krishna శ్రీకృష్ణుని కోరికపై మయుడు ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవు లందులో ప్రవేశించారు.
దిక్పాలకుల సభలకంటే, బ్రహ్మసభకంటె, మయనిర్మితమైన సభ మహిసకాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. అంతటితో ఆగక ఆ మహర్షి ధర్మజుని రాజసూయ యాగం చేయుమని ప్రోత్సహించాడు.
ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇంద్రప్రస్థానికి పిలిపించుకొని,
రాజసూయం చేయటానికి ఆశీస్సుల నర్థించాడు. శ్రీకృష్ణుడు రాజసూయం నిర్వహించే యోగ్యత ధర్మరాజుకు అన్ని విధాలా ఉన్నదని నిర్దేశించి, జరాసంధుణ్ణి, అతనికి ఆసట బాసటగా నిలచి ఉన్న శిశుపాలుణ్ణి,
హంసడిభకులనూ సంహరించందే రాజసూయ యాగం నిరాటంకంగా సాగదని సూచించాడు.
ధర్మజ రాజసూయం
మూర్థాభిషిక్తులైన రాజులనందరినీ బంధించి, రోజుకొక్కణ్ణి చండికకు బలియిస్తూ సమకాలీన రాజలోకంలో సింహస్వప్నంగా దాపురించాడు జరాసంధుడు. అతనికి ఆయుధాల వలన చావులేదు. అలాగే హంసడిభకులకు కూడా.
శిశుపాలుడు నూరు తప్పులు చేసేంతవరకు ఎవరూ ఏమీ చేయలేరు.
అపార సేనతో జరాసంధుడు శ్రీకృష్ణుని కూడా బాధించాడు. అతడు మధురను వీడి మరోచోటికి ఎన్నోసార్లు పోవలసి వచ్చింది. అటువంటి జరాసంధుణ్ణి భీముడొక్కడే చంపగలడు.
అందువలన శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి బ్రాహ్మణవేషాలతో గిరివ్రజానికి వెళ్లి ద్వంద్వయుద్ధంలో జరాసంధుని శరీనాన్ని
రెండుగా చీల్పించి చంపించే పథకాన్ని వేశాడు.
శ్రీకృష్ణుని మాట పాండవులకు శిరోధార్యం. శ్రీకృష్ణ దర్శకత్వంలో భీముడు జరాసంధుణ్ణి చీల్చి చంపాడు. బందీలుగా ఉన్న వేలాది భూపతులను విడుదల చేయించాడు.
శ్రీకృష్ణుడు గిరివ్రజానికి జరాసంధుని కుమారుడైన సహదేవుణ్ణి రాజును చేశాడు.
విముక్తులైన రాజులనందరినీ వెంట పెట్టుకొని భీమార్జున శ్రీకృష్ణులు ఇంద్రప్రస్థపురం చేరారు. ధర్మరాజు ఆ రాజులకు వారి వారి రాజ్యాలిచ్చి సగౌరవంగా పంపాడు. శ్రీకృష్ణునకు కృతజ్ఞతాంజలి సమర్పించాడు.
రాజసూయానికి ముందు జరాసంధ సంహారం ఒక విజయారంభం అయింది.
ర్మరాజు నలుగురు తమ్ములనూ నాలుగు దిక్కులూ జయించటానికి పంపాడు. భీమసేనుడు తూర్పు దిక్కున నున్న రాజులను నిరాఘాటంగా సాధించాడు. అర్జునుడు ఉత్తరదిశపై విజయాన్ని కరతలామలకం చేసుకొన్నాడు.
నకులుడు పశ్చిమ దేశ ప్రభువులను పాదాక్రాంతులను చేసుకొన్నాడు.
సహదేవుడు దక్షిణ దిగ్విజయాన్ని దక్షతతో నిర్వహించాడు. నాలుగు దిక్కులనుండీ అపార ధనరాసులు తెచ్చి ధర్మరాజుకు సమర్పించారు భీమాదులు. రాజసూయానికి కావలసిన సంపద చేకూరింది.
శ్రీకృష్ణుని అనుమతి తీసికొని ధర్మరాజు యాగానికి సన్నాహాలు ప్రారంభించాడు. సహదేవుణ్ణి సకల సన్నాహాలకూ సారధిగా నియమించాడు. నకులుణ్ణి హస్తినాపురానికి స్వయంగా పంపి భీష్మాదులనందరినీ సగౌరవంగా ఇంద్రప్రస్థానికి రప్పించాడు.
ధృతరాష్ట్ర దుర్యోధనాదులను కలిపికోలుతనంతో గౌరవించాడు. దక్షిణలిచ్చే నిర్ణయం కృపాచార్యునికిచ్చాడు; కృతాకృత నిర్ణయాధికారాన్ని భీష్మ ద్రోణులకు ఒప్పచెప్పాడు. వస్తు వ్యయభారాన్ని విదురుని చేతులో ఉంచాడు.
నానా దేశాల నుండీ వచ్చే రాజులు తెచ్చే విలువైన కానుకలను గ్రహించే పరువైన బాధ్యతను దుర్యోధనుని కిచ్చాడు.
భక్ష్యభోజ్యాది వినియోగ పర్యాలోకనాన్ని దుశ్శాసనుని కందించాడు. ఇలా అందరికీ అన్ని బాధ్యతలు ఇచ్చి ధర్మరాజు తాను యజ్ఞదీక్షితుడై యజమాని చేయవలసిన కార్యక్రమాలను ఆరంభించాడు. యజ్ఞం మహేంద్ర వైభవంగా సాగింది. అఖిల జనాలకు ఆనందాన్ని కలిగించింది.
శిశుపాలుని వధ
రాజసూయయాగం జరిగిన విధానాన్ని చూచి కురువృద్ధుడు భీష్ముడు ఉప్పొంగిపోయాడు.
ధర్మరాజును ఆప్యాయంగా దగ్గరికి పిలిచి ఇలా బోధించాడు:
‘మహాయజ్ఞం మహాత్ముని పూజతోకాని పరిపూర్ణం కాదు.
స్నాతకుడైనా, ఋత్విజుడైనా, సద్గురుడైనా, సన్మిత్రుడైనా, భూతలేశుడైనా, సంయమీంద్రుడైనా వీరిలో ఎవరినైనా ఒక్కరిని ఉత్తముని ఎన్నికచేసి పూజించు; యజ్ఞఫలాన్ని పొండు’ అని నిర్దేశించాడు.
