“Unlock Spiritual Energy on Maha Shivaratri with ‘Om Namah Shivaya’”

Om Namah Shivaya

“నమ శ్శివాయ”మహాశివరాత్రి – ఆధ్యాత్మికస్పూర్తిమాఘబహుళచతుర్దశినాటి అర్ధరాత్రికాలమున పరసు శివుడు కోటిసూర్యకాంతులతో లింగరూపమున ఆవిర్భవించినాడు.

కనుక ఈనాటి అర్ధరాత్రినుండి చతుర్దశి ఉన్నప్పుడే మహాశివరాత్రి.

ఈ మాఘమాససంబంధమువలెనే ప్రతిమాసమునను బహుళచతుర్దశి ‘మాసశివరాత్రి’ అయినది. మహా శివముగల రాత్రి – మహాశివునియొక్క రాత్రి -మహాశివరాత్రి, శివు డనగా – బ్రహ్మానంద స్వరూపుడు. నిర్వికారుడు గనుక శమించియుండవా డనియు ఇతనియందు నజ్జనుల మనన్సులు ఉండు సనియు, సాధువుల మనస్సులందు శయనించి యుండు వాడనియు.

సకలశుభములతో కూడినవా దనియు, అర్ధములు ‘శివము’ అనగా మంగళము, శుభము, కైవల్యము, శ్రేయస్సు.

రాత్రి అనగా సుఖము నిచ్చునది. కనుక గొప్ప శుభముతో కూడినదియు, పరమసుఖమును ఇచ్చునదియు, మహా శివస్వరూపమైన బ్రహ్మానందమును ప్రసాదించునదియు మహాశివరాత్రి! శివుడు మహాతేజోలింగరూపమున ఆవిర్భవించిన సందర్భం – 18 కల్పములలో ఈశానకల్పమున జరిగినది.

ఈ సందర్భములోశ్రీమన్నారాయణుడు శ్వేతవరాహరూపము దాల్చి, శివలింగప్రాదుర్భవస్థాన మును చూచివచ్చుటకై యత్నించినందున – ఆనాటి నుండి ఈ కల్పమునకు “శ్వేతవరాహకల్ప” మని పేరు వచ్చినది.

పరమేశ్వరుడు నర్వవ్యాపకు డయినప్పుడు అతనికి ప్రత్యేకముగా ఒకరూపమనునది లేదు. అన్నియు తానే! కాని అందరికిని కనిపించవలె ననెడి అనుగ్రహముతో పరమేశ్వరుడు ‘సాంబమూర్తి’ (అంబ = పార్వతి, సాంబ = స + అంబ = పార్వతితో గూడినవాడు) యై ఆవిర్భవించినాడు.

కేవలజ్ఞాన రూపము నిరాకారము. జ్ఞానము తేజోరూపము. ఆ జ్ఞానతేజమే రాశీభూతమై, జ్యోతిర్మయలింగముగా సాక్షాత్కరించినది. రూపము కంటికి కనిపించవలెనన్నచో జ్యోతిస్సు (కాంతి) అవసరము.

కనుకనే శివుడు మొట్టమొదట జ్యోతిర్లింగమై, పిదప సాంబ శివుడై విష్ణుబ్రహ్మలకు గోచరించినాడు. లింగ మనగా – ప్రకృతిలో లీనమై యున్న పరమాత్మ స్వరూపమును తెలుపునది.

ఆ స్వరూపమును పొందించునది – అనగా అనుభవింప జేయునది – అని అర్ధము. కనుక నిరాకారమై, సర్వవ్యాపకమైన సచ్చిదానంద శివస్వరూపము.

సాకారమై, సర్వజ నానందకరముగా నేత్రోత్సవముగా గోచరించిన మహాపవిత్రపర్వదినము శివరాత్రి. కృష్ణపక్షములోని చీకటి – జీవుని ఆవరించినమాయాంధకారము.

జ్ఞానదాతయగు పరమశివుని కృపవలన జీవుడు మాయనుండి ముక్తుడై, ఆత్మ స్వరూపమును గుర్తించి, సర్వవ్యాపకమయిన ఆనంద తేజమును శివలింగము దర్శించి, జీవన్ముక్తుడు కావలె ననెడి సదాశయముతో, జీవితమును సత్యశివ సుందరముగా తీర్చిదిద్దుకోవలయు నను శుభాకాంక్షలతో – అట్లు భావించి, దర్శించి, తరించిన మనపూర్వులు శివరాత్రిని పర్వదినముగా నిర్ణయించినారు.

