Can Destiny Be Changed?Power of Effort and Free Will

Destiny ఒక రాజు తన వీరులతో అరణ్యంలోకి వేటాడడానికి వెళ్ళాడు. ఏదో వింత శబ్దంతో కూస్తున్న ఒక పక్షి రాజు కంటపడింది. రాజు సైనికులలో పక్షి భాష తెలిసిన ఒక సైనికుడు ఉన్నాడు. రాజు ఆ సైనికుణ్ణి పిలిచి, “అ పక్షి ఇప్పుడు ఏం చెప్పింది?” అని ప్రశ్నించాడు. అందుకు ఆ సైనికుడు, “రాజా! ఆ పక్షి మనలను గురించి ఏమీ చెప్పలేదు. ఈ దారిగుండా ఒక రైతు వెళతాడు, అతడు ఈ రోజు పాము కాటుతో … Read more

The Fox’s Healing Advice – Wisdom from a Folktale

Fox’s ఒక మహారణ్యంలో ఒక సింహం రాజులా జీవిస్తోంది. ఆ సింహానికి ఆహారంగా, తక్కిన జంతువులు నిత్యం మాంసం తెచ్చి. ఇస్తూండేవి. అందువలన ఆ సింహం తన ఆహారం నిమిత్తం అక్కడకు ఇక్కడకు వెళ్ళకుండా, ఒకే చోటనే తిష్ఠవేసి ఉండిపోయింది. ఈ స్థితిలో బాగా బలిసిపోయి, కొవ్వుపట్టిన ఆ సింహానికి కూర్చున్న చోటునుండి లేవడానికి కూడా సాధ్యం కావడం లేదు. ఇలా ఉండగా ఒక రోజు ఆ సింహం, తన వద్దకు వచ్చిన నక్కతో ఇలా చెప్పి … Read more

Life and Teachings of Lord Sri Krishnachandra

గోపేశ్వర శివాలయం ఉన్న ప్రదేశంలో ‘లాలాబాబా మందిర్’ ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 1810లో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణచంద్రుడనే ఒక రాజు నిర్మించాడు. ఆయన బృందావన రాకకు నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఒరిస్సాలో ఒక చిన్నరాజ్యానికి శ్రీకృష్ణచంద్రుడు రాజు. సుఖభోగాలలో మునిగి తేలడమే జీవిత లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒక రోజు కొద్దిదూరంలో ఉన్న గ్రామంలో ఏవో పనులు చక్కబెట్టడానికి శ్రీకృష్ణచంద్రుడు వెళ్ళాడు. సాయంత్రం ఆయన … Read more

Real Happiness Comes from Mindful Restraint, Not Rare Attractions

The emotional pull of the golden deer symbolized hope, wonder, and longing, yet lacked true fulfillment మహాత్ముడైన ఏకనాథ్ మహారాష్ట్రకు చెందిన భక్తాగ్రేసరుడు. ఆయనకు ఒకసారి రామేశ్వరానికి వెళ్ళి, అక్కడ వెలసి ఉన్న రామనాథస్వామిని ఆరాధించాలని ఆకాంక్ష కలిగింది. రామనాథస్వామిని ఆరాధించడానికి మునుపు ఆయన ప్రయాగ సందర్శించాడు. అక్కడ గంగా యమునా సరస్వతీ నదులు సంగమం అయ్యే త్రివేణీ సంగమంలో, రామనాథస్వామికి అభిషేకం చేయడానికి ఆ పావన జలాన్ని తీసుకున్నాడు. తరువాత … Read more

Sita Devi’s Desire for the Golden Deer: A Timeless Lesson on Illusion and Destiny

శ్రీమత్ వాల్మీకి రామాయణం, తులసీ రామాయణం, కలల రామాయణం, రంగనాథ రామాయణం మొదలైనవి రామాయణాలలో ఇవే కాక భారతీయ భాషలన్నిటిలోనూ కవులు రామాయణాలను రచించి ఉన్నారు. వాటిలో వంగ భాషలో కృత్తివాస్ రచించిన ‘కృత్తివాస’ ‘రామాయణం’ కూడా ఒకటి. దాన్లో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇక్కడ మనం చూడబోతున్నాం. సీతాదేవిని రావణుడు అశోకవనంలో నిర్బంధించి ఉంచాడు. ‘అశోకవనంలో పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న సీతాదేవికి విభీషణుని కుమార్తె అయిన త్రిజట అప్పుడప్పుడు వచ్చి సాంత్వన చేకూరుస్తూ … Read more