‘తాతా’ అట్టివా డెవ్వడో నీవే నిర్ణయించి చెప్పాలి’ అని ధర్మరాజు అర్థించాడు.
పితామహుడు చిరునవ్వు నవ్వి, ఒకతన్మయభావంతో ఇలా అన్నాడు “యుధిష్ఠిరా ! సూర్యచంద్రులు ఎలా తమ కాంతి కిరణాలతో లోకాలను వెలిగిస్తూ ఉన్నారో,
అలాగే తన దివ్య తేజంతో మనలనందరినీ ఆనంద పరవశుల్ని చేస్తున్న ఆ పుండరీకాక్షుడు,
ఆ అనాది నిధనుడు, ఆ అబ్జనాభుడు ఈ కృష్ణుడు మన మధ్య ఉన్నాడు.
ఆ అచ్యుతుణ్ణి పూజించి, యజ్ఞపురుషుణ్ణి పూజించిన అమృతఫలాన్ని పొందు”.
భీష్ముని మాటలు ధర్మరాజు శిరసావహించాడు.
సహదేవుడు పూజాపాత్రలను తేగా ధర్మతనయుడు విధివిధానంగా వాసుదేవుని అగ్రాసనంమీద కూర్చుండపెట్టి అర్ఘ్యాన్ని ఇచ్చాడు. దానికి శిశుపాలుడు ఆగ్రహించాడు. నిండుసభలో పెద్దగా అధిక్షేపించటం ఆరంభించాడు –
“ధర్మరాజా! పూజింపదగిన రాజులు, ద్విజులు, పూజ్యులు ఇంతమంది ఈ సభలో కొలువుదీరి ఉంటే ఈ గాంగేయుడు ఏదో నెపంతో ఈ కృష్ణుణ్ణి పూజించమంటే,
వెంటనే పూజించి నీ అవివేకాన్ని ప్రకటించుకొన్నావు. నిజంగా దాశార్హుడు పూజార్హుడా? సభలలో ధర్మతత్త్వాన్ని నిరూపించి చెప్పటం సాధ్యంకాని పని.
భీష్ముడు వెర్రితనంతో ధర్మబాహ్యుడైన కృష్ణుణ్ణి పూజించుమని చెప్పాడు.
వృద్ధుల బుద్ధులు సంచలించటంలో ఆశ్చర్యం లేదు. ఇష్టముంటే కానుక లిచ్చుకోవచ్చు కాని, పలువురు పెద్దలున్న సభలో అయోగ్యుణ్ణి యోగ్యునిగా ప్రకటించి పూజించటం న్యాయం కాదు.
కృష్ణుడు ఏ విధంగా అర్హుడైనాడు? వృద్ధు డందామా సభలో అతని తండ్రి వసుదేవు డున్నాడే? ఋత్విజు డని గౌరవిద్దామా ఎదురుగా వేదవ్యాసుడున్నాడే?
ఆచార్యుడందామా అరుగో గృపాచార్యులూ, ద్రోణాచార్యులూ. భూనాథు డందామా ఈసభలో ఎందరో ప్రభువు లున్నారు.
యుధిషిరా! నీవు యోగ్యుడవని భావించి మేమందరమూ ఈ యజ్ఞానికి వచ్చాం. ఇలా భీష్ముడు చెప్పిన మాటలు విని మమ్మల్ని అవమానిస్తావని ఊహించలేకపోయాం.
ఒకవేళ నీవు తెలియక అర్ఘ్యమిచ్చినా, తగుదునమ్మా అని ఈ గోవిందు డెలా గ్రహించాడు?” అంటూ ధర్మజ భీష్మ శ్రీకృష్ణులనునిందిస్తూ పుత్రమిత్రులతో కలిసి సభను వీడి బయటకు నడిచాడు శిశుపాలుడు.
యజమానియైన ధర్మజుడు నయవినయవాక్యాలతో శిశుపాలుణ్ణి సమాధాన పెట్టటానికి ప్రయత్నం చేశాడు.
‘ఉత్తములకు వాక్పారుష్యం చెల్లుతుందా? విషం కంటె, దహనం కంటె అది ఎంతో దారుణం. పితామహుడు దామోదరుడు పూజ్యుడని చెప్పాడు.
బ్రహ్మోత్పత్తికి మూలమైనవాడు, వేదాది సమస్త వాఙ్మయాలలో ప్రశంసితుడైనవాడూ,
లోకాలకు ఆదియైనవాడూ త్రిలోక పూజ్యుడు అయిన అచ్యుతుడే ఈ కృష్ణుడని తాతగారు ఆత్మలో దర్శించి చెప్పారు.
ఇది ఒప్పుగాక తప్పెలా అవుతుంది? అదీకాక మహాత్ముల చరిత్రలు అల్పులకు అర్థం కావటం కష్టం కూడా.
నీకంటె పెద్దలందరు తమందరి కంటే పెద్దగా శ్రీకృష్ణుని గౌరవిస్తుంటే, నీ వభ్యంతరం చెప్పటం ఉచితమా?’ అని శిశుపాలుణ్ణి ధర్మజుడు మందలించాడు.
శిశుపాలుని మాటలకు భీష్ముడు మండిపడ్డాడు –
ఉ॥ “పాలిత దుర్ణయుండు శిశుపాలుఁడు బాలుఁడు వీని నేల భూ పాలక నీకుఁ బట్టుపరుపన్, మఱి ధర్మువెఱుంగ వీనికిం బోలునె రాగకోప పరిభూత మనస్కున కల్పరాజ్య ల క్ష్మీ లలనాంధబుద్ధి కనిమిత్త మహత్పరివాద శీలికిన్”
అని ధర్మరాజును వారించి శిశుపాలునితో ఇలా నిష్టురంగా పలికాడు. ‘శిశుపాలా! నీవు మూర్ఖుడవురా. అవినయబుద్ధితో హరికి అర్పిస్తున్న అర్ఘ్యాన్ని అయోగ్యమని నిందించావు.
నేను వేరే చెప్పవలెనా? ఈ సభలో నున్నవారందరూ ఆతని దయచేత పరిముక్తులైనవారే. అతని శరణార్థులే. బాలుడైనా, జ్ఞాని అయితే బ్రాహ్మణులలో పూజ్యుడు;
విక్రమంలో అధికుడైతే క్షత్రియుల్లో పూజ్యుడు. గోవిందుని యందు ఈ రెండు గుణాలూ ఉన్నాయి. అతడు వయోవృద్ధు డని కాదు గుణవృద్ధు డని పూజించాలి’ అని మందలించాడు.
