Think Smart, Act Practical: A Guide to Success
అనువర్తనం ఒక కళ. అది మన గెలుపు ఓటములకు మన పురోగమన తిరోగమనాలకు సంబంధించినది.
మీకు అనువర్తించుకోవడం అనేది నిజంగా తెలిస్తే మీరు మీ చైతన్యాన్ని విస్తరించుకోగలరు. పరిస్థితులకు అనుగుణంగా మెలగగలరు.
అనేకానేక పరిమితులని అధిగమించి క్రమంగా అపరిమిత అభివృద్ధిని సాధించగలరు. ఇది పాఠశాలలు, కళాశాలలు విశ్వవిద్యాలయాలలో బోధించని విషయం. దీనిని ప్రజలకు బోధించడం కోసం మనం ఏమైనా చేయాలి.
అనువర్తనానికి మూడు దశలున్నాయి. ఒక దానిలో మీరు సాధారణ ప్రజలకు సాధారణ సన్నివేశాలకు ఇబ్బంది కలిగించే, వినాశనానికి దారితీసే పరిస్థితులకు అనువర్తించుకుంటారు.
అక్కడ ఇమిడిపోతారు. అయితే ఆ ఒప్పుకోలు మీ వినాశనానికి దారి తీస్తుంది. అక్కడ మీ ఆకాంక్ష లేదు మీ లోపలి సామర్ధ్యాలను మీరు వెలికి తీసుకోవడం లేదు. కష్టాలను ఎదుర్కొని అధిగమించడం లేదు.
మిమ్మల్ని మీరు కోల్పోయి గుంపును అనుసరిస్తున్నారు. ఇది మొదటి రకపు అనువర్తనం.అనువర్తనపు రెండవ దశ భిన్నమైనది. సౌందర్యభరితమైనది.
మిమ్మల్ని మీరు నూతన దర్శనాలకు, నూతన ఆకాంక్షలకు, నూతనజ్ఞానాలకి, నూతన చైతన్య స్థాయికి, నూతన స్థాయి క్రమశిక్షణకు, నూతన వెల్లదులకు అనువర్తించుకుంటారు, దీనికి నిజంగా సాహసం, త్యాగం, శ్రమ, ధైర్యం, తెగువ ఉండాలి.
మూడవ రకపు అనువర్తనం అనేది బంధం కలుపుకోవడానికి చెందినది. సహాయం అవసరమైన వారితో మిమ్మల్ని మీరు అనువర్తించుకుని.
వారికి అవగాహనను అందించి శ్రమించేటట్లు చేసి ఒక ఉన్నత విషయంతో ముడిపెడతారు. వారి స్థాయిని పెంచి నూతన దర్శనాలను, నూతన నియమాలను లేదా ఉన్నత ఉనికి యొక్క ఉన్నత తలాలతో అనువర్తించు కునేటట్లు చేస్తారు.
అనువర్తనం అనేది మీ వాహనాలు (శరీరాలు), పరిస్థితులు, సందర్భాలపై సచేతనమైన అదుపు సాధించడానికి చేసే కృషిమీరు సరికాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానిని శాపంగా భావిస్తారు. మీ భౌతిక, ఉద్వేగిక మానసిక శరీరాలు సంక్షోభానికి గురి అవుతాయి.
అయితే ఇది నేను దాటగలను, నా చైతన్యాన్ని విస్తరించుకోగలను, నేను క్లిష్టమైన విషయాల సమస్యలపై విజయం సాధించగలను అని చెప్పుకోండి.ఇది మనకు ఎవరూ చెప్పరు, మనమే చెయ్యాలి.
మనం పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతాం. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం మీ ప్రస్తుత పరిస్థితి ఇప్పటికిప్పుడు ఉండవలసిన విధంగానే ఉంది అని తెలుసుకోండి,
ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితులో నేను ఎందుకు ఇమడలేకపోతున్నాను అని ప్రశ్నించుకోండి. దాని ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకొని, పునరానువర్తించుకొని తిరిగి సృష్టించుకుంటున్నారు.
