
వానర వీరులు సముద్రం మీద లంకకు వారధి నిర్మించే పనిలో మునిగి ఉన్నారు.ఆ సమయంలో, లంకలోని ఒక పర్వతాగ్రం మీద నిలబడి రావణుడు చూశాడు.
అప్పుడు అతడి పక్కన, భార్య మండోదరి ఉంది.
వానరులు సముద్రంలో శిలలను తెచ్చి వెయ్యడమూ, అవి మునిగిపోకుండా నీళ్ళపై తేలడమూ ఇద్దరూ గమనించారు.అందుకే,”వానరులు తెచ్చి పడవేస్తున్న శిలలు నీళ్ళపై తేలుతున్నాయి! అదెలా?” అని రావణుడు ప్రశ్నించాడు.
అందువల్లే మండోదరి, “వానరులు రామ నామం జపిస్తూ శిలలను సముద్రంలో పడవేస్తున్నారు. అందుకే ఆ శిలలు సముద్ర జలాలపై అలా తేలుతున్నాయి!” అని జవాబిచ్చింది.ఆ జవాబు విని రావణుడు, ” రావణుడు’ అని శిల మీద వ్రాసి వేస్తే, ఆ శిల కూడా నీళ్ళపై తేలుతుంది” అన్నాడు దర్పంతో.
ఇలా అంటూ, రావణుడు ఒక శిలను పుచ్చుకొని దానిపై ‘రావణుడు’ అని వ్రాసి, సముద్రంలో పడవేశాడు.తేలింది! అలా రావణుడు పడవేసిన శిల కూడా సముద్ర జలం మీదఅది చూసి మండోదరి ఆనందంతో ‘నా భర్త పేరు వ్రాసిన శిల కూడా నీళ్ళ మీద తేలింది! అలా అయితే నా భర్త పరాక్రమశాలి.
కీర్తిమంతుడూ’ అని మనస్సులో అనుకొన్నది.
తన మనస్సులో మెదలిన మాటను ఆమె, భర్తకు తెలపడం కూడా చేసింది.అందుకు రావణుడు, “నేను ఆ శిలపై ‘రావణుడు‘ అని నా పేరు వ్రాశాను. అప్పుడు నా మనస్సులో ‘రామ రామ’ అని రామనామం చెప్పుకుంటూ, రాముణ్ణి తలచుకొని నా పేరు వ్రాసిన శిలను సముద్రంలో వేశాను!” అని అసలు విషయం చెప్పాడు.
కర్ణాకర్ణిగా విన్న పై ఉదంతం రామనామ మహిమను వేనోళ్ళా చాటుతున్నది.
k