సహదేవుడు శిశుపాలుని అవినయవర్తనానికి ఆగ్రహించాడు.
‘మేము అచ్యుతునికి అర్ఘ్యమిచ్చాం. దీనికి అంగీకరింపని దుర్మార్గుల శిరస్సులమీద ఇదుగో నా పాదాన్ని ఉంచి తగినశాస్తి చేస్తాను’ అని సహదేవుడు పాదాన్ని ఎత్తి ఝళిపించాడు. సభాసదులు కిమ్మనకుండా సద్దుమణిగి కూర్చున్నారు. దేవతలు పూలవాన కురిపించారు.
ఆ తరువాత శిశుపాలుడు కొందరు రాజులను కూడగట్టుకొని ససైన్యంగా ధర్మరాజు యజ్ఞంపై దాడిచేశాడు. యజ్ఞదీక్షితుడైన ధర్మజుడు భయసంభ్రమాలతో భీష్ముని చూశాడు.
శ్రీకృష్ణు డున్నంతవరకు భయమేమీ లేదని పితామహుడు ధైర్యం చెప్పాడు. ఆమాటలు విని శిశుపాలుడు భీష్ముణ్ణి పరుషవచనాలతో నిందించాడు; పరమేశ్వరుడా’ అని అవహేళనం చేశాడు.
అతని వీరగాథలను పేర్కొని అధిక్షేపం చేశాడు. ఆ విధంగా ఇచ్చవచ్చినట్లు ప్రేలుతున్న శిశుపాలుని చూచి భీముడు రౌద్రోద్రేకుడైనాడు. పండ్లు పటపటా కొరుకుతూ అతణ్ణి చంపటానికకి ఉద్యుక్తుడైనాడు.
అప్పుడు భీష్ముడు భీముణ్ణి వారించి శిశుపాలుణ్ణి చంపవలసిన వాడు శ్రీకృష్ణుడే నని వాని జన్మగాథ చెప్పి నూరు నేరాలవరకు హరి అతణ్ణి సహించి ఊరుకుంటాడని ఆ తరువాత అతని చావు ఆయన చేతుల్లో తప్పదనీ వివరించాడు. ఆ మాటలు విని శిశుపాలుడు శ్రీకృష్ణునితో ముఖాముఖిగా నిలిచి ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు.
శ్రీకృష్ణుడు – శిశుపాలుడు చేసిన నూరు తప్పులను ఏకరువు పెట్టి అందరికీ తెలియచెప్పి, ఇక శిశుపాలుడు క్షమారుడు కాడని నిరూపించి సుదర్శన చక్రంతో అతని శిరస్సును ఖండించాడు.
శిశుపాలుని శరీరంలో నుండి ఒక వెలుగు లేచి వెలుగుల కన్నింటికి వెలుగైన శ్రీకృష్ణునిలో లీనమయింది. సభాసదులందరు ఆశ్చర్యమగ్నులయ్యారు. జయజయనినాదాలు చేశారు.
మయసభ: సుయోధనుని అసూయ
రాజసూయ యాగం నిర్విఘ్నంగా నారాయణుని దయవలన పరిసమాప్తమయింది. బంధుమిత్రులు ఒక్కరొక్కరే తరలి వెళ్లటం మొదలయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమైపోయాడు.
ధృతరాష్ట్రాదులు హస్తినకు తిరిగి వెళ్లారు. దుర్యోధనుడు, శకుని మాత్రం మయసభా వైభవాన్ని చూడటానికై కొన్నాళ్ళు ఇంద్రప్రస్థంలో ఆగారు.
సుయోధనుడు మయసభా శిల్ప రమణీయ కల్పనలన్నింటిని చూస్తూ విహరిస్తున్న తరుణంలో మిట్టలు జలాశయాలుగా, జలాశయాలు మిట్టలుగా,
ద్వారాలు కుడ్యాలుగా, కుడ్యాలు ద్వారాలుగా గోచరించే విచిత్రశాలలో తిరుగుతూ మిట్టలని భావించి నీటిలో పడడం, ద్వారమని భావించి కుడ్యాన్ని ఢీకొనడం జరిగింది.
అప్పుడు పాంచాలి, పాండుకుమారులు నవ్వారు.
ధర్మరాజు దివ్యాంబరాలను, భూషణాలను దుర్యోధనుడు ధరించటానికి భీముని ద్వారా పంపాడు.
ఆ విధంగా జరిగిన సభాప్రలంభనం దుర్యోధనునికి సహించరాని అవమానంగా హృదయాన్ని బాధించింది. లజ్జతో పాండవులను వీడ్కొని హస్తినాపురం చేరాడు.
ధర్మరాజు చేసిన రాజసూయం అందరికీ సంతోషాన్ని కలిగించింది.
కాని, దుర్యోధనునికి అసూయ రగిలించింది. సకలజన నయనానందాన్ని కలిగించిన పాండవ సభాలక్ష్మి ఆ సుయోధునికి మాత్రం గుండెల్లో మంటలు పెట్టినట్లు బాధించింది.
రాజధానికి తిరిగి వచ్చాడే కాని రారాజు కంటినిండా నిద్రపోలేదు. పాండవులపై పాపచింతతో అన్ని భోగాలూ వదలి దిగులుతో రోజులు గడుపసాగాడు.
శకుని దానిని గమనించి దుర్యోధనుణ్ణిఏకాంతంగా ఊరడించటానికి వచ్చాడు. దుర్యోధనుడు తనబాధ బయట పెట్టుకొన్నాడు.
“మామా! మయుడు నిర్మించి పాండవుల కిచ్చిన సభను నీవుకూడా చూచాను కదా! ఏ యుగంలోనూ, ఏ లోకంలోనూ దానివంటి వైభవం వినపడదు. కనపడదు. దానికి ధర్మరాజు సూర్యతేజంతో వెలిగిపోతున్నాడు.
అదేమి ఆశ్చర్యమో భూతలంమీది ప్రభువులందరూ ధనరాసులను కానుకలుగా తెచ్చి ధర్మరాజుకు భృత్యుల్లా చెల్లించారు. పాండవుల పరాక్రమం ధర్మరాజు ప్రభుత్వం భూమిమీద స్థిరపడ్డాయి. అపార పరాక్రమార్జితమై పాండవమహాలక్ష్మిని చూచి నేను సహించలేకపోతున్నాను.
అభిమానధనులైనవారు జ్ఞాతుల అభివృద్ధిని చూచి సహించగలరా! కాబట్టి ఏ విధంగా ఆ పాండవ లక్ష్మిని అపహరించటానికి వీలౌతుందో యోచించాలి’. అని ఆవేదన వ్యక్తంచేశాడు.
దుర్యోధనుని దురాలోచనకు ధృతరాష్ట్రుని అనుమతి సాధించాలని శకుని అత ధృతరాష్ట్రుని వద్దకు తీసుకొని పోయాడు. దుర్యోధనుడు తన మనోవేదనను తండ్రిముందు చెప్పుకొన్నాడు.
రాజులిచ్చిన కానుకల నన్నిటినీ తానే స్వయంగా లెక్కించాడు. కాబట్టి వాటి నన్నింటి విలువనూ చెప్పి వాపోయాడు. గతంలోనూ భవిష్యత్తులోనూ,
వర్తమానంలోను పాండవలక్ష్మి వైభవంతో సరితూగే సంపదను ఎన్నడూ చూడలేదనీ, దాని నిప్పుడు చూస్తు తాను సహించి ఉండటం కూడా కష్టమనీ, అందువల్లనే క్రుంగి కృశించిపోయినాననీ తండ్రి ముందు చెప్పుకొన్నాడు.
అవభృధస్నానానంతరం ధర్మరాజు ఉన్నత సింహానసం మీద కూర్చున్నాడు. సాత్యకి ముత్యాల గొడుగు పట్టాడు.
భీమార్జునులు మణిహేమదండాలు పట్టారు. నకుల సహదేవులు చామరాలు వీవసాగారు. ధృష్టద్యుమ్నుడు మూర్ధాభిషిక్తులైన రాజులందరి చేశ అతని పాదాలకు మ్రొక్కించాడు.
ఆ మహారాజు వైభవం చూచి మేమందరం చిన్నబోయాం.
మమ్మల్ని చూచి శ్రీకృష్ణ పాండునందన ద్రౌపదీ సాత్యకులు నవ్వారు. ధర్మజు రాజ్య వైభవాన్ని అనుభవించడం నేను సహించలేను. అని దుర్యోధనుడు పలికాడు.
‘అనుమతిస్తే ఆ సంపదనంతా మాయాద్యూత నెపంతో అపహరించి దుర్యోధనునికి ఇస్తా’నని శకుని సూచించాడు.
శకుని ఉపాయానికి అంగీకరింపుమని తండ్రిని బలవంతపెట్టాడు దుర్యోధనుడు. అంగీకరించకపోతే అగ్నిలో పడి ఆత్మాహుతి చేసుకొంటానని బెదిరించాడు.
పుత్రవ్యామోహంలో ధృతరాష్ట్రుడు శకుని వ్యూహానికి తలఊపాడు.
మహాసభను నిర్మించాడు.
దానిలో మాయాద్యూతం జరిపించాలని నిర్ణయించి విదురునికి చెప్పాడు.
విదురుడు జూదం వల్ల కలిగే ఆపదలను పేర్కొని దుర్యోధనాదులను ఆప్రయత్నం నుండి విముఖులయ్యేటట్లు ప్రయత్నించుమని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు.
గ్రుడ్డిరాజు ఏవిధంగానైనా జూదం జరగాలనీ, ఎటువంటి కీడులూ జరగకుండా పెద్దలు చూడాలనీ చెప్పి పాండవులను తీసికొని రావటానికి విదురుణ్ణి ఇంద్రప్రస్థ పురానికి రథాలతో పంపాడు. విదురు దీసంగతి భీష్మునికి నివేదించి బయలుదేరాడు.
మహేంద్ర వైభవంతో ఉన్న ధర్మరాజును విదురుడు దర్శించాడు.
ధృతరాష్ట్ర సందేశాన్ని వినిపించాడు. నూత్న సభాసందర్శన సందర్భంలో సుహృద్యూతం సమంజసం కాదనీ, అది కలతలకు దారి తీస్తుందనీ ధర్మజుడు భావించాడు.
కాని, పెదతండ్రి ఆజ్ఞను శిరసావహించి భీమాదులను ద్రౌపదిని, ధౌమ్యాదులను వెంటబెట్టుకొని బయలుదేరి హస్తినాపురికి చేరాడు.
మణిమయ మహాసభను దుర్యోధనుడు చూపగా ధర్మజుడు దర్శించి హర్షించాడు. ఆ తరువాత రారాజు ద్యూతానికి ఆహ్వానించాడు ధర్మరాజును.
ద్యూతం వలన కలిగే కీడును పేర్కొని ధర్మరాజు ఆ ఆహ్వానాన్ని వారించాడు. శకుని కల్పించుకొని ఆటనేర్చినవారే దానిని నిందిస్తే ఆకళ ఏమైపోతుందని చమత్కరించి, ధర్మజుడు ఓడినట్లు అంగీకరిస్తే ఆడవలసిన అవసరం లేదని అధిక్షేపించాడు.
ధర్మజుడు ఆ మాటకు నొచ్చుకొన్నాడు. బలవంతంగా జూద మాడించటానికి పిలిచిన తరువాత వెనుకాడటానికి వీలౌతుందా? అని అంటూ విధి ప్రేరితుడై మాయాద్యూతానికి ఉన్ముఖుడైనాడు.
జూదంలో తన పక్షాన శకుని ఆడతాడనీ, అతడొడ్డిన ధనరాసులు తాను చెల్లిస్తాననీ రత్నరాసులు కుప్పలు పోసి దుర్యోధనుడు ముందుకు వచ్చాడు.
ఇతరుల కోసం జూదం ఆడటం అసమంజసం అని అంటూనే ధర్మరాజు సాగరావర్త సంభవాలైన మణిరాసులను ఒడ్డాడు. సుహృద్ద్యూతం ఆరంభమయింది.
భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాశ్వత్థామాదులు సముచితాసనాలలో కూర్చొని జూదాన్ని పరికిస్తున్నారు.
శకుని మాయావిదుడు. అందువలన పాచికలతో కావలసిన పందాన్ని జయప్రదంగా వేయగలడు. దానితో వరుసగా పందాలు శకుని గెలుచుకొంటున్నాడు. ధర్మరాజు ఓడిపోతున్నాడు.
ఆట సాగే కొద్దీ ధర్మరాజుకు పంతంకూడా పెరిగింది. ఒక ఒడ్డుకు సువర్ణ భాండాగారాలు పెట్టి ఓడిపోయాడు. మరొక పందానికి రత్న భాండాగారాలను కోల్పోయాడు.
