The Fruit of Patience challenges of life.ఒక ఊళ్ళో కొత్తగా వినాయకుని గుడి నిర్మించారు.
ఆ రోజు ఆ ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది.
ఆ ఉత్సవంలో ఊరి జనులే కాక, బైట ఊళ్ళనుంచి కూడా వేలాదిమంది వచ్చి పాల్గొన్నారు.
దాంతో రోజంతా ఆలయంలో జనం కిటకిటలాడారు.
జనం వరుసక్రమంలో గర్భగుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రాసాగారు.
ఆ రాత్రి ఆలయ అర్చకులు, పనివారు తలుపులకు తాళం వేసి వెళ్ళిపోయారు.
అందరూ వెళ్ళిపోయాక ఆలయంలో పూర్తి ప్రశాంతత నెలకొంది.
అప్పుడు దైవ విగ్రహాన్ని చూస్తూ, గర్భగుడికి బయట మండపంలో నేలలో పరచబడి ఉన్న ఒక గచ్చు పలకరాయి మాట్లాడనారంభించింది:
గచ్చు పలక రాయి, “మిత్రమా నువ్వు ఇప్పుడు దైవ విగ్రహంగా ఉన్నావు! నీకు జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు నువ్వూ నేనూ ఒకే కొండలో పక్కపక్కనే ఉన్నాం. నీకు ఇప్పుడు ‘దైవ విగ్రహం’ అనే రూపం కల్పించి, అందరూ భక్తితో పూజిస్తున్నారు; ఎన్నో రకాల నైవేద్యాలు, ధూపదీపాలు నీకు అర్పిస్తున్నారు.
కాని నా స్థితి చూడు! వచ్చే పోయే వాళ్ళు అందరూ నన్ను కాళ్ళతో తొక్కిపోతున్నారు.
“మనం ఇద్దరమూ కలసి ఒకే చోట ఉన్నాం. కాని నీకో ఇప్పుడు మాలలతో మర్యాదలు! ప్రణామాలతో పూజాదికాలు కాని నాకో అందరి కాళ్ళచే తొక్కబడుతున్న దుస్థితి! ఇదేం న్యాయం? మన ఇద్దరికీ ఇంతటి తారతమ్యం ఎందుకు ఉండాలి? మనలను సృష్టించిన ఆ భగవంతుడు నాకు మాత్రం ఎందుకింత అన్యాయం చేశాడు?” అని వాపోయింది.
గచ్చు పలకరాయి ప్రశ్నకు, దైవవిగ్రహం చిన్నగా నవ్వి, ఇలా

జవాబివ్వనారంభించింది:
“మిత్రమా! నువ్వూ నేనూ ఒక కొండలో పక్కపక్కనే ఉన్నామన్న సంగతి నాకు బాగా జ్ఞాపకముంది. దాన్ని నేను మరిచిపోలేదు. కాని నువ్వే అప్పుడొక రోజు జరిగిన మరో సంఘటనను మరిచిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు.
“ఒక రోజు స్థపతి ఒకరు, మనం ఉన్న కొండ వద్దకు తన నలుగురు సహాయకులతో వచ్చాడు.
“వాళ్ళు నువ్వు ఉన్న చోటికే ముందుగా వచ్చారు.patients
“స్థపతి నిన్ను చూపుతూ తన సహాయకులలో ఒకనితో, ‘ఈ బండశిల దైవవిగ్రహం చెక్కడానికి అనువుగా ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి దీనిని నువ్వు ఉలితో కొట్టి చూడు!” అని చెప్పాడు..
ఆ సహాయకుడు, నీ మీద ఉలి పెట్టి ఒక దెబ్బకొట్టాడు. అంతే! వెంటనే నువ్వు ఎనిమిది ముక్కలుగా చిట్లిపోయావు!
“అది చూసి స్థపతి, ‘ఈ బండశిల ఒక్క దెబ్బకే అనేక ముక్కలుగా చిట్లిపోయింది. కనుక దైవవిగ్రహానికి ఇది పనికిరాదు. సరే… అదుగో, కాస్త దూరంలో అక్కడున్న ఆ బండశిల వద్దకు మనం వెళదాం!’ అని, నన్ను చూపించాడు.
“ఆ తరువాత నేను ఉన్న చోటుకు వచ్చారు.
“స్థపతి నన్ను చూపిస్తూ, తన మరో సహాయకునితో, ‘నువ్వు ఈ బందశిలను ఉలితో కొట్టి చూదు!’ అని చెప్పాడు.
“ఆ సహాయకుడు నా మీద ఉలితో బలంగా ఒక దెబ్బ కొట్టాడు. అబ్బా… ఏం దెబ్బ అది! ఆ దెబ్బను అప్పుడు నేను ఎలాగో తమాయించుకోగలిగాను.
“అది చూసి స్థపతి తక్కిన తన సహాయకులతో, ‘మీరూ ఈ బండశిల దైవవిగ్రహానికి పనికివస్తుందేమోనని ఉలితో అక్కడక్కడ కొట్టి పరీక్షించి చూడండి’ అని చెప్పాడు.