అనువర్తన అనేది ఆచరణాత్మక పాఠం. మీకు ఎదురైన పరిస్థితులలో మిమ్మల్ని మీరు ఇముడ్చుకోవడం ద్వారా జీవితంలో గొప్ప అవకాశాలు వస్తాయి.మార్మిక జీవితం అంటే మర్మంతో జీవించటం కాదు.
మీ బాహ్య జీవితం, అంతర్ జీవితం ఒకటే అనుకోండి.
అంతర్ జీవితం పూర్తిగా భిన్నమైనది. మీరు అంతర్ భావాలు, దర్శనాలు, వెల్లడులను అనువర్తించుకున్నపుడు కేవలం మీ ప్రకృతిని మార్చుకోవటమే కాక మీ గొప్పతనాన్ని కూడా వాస్తవీకరించుకుంటున్నారు.
బాధలు, ఇబ్బందులు సమస్యలు పడుతూ వాటిని పరిష్కరిస్తూ సమత్వంలోకి తేవడమే గొప్పతనం. అనువర్తన పరీక్షలకు లోనుకాకుండా నువ్వెలా గొప్పవాడివి కాగలవు.
మీ గొప్పతనం అనేది అసాధ్యమైన విషయాలను చేయటం పై ఆధారపడి ఉంటుంది.
అసాధ్యాలను సుసాధ్యం చేసే వ్యక్తులనే మేధావులని అంటారు. మీరు మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగించే మేధాశక్తితోను, సంభాషణా సృష్టితోను అనువర్తనం జరుగుతుంది.
సమాచారం నెరపటం ఎంతో కష్టం కనుక ముందుగా చేయవలసింది సమాచార సృష్టే.
అనువర్తన అనేది మీరంతకు ముందు చేయని పనులు చేసేటట్లు చేస్తుంది. మీరు అనువర్తించుకోవలసిన విషయాలు ఉన్నతంగా ఉండాలి.
మీ స్థాయికి మించి సవాలు విసిరేటట్లు ఉండాలి. అప్పుడే పురోగమనం, అభివృద్ధి సాధ్యం. మనం ఎప్పుడూ మన ఆహారాన్ని ఉన్నత మూలాల నుంచి స్వీకరించాలి.
అప్పుడు శరీరం చిన్నదిగా ఉండవచ్చు కాని ఆత్మ చైతన్యం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది.
మీరు మీ లోపల ఉన్న నిధిని కనుగొని దానిని తవ్వి తీసి ఉపయోగించుకోవటంతో మీరు ఇప్పుడు ఉన్నదాని కంటే ఎంతో ఉన్నతంగా ఉండగలరు.
అది పరిణామపు నిజమైన పురోభివృద్ధి.”గొప్ప అధినేతలందరు అత్యున్నతమైన దాని కోసం తరాల తరబడి ఆకాంక్షించిన వారే” అని గొప్ప అధినేత ఒకరు తెలిపారు. కృష్ణుడు వంటి గొప్ప ఉపదేశకులు మరికొందరు గొప్ప నాయకులు రెండు విధాలుగా అత్యున్నతంగా అత్యల్పంగా తమను తాము అనువర్తించుకుంటూ.
అత్యల్పమైనది అత్యున్నతమైనదానిని చేరటానికి అత్యున్నతమైనది క్రిందికి దిగి వచ్చి ఆ క్రిందివి మార్పు చెందడంలో తోడ్పడటానికి వారధిలాగా తమను తాము అనువర్తించుకుంటారు.మీరు మీ జీవితాన్ని ఆ విధంగా జీవించండి. ముందుగా మీ నియమాలు, దర్శనాలను అనువర్తించుకుని ఆ తరువాత ప్రజలను మీ నియమాలకు గాక వారి స్వీయ నియమాలను అనువర్తించుకునేటట్లు ప్రయత్నించటం ద్వారా మీరు అనువర్తనపు నిజమైన కళను, విజ్ఞానాన్ని నేర్చుకుంటారు.
మనం చేసే పొరపాటు అదే. అందరూ మన నియమాల ప్రకారం ఉండాలనుకోవటం. కాని మన ఇచ్చకు ఎదుటివారు బానిసలైతే వారు ఎలా అభివృద్ధి చెందగలరు.
