“When Faith Holds You, Life Stops Hurting”

ఒక ఊళ్ళో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిలో ఒకరు పరమ ఆస్తికుడు, మరొకడు పరమ నాస్తికుడు.“When Faith Holds You ,Life Stops Hurting”

ఈ ఆస్తికుడు గొప్ప శివభక్తుడు. సదా సర్వవేళలా శివనామ జపం చేస్తుంటాడు, shiva pooja నిర్వహిస్తుంటాడు, శైవ గ్రంథాలు పఠిస్తుంటాడు; మొత్తానికి సమస్తం అతడికి శివమయంగా ద్యోతకమయ్యేది.

ఇక నాస్తికుడి సంగతి చూద్దాం. ఇతడికి భగవంతుని పట్ల కించిత్తుకూడా నమ్మకం లేదు.

ఆస్తికుడు భగవంతుని గురించి చెప్పే విషయాలను నాస్తికుడు ససేమిరా అంగీకరించడు.

నాస్తికుడు భగవంతుని గురించి చేసే విమర్శలను ఆస్తికుడు తీవ్రంగా ఖండించే వాడు.

ఇలా ఉండగా ఈ మిత్రులు ఇద్దరూ ఒక ఫలానా చోటుకు కాలినడకన వెళుతున్నారు.

దారిలో ఆస్తికుడి కాలికి ఒక కంకరరాయి వల్ల ఎదురుదెబ్బ తగిలి, గాయం అయింది.

గాయానికి కట్టుకట్టుకుని మళ్ళీ ఇద్దరూ తమ పయనం సాగించారు. అప్పుడు దారిలో నాస్తికుడికి వెయ్యి రూపాయల నోటు దొరికింది.

అటువంటి నీకు ఏం జరిగిందో చూశావా? కాలికి ఎదురు దెబ్బ తగిలి గాయం అయింది. దైవ నమ్మకం వల్ల ఒరిగిన లాభం పరిహాసంగా చెప్పాడు.

దేవుడు లేడు, దేవుడు లేడు’ అని ఘంటాపథంగా చెప్పే నాకు వెయ్యిరూపాయల లబ్ధి. దీనినుండి భగవంతుడు లేడు’ అనే నాస్తిక భావనే ఉన్నతమైనదని నువ్వు గ్రహించుకో…” అని తర్క ధోరణిలో అన్నాడు.

నాస్తికుడి మాటలు విన్న ఆస్తికుడికి విచారం పట్టుకుంది.

నాటి రాత్రి ఇద్దరూ ఒక చోట బస చేశారు. భోజనానంతరం నిద్రకు ఉపక్రమించారు.

ఆస్తికుడి కలలో సాక్షాత్తు పరమశివుడు కనిపించి ఇలా చెప్పాడు: ‘ఒక కంకరరాయి వల్ల ఎదురుదెబ్బ తగిలిందని నువ్వు విచారించకు! నేడు ఒక కాలసర్పం కాటుతో నువ్వు, మరణించి ఉండవలసింది. నీకు నా పట్ల గల అచంచల భక్తివిశ్వాసాల కారణంగా, కాలసర్పం కాటుకు బదులుగా కంకరరాయి తగిలి కిందపడ్డావు!

“నీతో ఉన్న నాస్తికుడికి, నేడు కోట్ల విలువైన ఒక పెద్ద నిధి లభించి ఉండాలి. కాని అందుకు మారుగా అతడి నాస్తిక పోకడ కారణంగా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే లభించాయి.”

Leave a Comment