“ఆయన అలా చెప్పగానే, ఆ సహాయకులు నా మీద అనేక చోట్ల ఉలితో ‘ఫళీర్ ఫళీర్’ మని కొట్టారు.
“వారు కొట్టిన అన్ని దెబ్బలనూ నేను కించిత్తు కూడా ముఖం చిట్లించకుండా సహనంతో ఓర్చుకున్నాను.
“అది చూసి వారందరూ సంతోషించి, “ఈ బండశిల దైవ విగ్రహం చెక్కడానికి చాలా అనువుగా ఉంటుంది!” అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు.
తరువాత నిన్ను చూపిస్తూ, ‘ఈ బండశిలను కూడా మనం తీసుకుందాం. ఇది ఆలయంలో దేనికైనా పనికివస్తుంది’ అని వారు నిర్ణయించుకున్నారు.
“నన్ను కొండనుండి ఖండించి తీసుకువచ్చారు. నా దేహం మీద ఒక్కచోటు వదలకుండా ఉలితో కొట్టడమూ, చెక్కడమూ చేయసాగారు. ఆ విధంగా వినాయక విగ్రహానికి సముచితంగా ఉండే కాళ్ళు, చేతులు, తల మొదలైన వాటిని నా మీద చెక్కి ముగించారు. ఆ యాతనలను నేను పెదవి మెదపకుండా సహించాను.
“అందువలన నేడు నన్ను వినాయక విగ్రహంగా రూపొందించి ఆరాధనలో ఉంచి పూజిస్తున్నారు. ఈ విధంగా వందలాదిమంది నన్ను ఆరాధించే స్థితి నాకు ప్రాప్తించింది. కాని నువ్వో, వాళ్ళు కొట్టిన ఒకే ఒక్క దెబ్బనుకూడా సహనంతో భరించలేక చిట్లిపోయావు. అందుకే వాళ్ళు ఆలయ గర్భగుడికి ఎదురుగా, మండపంలో జనులు వచ్చి నిలబడే గచ్చు మీద నిన్ను గచ్చుపలకరాయిగా అమర్చారు. జరిగింది ఇదే! ఈ నీ స్థితికి కారణం ఎవరు?”
పై కథలోని అంతరార్థం ఏమిటి?
లౌకిక జీవితంలో చేసే ప్రయత్నం, కృషి, సరైన చింతనా ధోరణి, యాతనలను భరించడం, సహనం వంటివి మనిషిని ఉన్నత స్థితికి తీసుకుపోతాయి. ఈ గుణగణాలను జీవితంలో ఆచరణలో చూపని వ్యక్తులు ఉన్నత స్థితిని పొందరుగాక పొందరు!
ఈ సత్యం లౌకిక జీవితానికి మాత్రమే కాక ఆధ్యాత్మిక జీవితానికీ వర్తిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానోపలబ్ధికి సముచిత ప్రయత్నాలను చేసిన్నప్పుడు జ్ఞానం లభించే తీరుతుంది. అటువంటి ప్రయత్నాలను చేయనివారు సగటు మనుషులుగానే ఉండిపోతారు.
‘ఆధ్యాత్మికతలో పరిపూర్ణతను సిద్ధించుకోవాలి, ఈ జన్మలోనే ముక్తి పొందాలి’ అని హృదయపూర్వకంగా ఆశించే ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారు. వారు దైవవిగ్రహం కావడానికి బండరాయి స్వీకరించిన యాతనలవలె అల్ప లౌకిక సుఖాలలో మనస్సును జారవిడుచుకోకుండా భగవంతుని పాదపద్మాలలో మనస్సును లగ్నం చేసి స్థిరంగా ఉన్నారు.
ఇందుకు మారుగా, ‘అధర్మ మార్గంలో అత్యాశ కారణంగా ఐశ్వర్యాన్ని, పలుకుబడిని పొందే తీరాలి’ అని జీవిత పర్యంతం పరుగులెత్తేవారూ ఉన్నారు. వీరు ఆధ్యాత్మికతతో సంబంధం గల ఏ త్యాగాన్నీ చెయ్యరు, యాతనలనూ భరించరు. వీరి అంతం ఆధ్యాత్మిక రీతిలో గచ్చుపలకరాయిలాంటిదని చెప్పవచ్చు.
విద్యార్థులలో కొందరు విద్య పట్ల పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించి, పాఠాలను క్రమంతప్పక బాగా చదివి తమ విద్యను పూర్తి చేసుకొని సార్థకత సాధించుకుంటున్నారు.
వీళ్ళు పడే శ్రమ ఒక విధంగా దైవవిగ్రహం అనుభవించిన యాతనల వంటిదని చెప్పాలి. ఇంతటి యాతనలను అనుభవించకుండా, విద్యను అభ్యసించే కాలాన్ని పనికిమాలిన వ్యాపకాల్లో వృథా చేసుకొనే విద్యార్థులూ ఉన్నారు. వీరు వచ్చిపోయే వారు కాళ్ళతో తొక్కుతున్న గచ్చుపలకరాయి వంటివారు. జీవితంలో యాతనలను, శ్రమను సహనంతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారే ఉన్నత పథాన్ని అందుకోగలరు.