ప్రజలు అభివృద్ధి చెందడానికి వారిని స్వేచ్ఛగా వదలాలి. నిజమైన నాయకులు మీరు వారిలాగా ఉండాలనుకోరు. వారు మిమ్మల్ని మీ అంతరాత్మకు తగిన విధంగా తయారు చేస్తారు. మిమ్మల్ని మీ వైపుకునడిపిస్తారు.
మిమ్మల్ని మీరు అత్యున్నత నియమాలు అనువర్తించు కోవటంలో తోడ్పడుతారు.ఒక పక్కన మనం మన మనో స్థితిని, ఆలోచనా విధానాన్ని యథాతథంగా ఉంచి అభివృద్ధి చెందామని భావిస్తూ ఎదుటి వారిని ప్రత్యక్షంగా వంచించకుండా, మోసం చేయకుండా లక్షలాది మందిని రేడియోలు, టెలివిజన్ ద్వారా మోసం చేస్తున్నాము. మన అనువర్తన సరియైనదైతే మన ఆలోచన ఆ విధంగా ఉండదు.
మనం అనువర్తించుకోవలసిన విషయాలు:
1. ఒక నూతన ప్రవర్తన నియమావళి
2. నూతన పరిస్థితి
a) తక్కువ మాట్లాడటం
b) తక్కువ తినడం
c) గాఢ బంధాలు లేకపోవడం
d) ఎక్కువ ఎరుకతో ఉండటం
e) మరింత ఎక్కువ శక్తితో నిజాయితీతో, ధైర్య సాహసాలతో ఉండటం
f) ఎక్కువ గంటలు పని చేయగలగడం
g) ఎక్కువ కరుణ, సహనం, పవిత్రత, నైపుణ్యం స్వీయ అదుపులు కల్గి ఉండటం
h) సున్నితత్వంతో పొదుపరి తనంతో వ్యవహరించటం.
అనువర్తించలేని వారు దిగజారిపోతారు. అనువర్తనం అనేది భౌతికలోకంలోనే కాక ఉన్నత లోకాలలో కూడా కొనసాగే విధానం.
అది మీ చైతన్యాన్ని విస్తరించి నూతన వాహనాలను నిర్మించుకోవడానికి మీరు.అనువర్తనం మన చైతన్యాన్ని విస్తరించి మనలోపలి నూతన సామర్థాలను వెలికి తీస్తుంది. అనువర్తన నియమం, పొదుపు నియమంతో సంబంధంలో ఉంటుంది. అలా కాకపోతే వారు శక్తిని, సమయాన్ని, పదార్థాన్ని వృథా చేస్తారు.
అనువర్తనా నియమం ప్రతి తలంలోను, ఒక తలంలోనూ పరమాణువుల చలనాన్ని అదుపు చేస్తుంది.ఒక ఉన్నతశక్తికి అనుగుణంగా ఒక శక్తి విభాగంగా ఒక రూపాన్ని ఒక వ్యవస్థను ఎంపిక చేసుకొని దానిని సహకారంతో ఐక్యతతో ఒక మహాశరీరంతో కానీ, ఉనికితో కానీ సర్దుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
అనువర్తనంలో వ్యక్తి తన కొరకు సృష్టించబడిన అనుగుణ్య పరిస్థితులలో ఇముడుతాడు.సాధ్యతల విధానం. అది సమగ్రత ద్వారా తక్షణ ఫలితాన్నిస్తుంది.
అనువర్తన క్రమంలో అనువర్తనను నిరోధించటానికి ప్రయత్నించే ఇబ్బందికర శక్తులన్నింటితోను మీరు పోరాడాలి.
ఆ క్రమంలో మీకు పరిస్థితులు సంఘటనల పై అదుపు ఉంటుంది. ఆనువర్తన నియమం మీ చైతన్య స్థాయిని పెంపొందించి మీ వ్యవస్థను, ఉన్నత అభిప్రాయాలు, దర్శనాలు, లక్ష్యాలు, నూతన తలాలు, నూతన పౌనఃపుణ్యాలకు చేరే సవాళ్ళు విసురుతుంది. ఈ క్రమంలో మీ శరీరాలు, జీవితం తప్పని సరిగా మార్పు చెందుతాయి.“Think Smart, Act Practical: A Guide to Success”