ఇంకొకసారి చతుశ్శత నిధులను, మరొకసారి గుఱ్ఱాలను,
ఏనుగులను, పరిచారికలను, పరిచారకులను ఇలా క్రమంగా ఉన్న సంపదనంతా మాయాద్యూతంలో చేజార్చుకొన్నాడు.ఏకాంతంగా ఊరడించటానికి వచ్చాడు. దుర్యోధనుడు తనబాధ బయట పెట్టుకొన్నాడు.
“మామా! మయుడు నిర్మించి పాండవుల కిచ్చిన సభను నీవుకూడా చూచావు కదా! ఏ యుగంలోనూ, ఏ లోకంలోనూ దానివంటి వైభవం వినపడదు. కనపడదు. దానితో ధర్మరాజు సూర్యతేజంతో వెలిగిపోతున్నాడు.
అదేమి ఆశ్చర్యమో భూతలంమీది ప్రభువులందరూ ధనరాసులను కానుకలుగా తెచ్చి ధర్మరాజుకు భృత్యుల్లా చెల్లించారు. పాండవుల పరాక్రమం ధర్మరాజు ప్రభుత్వం భూమిమీద స్థిరపడ్డాయి.
అపార పరాక్రమార్జితమైన పాండవమహాలక్ష్మిని చూచి నేను సహించలేకపోతున్నాను. అభిమానధనులైనవారు జ్ఞాతుల అభివృద్ధిని చూచి సహించగలరా! కాబట్టి ఏ విధంగా ఆ పాండవ లక్ష్మిని అపహరించటానికి వీలౌతుందో యోచించాలి’. అని ఆవేదన వ్యక్తంచేశాడు.
దుర్యోధనుని దురాలోచనకు ధృతరాష్ట్రుని అనుమతి సాధించాలని శకుని అతణ్ణి ధృతరాష్ట్రుని వద్దకు తీసుకొని పోయాడు. దుర్యోధనుడు తన మనోవేదనను తండ్రిముందు చెప్పుకొన్నాడు.
రాజులిచ్చిన కానుకల నన్నిటినీ తానే స్వయంగా లెక్కించాడు.
కాబట్టి వాటి న్నింటి విలువనూ చెప్పి వాపోయాడు. గతంలోనూ భవిష్యత్తులోనూ, వర్తమానంలోనూ పాండవలక్ష్మి వైభవంతో సరితూగే సంపదను ఎన్నడూ చూడలేదనీ, దాని నిప్పుడు చూస్తూ తాను సహించి ఉండటం కూడా కష్టమనీ, అందువల్లనే క్రుంగి కృశించిపోయినాననీ తండ్రి ముందు చెప్పుకొన్నాడు.
అవభృధస్నానానంతరం ధర్మరాజు ఉన్నత సింహానసం మీద కూర్చున్నాడు. సాత్యకి ముత్యాల గొడుగు పట్టాడు. భీమార్జునులు మణిహేమదండాలు పట్టారు.
నకుల సహదేవులు చామరాలు వీవసాగారు. ధృష్టద్యుమ్నుడు మూర్ధాభిషిక్తులైన రాజులందరి చేత అతని పాదాలకు మ్రొక్కించాడు.
ఆ మహారాజు వైభవం చూచి మేమందరం చిన్నబోయాం. మమ్మల్ని చూచి శ్రీకృష్ణ పాండునందన ద్రౌపదీ సాత్యకులు నవ్వారు.
ధర్మజు రాజ్య వైభవాన్ని అనుభవించడం నేను సహించలేను. అని దుర్యోధనుడు పలికాడు. ‘అనుమతిస్తే ఆ సంపదనంతా మాయాద్యూత నెపంతో అపహరించి దుర్యోధనునికి ఇస్తా’నని శకుని సూచించాడు.
శకుని ఉపాయానికి అంగీకరింపుమని తండ్రిని బలవంతపెట్టాడు దుర్యోధనుడు. అంగీకరించకపోతే అగ్నిలో పడి ఆత్మాహుతి చేసుకొంటానని బెదిరించాడు. పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు శకుని వ్యూహానికి తలఊపాడు.
మాయాద్యూతం
హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు వేయిమంది శిల్పులను పిలిపించి ఒక విచిత్రమహాసభను నిర్మించాడు. దానిలో మాయాద్యూతం జరిపించాలని నిర్ణయించి విదురునికి చెప్పాడు.
విదురుడు జూదం వల్ల కలిగే ఆపదలను పేర్కొని దుర్యోధనాదులను ఆప్రయత్నం నుండి విముఖులయ్యేటట్లు ప్రయత్నించుమని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు.
గ్రుడ్డిరాజు ఏవిధంగానైనా జూదం జరగాలనీ, ఎటువంటి కీడులూ జరగకుండా పెద్దలు చూడాలనీ చెప్పి పాండవులను తీసికొని రావటానికి విదురుణ్ణి ఇంద్రప్రస్థ పురానికి రథాలతో పంపాడు.
విదురు దీసంగతి భీష్మునికి నివేదించి బయలుదేరాడు.
మహేంద్ర వైభవంతో ఉన్న ధర్మరాజును విదురుడు దర్శించాడు. ధృతరాష్ట్ర సందేశాన్ని వినిపించాడు. నూత్న సభాసందర్శన సందర్భంలో సుహృద్యూతం సమంజసం కాదనీ, అది కలతలకు దారి తీస్తుందనీ ధర్మజుడు భావించాడు.
కాని, పెదతండ్రి ఆజ్ఞను శిరసావహించి భీమాదులను ద్రౌపదిని, ధౌమ్యాదులను వెంటబెట్టుకొని బయలుదేరి హస్తినాపురికి చేరాడు.
మణిమయ మహాసభను దుర్యోధనుడు చూపగా ధర్మజుడు దర్శించి హర్షించాడు. ఆ తరువాత రారాజు ద్యూతానికి ఆహ్వానించాడు ధర్మరాజును.
ద్యూతం వలన కలిగే కీడును పేర్కొని ధర్మరాజు ఆ ఆహ్వానాన్ని వారించాడు. శకుని కల్పించుకొని ఆటనేర్చినవారే దానిని నిందిస్తే ఆకళ ఏమైపోతుందని చమత్కరించి,
ధర్మజుడు ఓడినట్లు అంగీకరిస్తే ఆడవలసిన అవసరం లేదని అధిక్షేపించాడు. ధర్మజుడు ఆ మాటకు నొచ్చుకొన్నాడు. బలవంతంగా జూద మాడించటానికి పిలిచిన తరువాత వెనుకాడటానికి వీలౌతుందా? అని అంటూ విధి ప్రేరితుడై మాయాద్యూతానికి ఉన్ముఖుడైనాడు.
జూదంలో తన పక్షాన శకుని ఆడతాడనీ, అతడొడ్డిన ధనరాసులు తాను చెల్లిస్తాననీ రత్నరాసులు కుప్పలు పోసి దుర్యోధనుడు ముందుకు వచ్చాడు.
ఇతరుల కోసం జూదం ఆడటం అసమంజసం అని అంటూనే ధర్మరాజు సాగరావర్త సంభవాలైన మణిరాసులను ఒడ్డాడు. సుహృద్యూతం ఆరంభమయింది.
భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాశ్వత్థామాదులు సముచితాసనాలలో కూర్చొని జూదాన్ని పరికిస్తున్నారు.
శకుని మాయావిదుడు. అందువలన పాచికలతో కావలసిన పందాన్ని జయప్రదంగా వేయగలడు. దానితో వరుసగా పందాలు శకుని గెలుచుకొంటున్నాడు. ధర్మరాజు ఓడిపోతున్నాడు.
ఆట సాగే కొద్దీ ధర్మరాజుకు పంతంకూడా పెరిగింది. ఒక ఒడ్డుకు సువర్ణ భాండాగారాలు పెట్టి ఓడిపోయాడు. మరొక పందానికి రత్న భాండాగారాలను కోల్పోయాడు.
ఇంకొకసారి చతుశ్శత నిధులను, మరొకసారి గుఱ్ఱాలను, ఏనుగులను, పరిచారికలను, పరిచారకులను ఇలా క్రమంగా ఉన్న సంపదనంతా మాయాద్యూతంలో చేజార్చుకొన్నాడు.
విదురు కపటద్యూతాన్ని అంతటితో ఆపించు మని ధృతరాష్ట్రుణ్ణి కోరుకొన్నాడు. కాని, అతడు పుత్రవ్యామోహంతో పిఎ: నకుండా మిన్నకున్నాడు.
అప్పుడు విదురుడు బ్యోధనుని ఇలా మందలించాడు: ‘అన్యాయంగా, శకుని మాయలో, పాపమతివై జూదంలో పాండవుల సంపదలను ఇలా మోసంతో సంగ్రహించటం న్యాయమా పాండవులు పరాక్రమాన్ని ప్రకటించి సంపాదించుకొన్నారు సంపదను; మీరు మోసంచేసి దొచుకుంటున్నారు” అన్నాడు. విదురుని మాటలు దుర్యోధనునికి కోపం తెప్పించాయి.
‘మావద్ద తిని పరాయి వాళ్లను పొగిడే కుత్సితబుద్ధి నీది! ఓ విదురా! నీవు మాయింట్లో విషసర్పము న్నట్లున్నావు.
ఇతరుల సంపద సులభోపాయంతో గ్రహించటం రాజనీతికాదా! అడగకుండానే నీవు మాకు నీతులు చెప్పవచ్చావు. ఇక చాలు. మాటలు కట్టి పెట్టటం మంచిది’ – అని దుర్యోధనుడు విదురుణ్ణి గద్దించాడు.
‘దుర్యోధనా! నిన్ను పాడుచేసే వారి మాటలు విని సంబర పడుతున్నావు.
నీకు ‘తుడైనవాడు – ముందుగా కొంత అప్రియంగా ఉన్నా తరువాత హితం చేకూర్చే మాటలు పుతాడు. హితులు మొగమోటం లేకుండా, బలవంతంగానైనా హితవును బోధిస్తారు.
నీ ప్పుడు హితు లెవ్వరో, అహితు లెవ్వరో తెలిసికోలేని స్థితిలో ఉన్నావు’ అని చెప్పి టలాడక మిన్నకున్నాడు విదురుడు.
ధనాలనన్నింటినీ ఓటువోయిన ధర్మరాజును మరొక పందెం కాయు మని శకుని 2 లవంతం పెట్టాడు. ఆ తరువాత కూడా శకుని అవహేళన చేస్తూ పందాలు కాయుమనేవాడు. రుషానికి ధర్మరాజు కాస్తుండేవాడు.
వరుసగా సహదేవ నకుల పార్థ భీములనూ, చివరకు € నను కూడా పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపైన శకుని ‘ద్రౌపది కూడా నీ ధనమే క వా’ అని ధర్మరాజుకు జ్ఞాపకం చేశాడు. గతిలేక కులభామను కూడా జూదంలో ఒడ్డి చివరకు మెను కూడా ఓడిపోయాడు. ధర్మజుడు దీనవక్త్రుడై దిగాలుబడి కూర్చున్నాడు.
భీష్మ ణులకు చెమటలు కమ్మాయి. విదురుడు మొగం ప్రక్కకు పెట్టి కంటతడి పెట్టుకొన్నాడు. గిలిన సదస్యులందరూ ఏకధారగా దుఃఖించారు. దుర్యోధన దుశ్శాసన కర్ణ సైంధవులు స్పారిన మొగాలతో ఒకరినొకరు చూచుకొంటూ నవ్వుకొన్నారు.
సభలో కలకలం బయలు ంది. దుర్యోధనునికి పట్టపగ్గాలు లేవు. పాండవులు తనకు దాసులైనా రని పొంగిపోతున్నాడు. 1 గర్వాతిశయంతో పాంచాలిని దాసీలతో కలిసి తమ యిళ్లు తుడవటానికి ఆజ్ఞాపించాడు. సభ’లో సంక్షోభం కలిగింది. గ్రుడ్డిరాజు ఆ గోల విని విషయ మేమిటని విదురుణ్ణి అడిగి లుసుకొన్నాడు.
ద్రౌపదీవస్త్రాపహరణం
దుర్యోధనుడు తన ఆజ్ఞను నెరవేర్పజేయటానికి విదురునిబోయి ద్రౌపదిని సభకు తీసుకొని రమ్మని కోరాడు. విదురు డందుకు అతణ్ణి మందలించాడు.
దుర్యోధనుడు విదురుణ్ణి తూలనాడి ద్రౌపదిని తోడ్కొని రావటానికి ప్రాతికామిని పంపాడు.
అతడు ద్రౌపది దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పాడు. ఎన్నడైనా ఇలా తననూ తన భార్యనూ జూదంలో ఓడిపోయిన జూదరి ఉంటాడా అని విచారిస్తూ ప్రాతికామిని ఒక ప్రశ్నవేసింది.
