Rudra Namam Secrets: Unlocking the Divine Energy of Rudra Aradhana

1.Rudra నామానికి అర్ధం ఏమిటి?

జ. రోదనము కలిగించువాడు, కరిగించువాడు. నమస్కరించిన వారి దుఃఖం పోగొట్టేవాడు. రుద్రుడు.

2. రుద్ర నామానికి తత్వ అర్థం ఏమిటి?

8. రుకారం అగ్ని బీజం, దకారం జలం నాదాంతంలో ఉండేవాడు రుద్రుడు. అమ్మ అయ్యా కలిపితే రుద్ర

3. రుద్రుడు ఎవరి ధ్యానానికి తొందరగా దర్శనం ఇచ్చాడు?

8. ఋషులు ధ్యానానికి కూర్చోగానే వెంటనే దర్శనం ఇచ్చాడు.

4. రుద్రుడు ఎక్కడనుండి ఆవిర్భవించాడు?

జ. బ్రహ్మ గారి భ్రూ మధ్య స్థానం నుండి ఆవిర్భవించాడు.

5. రుద్రులు ఎంతమంది? వారు ఎవరు?

8. ఏకాదశ రుద్రులు. కపాలి, పింగళుడు, భీముడు, చండుడు, భవుడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త్ర, అజాపత్, శంభుడు.

6. వైద్యనాథ మంత్రం ఏమిటి?

జ శ్రీ బాలాంబికేశాయ నమః శ్రీ వైద్యేశాయ నమః శ్రీ భవరోగాయ నమః శ్రీ మృతుంజయాయనమః.

7. లింగములు ఎన్ని రకములు అవి ఏవి?

8. మూడు రకములు

1 మానుష లింగములు 2 సిద్ద లింగములు

= స్వయంభూ లింగములు.

8. రుద్ర ఆరాధన ఎన్ని రకాలు? అవి ఏవి?

జ.

1) పంచాక్షరీ జపం

2) శివకార్యాలు శివప్రీతిగా చెయ్యడం

3) శివక్షేత్రాలు దర్శించడం,

మంత్రజపం.

9. శివ గంగ అంటే ఏమిటి?

2. శివక్షేత్రాలలో ఉన్న జలం. నూతి నీరును శివగంగ అంటారు

10. శివకార్యాలు అంటే ఏమిటి?

2. శివునికోసం పూలు సమకూర్చడం. ఆలయాలు శుభ్రపరచడం శివునికోసం చేసేప్రతిపని కూడా శివకార్యమే.

11. క్రియా యోగం మరియు చర్యా యోగం అంటే ఏమిటి?

2. శరీరం ఉపయోగించి ఆలయాలు శుభ్రపరచడం పూలుకోయడం లాంటివి చర్యా యోగం జపం ధ్యానం పూజ లాంటివి క్రియా యోగం

12. రుద్రారాధన వల్ల ఏమి జరుగుతుంది?

8. రుద్రారాధన వల్ల కార్మిక, మాయిక మలములను తొలగించుకోవచ్చు.

13. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చెయ్యవలసిన విధులు ఏమిటి?

8. తీర్థ విధులు మరణించిన పెద్దవారిని ఉద్దేశించి చెయ్యాలి.

14. మనం చేసేకర్మలలో ఎన్ని భాగాలూ ఉంటాయి? అవిఏవి? అవి ఎలా పోగొట్టుకోగలం?

8 మనం చేసే కర్మలు మూడు భాగాలుగా ఉంటాయి. అవి బీజ వృద్ధి, భోగ, అంశ. వీటిని రుద్రారాధన ద్వారా పోగొట్టుకోగలము.

15. క్షేత్రానికి వెళ్ళినపుడు చెయ్యకూడని పనులు ఏమిటి?

జ. ఇతరులను నిందించకూడదు తిట్టకూడదు.

6. గృహస్తు ధర్మాలు

1. లింగ పూజలు ఎన్ని విధములు?

8. స్థిర (అచల లేదా ప్రతిష్ఠితమైన లింగములు) 2. చల లేదా చర – ఇళ్లలో చేసే

లింగార్చన

2. ఎటువంటి లింగం లో ఆవాహనాదులు చెయ్యకుండానే శివుడు ఉంటాడు?

జ. బాణ లింగంలో

3. బాణ లింగాలు ఎక్కడ దొరుకుతాయి?

జ. నర్మదా నదిలో

4. శివలింగములు ఎన్ని రకములు?

జ. మానుషం, అర్థం, దైవం

5. శివాలయం లో ఉండే నీటిని ఏమి అనాలి?

జ. శివగంగ

6. క్షేత్రాలలో ఉండాల్సిన లక్షణములు ఏంటి?

జ. సదాచారం, సత్ప్రవర్తన, సద్భావన, దయతో ఉండుట

7. మన కర్మలకి ఉండే మూడు అంశలు ఏవి?

జ. బీజాంశ వృధ్యంశ, భోగాంశ

8. ప్రతి క్షణం సాధనకి వినియోగించాల్సిన మానవ జన్మ యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి?

2. అస్సలు పాపం చెయ్యకుండా ప్రయత్నించడం, ఈశ్వరారాధన కోసమే ఎల్లప్పుడూ జీవించడం.

9. గృహస్తు ధర్మం ప్రకారం ఏ సమయం లో నిద్ర లేవాలి?

జ. ఉషః కాలములో (3.30 AM తరువాత, సుర్యోదయానికి ముందర). ఇది రోగ హరణ కాలము.

10. గృహస్తు ధర్మాల్లో ధనం ఎలా సంపాదించాలి అని చెప్పారు. దాని వల్ల లాభం ఏంటి?

జ. శాస్త్ర విహితమైన కర్మ ద్వారానే ధనం సంపాదించాలి. దీనినే అర్థశౌచం అంటారు. ఇటువంటి ధనం తో బతికితేనే వైరాగ్యం వస్తుంది.

11. కాయిక యజ్ఞం అనగా ఏమిటి? దానికి ఉదాహరణలు ఏవి?

2. శరీరం తో చేసేది కాయిక యఙ్ఞం.

ఉదా|| ఉపవాసాదులు చెయ్యటం, క్షేత్రములు దర్శించటం.

12. మానసిక పాపం ఎలా పోతుంది?

జ. ధ్యానముతో

13. బ్రాహ్మణ జన్మ లభించినవారికి ఎటువంటి ధనం ఉత్తమం అని చెప్పబడింది?

జ. గురు దక్షిణ ద్వారా లభించినది.

14. బ్రాహ్మణుడికి అపవిత్రుల ద్వారా ధనం లభిస్తే ఏమి చెయ్యాలి?

జ. సముద్రం లో పారవేయాలి

7. వారాలు, పూజించవలసిన దేవతలు

1. ఏడు రోజులకు అధిపతి ఎవరు?

జ. సూర్యభగవానుడు.

2. ఆదివారానికి గ్రహదేవత & అధిదేవత ఎవరు?

2. గ్రహదేవత సూర్యుడు, అధిదేవత శివుడు

3. ప్రమాదాలు దాటించే దేవత ఎవరు? ఆ దేవత వారం ఏది?

జ. కుమారస్వామి.మంగళవారం

4. బ్రహ్మను ఆరాధించవలసిన మంత్రము ఏది?

జ. శ్రీ భగవతే హిరణ్యగర్భాయనమః.

5. బ్రహ్మకి వేదములు ఇచ్చిన రూపం ఏది?

2. దక్షిణామూర్తి రూపం.

6. దేవతారాధనలు ఎన్ని విధములుగా ఉంటుంది?

2. 4 విధములు. మంత్రము, దానము, తపస్సు, సమారాధన.

7. క్షుర కర్మలు చేసుకోకూడని రోజు ఏది? చేసుకుంటే పరిస్కారం మంత్రము ఏది?

2. ఆదివారము.ఆవర్తనో అహిచ్ఛత్రో పాటలీపుత్రో జనార్దనః.

8. శనివారం నివేదించవలసిన పదార్ధము ఏది?

2. నువ్వులతో చేసిన పదార్దము.

9. యజ్ఞాలు ఎక్కడ చేస్తే ఎక్కువ ఫలితము వస్తుంది?

జ. పుణ్యతీర్థాలలో చేస్తే

10. వేటిని సప్త గంగలు అంటారు?

జ. గంగ, గోదావరి, కావేరి, యమునా, తామ్రపర్ణి, సింధు, రేవానది.

8. షోడశోపచారములు


1. పరమేశ్వర పూజ లో ఎన్ని ఉపచారములు ఉన్నాయి? అందులో ప్రధానమైనవి ఎన్ని?

8. అరవై నాలుగు ఉపచారములు ఉన్నాయి ప్రధానమైనవి పదహారు.

2. pooja లో ముఖ్యమైన పంచ ఉపచారములు ఏవి?

జ. పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పణ.

3. పంచ ఉపచారములలో ఒక్కొక్క టి ఏ తత్వాన్ని చెప్తోంది?

జ. గంధం – పృథ్వి తత్త్వం, పుష్పం ఆకాశ తత్త్వం, దీర్ఘం- అగ్ని తత్త్వం, ధూపం వాయు తత్త్వం, నైవేద్యం – అమృత తత్త్వం

4. శివార్చనలో ముఖ్యమయిన ఉపచారము ఏది?

జ. అభిషేకం.

5. అభిషేకం చేయడం వల్ల ఏమవుతుంది?

8. ఆత్మశుద్ధి

6. గంధం సమర్పణతో ఏమవుతుంది

జ. పుణ్యం వస్తుంది.

7. ధూప సమర్పణ వల్ల ఏమి ప్రయోజనం?

జ. ధూప సమర్పణ వల్ల అర్ధ ప్రాప్తి కలుగుతుంది.

8. దీపం సమర్పణం వల్ల ఏమి జరుగుతుంది?

జ. దీపం సమర్పణం వల్ల అజ్ఞానం తొలగుతుంది. దీపేన సాధ్యతే సర్వం.

9. ధూప దీపాల మధ్య శివ లింగాన్ని ఏఏ కాలాములలో చూస్తే ఏమి ఫలం కలుగుతుంది?

2. ప్రాతః కాలం లో చూస్తే స్వర్ణ ఫలం, మధ్యాహ్నం చూస్తే యజ్ఞ ఫలం, సాయంత్రం చూస్తే మోక్ష ఫలం.

10. దీపములలో ఏ దీపములు శ్రేష్ఠము?

జ. నేతి దీపం, నువ్వుల నూనె దీపం

11. అపమృత్యువు తొలగడానికి ఎటువంటి దీపం సమర్పించాలి?

8. మూడు రంగుల దారాన్ని 7 పేటలుగా చేసి మట్టి ప్రమిదలో ఆముదం వేసి దీపం పెడితే అపమృత్యువు తొలిగి పోతుంది.

12. నేతినైవేద్యం సమర్పించడం వల్ల ఏమి జరుగుతుంది?

జ. ఆయుష్షు, తృప్తి కలుగుతాయి.

13. తాంబూలం సమర్పించడం వల్ల ఏమి జరుగుతుంది?

2. తాంబూలం సమర్పించడం వల్ల భోగం వస్తుంది.

14. అర్చనాదులు ఎప్పటి వరుకు చెయ్యాలి?

2. శరీర బాహ్య స్పృహ ఉన్నంతవరకు చెయ్యాలి.

15. పుణ్యం అంటే ఏమిటి?

జ. ఏ కర్మ వల్ల పవిత్రులము అవుతామో అది


9. తిధి, మాసముల ప్రాముఖ్యత

1. రధసప్తమి ఏ రోజు చేసుకుంటాము?

జ. మాఘమాసము శుక్ల పక్ష సప్తమి తిధి రోజు.

అమ్మవారి ఆరాధనకు విశిష్టమైన మాసము, వారం, నక్షత్రము, తిధి ఏది?

2. జ. చైత్రమాసం (కర్కాటక సంక్రమణంలో), మృగశిర నక్షత్రం, సోమవారం, నవమి తిధి.

3. ఏకాదశి, ద్వాదశి తిధులకు అధిపతి ఎవరు?

జ. యముడు ఏకాదశికి, విష్ణువు ద్వాదశికి అధిపతులు.

4. విష్ణువు వామన అవతారంగా వచ్చిన రోజు ఏది?

జ. భాద్రపద మాసం, ద్వాదశి తిధి, శ్రవణా నక్షత్రం.

5. శివారాధకి ముఖ్యమైన నక్షత్రం ఏది?

జ. ఆరుద్ర నక్షత్రం.

6. ఎన్ని రకాల ప్రదోషాలు ఉన్నాయి?

జ. 3 రకాలు.

1 నిత్య ప్రదోషము

2 పక్ష ప్రదోషము

3 మాస ప్రదోషము.

7. లింగావిర్భావము ఏ మాసము, ఏ నక్షత్రము నాడు జరిగింది?

