ద్రౌపదీసహితులై పాండవులు ఉత్తరదిశగా పయనించారు.maha bharatham
కొంతదూరం పోయిన తర్వాత ఇంద్ర సేనాదులైన మూల భృత్యులు, పధ్నాలుగు వేల రధాలతో సుభద్రా అభిమాన్యులు ప్రతివింధ్యాదులు వారిని కలుసుకొన్నారు.
.
ధర్మజుడు వారికి నచ్చచెప్పి నివాసాలకు పంపాడు.
కొందరు వేదవిహిత పండితులూ ధౌమ్యుల వారి వెంట సాగి వచ్చారు.
తమతో వస్తున్నవారు వనవాసంలో ఏమాత్రం ఆకలిబాధకు శ్రమపడినా ధర్మజుడు ఎంతో బాధపడుతుండేవాడుధౌమ్యుడు ధర్మజునికి అతని ఆశ్రితులకు అన్నలోపం లేకుండా ఆదిత్య మంత్రాని జపించుమని ఉపదేశించాడు.
నిష్ఠతో జపించిన ధర్మరాజుకు సూర్యుడు ప్రత్యక్షమై ఒక రాగిపాత్ర నిచ్చి ఆ పన్నెండేళ్ల వనవాసకాలంలో వన్యఫలమూల శాకాలకు ఎటువంటి లోపం లేకుండా ద్రుపదరాజపుత్రిచేత సాధింపబడతాయని వరమిచ్చాడు. ఆవిధంగా అరణ్యవాసంలో ధర్మరాజాదులకు ఆకలిబాధ లేకుండా ఆదిత్యుడు రక్షించాడు.
పాండవులు కామ్యకవనం చేరారు. యాదవ పాంచాల వీరులు శ్రీకృష్ణ ధృష్టద్యుమ్నాదులు పాండవులను దర్శించటానికి వచ్చారు.
ద్రౌపది తనకు కలిగిన అవమానాన్ని అన్నలిద్దరి యెదుట చెప్పుకొని కంటతడిపెట్టింది. శ్రీకృష్ణుడు ఆమె నోదార్చి కౌరవుల సంహారం తప్పకుండా జరుగుతుందని ఊరడించాడు.
ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి చంపుతా నని ప్రతిజ్ఞ చేశాడు. కొంతకాలమున్న తరువాత శ్రీకృష్ణుడు తనతో సుభద్రాభిమన్యు లను ద్వారవతికి తీసుకొని వెళ్ళాడు.
ఉపపాండవులైన ప్రతివింధ్యాదులను ధృష్టద్యుమ్నుడు ద్రుపదపురానికి కొనిపోయాడు. పాండవులు మూలభృత్యులతో సహస్ర బ్రాహ్మణవరులతో ద్వైతవనంలో ప్రవేశించారు.
పాశుపతాస్త్ర సంపాదనం
యుద్ధం సంభవిస్తే భీష్మద్రోణ కృపాదులను నిగ్రహించగలిగిన శక్తి తమ కెక్కడ ఉన్నదని ధర్మరాజు గాఢంగా విచారించాడు. ఆతని మనస్సు తెలిసి వేదవ్యాసుడు ప్రసన్నుడైనాడు.
ప్రతిస్మృతి విద్యను బోధించి దానిని అర్జునున కిస్తే తపోవీర్య విభవంతో దేవతలనుండి మహాస్త్రాలను సంపాదింపగల డని సూచించాడు. పాండవులు అక్కడినుండి కామ్యకవనం చేరి సరస్వతీ నదీతీరంలో ఉన్నారు.
ధర్మజుడు అర్జునునికి ప్రతిస్మృతివిద్యను బోధించాడు. దానితో అతడు తేజోవంతుడైనాడు. దివ్యాస్త్ర సంపాదనం కోసం పార్థుడు తపస్సుకు పూనుకున్నాడు.