“మున్న దన్నోటువడి మఱి నన్ను నోటు వడియెనో, నన్ను మున్నోటువడి విభుండు గ్రన్నఁ దన్నోటు వడియెనో యన్న! నాకు నెఱుఁగఁ జెప్పుము దీని నీ వెఱుఁగుదేని”
‘నీకు తెలియకపోతే ఆ ధర్మరాజునే అడిగి తెలుసుకొని వచ్చి నన్ను తీసికొని పో’ అని నిర్దేశించింది.
ప్రాతికామి సభకు వచ్చి ధర్మరాజును ఈ ప్రశ్న అడిగాడు. అతడేమీ సమాధానం ఇవ్వలేక మిన్నకున్నాడు. mahabaratham
దుర్యోధనుడు నిండు సభలోనే ఆ సందిగ్ధమైన అర్థాన్ని నిర్ణయించు కొనవచ్చును పాంచాలిని వేగంగా తీసికొని రమ్మని ప్రాతికామిని మరలా పంపాడు.
ద్రౌపది పరిస్థితుల ప్రాబల్యాన్ని గమనించింది. ఏకవస్త్రగా, అధోనీవిగా, అవిరళాశ్రుధారాపాతగా సభకు వచ్చి కురువృద్ధుల సమీపంలో నించున్నది.
ద్రౌపదిమోము చూడలేక లజ్జితులై, దుఃఖాయమాన మానసులై, తలలు వంచియున్న పాండవులను చూచి దుర్యోధనుడు సంతోషించాడు. దుశ్శాసనుని బిల్చి నీవు పోయి పెద్దల వద్ద నున్న ద్రౌపదిని ఈవలకు లాక్కొని రమ్మని నియోగించాడు.
అతడు ఆమెను సమీపించాడు. భయంతో ద్రౌపది గాంధారి దగ్గరకు పోయింది. దుశ్శాసనుడు ఆమెను వెన్నంటి వెళ్ళాడు. ‘ఇంకెక్కడికి పోతావు? నీ మగళ్ళు నిన్నోడారు. రారాజు నిన్ను గెలుచుకొన్నాడు. వెంటనే రా!’ అని గద్దించాడు. ‘నేను రజస్వలను. ఏకవస్త్రను.
నన్ను ముట్టకు; పెద్దలున్న సభకు నేనీ స్థితిలో రాలేను’ అని దీనంగా పలికింది పాంచాలి. ‘నీవు ఏకవస్త్రవైతేనేమి? వివస్త్రవైతేనేమి? నిన్ను ఎలాగైనా తీసుకొని పోతాను’ అని ఆ దుశ్శాసనుడు బలవంతంగా రాజసూయావభృధ స్నానంతో పవిత్రమైన ఆమె శిరోజాలను ఒడిసిపట్టి సభకు ఈడ్చి తెచ్చాడు.
కర్ణ దుర్యోధన శకుని సైంధవాది దుష్టభూయిష్టమైన ఆ సభలో నిలువబడి ద్రౌపది వివర్ణ వదనంతో ఇలా సభికులను ఉద్దేశించి పలికింది -‘ఓ కురు వృద్ధులారా! ధర్మరాజు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులలో చిక్కుకొనా ధర్మమార్గాన్ని మాత్రం వీడని ధన్యుడు.
దుర్జనుడైన ఈ దుశ్శాసనుడు నన్నీ సభ కెందుక ఈడ్చుకొని తెచ్చాడు?
సర్వ ధర్మ సంవిదు లని పేరుగాంచిన కురుముఖ్యలు చూస్తు ఉండగానే ఈ దుర్మదాంధుడు నన్ను అవమానం చేయవచ్చు. భరతవంశం నేడు అధర్మం అతినింద్యమై పోయింది’ అని ఆక్రోశిస్తూ, ‘అన్యధా శరణం నాస్తి’ అనే భక్తి భావంతో ద్రౌప శ్రీకృష్ణుణ్ణి ఆర్తితో పిలిచింది.
ద్రౌపది దీనస్థితి చూచి భీముడు ధర్మరాజుపై మండిపట్టాడు. జూదానికి కారణమై అతని చేతుల్ని కాలుస్తానన్నాడు. అర్జునుడు అడ్డం వచ్చి దర్మరాజు వర్తనంలోని ధర్మనీతి తెలియపరిచాడు.
సభలో వికర్ణుడు లేచి ద్రౌపది అన్యాయవిజిత అని వాదించాడు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం సభాధర్మమని మనవి చేశాడు. కర్ణుడు అత అధిక్షేపించాడు. అడగకుండానే నీతులు చెప్పే అధిక ప్రసంగానికి పోవద్దని మందలించాడు ద్రౌపది ‘ధర్మవిజితయే’ అని సమర్థించాడు.
ఒక పతిని దైవంగా భావించి కాపురం చేసే వనితను ఏకవస్త్రయని గౌరవించాలిగాని, అనేక భర్తృక అయిన బంధకిని వివస్త్రను చేసినా దోషం లేదని కర్ణుడు వాదించాడు. ఆమాటలు విని రెచ్చిపోయి దుర్యోధనుడు పాంచాలి’ వివస్త్రను చేయుమని దుశ్శాసనుణ్ణి ఆజ్ఞాపించాడు. అతడు అన్నమాటను అక్షరాల పాటించాడు.
అయినా, అఖిల జగద్రక్షాదక్షుడైన నారాయణుని మహిమవలన ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండింది. దుశ్శాసనుడు లాగిన చీరలు కుప్పలు కుప్పలుగా పర్వతాకారంగా పడ్డాయి.
అత డా మహిమకు సిగ్గుపడతాడు. అలసిపోయి ఊరుకొంటాడు దుశ్శాసనుడు ద్రౌపదికి చేసిన అవమానాన్ని భీమసేనుడు చూచి, ప్రతిక్రియ ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉండికూడా రౌద్రాకరుడై ఇలా భయంకర శపథం చేశాడు.
మ. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో ద్దురుఁ డై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోక భీ కరలీలన్ వధియించి తద్విపుల వక్షశైల రక్తాఘని ర్ఘర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్”
“అలా చేయకపోతే పితృపితామహుల గతికి తప్పినవాణ్ణవుతాను”” భీమశపథం విన్న సభాసదులందరూ సపుత్రకుడైన ధృతరాష్ట్రుణ్ణి నిందించారు. పాంచాలి ప్రశ్నలను పట్టించుకొనని సభను విమర్శించారు.