“జాగ్రత్స్వప్నసుషుప్తిరూపం – అవస్థాత్రయం, ఆత్మరూపేణ – శివాభిన్నస్వరూపేణ, రాతి ఆదదాతి శివరాత్రి:” అని వ్యుత్పత్తి – కనుక ఆధ్యాత్మికతత్త్వాను భూతి నొంది, “శివో: హమ్” అను పరమాద్వైతస్థితి సిద్ధించుటయే శివరాత్రి ఫలము! ఇది యోగరాత్రి! శివరాత్రిఎల్లరికిని భుక్తి ముక్తులను ప్రసాదించు పరమవ్రతము.

శివపూజకు, శివరాత్రి వ్రతమునకు భేద మున్నది. వేదములలో శివుడు రుద్రుడుగా పేర్కొనబడినాడు. సంసార దుఃఖమును నాశనము చేయువాడు, వేదరూపమున ధర్మమును పొందింప జేయువాడు, మున్నగు నర్థములు రుద్రశబ్దమున కున్నవి.

సహ ప్రారకమలమున అర్థమాత్రాన్వరూపమున నిలిచిన పరతత్త్వమే శివుడు శివరాత్రినాడు శివునికి ధారాపూర్వకముగ చల్లని నీటితో అభిషేకము గావించవలెను ఇది యోగశాస్త్ర రీత్యా – సహస్రారకమలమున ప్రకాశించు నదాశివతత్త్వామృతము వర్షించుటకు ప్రతీక.

శివరాత్రి విశేషములలో, ఉపవాసము, రాత్రివేళ అర్చనలు, చతుర్దశీయుక్తమైన అమావాస్య మున్నగునవి ప్రముఖ మైనవి.

ఇందలి ఆధ్యాత్మిక రహస్యములను గమనింతము,ఉపవాస మనగా నిరాహారియై యుండుట అనునది సామాన్యార్ధము. ఆహారమనగా “మనస్సు, బుద్ధి, ఇంద్రియముల స్వీకరింపబడునది” అని అర్ధము.

సంస్కార రూపమున మనస్సు స్వీకరించునది సూక్ష్మాహారము. పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనన్సు స్వీకరించునది స్థూలాహారము. ఇది శబ్ద స్పర్శ రూప రస గందాత్మకము శరీరమునకు స్వీకరించు అన్నము మున్నగునది స్థూలతరాహారము.

‘ఉపవాస’ మనగా ‘సమీపవాసము’.

మనశ్శరీరములను శివునినమీనమున నుంచుటయే శివరాత్రినాటి ఉపవాసము. కనుక కేవలము ఆహార రూపవస్తువులను స్వీకరింపకుండుటయే గాక – సూక్ష్మ, స్థూల, స్థూలతరాహారములను వదలు టయే నిజమైన ఉపవాసము.

ఇట్టి తాత్త్వికమైన ఉపవాసముచేసినపుడే “శివోహమ్” స్థితి అనుభవించబడును. కేవల బాహ్యానుష్టానము నిష్ప్ర యోజనము! విశాల బ్రహ్మాండమున సృష్టిప్రళయము లనెడి రెండు విభిన్నప్రవాహములు నిత్యము ప్రవహించు చున్నవి.

కాలప్రవాహమున రాత్రి – పగలు అను రెండుచీలిక లున్నవి. మనస్సునందును ఈ సృష్టి ప్రళయము లున్నవి. ప్రకృతియందు నిత్యసృష్టి, నిత్య లయము గలదు. ఇది ఏకత్వము నుండి భిన్నత్వము నకు, భిన్నత్వమునుండి ఏకత్వమునకు చేర్చు మహాశక్తి. కార్యకారణరూపము, పగలు కార్యరూపము. రాత్రి కారణరూపము.

రాత్రిలో సర్వము లయించియుండి, పగలు సృష్టిరూపమున కార్యము జరుగును. కారణము ఏకరూపము. కార్యము నానారూపము.

శివరాత్రినాడు అర్ధరాత్రివేళ శివుడు ఏకాకారతేజోలింగ రూపమున సాక్షాత్కరించుటచే” సర్వసముద్భవ కారణలింగ” మ్మని లింగాష్టకస్తోత్రమున నున్నది.

