పరీక్షిన్నరేంద్రా! కల్పాంతంనాటి విషయం.
ఆ రోజులలో సత్యవ్రతుడనే రాజు ధర్మబద్ధంగా రాజ్యపాలవంచేస్తూ, ఒక సంవ త్సరకాలం శ్రీహరిధ్యానంలో గడిపాడు. తీసుకున్నాడు. ఆ సంవత్సరం అంతా ఆయన నీరే ఆహారంగా
అలా ఉండగా ఒకవాడాయన నదీస్నానం చేసి హరిప్రీతిగా జలతర్పణంచేసే సమ యంలో ఆయన దోసిలిలో ఒక చేపపిల్ల కనిపించింది.
కనిపించిన క్షణంలో దానిని జారవిడిచాడు.
పదీజలంలో పడ్డ చేపపిల్ల:
మహారాజా! ఈవదిలోని పెద్దచేపలు చిన్నవాటిని కబళినున్నాయి. వాటికి భయ పడి నేను నీ దోసిటపడ్డాడాను.
నన్ను రక్షించకుండా యిలా విడిచిపెట్టడం న్యాయమా! ఒక వేళ చేపలబారితప్పినా, జాలరులు వల పన్ని హింసిస్తారు, అనగా ఆ రాజు కరుణించి, దానిని తన కమండలంలోవుంచి యింటికి తీసుకువెళ్ళాడు.
తెలతెలవారుతూండగా ఆ చేప తన కి చిన్నపాత్ర విశాలంగా లేదంది. అప్పు డాయన మరింత పెద్ద పాత్రలో విడిచాడు. విడిచిన క్షణకాలంలో ఆ పాత్రకూడా చాలలేదు.
దానిని చిన్నకొలములో విడిచాడు. అంతకంతకు అది పెరుగుతూంటే, దానిని సముద్రంలో వదలిపెట్టాడు.
అప్పుడది : రాజా! నన్నీ మొనళ్ళగుండంలో వదలివెడతావా, అనగా సత్యవ్రతుడు: క్లేశాలలో వున్న భక్తులను రక్షించడానికి ఈ అవతారం ధరించిన శ్రీహరీ! నీకు నమస్కారం.
ఇంతకూ ఈ అవతారకారణం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అనగా
శ్రీమన్నారాయణుడు :
రాజా ! నేటికి ఏడురోజులలో బ్రహ్మకు వగలుపూర్తికానున్నది. అప్పుడు ప్రళయం వస్తుంది. అప్పుడొక పెద్దనావ వస్తుంది, దానిలోసర్వబీజాలూ, ఓషధులూ నింపి నవ్వు ఈ జలరాఃలో తిరుగుతూవుండు. అందులోనే నవర్తులూ నీతో వుంటారు. దాని రక్షణభారం నాది. అందుకే ఈ అవతారం ధరించాను, అని అదృశ్య మయాడు హరి.
శ్రీహరినే ధ్యానిస్తూ ఆరాజు దర్భాసనంమీద కూర్చున్నాడు. సమయానికి ఆకాశ మంతా కారుమేఘాలతో నిండింది. కుంభవృష్టి నిర్విరామంగా కురిసింది. సముద్రం చెలియలికట్టదాటి భూగోళాన్ని ముంచెత్తింది.
బ్రహ్మ నిద్రలో ఉండగా వెలువడిన వేదాలను హయగ్రీవుడనే దైత్యుడు అవహరించాడు.
అప్పటికే నిఖిలబీజాలనూ, ఓషధులనూ నావలో భద్రపరచి, మహావిష్ణువు మహా మత్స్యా కృతిధరించి రాక్షసుడు దాగిన జలరాశి మధ్యానికి వెళ్ళాడు.
ఎక్కాడు. నావను చూచిన సత్యవ్రతుడు శ్రీహరి అజ్ఞానుసారం సవర్ణులతో ఆనావలోఅందరూ అధివసించిన ఆనావకు రక్షణ కల్పించిన శ్రీహరిని సత్యవ్రతుడు అనేక విధాల స్తుతించగా, మహావిష్ణువు వారందరికీ బ్రహ్మస్వరూపాన్ని తత్వరహస్యాలతో విశదం చేశాడు.
ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వివస్వంతుడనే పేర వెలిగే నూర్యుని కుమారుడుగా పుట్టి వైవస్వతమనువుగా ప్రఖ్యాతు డయాడు.
అప్పుడు శ్రీమన్నారాయణుడు సముద్రంలోపలకు పోయి అక్కడదాగిన దుష్టదైత్యుని సంహరించి వేదాలు అందుకున్నాడు.
ప్రళయకాలం పూర్తి అయింది.
కాళరాత్రి ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూసే మునీంద్రుల హృదయాలు సంతోషంతో విచ్చుకున్నాయి. సరస్వతీదేవి తన శయ్యామందిరం వీడివచ్చింది.
ప్రజాపతి తన అవయవాలన్నీ కదలించి, ఒక్కసారి ఆవులించి, కన్నులువిచ్చి, లేచి కూర్చున్నాడు.
ఆసమయాన శ్రీహరి వేదాలు తెచ్చి బ్రహ్మకందించాడు, అని అష్టమస్కంధం ముగించాడు శుకయోగీంద్రుడు.
దివిజ రిపు విదారీ! దేవలోకోపకారీ భువనభర నివారీ, పుణ్యరక్షామసారీ!
ప్రవిమల శుభమూర్తీ బంధుపోషప్రవర్తీ
ధవళ బహుళకీర్తీ, ధర్మ నిత్యానువర్తీ .Matsya Avatar

Exalent
thank u
Thank you
Thank you