విదురుడు పాంచాలి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ధర్మవిదులకు పుట్టగతులుండ వని హెచ్చరించాడు. ఆమె ప్రశ్నకు ధర్మరాజు మాత్రమే తగిన జవాబివ్వగలడని భీష్ముడు మారు పల్కాడు.
ఇంతలో కర్ణుడు పెచ్చుపెరిగి ద్రౌపదిని చూచి నవ్వుతూ ‘తరుణీ! నీకు ఆరవ భర్త ఉండటం ఉచితం. జూదంలో ఓడనివానిగా అతణ్ణి ఎన్నుకో” అని ఎగతాళి చేశాడు.
ఆ మాటలను ఆసరాగా తీసికొని దుర్యోధనుడు ఆ యిల్లాలిని తన యెడమ తొడమీద కూర్చో మని సైగచేశాడు. ఆ దారుణమైన దృశ్యం చూచి వాయునందనుడు ఆగ్రహోదగ్రుడై లయకాల రుద్రుడు లాగా విజృంభించి భయంకర శపథం చేశాడు.
ఉ॥ “ధారుణి రాజ్య సంపద మదంబునఁ గోమలిఁ గృష్టఁ జూచి రం భోరునిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు. ర్వార మదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్”
అని అరుణ లోచనాలతో ఆయుధాలున్నవైపు చూపులు సారిస్తూ అన్నగారి అనుమతి కోసం ఎదురు చూస్తున్న భీముణ్ణి భీష్మ విదుర ద్రోణాదులు ఇది కోపానికి సమయం కాదని వారించారు.
ఆ సమయంలో ధృతరాష్ట్రుని అంతఃపురంలో ఎన్నో అపశకునాలు గోచరించాయి. గాంధారి విదురుని తోడ్కొని ధృతరాష్ట్రుని దగ్గరకు పోయి, జరిగినదంతా చెప్పి, దుర్యోధనుని పిలిచి కోపించి, సకల బాంధవ హితం చేయసమకట్టి ద్రౌపదిని దగ్గరికి పిలిచి శాంతవచనాలు పలికింది.
ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఆమె ధర్మరాజు దాస్య విముక్తిని వరంగా కోరుకొన్నది. దానిని గ్రుడ్డిరాజు ప్రసాదించి రెండో వరాన్ని కోరుకోమన్నాడు.
భీమాదులు నలుగురును వారి ఆయుధాదులతో సహా దాస్యవిముక్తులు కావాలని అడిగింది. దానినీ ఇచ్చాడు. మూడో వరం వేడుకోమన్నాడు. క్షత్రియ వనితకు రెండు వరాలు కోరుకోవటం న్యాయం కాబట్టి మూడోవరం కోరుకొననన్నది.
కోడలి ధర్మనిష్ఠకు మెచ్చుకొని ధర్మరాజుకు అతని రాజ్యాన్ని యిచ్చి యేలుకొమ్మని ఇంద్రప్రస్థపురానికి పంపాడు. పాండవులు బంగారు రథాలెక్కి తమ రాజధానికి చేరి సుఖంగా ఉన్నారు.
అనుద్యూతం
ఈ విషయం తెలుసుకొన్న దుర్యోధనుడు ఖిన్నుడై తండ్రి వద్దకు పోయి ఇలా అన్నాడు: ఇకపై ఎంతమేలుచేసినా పాండవులకు మనం హితులం కాగలమా? పాములకు తోకలు తొక్కి వదిలి పెట్టాం. అవి పగపట్టి కాటేయక మానవు.
గాండీవంతో ఉన్న సవ్యసాచిని, గదగొన్న భీముని ఎదుర్కొనటం సాధ్యమా? కాబట్టి వారలను మరల పిలిపించి అనుద్యూతంలోఓడించి, అడవులకు పంపుదాం’ అని ధృతరాష్ట్రుని ఒప్పించి, ప్రాతికామిని పాండవుల’ తెచ్చుటకు పంపాడు.
ధర్మరాజాదులు మరల హస్తినాపురికి వచ్చారు. అనుద్యూతానికి పూనుకొన్నా అందులో ఓడినవారు వల్కలాలు కట్టి, కందమూలాలు తింటూ బ్రహ్మచర్యాన్ని పాటిన పన్నెండేళ్లు వనవాసం చేసి, పదమూడవ యేడు జనపదంలో అజ్ఞాతవాసం చేయా అజ్ఞాతవాసంలో ఎవరైనా గుర్తిస్తే మరల పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాస చేయాలని కట్టడి చేసుకున్నారు.
ధర్మరాజు అనుద్యూతంలో శకుని మాయవలన ఓడిపోయాడ పాండవులు వనవాసాజ్ఞాతవాసాల దీక్షను గ్రహించారు. కుంతిని విదురునియింట ఉంచా సతీసమేతులై పాండవులు అడవులకు బయలుదేరారు.
తలవిరబోసుకొని పతుల వెంట నడచిపోయే ద్రౌపదిని చూచి కౌరవేంద్రు అంతఃపుర వనితలందరూ ఏదో చెప్పలేని భయంతో తలలు వంచారు.
నా భయంక గదాదండంతో ఆ దుర్యోధనుని తొడలను ఉగ్రరణంలో విరగకొడతాను, శిరస్సు కాలు తన్ని అవమానిస్తాను, దుశ్వాసనుని వధించి వేడిరక్తం త్రాగుతా నంటూ బుసలు కొడుత సాగాడు వాయుపుత్రుడు భీమసేనుడు. రాబోయే పదునాల్గవయేట జరగబోడే మహాయుద్ధంలో నా గాండీవంతో ఈ కర్ణుడు మొదలుగాగల దుర్జన సంఘాన్ని హతమారు నని హుంకరిస్తూ అర్జునుడు వెడలాడు.
మాయాద్యూతంలో మోసం చేసి యింత విపత్తు మూలమైన శకునిని చంపుతామని భీమార్జున నకుల సహదేవులు శపథం చేశారు.
ధృతరాష్ట్రుని మందిరంలో పట్టపగలే నక్కలు కూశాయి. గ్రహణకాలం కాకుండా సూర్యుణ్ణి రాహువు పట్టాడు. భూమి కంపించింది.
నారదుడు మింట నాట్యం చేస్త పదునాల్గవ యేట భారతయుద్ధం జరుగుతుంది. భీమార్జున పరాక్రమాల వలన పాండవుల జయిస్తారు అని ప్రకటించాడు.