కాగా మనః ప్రాణేంద్రియ ములు ఆత్మసన్నిధిలో చేరి, ఆనందించుటయే రాత్రి. అనగా పగలు విషయానందమగ్నములయిన కార్యరూప మనః ప్రాణాదులు, రాత్రి కారణరూపశివసన్నిధిలో తమతమ కార్యములు చాలించి, నిర్విషయానందస్థితిలో సుఖించుటయే శివరాత్రి, పగలు భిన్నత్వము.

రాత్రి ఏకత్వము.చతుర్దశి – అమావాస్య, అమా = కూడిక; వాస్య = వసించియుండుట. అనగా = ఈరోజు = సూర్య చంద్రులు కూడికయుందురు. ఆధ్యాత్మికముగా సూర్యుడు పరమాత్మ, చంద్రుడు జీవాత్మ. జీవాత్మ పరమాత్మతో చేరుటయే యోగ సాధనలో చివరిదశ.

కనుక అమావాస్య అద్వైత పరమానందమునకు సంకేతము. ఉపాసనాశక్తి లేనిదే ఈ అభేదస్ధితి లభింపదు. కనుక చతుర్దశి అవసరమైనది.

చతుర్దశినాడు చంద్రుడు సూర్యునికి అత్యంతసమీపమున రేఖామాత్రముగ నుండును. అట్లే సాధనకాలమున జీవాత్మ పరమాత్మసన్ని ధానమున రేఖామాత్రదూరమున భేదస్థితిలో నుండును. మాఘబహుళచతుర్దశినాడు జీవాత్మ – పరమ శివునికి అత్యంతసమీపమున నుండును.

సాధన – ఉపాసన తీవ్రమైనపుడు – చతుర్దశిస్థితి నుండి అమావాస్యస్ధితి అనగా శివైక్యస్థితి సిద్ధించును. ఇట్టి శుభలగ్నమే అర్ధరాత్రి లింగోద్భవకాలము! ఇదియే మహాశివరాత్రి! ఇట్లు ఆధ్యాత్మికముగ ఆచరించిననే శివరాత్రివ్రతము సార్ధకము.

సఫలము అగును. అద్వైతానుభూతియే శివరాత్రి!జాగరణము : జాగరణ మనగా ఏదో పిచ్చాపాటిమాటలతో, వినోదకార్యక్రమములతో మేల్కొనుట కాదు.

ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొల్పి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము.

అప్పుడు శివపూజలో సాపూర్పయము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సాలోక్యము. శివ ధ్యానములో సారూప్యము సిద్ధించుననిన ఆదిశంకరుల మాటప్రార్ధించి, శాపపరిహారమును గూర్చి వేడుకొంటిని. Shiva కరుణించి — “పండ్రెండు సంవత్సరములు గడచిన తరువాత మీకు శివప్రాప్తి కలుగును” అని అనుగ్రహించెను. శాపానుసారముగా మేము నలుగురము కర్మభూమిపై జింకలుగా జన్మించితిమి.

“నేను గర్భిణినని నీకు తెలిసినదే. నీవు నా శరీరమును కోరినయెడల, నేను నా స్వస్థానమునకు వెళ్లి బిడ్డను ప్రసవించి తిరిగి వచ్చెదను. అప్పుడు నీవు నన్ను చంపి నా శరీరమును తినవచ్చును. ఇది సత్యమైన మాట” అని ఆ జింక వినయపూర్వకముగా విన్నవించెను.

అప్పుడు వ్యాధుడు జింక మాటలు విని ఇలా అనెను —
“నీవు చెప్పినది నిజమే కావచ్చును; అయినను నీ మాటలలో నాకు పూర్తి నమ్మకం కలుగుటలేదు. లోకములో ఎంతో మంది తమ ప్రాణములను కాపాడుకొనుటకు ఎన్నో విధములుగా అబద్ధములు చెప్పుదురు. కావున నీవు నిజముగా సత్యవాదినివైతే ఏదైనా ఒట్టు పెట్టుకొనుము” అని చెప్పెను.

అప్పుడు ఆ మృగము మహాదైన్యముతో ఇలా పలికెను “ఓ వ్యాధుడా నేను నా మాటను తప్పినడు అనేక పాపములు నాకు సంభవించును. చేసిన ఉపకారము మరచు కృతఘ్నునకు, ఇతరులను హింసించువానికి, భగవంతుని భజింపనివానికి, దానములకు విఘ్నముచేయువాడి కి, గురువును నిందించువానికి గల్గు పాపము నాకు ప్రాప్తించుగాక!