ఇంద్రకీల పర్వతం మీదకు చేరి ఇంద్రుని ఆనతితో పాశుపతాస్త్రాన్ని పొందటానికి పరమేశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేశాడు.
పార్థుని ఘోరతపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి పరీక్షించి వరమిద్దామని కిరాత వేషంతో దిగివచ్చాడు.
మూకుడనే రాక్షసుడు అరుమని చంపాలని అడవిపంది ఆకారంలో పరుగెత్తుతూ వచ్చాడు. ఒకవైపు నుండి పార్థుడు, మరొకవైపునుండి పరమేశ్వరుడు బాణాలు వేశారు పంది పడింది. మూకుడు నిజాకారాన్ని పొంది అంతర్ధానం చెందాడు. కిరీటి ఎదుట కిరాత వేషధారియైన పరమేశ్వరుడు. ఇరువురూ వీరాలాపాలాడు ఉన్నారు.
అడవి పందిని చంపటంపై వివాదం పెంచుకొన్నారు బాణాలు గుప్పుకున్నారు.ఎఱుకువాని బాణాల ధాటికి అర్జునుడు ఆశ్చర్యపోయి మారురూపంలో వచ్చిన యే దేవుడో అని భావించాడు.
అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించాడు. అగ్నిదేవు డిచ్చిన అక్షయతూణీరద్వయం ఓటువోయింది. అర్జునునికి ఆశ్చర్యం వేసింది.
గత్యంతరం లేక గాండీవంతో కిరాతుని మీదకు లంఘించాడు. అన్ని ప్రయత్నాలూ వృథా అయ్యాయి. ముష్టియుద్ధానికి తలపడ్డాడు పార్థుడు. పరమేశ్వరుడు గట్టిగా చరిచాడు. నరుడు మూ పోయాడు.
శివుడు ప్రత్యక్షమై కరుణతో పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. దానికి అసాధ్యమనేది లేదనీ, అల్పుల
మీద ప్రయోగిస్తే జగత్ప్రళయం చేస్తుందనీ హెచ్చరిక చేశాడు. ఆ దివ్యబాణంతో అఖిల లోకాలను జయించగలవని చెప్పి పరమేశ్వరుడు అంతర్థానమైనాడు.
పాశుపతాస్త్రం పొందిన అర్జునునికి ఇంద్రుడు దేవగణంతో ప్రసన్నుడైనాడు.
వారందరూ పార్థుని నభినందించి వివిధ దివ్యాస్త్రాలను ప్రసాదించారు. దేవేంద్రుడు అర్జునుణ్ణి తన రథంమీద అమరావతికి తీసికొని పోయాడు. అక్కడి భోగభాగ్యాలను చూపించాడు.
సగం గద్దెమీద కూర్చుండబెట్టుకున్నాడు. రాత్రి వెన్నెల వేళ ఊర్వశి అర్జునునిపై మరులు గొని సమీపించి మనసుబైట పెట్టింది.
కాని, అర్జునుడు ఆమెయందు మాతృభావాన్ని ప్రకటించి నమస్కరించాడు. దేవవనితలకు వావి వరుస లుండవని ఆమె ఎన్నో విధాల సదనోద్దీపకంగా మాట్లాడుతుంది.
అతడు చలింలేదు. ఆమె విసిగి అతణ్ణి నపుంసకునిగా పించింది.
మరునా డా సంగతి తెలుసుకొనిన దేవేంద్రుడు అర్జునుని అభినందించి ఆషండరూపం అజ్ఞాతవాస వత్సరకాలం మాత్రమే ఉంటుందని వరమిచ్చి వివిధ దివ్యాస్త్రాలను ప్రసాదించాడు.
ధృతరాష్ట్రుడు అర్జునుని పాశుపతాస్త్ర లాభవృత్తాంతం పారాశర్యుని వలన విని పరమ వ్యాకుల చిత్తుడై తపించాడు. భీముడు కిమ్మీరుని చంపిన వార్తవిని మనసులో కటకటలాడాడు.