జ. మార్గశీర్ష మాసము, ఆరుద్ర నక్షత్రము.

8. కార్తీక మాసంలో మంగళవారం నాడు ఏదానము చేస్తే శ్రేష్ఠము?

జ. దీపదానం చేస్తే శ్రేష్ఠము.

9. పంచోదకం అంటే ఏమిటీ?

జ. గోమయం, గోజలం, క్షీరం, గోనెయ్యి, పెరుగు ఈ 5 కలిపినదానిని పంచోదకం అంటారు.

ఈ పంచోదకం తో శివుడికి అభిషేకం చేస్తారు.

10. శివుడికి మనల్ని మనం సమర్పణ చేసుకోవాలాంటి భక్తితోపాటు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏది?

జ. శ్రద్ధ

10. శివారాధన ప్రక్రియ

1. శివారాధన ఎందుకు చేయాలి?

జ. శివారాధన వలన భోగము మోక్షము వస్తాయి.

2. ప్రకృతి పురుషాత్మకత్తాన్ని ఏ రూపములో ఆరాధిస్తున్నాము?

జ. శివలింగ రూపములో

3. శివ స్వరూపము చూడటానికి మార్గములు?

జ. నిర్గుణ ఉపాసన, సగుణ ఉపాసన, సూర్యారాధన

4. సూర్యారాధన ఏ విధముగా చెయ్యాలి?

జ. సూర్యుని ఒక మహాలింగముగా భావన చేసి తేజోమయమైన జ్యోతిర్లింగ మధ్యంలో హిరణ్మయ రూపంతో ఉన్న పరమేశ్వరుని ధ్యానించాలి.

5. సంధ్యా వందనంలో సూర్యమండలంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఏ మంత్రము చదువుకోవచ్చు?

జ. నమః శివాయః సాంబాయ సగణాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రాహ్మణే సూర్యమూర్తయే

6. పరమేశ్వరుని స్వరూపాలలో ఆరాధించవలసిన ఆరు లింగములు?

జ. ధ్వని లింగము, నాదలింగము, బిందులింగము, మకారలింగము, ఉకారలింగము అకారలింగము

7. ధ్వనిలింగము అంటే ఏమిటి?

8. ఓంకారము

8. నాదలింగములు ఏవి?

జ. స్వయంభూ లింగములు నాదలింగములు, శ్రీశైల మల్లికార్జునుడు, కాశీ విశ్వనాధుడు, ఉజ్జయిని మహాకాళుడు వంటి స్వయంభూ లింగములు నాదలింగములు.

9. బిందులింగము అంటే ఏమిటి?

జ. పంచాక్షరీ యంత్రము, దక్షిణామూర్తి యంత్రము, మృత్యుంజయ యంత్రము, స్త్రీ యంత్రము వంటి యంత్రములు రూపములో శివారాధన చేస్తే బిందు లింగము అని పేరు.

10. మకారలింగములు ఏవి?

జ. ప్రతిష్ఠ చేసిన లింగములు మకారలింగములు.

11. ఉకారలింగములు ఏవి?

జ. ఊరేగింపునకు ఉపయోగించే లింగములు ఉకార లింగములు.

12. అకార లింగము అంటే ఏమిటి?

8. శివఙ్ఞానాన్ని, శివమంత్రాన్ని, శివదీక్షని ఏ గురువు ద్వారా పొందుతామో ఆ గురువు అకారలింగము.

13. ప్రకృతి అష్టకము అనగా ఏవి?

8. మూలప్రకృతి, బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రములు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ)

14. చండాధీకారము ఎక్కడ ఉంటుంది?

8. మానవులు ప్రతిష్ట చేసిన శిలాలింగములందు ఉంటుంది.

15. శివారాధనకు ప్రధానమైనవి?

8. బిల్వము, మారేడు.

16. ఐదు రకముల బిల్వములు ఏవి?

8. తులసి, మారేడు, నిర్గుండి (వావిలి), జంజీర (నిమ్మదళము), అమలకం (ఉసిరిక)

17. శివ దీక్ష తీసుకున్నవారు ప్రధానంగా చేయవలసినవి?

జ. భస్మ ధారణ, రుద్రాక్ష ధారణ.

18. జీవులకు సర్వ విధములైన శుద్ధికి హేతువులు ఏమిటి?

8. భస్మము, రుద్రాక్ష, శివనామము.

Leave a Comment