లక్ష్మీపతి అయిన విష్ణువును, పార్వతీపతి అయిన శివుని నిందించువారికి, దానమిచ్చి పిదప దానిని మరల తీసికొనువారికి, వచ్చు పాపము నాకు సంభవించు గాక! స్వధర్మభ్రష్టునకు, శాస్త్రమును నిందించువారికి, భ్రష్టాచారునకు దేవాలయమునందుండి హరికీర్తనాది సత్కాలక్షేవములలో తాంబూలము వేసికొనునతనికి కుష్టురోగము సంభవించు నని శాస్త్రములలో చెప్పబడినది. అట్టి పాపము నాకు సంభవించుగాక! తాను విద్యా వంతుడైన ఆ విద్యను దానముచేయక దాచువానికి శకునపక్షి జన్మమువచ్చును.

సజ్జనులను అనవసరముగా బాధపెట్టువానివంశము నిర్వంశమగును.స్వామి ద్రోహము చేయువాడు కుక్క అగును. సేవకులతో సేవచేయించుకొని, వారికి జీతభత్యములివ్వని యజమానులు భిక్షగాండ్రు అగుదురు. వంటవదార్థములను దొంగలించువారు పిల్లిజన్మమెత్తెదరు. అతిథి అభ్యాగతులకు, మంచిఆహారము పెట్టక, తానుమాత్రము మృష్టాన్నము భుజించినయెడల పతితుడగును. దండ్రులను దుః ఖపెట్టువాడు కోతిగా పుట్టును.

నేను ఇక్కడికి నా మాటమేరకు మరల రాకపోయిన యడల ఈ పాపము లన్ని సంభవించును. నామాటలు తప్పినచో శివపూజకు విఘ్నము కలిగించిన దాని వల్ల వచ్చు పాపమునకు గురియగుదును” అని జింక ప్రతిజ్ఞ చేసెను.

బోయ వాడు ఈ మాటలు విని ఆశ్చర్యభరితుడైనాడు. తన పనిని త్వరగా ముగించుకొని రావలసినదిగా అనుమతించెను. అట్లు అనుమతించిన బోయవానికి శుభములను కోరుచు సరోవరమునందలి నీరుత్రాగి, ఆ జింక తన తావునకు పోయెను. ఇక్కడ బోయవాడు తన యెడమ చేతితో బిల్వదళములను త్రుంచి, పారవేయుచుండెను.

రెండుజాములవరకు బోయవాడు వేయుచున్న బిల్వదళములతో తనకు ఉత్తమమైన పూజ జరిగినందున ఈ చెట్టుక్రిందగల శివుడు పరమసంతోషమును పొందెను. దానివలన ఏడు జన్మములనుండి ఆ బోయవానినాశ్రయించిన పాపములలో సగభాగము భస్మమాయెను.

శివనామోచ్చారణయందు వానికి ఆసక్తి గల్గెను. జింక చెప్పిన పవిత్రమైన మాటలు వినినందున సతా కాలక్షేపముద్వారా ఆ బోయవాడు జాగరణము చేసినట్లు అయ్యెను.ఆ జింక వెళ్లిన తరువాత వ్యాధుడు శివనామస్మరణ చేయుచు, బిల్వదళములను గిల్లి, కింద వైచుచుండెను.

కాలము నిలువదుకదా! రెండవజాము పూర్తికావచ్చినది. ఇంతలో నీరు తాగుటకు ఒక ఆడుజింక అచ్చటికి వచ్చెను. “దీనిని వదలను” అనుచు వేటగాడు బాణమును సంధింపగా, కలత చెందిన జింక “నేటితో నా ఆయుస్సు తీరినది” అనుకొని, ధైర్యము వహించి, “అయ్యా! శబరా! కొంచెము ఆలోచింపుము. నీరు డ్రాగుటకై నే నిక్కడికి వచ్చితిని.

మొదట తనివిదీర నీరు ద్రావ నిమ్ము. ఇంట చిన్న చిన్న బిడ్డలున్నారు. వారినొక్కమారు పల్కరించి, సంతోషపరచి వత్తును. సంతానవ్యామోహమనునది సహజముకదా! ఐహికసుఖోప భోగమోహము నాకును తప్పకున్నది. త్వరగా ఇల్లు చేరి, భర్తను, సంతానమును కలిసి, తిరిగి వత్తును.

