శ్రీమత్ వాల్మీకి రామాయణం, తులసీ రామాయణం, కలల రామాయణం, రంగనాథ రామాయణం మొదలైనవి రామాయణాలలో

ఇవే కాక భారతీయ భాషలన్నిటిలోనూ కవులు రామాయణాలను రచించి ఉన్నారు. వాటిలో వంగ భాషలో కృత్తివాస్ రచించిన ‘కృత్తివాస’ ‘రామాయణం’ కూడా ఒకటి.
దాన్లో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇక్కడ మనం చూడబోతున్నాం.
సీతాదేవిని రావణుడు అశోకవనంలో నిర్బంధించి ఉంచాడు. ‘అశోకవనంలో పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న సీతాదేవికి విభీషణుని కుమార్తె అయిన త్రిజట అప్పుడప్పుడు వచ్చి సాంత్వన చేకూరుస్తూ ఉండేది.
ఇలా ఉండగా త్రిజట ఒక రోజు సీతాదేవితో “అమ్మా! నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కాస్త నాతో రండి!” అని చెప్పి, పక్కనే ఉన్న ఒక చోటుకు తోడ్కొని వెళ్ళింది.
అశోకవనంలో ఒక మూల ఉన్న సన్నెకల్లును (నూరుడు రాయి) సీతకు చూపించి త్రిజట, “దీన్ని చూడండి!” అంది.
అందుకు సీత, “ఇది సన్నెకల్లు! ఇదా నువ్వు చెప్పవచ్చిన “ముఖ్యమైన విషయం?” అంది కాస్త విసుగ్గా.
ఇప్పుడు త్రిజట, “ఇది సన్నెకల్లే! కాని ఇది సాధారణమైన నన్నెకల్లు కాదు. దీనికొక ప్రత్యేకత ఉంది!” అని చెప్పింది.
ఇది విని సీత, “నువ్వు ఏమంటున్నావు? ఇదొక సన్నెకల్లు… దీన్లో అలా ఏం ప్రత్యేకత ఉంది?” అని అడిగింది.
త్రిజట అప్పుడు ఇలా వివరించింది: “ఈ సన్నెకల్లు మీద నూరిన దిమసుల సహజ వాసనలు అధికరించి ‘ఘుమఘుము’ వాసనలు వెదజల్లుతాయి. అంతేకాక దీనిపై నూరిన దినుసుల రుచి, గుణాలు ఇనుమడిస్తాయి.”
ఈ మాటలు విన్న సీతాదేవి మనస్సులో ‘శ్రీరామునితో నేను లంక నుండి అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ సన్నెకల్లును తీసుకుపోవాలి!’ అనే ఆలోచన మెదలింది.
కొత్త, వింత వస్తువులను చూసినప్పుడు సామాన్యంగా స్త్రీలకు జనించే ఆకాంక్ష, సన్నెకల్లు విషయంలో సీతకు అప్పుడు కలిగింది.
అచిర కాలంలోనే రాముడు లంకపై దండెత్తి రావణుణ్ణి హతమార్చాడు. లంక రాముని హస్తగతమైంది. తరువాత రాముడు లంకా రాజ్యాన్ని విభీషణునికి దానం చేసి, అతణ్ణి లంకకు రాజుగా, అభిషిక్తుణ్ణి గావించాడు.
విభీషణుని పట్టాభిషేక మహోత్సవం పూర్తికాగానే, అందరూ అయోధ్యకు బయలుదేరడానికి సన్నద్ధులయ్యారు. ప్రయాణ ఏర్పాట్లు హుటాహుటిన చెయ్యవారంభించారు.
అప్పుడు సీతాదేవికి ఆ సన్నెకల్లు విషయం జ్ఞాపకానికి వచ్చింది.
వెంటనే ఆమె హనుమంతుణ్ణి పిలిచి సన్నెకల్లును చూపింది. “ఆంజనేయా! ఈ సన్నెకల్లు ప్రత్యేకత గూర్చి త్రిజట మునుపు నాడ చెప్పింది” అంటూ త్రిజట చెప్పిన విషయం చెప్పి, మళ్ళీ సన్నెకల్లును మనం అయోధ్యకు మనతో తీసుకుపోవాలి. నువ్వు సంజీ పర్వతాన్ని పెకలించినప్పుడు చూపిన మోటుతనాన్ని చిన్నదైన ఈ సన్నెకల్లు మీద చూపితే ఇది పగిలి ముక్కలవుతుంది. కాబట్టి నెమ్మడిగా, జాగ్రత్తగా నేలనుండి ఈ సన్నెకల్లును పెకలించాలి.” అని ఆదేశమిచ్చింది.
వెంటనే ఆంజనేయుడు నేల మీద కూర్చుని, వేలలో పాతుకుపోయిన సన్నెకల్లును పెకలించడానికి దాని చుట్టూ మెల్లగా నేలను తవ్వసాగారు.
అప్పుడు అక్కడకు వృద్ధుడూ, అమిత గౌరవనీయుడూ అయిన జాంబవంతుడు వచ్చాడు.
ఆయన హనుమంతుడితో, “ఏమిటి? అందరూ అయోధ్యకు బయలుదేరబోతున్నారు! నువ్వెందుకు ఇప్పుడు. ఈ రాయిని. పెకలించడానికి తాపీగా ఇక్కడెందుకు కూర్చున్నావు?” అని ఆశ్చర్యపోతూ అడిగారు.
అందుకు హనుమంతుడు, “సేతాదేవి, ‘ఈ సన్నెకల్లును ఆయోధ్యకు తీసుకుపోవాలి! దీన్ని పగులకొట్టకుండా జాగ్రత్తగా పెకలించు’ అని ఈ పని పురమాయించింది. అందువల్ల జాగ్రత్తగా ఈ రాయిని తన్పి తీస్తున్నాను” అని జవాబిచ్చాడు..
ఆ జవాబు విని జాంబవంతుడు, “ఏమిటి? స్వయంగా సీతాదేవి అలా చెయ్యమని నీతో చెప్పిందా?” అని అడిగి, తిన్నగా సీతాదేవి వద్దకు వెళ్ళాడు.
సీతాదేవితో, జాంబవంతుడు, “అమ్మా! అక్కడ చూడండి…. అంజనేయుడు ఒక సన్నెకల్లును పెకలించడానికి కూర్చున్నాడు! అడిగితే. స్వయంగా మీరే ఈ పని చెయ్యమని చెప్పారు అని చెప్పాడు…” అన్నాడు.
అది విని సీతాదేవి, ‘నేను ఆంజనేయునికి పురమాయించిన పనిలో ఈ జాంబవంతుడు తల దూరుస్తున్నాడు!’ అని మనస్సులో అనుకొంది.
కాబట్టి ఆమె కాస్త కోపంతో,” ‘అది వింత సన్నెకల్లు’ అని త్రిజట నాతో చెప్పింది. అందుకే దాన్ని నేను అయోధ్యకు తీసుకుపోవడానికి పెకలించి తియ్యమని ఆంజనేయునితో చెప్పాను. ఇందులో ఏం తప్పు ఉంది?” అని అడిగింది.
వెంటనే జాంబవంతుడు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ, ‘అమ్మా, మీ పతిదేవుడు శ్రీరాముడు లంకను విభీషణుడికి దానంగా ఇచ్చివేశాడు. ఇది మీకూ తెలుసు.
“దానం ఇచ్చిన వ్యక్తి, దానం పుచ్చుకున్న వ్యక్తి నుండి ఏ వస్తువునూ మళ్ళీ పొందరాదు. ఒకవేళ దానం పుచ్చుకొన్న వ్యక్తి ఇష్టపడి ఏదైనా ఇవ్వగోరినా, దానం ఇచ్చిన వ్యక్తి ససేమీరా పుచ్చుకోకూడను. అలా పుచ్చుకుంటే, దానం చేసిన పుణ్యం హరించుకుపోతుంది.
అ విధంగా చూస్తే శ్రీరాముడు, విభీషణునికి దానం పొందిన గొప్ప పుణ్యాన్ని, ఈ అల్పమైన సన్నెకల్లు నశింపజేస అది భావిస్తున్నాను” అని వివరించి చెప్పాడు.
జాంబవంతుడు వినయంగా తెలియపరిచిన వాస్తవం సీ తక్కువ అవగతమైంది. కృతజ్ఞతాభావంతో ఆమె నయనాల చెమ్మగిల్లాయి.
అప్పుడు ఆమె జాంబవంతుడితో గద్గదస్వరంలో, సమయంలో మీరు ఇక్కడకు వచ్చి, నాకు వాస్తవాన్ని స్పష్టంగా తెలిసి పాప కార్యానికి పాల్పడకుండా నన్ను రక్షించారు. మా పుణ్యం వలన చెక్కుచెదరలేదు…” అని చెప్పింది.
అప్పుడు అక్కడకు వచ్చిన హనుమంతుడు నవ్వుతూ జాంబవంతుడితో, “చెప్పవలసిన వారికి, చెప్పే అర్హత గల వారు సముచిత రీతిలో చెప్పాలి. ‘కరిగించే వారు కరిగిస్తే రాయీ కరుగుతుంది. అంటారు. అది ముమ్మాటికీ సత్యమని మీ మూలంగా ఇక్క తెలుసుకున్నాను” అన్నాడు.
అది విని జాంబవంతుడు, హనుమంతుడితో, “నువ్వు వేసిన, కార్యదక్షుడవు అని రుజువుపరిచావు?” అన్నాడు ఆహ్లాదంగా నవ్వుతూ జాంబవంతుడు, సీతాదేవికి చెప్పిన వాస్తవం, హనుమంతుడికి ముందే తెలుసు.
అయినప్పటికీ, మాతృస్థానంలో ఉన్న సీతాదేవి అట్టకు ఎడుని. చెప్పడమూ, హితవు చెప్పడమూ ఇష్టపడని హనుమంతుడు వెంటనే ఆమె అజ్ఞను శిరసావహించడానికి పూనుకున్నాడు.
అంతేకాక హనుమంతుడు, వయస్సులో అందరికన్నా పెద్ద వాడైన జాంబవంతుడు దీన్ని గూర్చి సీతాదేవితో మాట్లాడడం సబబు అని భావించి, తాను కిమ్మనకున్నాడు.
హనుమంతుడి. ఈ చర్య ఆయనలో ఉన్న గొప్ప సంస్కారానికి అద్దంపడుతోంది కదా!