ఘటోత్కచుడనే పుత్రుడు పుట్టాడు హిడింబకు. భయంకరాకారుడు. సద్యోయౌవనుడు; అస్త్రశస్త్రకుశలుడు, రాక్షస పిశాచబలపరివృతుడు. పాండవులను కొంతకాలం సేవించి రాక్షస రాజ్యానికి వెళ్లిపోయాడు తల్లిని తీసికొని. స్మరిస్తే చాలు ప్రత్యక్షమౌతానని తండ్రితో చెప్పాడు.

శాలిహోత్రుని ఆశ్రమమంలో వ్యాసుడు పాండవులకు దర్శనమిచ్చాడు. జరిగిన దానికి విచారించవద్దని ధైర్యం చెప్పి, భావికార్యక్రమాన్ని సూచించి వెళ్లాడు. పాండవులు బ్రాహ్మణవేషాలతో ఏకచక్రపురం చేరారు.

అక్కడ భిక్షాటనం చేసుకుంటూ బ్రతుకు సాగించారు. అయినా, అక్కడ ప్రజలను పట్టి పీడించే బకాసురుణ్ణి భీముడు వధించి వారికి శాంతి సౌఖ్యాలను అందించాడు.

పాండవ వివాహం

ఆనాడు అర్జునుని చేతిలో ఓడిననాటినుండి ద్రుపదుడు ద్రోణుణ్ణి చంపే కొడుకును,

అర్జునుని వివాహమాడే కూతురును పొందాలని అనేక ఘోరవ్రతాలు చేశాడు.

చివరకు ఒక క్రతువు నిర్వహించాడు. యజ్ఞాగ్నిలో నుండి ఉజ్జ్వల కరవాలంతో రథారూఢుడైనధృష్టద్యుమ్నుడు పుట్టాడు, దివ్య తేజస్విని ద్రౌపది పుట్టింది.

ఆ ద్రౌపదిని అర్జునున కివ్వాలని లోన సంకల్పం.

పైకి, చలత్ మత్స్య యంత్రభేదనాన్ని వరపరీక్షగా పెట్టాడు ద్రుపదమహారాజు. ఈ సంగతి పాండవులు ఏకచక్రపురంలో విన్నారు. పాంచాలపురికి హుటాహుటి పయనమైనారు.

ద్రుపద నగరం స్వయంవరోత్సవంతో కోలాహలంగా ఉంది. ఎత్తుగా కట్టబడిన మత్స్య యంత్రాన్ని అయిదు బాణాలతో ఎవడు కొట్టగలగో,

ఆవిలుకాడే ద్రౌపదికి భర్త కాగలడని పాంచాలపతి ప్రకటించాడు.

రాజులు నగరం చుట్టూ డేరాలు తీర్చి స్వయంవరానికి దిగి ఉన్నారు. పాండవు లాపురిలో బ్రాహ్మణ వేషాలతో ప్రవేశించి ఒక కుంభకారుని యింట్లో వసించి మత్స్యయంత్రసభకు వెళ్లారు.

ధృష్టద్యుమ్నుడు స్వయంవర నియమాన్ని ప్రకటించాడు. స్వయంవర సభలో విచ్చేసియున్న రాజుల నందరినీ ద్రౌపదికి చూపించాడు. అందులో నూరుగురు కౌరవులున్నారు;

కర్ణాశ్వత్థామాదులు కూడా ఉన్నారు. వారిలో ఎవరు లక్ష్యాన్ని భేదిస్తే అతడు కల్యాణమాలకు అర్హుడని సూచించాడు. ఆ సభలోని అతిథులలో వాసుదేవు డున్నాడు.

అతడు బ్రాహ్మణవర్గంలో పంచాగ్నుల వలె వెలుగొందుతున్న పాండవులను గ్రహించి పార్థుడు పాంచాలిని గ్రహిస్తాడని సంతోషించాడు.

కొందరు రాజులు విల్లును ఎక్కుబెట్టలేక వెనుతిరిగి పోయారు; కొందరు ప్రయత్నమే చేయలేకపోయారు; కొందరు చేసి విఫలురయ్యారు. బ్రాహ్మణులలోనుండి అర్జునుడు లేచి యంత్రాన్ని సమీపించి, గురువులకు నమస్కరించి,

ధనువునకు ప్రదక్షిణం చేసి మ్రొక్కి, దానిని అవలీలగా ఎక్కుబెట్టి, అలవోకగా మత్స్య యంత్రాన్ని భేదించాడు. సభికులందరూ ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణు లుప్పొంగిపోయారు. ధృష్టద్యుమ్నుడు సైన్యంతో అర్జునుని వెంట నిలువబడ్డాడు.

ధర్మజుడు నకుల సహదేవులతో కలిసి వసతి గృహానికి వెళ్లాడు. ద్రౌపది కల్యాణ మాలను అర్జునుని మెడలో ఉంచటానికి బయలుదేరింది. దుర్యోధనాదు లది సహించలేకపోయారు.

రాచకన్నెను విప్రుని కివ్వటం అవమానమని ఆగ్రహించారు. విప్రాకారంలోనున్న అర్జునుణ్ణి అపహసించారు. బ్రాహ్మణులు భయపడి అర్జునుని వెనకాల నిలువపడ్డారు. వారందరికి అభయమిచ్చి అర్జునుడు భీమసహాయంతో తిరగబడ్డాడు.

అర్జునునికి ఎదురుగా కర్ణుడు నిలిచి బాణయుద్ధం చేశాడు. తన ఎదుట నిలువగలిగిన వా డెవడా అని కర్ణు డాశ్చర్యపోయాడు. ఎవడో విప్రశ్రేష్ఠుని వలె నున్నాడని రణరంగం నుండి తొలిగిపోయాడు.

భీముడు శల్యుణ్ణి నేలపై పడవేసి కొట్టాడు. అతడు లేచి దుమ్ము దులుపుకొని వెళ్లిపోయాడు. ఆ బ్రాహ్మణు లెవరో తేల్చుకోవాలని పట్టుబట్టిన దుర్యోధనాదులకు మొగం వాచేటట్లు సమాధానం చెప్పి వాసుదేవుడు పంపివేశాడు.రాజులు మరలి పోయారు.

భీమార్జునులు ద్రౌపదిని తీసికొని యింటికి వచ్చారు.

ధర్మజాదులకి కలిసి తల్లితో “అమ్మా! మేమొక భిక్ష తెచ్చాం” అని అన్నారు. కుంతి అసలు విషయాన్ని గమనింపక “మీరయిదుగురూ ఉపయోగించుకొనండి” అని కొడుకులను నియోగించింది. ఆ తరువాత ద్రౌపదిని చూచి అధర్మాన్ని ప్రబోధించానని చిన్నబోయింది. ఆమె అన్నమాట అయితీరుతుంది.

పాండవులు అమ్మమాట జవదాటరు. కుంతి కలత చెందింది. ధర్మజుడు తల్లి నోదార్చి ద్రౌపదిని అర్జునుణ్ణి వివాహమాడుమన్నాడు. అర్జునుడు పెద్దవాడైన ధర్మరాజును పెండ్లాడమన్నాడు.

వీరిద్దరూ ఇలా అంటూనే ఉన్నారు. పాండవు లైదుగురూ పాంచాలిని చూచి మన్మథభావాన్ని ఒకేసారి పొందారు. పాంచాలి కూడా వారి అయిదుగురియందు బద్ధానురాగయై నిలిచింది.

ధర్మజుడు వేదవ్యాసుని మాటలు స్మరించి ద్రౌపదిని పాండవు లైదుగురు పాణిగ్రహణం చేయటమే ఉత్తమ మని నిర్ణయించాడు.

మత్స్యయంత్రం భేదించింది అర్జునుడనీ, ద్రౌపదిని వివాహమాడేది పాండవులనీ తెలుసుకొని ద్రుపదుడు సంతోషించాడు.

ద్రౌపదికి భర్తృ పంచకం ఏర్పడటానికి గల పూర్వ జన్మ వృత్తాంతాన్ని వ్యాసుడు వినిపించాడు.