ఇంతమాత్రము ఔదార్యము నాపై చూపుము. నన్ను విశ్వసింపుము. నాకడసారి కోర్కెను మన్నించి, ఈ సాహాయ్యము చేయుము. నీ మేలు ఎన్నటికి మరువను” -అనెను. ఈ మాటలు విన్న వ్యాధుడు “చాల బాగున్నది!ఇటనుండి వెళ్లి, నీవు తిరిగి వత్తువా? ప్రాణములు మిక్కిలి తీపియైనవి. ప్రాణములు కోల్పోవుటకు ఎవ్వరును రారు. నీ మాటపై నాకు నమ్మకము లేదు.

కనుక ప్రమాణo చేసి, ప్రయాణము కమ్ము” – అనెను.అంతట జింక “అయ్యా! పుణ్యాత్మా! ఆడిన మాటను తప్పి, నేను రాకున్నచో – బావులను, గుళ్ళను, గోపురములను కూల్చువారును, వేదశాస్త్రములను నిందించువారును, సాధు సజ్జనులను హింసించువారు పురాణపుణ్యకథలను దూషించువారును – ఏ పాపము నొందుదురో, అట్టి పాపమును నేనును పొందుదును. అన్నదమ్ములయ్యును కడుపుమంటతో (ఈర్ష్యతో) ఒకరినొకరు హింసించువారు తమ ఐశ్వర్యమును కోల్పోవుదురు.

ప్రత్యక్షమున మంచిగా మాట్లాడి, పరోక్షమున నిందించువారు కొంగలగుదురు. గురువునందలి దోషములను వెదకువారిసంపదలు సర్వనాశనమగును. తల్లిదండ్రులను, గురువులను కష్టపెట్టువారును, మూగజీవులకు నీరు మేత పెట్టని వారును, మూగవారై పుట్టుదురు. నేను తిరిగి రాకున్నచో ఇట్టి పాపము లన్నియు నన్ను చెందునుగాక! మరణమునుగూర్చి నాకు ఆవగింజంతయు బాధ లేదు. పుణ్యాత్మ! అంత్యకాలమున నా మనోవాంఛను నెరవేర్చి, పుణ్యముగట్టుకొమ్ము. త్వర త్వరగా పోయి వత్తును. అనుమతింపుము” ప్రమాణములు చేసెను.వ్యాధునికి జ్ఞానోదయకాలము సమీపించినది. శాశ్వత సుఖములు లభింపనున్నవి. కనుకనే కఠినాత్ముడైన వ్యాధుని మనస్సు మెత్తవడుచున్నది. కరుణారసము కట్టలు తాకుచున్నది.

జింకను కరుణించి, ‘పోయి ర’మ్మనినాడు. జింక మిక్కిలి సంతోషించి, కడుపునిండ నీరు ద్రావి, వ్యాధుని ప్రశంసించుచు ఇంటికి వెళ్లినది. మంచికాలము చేరువగునప్పుడు – మంచిబుద్ధియు చేరువగునుకదా! కొంతసేపటికి ఆ సరోవరమునకు నీరు ద్రాగుటకై మగజింక వచ్చెను. వెంటనే వ్యాధుడు బాణమును సంధించెను. వానిని చూచి జింక ఇట్లు చెప్పెను.

“ఓ శివభక్తుడా! సుగుణవతులై పతివ్రతలైన నా భార్యలకు కొన్ని విషయములను చెప్పి, నేను వెంటనే ఇక్కడికి వచ్చెదను. నేను అట్లు రానిచో నా శపథములను వినుము. పరమభక్తుడు హరకీర్తన చేయు సమయమున దానిని భంగపరచువాని వంశము నిర్వంశమగును. అట్టి పాతకము నాతలపై పడుగాక! సజ్జనులను హింసించు వారికి, సంతానము వృద్ధికానేరదు.

దేవతావిగ్రహములను భంగము చేయువారు, శివమహిమను తృణీకరించువారు, ఘోరమైన నరకమును పొంది, కీటకము లగుదురు. లేనిపోనివాటిని అతిశయోక్తితో చెప్పువారికి కప్ప జన్మము కలుగును. పురాణములు జరుగుచోట నిద్రించువారికి పెనుభూతజన్మము వచ్చును.

నేను మరలఇక్కడికి రానిచో ