1) బ్రహ్మ మంత్రము Brahma Mantra
శ్రీ భగవతే హిరణ్యగర్భాయ నమః

2) విష్ణు మూర్తి ఉపదేశించిన మంత్రం Lord Vishnu’s Upadesha
శ్రీ శివాయ నమ: శుభం శుభం కురు కురు నమః శివాయ శ్రీ
3) భస్మధారణప్పుడు పఠించవలసిన మంత్రము Bhasma Dhaarana Mantra
ఈశానతే తత్పురుషాయ నమః ఘోరాయ సదా ! వామదేవ నమస్తుభ్యం సంభోజాయవై నమః ।
4) దక్షిణామూర్తి మంత్రము Dakshina Moorthi Mantram
గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం | నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః|| ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే! నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణా మూర్తయే నమః॥
5) పరమ మంత్ర సామ్రాట్ Parama Mantra Samrat
శివాయ గురవే నమః
6) శ్రీ అమృతేశ్వర మూర్తి Amruteswara Murthy Manthra
శ్రీ అమృతేశ్వరాయ నమః శివాయ
7) ລ້ – Marga Bandhu
శ్రీ మార్గ బంధవే నమః
8) సూర్య మంత్రం Surya Manthra
సూర్య మండలం మధ్యస్థం, సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివమవ్యయం
నమః శివాయః సాంబాయ సుగుణాయ ఆది హేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే
9) వీరభద్ర మంత్ర – Veerabhadra Manthram
జటాజూట శక్తి సముదాయాం విద్యామార్గం శ్రీ వీరభద్ర
శ్రీ వీరభద్రాయ నమః శివాయ
10) వాస్తు దోష నివారణ Vastu Dosha Nivarana
శ్రీ రుద్రాయ నమః
11)Annapoorna Devi
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి
12) శ్రీ వైద్యనాధ మంత్రం రోగ నివారణ – Sri Vaidhyanadha Manthram
బాలాంబికేశాయనమః
శ్రీ వైద్యేశాయ నమః
భవరోగహరాయనమః
శ్రీ మృత్యుం జయాయనమః
13) అష్టమూర్తి నామాలు Ashta moorthi Manthram
శర్వాయ క్షితి మూర్తయే నమః భవాయ జల మూర్తయే నమః రుద్రాయ అగ్ని మూర్తయే నమః ఉగ్రాయ వాయు మూర్తయే నమః భీమాయ ఆకాశ మూర్తయే నమః ఈశానాయ సూర్య మూర్తయే నమః మహా దేవాయ చంద్ర మూర్తయే నమః పశుపతయే యజమాన మూర్తయే నమః
14) Pradakshina mantra
యానికానిచ పాపాని, జన్మాంతర కృతానిచ|
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణం పదే పదే॥
15) క్షుర కర్మ మంత్రం Kshura karma
ఆనర్తో హిచ్ఛత్రః పాటలీ పుత్రో అదితిర్దితిః శ్రీశః క్షౌరౌ స్మరణాదేషాం దోషానశ్యంతి నిశ్శేషాః
16) నటరాజమూర్తి శ్లోకం Nataraja Murthi Slokam
ధనలిపితహితం కించిత్ ధృత్ చర్యక్, చాకుంచాయనంద నృత్యం. కలయతి వరదం కుంచితాంగం భజేహం.
ధర్మం దత్త్వా జనానామం డమరుకనినదైహి అర్ధమప్వయగ్నినాయహ, కామం దత్త్వా అభయేన, స్వపదసరసిజం, మోక్షరూపం పుమర్ధాం నిత్యం లోకాన్, సమస్తాన్ అవతి నటపత హిః నాయకాహః చిత్ సభాయాహా
17) నామాష్ట కయోగం Pashupaasha yogastakam
శివోశివోమహేశ్వరశ్చెవ రుద్రో విష్ణుః పితామహః సంసారవైద్య స్సర్వజ్ఞః పరమాత్మేతి ప్రతిపాదకమ్.
18) For anayasa maranam
అనాయాసేన మరణం
వినాదైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలం
1.శివ నామములు
- శివ పురాణం ప్రవచనం ఎక్కడనుంచి సేకరించారు?
జ. పురాణాలు, ఆగమాలు, స్తోత్రాలు,మంత్రములు, గ్రంథములు, ఆసేతు హిమాచలం, భక్తుల జీవితం, క్షేత్ర మహిమలు, భక్తులమాటలు నుండి సేకరించారు.
2 శృతి జీవ రత్నం ఏమిటి?
జ. శృతి జీవ రత్నం అంటే శివ పంచాక్షరి. ఇది వేదం యొక్క హృదయంలో దాగి ఉన్నది.
- శివ అనే నామానికి ఎన్ని అర్ధాలు ఉన్నాయి?
జ. రెండు అర్థాలు
. (1) సాహిత్య /శబ్ద అర్ధం
(ii) మంత్ర అర్ధం
ధ్యాన మూరి
- శివ నామానికి అర్ధాలు ఏమిటి?
జ. మంగళం, శుభం, భద్రం, కళ్యాణం, శ్రేయస్సు, క్షేమం, మోక్షం, శుద్ధం, శాంతం, విశ్రాంతిదాయకుడు
- శివ నామానికి ఉన్న మంత్రం అర్ధం ఏమిటి?
జ. శకారం -పరమాత్మ: ఇకారం – శక్తి వకారం- అమృతబీజం శివ- మంత్రము పరమాత్ముని అమృతశక్తి
- శుద్ధమైన వాడన్న నామానికి అర్థం ఏమిటి?
జ. శుద్ధమైన వాడు – దోషములు లేని వాడు,
- “ఉండువాడు” అన్న నామానికి అర్ధం వివరించండి
జ. ఉండువాడు అనగా శితే ఇతి శివః – ఎప్పటికి ఉండే వాడు అని అర్ధం.

2.శివయోగం & జీవుడికీ దేవుడీకి ఉన్న తేడా
1.జీవునిలో ఉన్న మాలిన్యములు (మలములు) ఎన్ని రకములు? జీవుడికి శివునికి తేడా ఏమిటి? జీవుడు శివోహం ఎప్పుడు అవుతాడు?
జ. ఆనవ మలము, కార్మిక మలము, మాయక, మలములు. ఈ మూడు మాలిన్యములు లేనివాడు శివుడు. జీవుని లో ఈ మూడు మాలిన్యములు తీసివేస్తే శివుడు, అప్పుడు జీవుడు శివోహం అవుతాడు.
- కార్మిక మాలిన్యం అంటే ఏమిటి? ఏ మాలిన్యం వలన ఏ దోషాలు అంటుతాయి?
జ. మనము చేస్తున్న పనుల వలన వచ్చే మాలిన్యము కార్మిక మాలిన్యము. ఏ పని చేస్తున్నా ఏదో ఒక అహంకారం, ఏదో కావాలని తపన వలన దోషాలు అంటుతాయి.
- శాంతం అంటే ఏమిటి?
జ. మూడు అవస్థలు మెలకువ, స్వప్న, గాఢ, నిద్ర (ఈ 3) దాటి పైన స్థితియే శాంతం.
- తురీయా స్థితి అంటే ఏమిటి? ఆది ఎలా పొందగలరు?
జ. జగత్తు 3 అయితే బ్రహ్మము నాలుగవది. ఆ నాలుగవ స్థితి తురీయా స్థితి, ఈ స్థితి ధ్యానము ద్వారా పొందగలరు. చైతన్యము లేకపోతే ఈ మూడు అవస్థలు (మెలకువ, స్వప్న, గాఢ నిద్ర) లేవు. కానీ చైతన్యానికి ఈ మూడు లేవు. ఆ చైతన్యమే శివుడు.
ఆ తురీయా స్థితియే Ultimate స్థితి. తురీయా స్థితి శివం.
- శివ యోగము అంటే ఏమిటి? జీవుడు మోక్షము ఎలా పొందగలడు?
- శివుని పొందే యోగమే శివ యోగము. ఎవరి మనస్సు ఎప్పుడు శివుని తో కలిస్తే అదే మోక్షము. శివ ప్రాప్తికి శివ యోగము అవసరం. ఎవరి మనస్సు శివుని తో కలిసి ఉంటుందో వారు ఇక్కడే మోక్షము పొందుతారు.
- శివ యోగము ఎన్ని విధములు? అవి ఏమిటి?
జ. శివ యోగము 5 విధములుగా ఉంటుంది. అవి శివఙ్ఞానము, శివభక్తి, శివధ్యానము,
శివార్చన, శివ వ్రతం.
- ఆరాధన ఏ మూడిటితో చేయాలి?
జ. మనసు, మాట, శరీరము ఈ మూడిటితో చెయ్యాలి.
- ఎటువంటి శుద్ధి శివార్చన అవుతుంది?
జ. శరీర శుద్ధి, బాహ్య శుద్ధి, మనసు శుద్ధి ఈ మూడిటితో చేసేది శివార్చన అవుతుంది.
3.పంచముఖ పరమేశ్వర రూపం

- పరమేశ్వరుడు సృష్టి ఆరంభం లో సృష్టి చెయ్యాలని ఎవరి రూపం లో గోచరించారు?
- నారాయణ రూపం
- బ్రహ్మదేవుడు, నారాయణుడి మధ్య వివాదంలో వారు ఉపయోగించిన అస్త్రాలు ఏమిటి?
జి. బ్రహ్మదేవుడు మహేశ్వర అస్త్రం నారాయణుడు. పాశుపతి ఱ్యస్త్రం.
- బ్రహ్మదేవుడు, నారాయణుడి మధ్య వివాదం ఎందుకు వచ్చింది?
- ఎవరు ఎవరిని సృష్టించారనే విషయం మీద.
- ఆకాల ప్రళయం సంభవించినప్పుడు దేవతలు ఎవరిని ప్రార్థించారు?
- కైలాస వాసిని
- అకాల ప్రళయం ఎందుకు సంభవించింది?
- బ్రహ్మదేవుడు, నారాయణుడు వివాదం లో ఉపయోగించిన అస్త్రాల వలన
- శివుడు ఏ విధంగా ఆవిర్భవించాడు?
జ. ఆద్యంతమూ లేని అగ్ని స్తంభంగా
- అగ్ని స్తంభం యొక్క తుది తెసులుకోటానికి బ్రహ్మదేవుడు ఏ రూపం ధరించాడు?
- హంస రూపం
- అగ్ని స్తంభం యొక్క మూలం తెసులుకోటానికి నారాయణుడు ఏ రూపం ధరించాడు? జ. వరాహ రూపం.
- అగ్ని స్తంభం యొక్క తుది తెలుసుకోలేక పోయిన బ్రహ్మ ఎవరి చేత అబద్ద సాక్ష్యం చెప్పించాడు?
- అగ్ని స్తంభం మీద నుండి కింద పడుతున్న మొగలి పువ్వు చేత.
- అగ్ని స్తంభం నుండి పరమేశ్వరుడు ఏ రూపం తో బయటకి వచ్చాడు?
జ. పంచ ముఖాలతో, పది చేతులతో, తెల్లని రూపంతో.
- శివుడి మొట్ట మొదటి రూపం ఏమిటి?
జ పంచముఖ పరమేశ్వర రూపం
- కాలభైరవ రూపం ఎక్కడ నుండి ఉద్భవించింది?
జ. పంచ ముఖ పరమేశ్వరుడి ఆజ్ఞాచక్ర స్థానం నుండి, ఆయన కోపం తో కనుబొమలు ముడి వేయగా దాని మధ్య నుండి.
- బ్రహ్మ దేవుడి పై తలకాయను ఎందుకు? ఎవరు గిల్లి వేశారు?
జ. కాలభైరవ రూపం తో ఉన్న పరమేశ్వరుడు. తుది తెలుసుకోకుండా చూశానని అబద్దం చెప్పిన కారణంగా.
- మొగలి పువ్వు శివ పూజ కు ఎందుకు పనికి రాదు?
జ. అబద్ద సాక్ష్యం చెప్పిన కారణంగా.