పాండవులు గంధమాదన పర్వతం మీద ఉన్నప్పుడు భీముడు ద్రౌపదికి సౌగంధిక ష్పాలు తెచ్చియిచ్చాడు. ఆ సందర్భంలో హనుమంతుడు దయ కాతడు పాత్రుడైనాడు.
అర్జున రథ ధ్వజం మీద నిలిచి రక్షించటానికి వరమిచ్చాడు వీరాంజనేయుడు.
పాండవులు హిమవన్నగ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు భీమసేను డొక్కడే వేటకోసం వెళ్ళాడు. అతడు అలసిపోయి ఉన్నప్పుడు ఒక గొప్ప కొండచిలువ భీముణ్ణి బిగపట్టింది.
ఆ పాము పట్టు తో భీముడు బలహీనుడైనాడు. తనను గురించి ఆపాముకు నివేదించుకొన్నాడు.
కాని, పాము భీముణ్ణి వదలలేదు. ధర్మరాజు భీముడు తిరిగి రావటం ఆలస్యమైందని తమ్ములతో కలిసి వెదుక్కుంటూ వచ్చాడు.
సర్పాధీనంలో భీముణ్ణి చూచాడు. ఆ సర్పం సామాన్యమైనది కాదని తెలిసి వివరాలు అడిగాడు. ఆపామురూపంలోఉన్నది భరతవంశీయుడైన నహుష చక్రవర్తి.
అన్ని వేదాలు చదివినా. నూరు యజ్ఞాలు చేసినా, దేవేంద్ర పదవి పొందినా మదంతో ముని పుంగవులను అవమానిస్తే ఇలాగే ఫలం అనుభవించవలసివస్తుందని పశ్చాత్తాపంతో స్వవిషయం చెప్పుకొన్నాడు నహుషుడు.
తనువేసే ప్రశ్నలకు సమాధానాలు చెపితే భీముణ్ణి వదులుతానన్నాడు. నహుష ప్రశ్నలు తాత్త్విక గుళికలు. వాటిని వినయంతో సరైన సమాధానాలు చెప్పాడు ధర్మరాజు.
నహుషునకు శాపవిమోచనమైంది. భీముడు బంధవిముక్తు డైనాడు. నహుషునికి నమస్కరించి తమ్మునితో తిరిగి ఆశ్రమానికి చేరుకొన్నాడు ధర్మరాజు.
ఘోష యాత్ర
పాండవులు ద్వైతవన సరోవర తీరంలో ఉన్నారు. వారు వనవాస క్లేశాలను అనుభవిస్తున్నారని, వారి ముందు కౌరవ సంపదను ప్రదర్శించి వారికి మరింత దుఃఖాన్ని కలిగించాలనీ దుష్టచతుష్టయం పన్నాగం పన్నింది.
ద్వైతవనంలో ఉన్న పశువులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తక్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలనీ సమంగుడనే గోపాలునిద్వారా వినతిని సృష్టిస్తారు.
దానిని నమ్మి ధృతరాష్ట్రుడు ఘోషయాత్ర చేయటానికి దుర్యోధనాదులకు అనుమతినిచ్చాడు.
అయితే, ఆ వనంలోనే నివసిస్తున పాండవుల కెటువంటి కీడును తలపెట్టవద్దని హెచ్చరించాడు.
సరేనని దుష్టచతుష్టయం మహావిభవంగా అట్టహాసంగా సకుటుంబ పరివారంగా ద్వైతవనం చేరి డేరాలు వేయించి వినోదంగా జీవిస్తుంటారు.
దుర్యోధనాదుల సంపదలను చూచి పాండవులు, ధార్తరాష్ట్రుల వైభవం చూచి పాంచాలి మనసులో బాధపడా లని వారి పన్నాగం.
ద్వైతవనంలో దుర్యోధనాదులు మృగయా వినోదం సాగిస్తూ ద్వైత సరోవర ప్రాంతంలో ధర్మరాజు యజ్ఞదీక్షితుడై ఉన్నాడని తెలిసి, సరోవరానికి ఆవలి ఒడ్డున క్రీడాగృహాలను నిర్మించటానికి ఆజ్ఞాపించారు.
ఆ ప్రయత్నాన్ని కొందరు గంధర్వులు అడ్డుకొన్నారు. చిత్రసేనుడనే గంధర్వరాజు క్రీడార్థం కల్పించుకొన్న కొలను కాబట్టి అన్యు లది ఉపయోగించరాదని హెచ్చరించారు.
దుర్యోధనాదులు వారిమాటలకు లెక్క సేయక చిత్రసేనుని గంధర్వసేనతో యుద్ధానికి సిద్ధమయ్యారు.
పోరు ఘోరంగా జరిగింది. కర్ణుని రథం కూలింది. దుర్యోధనుని రథాన్ని భగ్నం చేసి, విరుగగొట్టి, జుట్టుపట్టి అతణ్ణి నేలపై పడవేసి, పెడకేల కట్టి సింహనాదం చేశాడు చిత్రసేనుడు.
దుశ్శానాదులనందరినీ బంధించాడు. ఆ భంగపాటుకు బెదరి కౌరవ సైనికులు ధర్మరాజు దగ్గరికి పోయి జరిగిన సంగతి చెప్పి శరణువేడారు.
‘మనం చేయవలసిన పని గంధర్వులే చేశా’రని భీముడు నవ్వాడు. పుట్టినప్పటినుండి.
మన కపకారం చేస్తున్నది చాలక అరణ్యవాసం చేస్త్ను మనలను అపహాస్యం చేయటాని వచ్చిన అహంకారులకు తగిన శాస్తి అయిందనీ, అతనిమీద ఎటువంటి దయచూపవద్ద భీముడు పలుకుతాడు. ధర్మజుడు అనుసరిస్తు ఇలా అంటాడు-
కావరయ్యతో! అనీన, కరము దుర్బలుడైన చెనసి యోపినంత సేయు ననిన ఊరకుండునయ్య! ఉత్తమ శూరుండు దీనజనులయున్న తెరగు సూచి”
అని నచ్చచెప్పి భీమార్జునులను గంధర్వరాజుపై పంపి దుర్యోధనుణ్ణి విడిపించే ప్రయత్నఁ దేశాడు. భీమార్జునులు చిత్రసేనునిపై దండెత్తారు.
గంధర్వపతి వారితో అస్త్రశస్త్రాలతో యుద్ధం చేశాడు. పాండవులను పరిహసించటానికి వచ్చిన కౌరవులపట్ల ఎందు కింత కనికర ఎని ప్రశ్నించాడు.
‘సుయోధనుడెంత చెడ్డవాడైనా మాకు సోదరుడు అతణ్ణి వదలిపెడితే మా అన్న ధర్మరాజు సంతోషిస్తాడు’ అని అర్జునుడు ప్రకటించాడు.
అందుకు గంధర్వరాజంగీ కరించి పెడరెక్కలు కట్టిన దుర్యోధనుణ్ణి స్వయంగా ధర్మరాజు ఎదుట నిలిపి అతని దుష్ట స్వభావాన్ని బయట పెట్టాడు. చిత్రసేనుని ఔదార్యాన్ని కొనియాడి ధర్మజుడు సగౌరవంగా అతన్ని గంధర్వ లోకానికి సాగనంపాడు. ఆపైన దుర్యోధనాదుల బంధాలను ఊడదీయించాడు.
“ఎప్పుడూ ఇటువంటి సాహసాలు చేయకుము సోదరా! దుర్జనుడు సాహసిస్తే నశిస్తాడు. కాబట్టి వెంటనే నీ తమ్ములను తీసికొని నగరానికి వెళ్లిపో. దీన్ని మనసులో పెట్టుకొని బాధపడకు” అని మెత్తగా మందలించి దుర్యోధనుణ్ణి వీడ్కొలిపి పంపించాడు. ధర్మజుని ధర్మప్రవృత్తికి ధౌమ్యాదులందరు ప్రశంసించారు.
దుర్యోధనుడు పాండవులచేత విడిపింపబడ్డాడన్న అపకీర్తిని సహించలేక నగరికి తిరిగిపోతూ మార్గ మధ్యంలోనే ప్రాయోపవేశం మొదలుపెట్టాడు. దుశ్శాసన, కర్ణ, శకునులు ఎంతో చెప్పి చూచారు.
పాతాళవాసులైన రాక్షసులు కృత్యను సృష్టించి అర్ధరాత్రి దుర్యోధనుణ్ణి అక్కడికి తెప్పించుకొన్నారు. దుర్యోధనుడు వారి తపస్సుకు ఫలంగా పుట్టాడని చెప్పి అసురాంశలతో పుట్టినవారినందరినీ పేర్కొని, వారి కందరికీ ఉత్తేజం కలిగించటానికి బ్రతికి ఉండు మని హితవు చెప్పారు. మరునాడు ఉదయమే దుర్యోధనుడు ప్రాయోపవేశం మాని సైన్యసమేతుడై హస్తినాపురం.

సైంధవుడికి కలిగిన పరాభవం
ఒకసారి పాండవులు తృణబిందునాశ్రమంలో ధౌమ్యుణ్ణి, ద్రౌపదిని ఉంచి తాము వేటకు వెళ్లారు. ఆ సమయంలో సైంధవుడు సాల్వకన్యను వివాహమాడే నిమిత్తమై ఆవైపు ససైన్యుడై తరలిపోతున్నాడు.
సైంధవుడు ఆశ్రమద్వారంలోని ద్రౌపదిని చూచాడు. ఆమె అపూర్వ లావణ్యాన్ని చూచి మోహించి ఆమెకు తన కోర్కెను దూతద్వారా తెలియపరిచాడు. దూతకు ద్రౌపది తనవివరాలు తెలిపి పాండవపత్నిననీ, సంతానవతి ననీ పేర్కొని, పాండవులు వచ్చేంతవరకు ఉండి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లమంటుంది.maha baratam
ఆ సంగతి దూత సైంధవుడుకి చెప్పాడు. అతడు మదనాతురుడై రథం దిగి ద్రౌపదిగల ఆశ్రమం లోనికి ప్రవేశించి ఆమెను పలుకరించాడు. ఆమె సైంధవుడుకి అతిథి మర్యాదలు చేసింది. ఆమె పై సైంధవుడు మరులుగొన్న మాటలు మాట్లాడసాగాడు.
ఆమె తనకు చెల్లెలివరస అనికూడా భావించకుండా కామాంధకారంతో మాట్లాడిన అతని వైఖరికి నిష్టురంగా సమాధానం చెప్పింది. పాండవాగ్రహం వలన కలిగే విపత్తును హెచ్చరించి చెప్పింది.
అయినా, అతడు లెక్క సేయకుండా ఆమెను బలాత్కారంగా ఎత్తుకొని రథంమీద ఉంచుకొని బయలదేరాడు. ద్రౌపది ధౌమ్యుణ్ణి పిలుస్తూ ఆక్రందిస్తుంది. ఆ రథం వెంట ధౌమ్యుడు అనుసరించాడు.
పాండవులు వేట ముగించి తిరిగి వచ్చారు. ద్రౌపది చెలికత్తెవలన అంతా తెలుసుకున్నారు. అయిదుగురూని సైంధవుని మీదకు లంఘించారు. వారి రథాలను చూచి సైంధవుడు వారిని పరిచయం చేయుమని ద్రౌపదిని కోరాడు. ఆమె పాండవ పరాక్రమ మూర్తులను వర్ణించి వారి బారిన పడిన వారికి మృత్యువు ఖాయమని వెల్లడించింది.
పాండవులు దిక్కులు చీకట్లు కమ్మే టట్లు బాణాలు గుప్పించారు. త్రిగర్త శిబి సింధు సౌవీర సైన్యాలు పాండవుల నెదుర్కొన్నాయి. భీముడు సైంధవుణ్ణి, యుధిష్ఠిరార్జునులు సౌవీరులనూ, నకుల సహదేవులు మిగిలిన వారినీ డీకొన్నారు సమరం సాగింది.
రణభూమి శవమయం అయిపోయింది. సైంధవుడు ద్రౌపదిని నేలపై దిగవిడిచిన రథం తోలుకొని పలాయనం చిత్తగించాడు.
కాని, భీమార్జునులు ఆ దుర్మార్గుణ్ణి విడిచి పెట్టదలచలేదు. పాంచాలి క్రుద్ధురాలై సైంధవుని చంపటానికి వారిద్దరినీ పురికొల్పింది. ధౌమ్య ధర్మజ ద్రౌపదులను, నకుల సహదేవులను ఆశ్రమానికి తిరిగి సంపి భీమార్జునులు అతని వెన్నంటారు.
భీముడు సైంధవుణ్ణి చితకపొడిచాడు. మొగం నుండి నెత్తురు కారుతూ అతడు మూర్ఛపోయాడు. అర్జునుని సలహాతో అతణ్ణి ధర్మజుని వద్దకు తీసుకొని పోయారు.
ధర్మజుడు సైంధవుని తల గొరిగించి నాటినుండి ‘పాండవదాసుడ’నని చెప్పుకొనేటట్టు ఒప్పించి విడిపించి పంపాడు. ధర్మరాజు కరుణకు జనులందరు జయజయధ్వానాలుకర్ణుని దానవీరం
పాండవ వనవాసంలో 12వ యేడు గడుస్తోంది. కర్ణుని సహజ కవచకుండలాలను బ్రాహ్మణ రూపంలో దానంగా గ్రహించి అర్జునునికి రాబోయే యుద్ధంలో మేలు చేయాలని ఇంద్రుడు సంకల్పించాడు.
ఆ తలపు తెలుసుకొని సూర్యుడు ముందుగానే బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణునికి ఇంద్రుని వ్యూహాన్ని వివరించి చెప్పాడు. అప్పుడు కర్ణుడు తన జన్మ వ్రతమైన దానవ్రతాన్ని ప్రాణంపోయినా విడనాడనని చెప్పి ఇలా అంటాడు-
“మతి కుంతీ సుతకు పక్షపాతి యగుచున్ మాయా స్వరూపంబుతో
జితదైత్యుండు శతక్రతుండు నను భిక్షింపంగ నేతెంచున ట్టి తెఱంగైనఁ దదీయ కీర్తియ చుమీ డిందుం; ద్రిలోకీసము న్నతమై యొప్పు మదీయ కీర్తి; యిది సూ నా పుణ్య మెబ్భంగులన్”
అని కీర్తి కాముడై ప్రాణాలను లక్ష్యం చేయని కర్ణుని పట్ల వాత్సల్యాన్ని ప్రకటించటానికి దేవనిర్మితమైన రహస్యం ఒకటి ఉందని కర్ణ జన్మవృత్తాంతాన్ని సూచించి హస్యంగా ఉంచాడు. కాలాంతరాన వెలువడుతుందని పలికాడు. mahabaratam
కర్ణార్జునులకు పగలు పెరిగియుద్ధం వస్తే కవచ కుండలధారియైన కర్ణుడు అర్జునుని కంటె అధికుడౌతాడు. అందువలన ఇంద్రుడు మోసంతో తన
కొడుకుకు మేలు చేసుకోతలచాడు. కాబట్టి కవచ కుండల దానాన్ని మానుమని హితవు చెప్పాడు.
కర్ణుడు దాని కంగీకరించలేదు. అయితే కవచకుండలాలకు ప్రతిఫలంగా శక్తిని వరంగా గైకొనుమని చెప్పి కర్ణునికి సూర్యు సంతర్థాన మయ్యాడు.
సూర్యు ఆన్నంత పని అయింది. కర్ణుడు కవచ కుండలాలను ఇంద్రుని కిచ్చాడు. దానిని అర్జునినిపై ప్రయోగించి దివిజనాథునికి తగిన బుద్ది చెప్పాలని కర్ణుడు లోలోన భావిస్తూ ఉన్నాడు.
మార్కండేయ మహర్షి వల్ల అనేక కథలు విని ధర్మరాజు ద్వైత వనానికి చేరాడు. ఒక బ్రాహ్మణుడు అరణి కోసందర్మజుని శరణువేడాడు. మృగమొకటి ఆ అరణిని కొమ్ముకు తగిలించుకొని పారిపోయింది.
దానిని తేవటానికి తమ్ములతో కలిసి ధర్మజుడు బయలుదేరాడు. మధ్యలో దాహం వేసింది. దూరంగా ఉన్న కొలని నుండి నీటికోసం వరుసగా తమ్ములనందరినీపంపుతారు.
యక్షుడు ఓకడు ఎంతవారించినా వినక నీరు త్రాగి భీమాదులు మృతి చెందారు.
ధర్మజుడు చివరకు తానే ఆకొలను చేరి యక్షరూపంలో ఉన్న యమధర్మరా జడిగిన ప్రశ్నలకు వివేకంతో సమాధానం చెప్పి, తన తమ్ములను తిరిగి సజీవులుగా పొందగలుగుతాడు. బ్రాహ్మణున్ని అరణిని సాధించగలుగుతాడు.
యక్ష ప్రశ్నలు : ధర్మజుని సమాధానాలు :
1. సూర్యుణ్ణి నడిపే శక్తియేది? బ్రహ్మ శక్తి.
2. సూర్యుణ్ణి సేవిస్తూ తిరిగే దెవ్వరు? సురకోటిని.
3. సూర్యుడు దేనివలన అస్తమిస్తాడు? ధర్మున్ని చేత
4. సూర్యునికి ఆధారమేది ? బ్రహ్మమే సూర్యునికి ఆధారం
5. శోత్రియుడు దేనివలన అవుతాడు? శ్రుతము వలన కుగును
6. పురుషుడు దేనివలన మహత్యాన్ని పొందగలడు? – తపస్సు నిష్ఠ చేత
7. పురుషుడు దేనిచేత సహాయముతు డౌతాడు? – ధృతిచేతనే
8. పురుషుడు దేనిచేత బుద్ధిమంతుడౌతాడు? – బుధ సేవచేత
9. బ్రాహ్మణుడు దేనివలన దేవభావాన్ని పొందుతాడు? అధ్యయనం వలన సాధ్యం
10. అతనికి సాధుభావం ఏ విధంగా కలుగుతుంది? అధిక వ్రతశీలం వలన
11. అతనికి అసాధుత్వం దేనివలన కలుగుతుంది? శిష్టవృత్తిని వదలటం వలన
12. అతడు దేనివలన మానుషుడు అవుతాడు? మృత్యుభయం వలన అవుతాడు
13. జీవన్మృతుడౌటువంటి వాడు? దేవాతిధిపతితృభృత్య జనాలకు అన్నం పెట్టకుండా తానే తినేవాడు.
14. భూమి కంటె గొప్పదైనదెవరు?- తల్లి భూమికంటే గొప్పది.
15. ఆకాశం కంటె పొడవైనదెవరు? తండ్రికి.
16. గాలి కంటె వేగం కలిగిన దేది? మనస్సు మాత్రమే
17. గడ్డి పోచకంటె హీనమైన దేది? – చింత.
18. నిద్రిస్తూ కూడా కన్ను మూయ లేనిది? – చేప మాత్రమే
19. పుట్టి కూడా చేతనత్వం పొందని దేది? – గుడ్డు.
20. రూపముండి హృదయం లేనిది? విగ్రహం.
21. వేగం వలన ప్రకాశించేదేది? మెరుపు.
22. బాటసారికి, రోగార్తునకు, గృహస్థునకు, మృతునకు మిత్రులెవ్వరు? – సార్థము, వైద్యుడు, సద్భార్య, చేసిన ధర్మం.
23. ధర్మువునకు గుర్వేది? -దయే ధర్మునకు గురువు.
24. కీర్తికి ఆశ్రయ ఏది? వైభమునే
25. స్వర్గానికి ఇమ్మైన మార్గమేది? దానగుణం, సత్యవాక్యం
26. సుఖాలకన్నింటికి కరణమేది? – శీలము
27. నరునకు ఆత్మ ఎవ్వరు? భార్యే నరునకు ఆత్మ.
28. మానువునకు దైవికమైన చుట్టమెవ్వరు?- విద్య మానవునకు దైవికమైన చుట్టము.
29. మానవుని జీవిక దేనివలన కలుగుతుంది? – పర్జన్యుని వలన.
30. మానవుడు దేనిని కొనియాడి అతిశయిల్లును? – దానము
31. ఉత్తమ ధర్మము ఏది? అహింస మాత్రమే
32. ఎప్పుడును పండియుండునది ఏది? యాగకర్మ.
33. దేనిని నిగ్రహిస్తే ప్రయోజనసిద్ధి కలుగుతుంది? మనో ఆహంకారం
34. ఎవరితో చెలిమి ఎప్పుడూ చెడిపోకుండా ఉంటుంది? సజ్జనులతో చేసే చెలిమి ఎప్పుడూ చెడిపోకుండా ఉంటుంది.
35. లోకమునకు ఏది దిక్కు? సజ్జనౌళినవారు
36. దేనివలన జలము, అన్నము సంభవిస్తున్నాయి?- ఆకాశము, భూమి, జలము
37. విషము వంటి దేది? విప్ర ధనము
38. శ్రాద్ధ విధికి సమయమేది? బ్రాహ్మణాగమము
39. మానవుడు ఏవి వదలి పెట్టి సర్వజన సమ్మతుడు, నిశ్శోకుడు, అర్ధవంతుడు, షుకి కాగలడు? – గర్వము, కోథము, లోభము, తృష్ణ
40. పురుషుడెవ్వడు? ధైర్యం, ధర్మం, నీతి కలవాడే నిజమైన పురుషుడు.
41. సర్వధని యైనవాడెవ్వడు? – సంతృప్తి గలవాడే సర్వధని.
ధర్మరాజిచ్చిన సముచిత సమాధానాలకు యక్షుడు సంతోషించి ఒక తమ్ముని బ్రతికిస్తాను అతని నెన్నుకోమని అడిగాడు. ధర్మరాజు నకులుణ్ణి బ్రతికించుమని యక్షుణ్ణి కోరతాడు.
భీమార్జునులలో ఎవరైన నీ కండదండలుగా నిలువగలరుగాని నకులు డెందులకు పనికి వచ్చునని యక్షుడు ప్రశ్నించాడు. కుంతీ పుత్రులలో మొదటి వాణ్ణి నేనున్నాను.
అలాగే మాద్రీ పుత్రులలో నకులుడుండటం ధర్మమని ధర్మరాజన్నాడు. యక్షుడు ధర్మజ ధర్మబుద్ధికి సంతోషించాడు. చనిపోయిన భీమాదుల కందరికీ ప్రాణదానం చేశాడు.
ధర్మజుని ధర్మవర్తనానికి సంతుష్టుడైన యమధర్మరాజు పాండవులు అజ్ఞాతవాసం కోసం వారు కోరుకున్న రూపాలు వెంటనే రాగలవనీ, వారి నెవరూ గుర్తింపజాలరనీ వరమిచ్చి అంతర్థానమయ్యాడు.
పన్నెండేళ్ల అరణ్యవాసం పాండవులు నియమంతో చేశారు.