The Shocking Truth Behind Arjuna’s Chariot Burning in the Mahabharata

Arjuna.మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులకు విజయం దేకూరింది. దానిని సూచిస్తూ వీరులు శంఖ నాదాలు చేశారు.

ఈ స్థితిలో అర్జునుడు, ‘నా అసమాన అస్త్రశక్తి వల్లనే ఈ విజయం. లభించింది’ అని లోలోన గర్వించాడు.

అంతేకాక, ‘నాకు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే రథ సారధ్యం వహించాడు. అనే ఘనతా అర్జునుడి అహంకారాన్ని పెంచింది.

మహాభారత యుద్ధంలో ప్రారంభం నుండి చివరి వరకు అర్జునుడికి రథ సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు, అర్జునుడికి సేవకునిలానే ప్రవర్తించారు.

యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి రోజూ శ్రీకృష్ణుడు, అర్జునుడు. నాటి యుద్ధం సమాప్తం కాగానే సాయంత్రం శిబిరానికి తిరిగి

వెళ్ళేవారు. అప్పుడు, అర్జునుడు ముందుగా రథం నుండి దిగేవాడు. తరువాత కృష్ణుడు దిగేవాడు. ఇది అలవాటుగా పరిణమించింది.

ఈ అలవాటును, ఇప్పుడు యుద్ధం ముగిసిపోయినందున. అర్జునుడు మార్చ తలచాడు.

కనుక అర్జునుడు, “శ్రీకృష్ణా! ఈ రోజు రథం నుండి ముంద నువ్వు దిగు. ఆ తరువాత నేను దిగుతాను!” అన్నాడు.

కాని అర్జునుని విన్నపానికి కృష్ణుడు సమ్మతించలేదు. “అర్జునా తలవాడు ప్రకారం నువ్వే ముందు దిగ్గు!” అన్నాడు.

కాని శ్రీకృష్ణుడు చెప్పినట్లు చెయ్యడానికి అర్జునుడు ఇష్టపడలేదు.

అయినప్పటికీ శ్రీకృష్ణుడు పదే పదే బలవంతపెట్టడంతో, అయిష్టంగానే అర్జునుడు రథం నుండి ముందు దిగాడు.

అర్జునుడు రథం దిగిన తరువాత, మెల్లగా శ్రీకృష్ణుడు కూడా దిగాడు.krishna

శ్రీకృష్ణుడు రథం దిగడమే ఆలస్యం, అర్జునుడు చూస్తూ ఉండగానే అంతవరకు రథ కేతనంలో ఆసీనుడై ఉన్న హనుమంతుడు అక్కణ్ణుండి మటుమాయమయ్యాడు. అంతే! హఠాత్తుగా రథంలో మంటలు లేచి క్షణాల్లో రథం నామరూపాలు లేకుండా దగ్ధమైపోయింది.

అది చూసి అర్జునుడికి ముచ్చెమటలు పట్టాయి. కంగారుగా అతడు, “శ్రీకృష్ణా! రథం ఎందుకిలా అర్ధంతరంగా మంటలో దగ్ధం అయిపోయింది?” అని అడిగాడు.

అందుకు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు:

“యుద్ధంలో ద్రోణుడు, కర్ణుడు వంటి వీరాధివీరుల శక్తిమంతమైన బాణాలు, ఆయుధాలు రథాన్ని తాకాయి. అందువలన రథంలో అగ్ని ప్రవేశించింది. ఇంతవరకు నేను రథంలో కూర్చుని ఉన్నందున, రథాన్ని అగ్నిదేవుడు ఏం చేయకుండా నిర్లిప్తంగా ఉండిపోయాడు;

ఆ ఆయుధాల శక్తి ప్రభావం అణగి ఉండిపోయింది. ఇప్పుడు మహాభారత యుద్ధం ముగిసింది. ఇక నేను రథంలో కూర్చోబోనని గ్రహించి, రథంలో నిద్రాణమై అణగి ఉన్న శక్తి జాగృతమై, విజృంభించి రథాన్ని దగ్ధం చేసివేసింది.”

శ్రీకృష్ణుడు చెప్పిన వివరణను విని, ‘తన వల్లనే విజయం లభించింది’ అనుకొన్న అర్జునుని అహం అంతరించింది.

అంతే, అతడు శ్రీకృష్ణుడితో, “నన్ను క్షమించు కృష్ణా!” అంటూ చేతులు జోడించాడు.

భగవంతుడి అనుగ్రహం వలననే మన జీవితాల్లో ప్రతి సంఘటనా జరుగుతుంది. దీనిని అజ్ఞానం కారణంగా మనం, “మనం చేశాం, మనం చేశాం!” అంటూ గర్వంగా చెప్పుకొంటాం.

‘ఆయన ఆజ్ఞ లేనిదే అణువు కూడా కదలదు, భగవంతుని చేతల వలననే సమస్తమూ జరుగుతున్నది’ అనే వాస్తవాన్ని అనుభూతిలో గ్రహించిన వారు జీవన్ముక్తులు,

Leave a Comment