The Minister’s Wise Counsel blends common governance advice

ఒక అపార ఐశ్వర్యవంతుడి వద్ద బుద్ధిమంతుడనే బానిస ఒకడు పని చేస్తుండేవాడు. ఈ బానిస విశ్వాసంతో, నిజాయితీతో, యజమానిని సేవిస్తూ వచ్చాడు. దాంతో యజమాని ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఆనందభరితుడైన ఆ యజమాని, తన బానిస అయిన బుద్ధిమంతుడికి స్వతంత్రం ఇచ్చాడు. అంతేకాక అతడు బుద్ధిమంతుడికి ఒక ఓడ నిండా సరకులు నింపి ఇచ్చి, ఇలా అన్నాడు: “ఈ ఓడ, దాన్లోని సరకులు ఇకపై నీ సొంతం. ఈ సరకులను నువ్వు విదేశాలకు … Read more

A Lesson from a Sparrow reveals moments, awareness, and powerful guidance.

Sparrow’s Lesson యువకుడొకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు. అతడు జ్ఞానితో, ఇలా చెప్పాడు: “అయ్యా, ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు. ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు. కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చూసుకుంటాను. అందునిమిత్తం నేడే నేను మన ఊళ్ళోనుండి బయలుదేరుతున్నాను. “నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి, అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి.” అలాగే ఆ యువకుణ్ణి, … Read more

The Magic of Krishna blends common reality

krishna శ్రీకృష్ణుని దర్శనార్థం ఒకసారి నారదుడు ద్వారకకు వెళ్ళాడు. తనకు ప్రణమిల్లిన నారదుని, శ్రీకృష్ణుడు ఆశీర్వదించాడు. తరువాత వారిద్దరూ మాట్లాడుకుంటూ వాహ్యాళికి వెళ్ళారు. అప్పుడు నారదుడు, “శ్రీకృష్ణా! నీ మాయ అమిత శక్తిమంతమైనదని అందరూ చెప్పుకుంటున్నారు. అది నిజమా? నన్ను అందరూ దేవర్షి అని సంబోధిస్తున్నారు. బ్రహ్మజ్ఞాని అయిన నన్ను నీ మాయ ఏం చెయ్యగలదు? మాయకు నేను వశవర్తిని అవుతానా?” అని అడిగాడు. అది విన్న శ్రీకృష్ణుడు, నారదునికి సూటిగా జవాబివ్వకుండా కాస్త దూరంలో ఉన్న … Read more

Dommari Vaadu Vinyasalu – Amazing Traditional Acrobat Show

ఒక ఊళ్ళో ఒక దొమ్మరివాడు ఉండేవాడు. అతడు వీధుల్లో గడకట్టి దాని మీద విన్యాసాలు ప్రదర్శిస్తూండేవాడు. అతడు ఊళ్ళు తిరుగుతూ తన విన్యాసాలు జనులకు ప్రదర్శించి చూపుతుండేవాడు. అందుమూలంగా వచ్చే కొద్దిపాటి రాబడితో జీవించసాగాడు. అతడు ఒక రోజు ఒక ఊళ్ళో, జనులు ఎక్కువగా సంచరించే చోట, గడకట్టి తాడు మీద నిరాధారంగా నడుస్తూ విన్యాసాలు ప్రదర్శించసాగాడు. విన్యాసాలు ఇప్పుడు అతడు తన చేతిలోకి ఒక ఇనుప వలయాన్ని తీసుకున్నాడు. “ఈ ఇనుప వలయంలోకి ఇప్పుడు నేను … Read more

Patience brings its own rewards in life through growth, strength, and success

The Fruit of Patience challenges of life.ఒక ఊళ్ళో కొత్తగా వినాయకుని గుడి నిర్మించారు. ఆ రోజు ఆ ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఆ ఉత్సవంలో ఊరి జనులే కాక, బైట ఊళ్ళనుంచి కూడా వేలాదిమంది వచ్చి పాల్గొన్నారు. దాంతో రోజంతా ఆలయంలో జనం కిటకిటలాడారు. జనం వరుసక్రమంలో గర్భగుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రాసాగారు. ఆ రాత్రి ఆలయ అర్చకులు, పనివారు తలుపులకు తాళం వేసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక ఆలయంలో … Read more