Real Happiness Comes from Mindful Restraint, Not Rare Attractions

The emotional pull of the golden deer symbolized hope, wonder, and longing, yet lacked true fulfillment

మహాత్ముడైన ఏకనాథ్ మహారాష్ట్రకు చెందిన భక్తాగ్రేసరుడు.

ఆయనకు ఒకసారి రామేశ్వరానికి వెళ్ళి, అక్కడ వెలసి ఉన్న రామనాథస్వామిని ఆరాధించాలని ఆకాంక్ష కలిగింది.

రామనాథస్వామిని ఆరాధించడానికి మునుపు ఆయన ప్రయాగ సందర్శించాడు. అక్కడ గంగా యమునా సరస్వతీ నదులు సంగమం అయ్యే త్రివేణీ సంగమంలో, రామనాథస్వామికి అభిషేకం చేయడానికి ఆ పావన జలాన్ని తీసుకున్నాడు.

తరువాత ఆ పావన జలం గల పాత్రను కావడిలా తన భుజాల మీద మోసుకుని, కాలినడకన రామేశ్వరానికి బయలుదేరాడు.

చాలా రోజుల కాలినడక పయనం తరువాత చివరికి ఆయన రామేశ్వరం సమీపించాడు.

అది మండుటెండల వేసవి కాలం.

అక్కడ ఒక గాడిద నేలమీద పడిపోయి విపరీతమైన దప్పికతో తల్లడిల్లిపోవడం ఏకనాథ్ కంటపడింది; అలా వదలివేస్తే కాసేపట్లో అది చనిపోవడం తథ్యం. ఏక్నాధ్ క్షణం కూడా ఆలోచించలేదు.

వెంటనే ఆయన తను ప్రయాగనుండి అంత ప్రయానపడి తీసుకువచ్చిన త్రివేణీ సంగమ జలాన్ని మరణావస్థలో ఉన్న ఆ గాడిన నోట్లో ఎంతో అక్కరతో పోశాడు; దైవప్రార్ధన చేశాడు.

అంతే! ప్రాణాధారమైన నీరు నోట్లోకి జాలువారగానే, సృత్యుగహ్వరంలో తల్లడిల్లిపోతున్న ఆ గాడిదకు పోయిన ప్రాణం వచ్చినట్లయింది; దాని ప్రాణం నిలిచింది. కాసేపు అది సేదతీరి, లేచి వెల్లగా నడుస్తూ తన దారిన తాను వెళ్ళిపోయింది.

రామనాథస్వామికి అభిషేకం చేయడానికనే ప్రయాగ నుండి అతిప్రయాసతో తీసుకు వచ్చిన త్రివేణీ సంగమ పావన జలాన్ని మహాభక్తుడైన ఏకనాథ్, గాడిద దప్పిక తీర్చడానికి వినియోగించాడు!

ఈ చర్య వలన రామేశ్వరంలో వెలసిన రామనాథస్వామికి అ పావన జలంతో అభిషేకం చేసి ఉంటే ఎంతటి ఆత్మతృప్తి పొంది దో, అంతకన్నా ఎక్కువ ఆత్మతృప్తిని ఏజానాథ్ పొందాడని విడిగా చెప్పకరలేదు.

Leave a Comment