అంతఃపుర కావలి రక్షకులు రాజు సమక్షంలో ఒక చోరుడ్డి తెచ్చి నిలబెట్టారు.
ఆ దొంగ చేసిన దొంగతనం నేరాన్ని విచారించిన రాజు, “వీడ్డి లాక్కెళ్ళి వెంటనే ఉరి తీయండి” అని భటులను అజ్ఞాపించాడు.
ఆ కఠోర తీర్పు విని దొంగ నిర్ఘాంతపోయాడు. కాస్త తేరుకున్న తరువాత రాజుతో ఇలా విన్నవించుకున్నాడు: “మామూలు దొంగతనం నేరానికి ఉరిశిక్ష విధించడం న్యాయంగా లేదు రాజా! అయినా నన్ను

ఉరి తీసే ముందు మీకు ఒక మాట చెప్పాలి. నా తండ్రి నాకు ఒక రహస్య మంత్రం నేర్పాడు. ఆ మంత్ర ప్రభావంతో ఒక మామిడి టెంకను నేలలో పాతి, ఒకే రాత్రి అది చెట్టు అయి పండ్లు కాయడం మీకు చూపాలని ఉవ్విళ్ళూరుతున్నాను. తరువాత నన్ను ఉరితీసినా ఫర్వాలేదు.
”ఇదేదో విచిత్రంగా ఉందే! ఒకే రాత్రి టెంక నుండి చెట్టు అయి, పండ్లు కాయడం చూడవలసిందే’ అనే ఆసక్తి రాజుకు కలిగింది. వెంటనే దొంగ విన్నపాన్ని ఆమోదించాడు.మామిడి టెంకను పాతడానికి దొంగ నేల మీద ఒక గుంట తవ్వాడు.
తరువాత అతడు మామిడి టెంకను చేతిలో తీసుకుని, “రాజా! జీవితంలో ఒక్కసారి కూడా దొంగతనానికి పాల్పడని వ్యక్తి ఈ మామిడి టెంకను నేలలో నాటాలి. అప్పుడే నేను పఠించే మంత్రం ఫలించి, మామిడి టెంక ఒకే రాత్రిలో చెట్టై, పండ్లు కాస్తుంది. నేను దొంగతనం చేశాను కనుక నేను నాటితే ఫలించదు” అని చెప్పాడు.
ఇలా చెబుతూ ఆ దొంగ పక్కనే ఉన్న ఒక ఉన్నత రాజోద్యోగితో, “మీరు ఈ మామిడి టెంకను నేలలో నాటగలరా?” అని వినయంగా అడిగాడు.
దొంగ ఇలా తనను అడుగుతాడని ఊహించని ఆ రాజోద్యోగి గతుక్కుమన్నాడు.
తన కంగారును కప్పిపుచ్చుకొంటూ ఆ రాజోద్యోగి, “నేను చిన్నప్పుడు ఒకసారి మా తమ్ముడి పలకను దొంగతనం చేశానుకనుక నేను ఈ మామిడి టెంకను నాటితే ఫలితం ఉండదు” అన్నాడు నీళ్ళునములుతూ.king
అప్పుడు ఆ దొంగ రాజు పక్కనే ఆసీనుడై ఉన్న మంత్రితో, “దయచేసి మీరు ఈ మామిడి టెంకను నాటండి మంత్రివర్యా!” అని అర్థించాడు.
అందుకు మంత్రి, “చెప్పడానికే సిగ్గుపడుతున్నాను. నేను యువకుడుగా ఉన్నప్పుడు, మా ఊరికి వెలుపల ఉన్న ఒక తోటలో మామిడిపళ్ళు దొంగతనం చేశాను. కాబట్టి నేను ఈ మామిడిటెంకను నాటడానికి అర్హుడను కాను” అన్నాడు తల వంచుకొని.
దొంగ ఇలా సభలోని కొందరు ప్రముఖులను టెంకను నాటమని అడిగాడు. కాని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో చిన్న చితక దొంగతనం చేసినట్లు బాహాటంగా ఒప్పుకున్నారు.
చివరికి ఆ దొంగ, రాజు వైపు తిరిగి, “రాజా! మీరు సజ్జనులు. కనీసం మీరైనా టెంకను నాటితే బాగుంటుంది” అన్నాడు ఉట్టిపడే వినయంతో.