యాతనలను ఓర్చుకోనివారు, కర్తవ్యాల నుండి తప్పుకొనేవారు, చిన్న చిన్న పనులు సైతం పూర్తి చేయడానికి ముఖం చిట్లించేవారు జీవితంలో పురోగమించకుండా దిగువనే పడి ఉండాల్సి వస్తుంది.
భూమ్మీద పడి ఉండడమూ, ఆకాశంలో ఎత్తులో ఎగరడమూ వారి వారి చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.
భక్తులకు కొన్ని సమయాల్లో కష్టాలు- అగ్నిపరీక్షలు తప్పవు. ఈ కష్టాలూ, అగ్ని పరీక్షలూ వారిని మరింత ఉన్నతులను చేయడానికే ఎదురౌతాయి.
జీవితంలో యాతనలు చవిచూసిన వారికే సుఖం అనుభవించే హక్కు ఉంది. ఈ సత్యాన్ని మనం విస్మరించరాదు.
భగవంతుడు తన భక్తులను కొన్ని సమయాల్లో పరీక్షిస్తుంటాడు.
ఇటువంటి అగ్ని పరీక్షలను ప్రహ్లాదుడు, నాయన్మారులైన తిరునావక్కరసర్, మాణిక్యవాసగర్ వంటి భక్తాగ్రేసరులు చవిచూసిన వారే! అగ్ని పరీక్షానంతరం స్వయంగా భగవంతుడే వారి ఘనతను లోకవిదితం చేశాడు. ఇది అధ్యాపకుడు పరీక్ష పెట్టి, ఉత్తీర్ణులైన విద్యార్థిని పై తరగతికి పంపడం వంటిది.
“సహనమే సత్ఫలితాన్ని ఇస్తుంది.”
అగ్నిలో పుటం పెట్టిన బంగారం మరింత నాణ్యతను సంతరించుకొంటుంది. ఆ విధంగానే యాతనలు పెరిగేకొద్దీ వాటిని ఓరిమితో భరించే వారు కీర్తిమంతులు అవుతారు.
ఏ పనిని కూడా ప్రారంభించడానికి ముందు, ఆ పని ఎంతో కష్టమైనదని ఎంచి డీలాపడిపోకూడదు. కష్టసాధ్యమైన ఆ పనికి పూనుకొని చేసే ప్రయత్నం సైతం ఘనతను చేకూరుస్తుంది.
యాతనలను ఓర్చుకోనివారు, కర్తవ్యాల నుండి తప్పుకొనేవారు, చిన్న చిన్న పనులు సైతం పూర్తి చేయడానికి ముఖం చిట్లించేవారు జీవితంలో పురోగమించకుండా దిగువనే పడి ఉండాల్సి వస్తుంది.
భూమ్మీద పడి ఉండడమూ, ఆకాశంలో ఎత్తులో ఎగరడమూ వారి వారి చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.
భక్తులకు కొన్ని సమయాల్లో కష్టాలు – అగ్నిపరీక్షలు తప్పవు. ఈ కష్టాలూ, అగ్ని పరీక్షలూ వారిని మరింత ఉన్నతులను చేయడానికే ఎదురౌతాయి.
జీవితంలో యాతనలు చవిచూసిన వారికే సుఖం అనుభవించే హక్కు ఉంది. ఈ సత్యాన్ని మనం విస్మరించరాదు.
భగవంతుడు తన భక్తులను కొన్ని సమయాల్లో పరీక్షిస్తుంటాడు.
ఇటువంటి అగ్ని పరీక్షలను ప్రహ్లాదుడు, నాయన్మారులైన తిరునావక్కరసర్, మాణిక్యవాసగర్ వంటి భక్తాగ్రేసరులు చవిచూసిన వారే! అగ్ని పరీక్షానంతరం స్వయంగా భగవంతుడే వారి ఘనతను లోకవిదితం చేశాడు. ఇది అధ్యాపకుడు పరీక్ష పెట్టి, ఉత్తీర్ణులైన విద్యార్థిని పై తరగతికి పంపడం వంటిది.
“సహనమే సత్ఫలితాన్ని ఇస్తుంది.”
అగ్నిలో పుటం పెట్టిన బంగారం మరింత నాణ్యతను సంతరించుకొంటుంది. ఆ విధంగానే యాతనలు పెరిగేకొద్దీ వాటిని ఓరిమితో భరించే వారు కీర్తిమంతులు అవుతారు.
ఏ పనిని కూడా ప్రారంభించడానికి ముందు, ఆ పని ఎంతో కష్టమైనదని ఎంచి డీలాపడిపోకూడదు. కష్టసాధ్యమైన ఆ పనికి పూనుకొని చేసే ప్రయత్నం సైతం ఘనతను చేకూరుస్తుంది.