ఆమె అయిదుగురు భర్తల భార్య అయినా ఎవరి దగ్గరి కన్యాత్వం సతీత్వం వారివద్ద మొక్కవోకుండా ఉండే వరం ఉండటం వలన వివాహంలో కూడా వరుసగా ధర్మజాదులు తాళిగట్టేటప్పు డామె కన్యాత్వం చెక్కు చెదరకుండా నిలిచింది.

ఆమహిమను చూచి అగ్నిజాతయైన ద్రౌపది విశిష్ట లక్షణంగా అందరూ భావించారు. వాసుదేవుడు సంతోషించాడు. పాండవుల వివాహం వైభవంగా జరిగింది; వారు పాంచాలీ నగరంలో ఒక యేడాదిపాటు ఉన్నారు.

ఇంద్రప్రస్థపురం

ధృతరాష్ట్రుడు భీష్మాదుల నీతివచనాలు విని పాండవులను హస్తినాపురానికి విదురుని పంపి పిలిపించాడు. లాక్షాగృహదహనం నుండి పాండవులు బైటపడ్డందుకు దుర్యోధనుడు లోలోన మండిపోతుండేవాడు.

పాండవులు ఎక్కువ కాలం హస్తినాపురంలో ఉండకుండా చూడుమని

తండ్రిని బలవంత పెట్టేవాడు.

కొడుకు పోరు పడలేక ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యమిచ్చి ఇంద్రప్రస్థపురం రాజధానిగా ఏలుకోండని పంపాడు. ధర్మరాజును పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. శ్రీకృష్ణాదులు వెంటరాగా పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని చేరుకొన్నారు.

శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి, ఇంద్రుడు విశ్వకర్మను స్మరించగా విశ్వకర్మ సాయంతో ఇంద్రప్రస్థపురం దిక్పాలకుల పురాలతో దీటైనదిగా రూపొందింది.

వాసుదేవుని అనుమతితో ఆశీస్సులతో ధర్మజు డానగరంలో ప్రవేశించి అపర దేవేంద్రుడు లాగా వెలుగొందుతూ ఉన్నాడు.

ఒకనాడు నారదుడు వచ్చి పాండవులలో ఒక్కొక్కరు ద్రౌపదిని ఒక్కొక్క యేడు తన తన భవనంలో ఉంచుకోవాలనీ,

ఆ కట్టడిని తెలిసిగాని, తెలియకగాని ఎవరైనా మీరితే ఒకయేడాది పాటు అతడు తీర్థయాత్రలు చేసిరావాలనీ నియమం చేశాడు. పాండవులు దానికి కట్టుబడి ఉన్నారు.

ఒక యేడు ధర్మరాజు అంతః పురంలో ద్రౌపది ఉంటున్నది.

అర్జునుడు బ్రాహ్మణ ధేనువును రక్షించడానికై ఆయుధాలు తెచ్చుకొందామని ధర్మజుని భవనానికి వెళ్ళివచ్చాడు. దొంగలను చంపి ధేనువును బ్రాహ్మణున కిచ్చి ఆయుధాలు ఉన్నచోట పెట్టాడు.

కాని, ఆ సమయంలో అర్జునాదులు ధర్మజునింటికి పోగూడదు.

నియమం తప్పినట్లైంది. ధర్మజుడు వలదన్నా అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు.

ఆ యాత్ర అతనికి పుణ్యం పురుషార్ధం కలిసి వచ్చేటట్లు చేసింది. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలు అర్జునుని వివాహమాడారు. సుభద్ర బలరామ శ్రీకృష్ణుల ముద్దుల చెల్లెలు.

అర్జునుడు యతివేషంలో సుభద్రకు సన్నిహితుడు కావటానికి,

ఆమెను వివాహమాడి ఇంద్రప్రస్థపురానికి చేరటానికీ శ్రీకృష్ణుడు సూత్రధారుడుగా నిలిచాడు.

సుభద్రార్జునుల వివాహం ఇంద్రోపేంద్రులే స్వయంగా చేయించారు. ఆమీద బలరాము డంగీకరించాడు. సుభద్రను ద్రౌపది దీవించింది. పాండవవంశాన్ని నిలిపే కౌరవ వధువుగా సుభద్ర మహాభారతంలో చిరస్మరణీయురాలుగా నిలిచింది.

next part next post soon

Leave a Comment