- బ్రహ్మ పూజకి ఎందుకు పనికి రాడు?
జ. అబద్ధం చెప్పిన కారణంగా.
- పంచకృత్యాలు ఏమిటి?
జ. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం
- పంచ కృత్యాలు చేసేటప్పుడు పరమేశ్వరుడు ఏ ఏ రూపాలలో ఉంటాడు?
జ. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి అప్పుడు విష్ణువుగా, సంహారం అప్పుడు రుద్రుడిగా, తిరోధానమప్పుడు మహేశ్వరుడిగా, అనుగ్రహం అప్పుడు సదా శివుడిగా.
- పంచ ముఖాల పేర్లు ఏమిటి?
జ. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన,
- బ్రహ్మ విష్ణువులకి పరమేశ్వరుడు ఉపదేశించిన మంత్రం ఏమిటి?
జ. పంచాక్షరి మంత్రం. పంచ ముఖాల నుండి ఒక్కో అక్షరం తో ఐదు అక్షరాల మంత్రం ఉపదేశించారు.
- శబ్ద లింగం అని దేనిని అంటారు?
- ఓం కారాన్ని సాహిత్య అర్థం లేని నాదశక్తి కాబట్టి.
- సూక్ష్మ ప్రణవం, స్థూల ప్రణవం అని వేటిని పిలుస్తారు?
జ. ఓం కారాన్ని సూక్ష్మ ప్రణవం అని, పంచాక్షరి ని స్థూల ప్రణవం అని, పరమేశ్వరుడిని ప్రణవ స్వరూపం అని అంటారు.
- మొట్టమొదటి అగ్ని లింగాన్ని ఆరాధించింది ఎవరు?
జ. బ్రహ్మ, విష్ణువులు
- ఇంద్రునికి, బృహస్పతికి ఏ ధాతులింగం ఆరాధనకి ప్రసాదింపబడింది?
జ. ఇంద్రునికి మణిమయ లింగం, బృహస్పతి కి పుష్య రాగ లింగం.
4.శబ్దబ్రహ్మ స్వరూపం, అక్షరలింగ స్వరూపం, లింగారాధన
- ఋషి అంటే ఎవరు?
జ. దర్శనశక్తి ఇంద్రియాలతో చూడలేని సత్యాలని తపశ్శక్తి ద్వారా చూడగలిగేవాడు.
2 ఋషి సారసత్తముడు ఎవరు?
జ. శబ్ద బ్రహ్మను దర్శించి, ఉపాసన చేసి పరబ్రహ్మతత్వము పొందిన ఋషిని సారసత్తముడు అంటారు.
- మూలప్రకృతి అనగా ఏమి?
జ. త్రిగుణములు ప్రపంచములో పరుచుకోకముందు త్రిగుణసామ్య స్థితిలో ఉండేదానిని మూలప్రకృతి అంటారు.
4 శివుని శరీరంలో ఎడమ కన్ను, హృదయము, దేనిని తెలియచేస్తాయి?
జ. ఎడమ కన్ను – ఇకారము
హృదయం – మకారము
- పరమాత్ముడి నుండి శబ్దబ్రహ్మ కనపడగానే 5 కళలతో కూడినటువంటి రూపం ఏది?
జ. నమః శివాయ.
- లింగార్చన సకామభావనతో చేస్తే ప్రయోజనం ఏమి? నిష్కామ భావనతో గాని చేస్తే ప్రయోజనం ఏమి?
జ. సకామ – ఇహలోక సుఖాలు, నిష్కామ మోక్షము.
- ఋషులు, వివ్రులు పూజించే లింగం ఏది?
- పార్థివ లింగం.
- మానుష, సిద్ధ, దైవ లింగములు ఏవి?
జ. మనుషులు ప్రతిష్ఠించినవి మానుషలింగములు ఋషులు, దేవతలు ప్రతిష్టించినవి
సిద్ధలింగాలు. ఉదా: అమరావతి, శ్రీకూర్మం
స్వయంభూలింగాలు దైవ లింగాలు. ఉదా: జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు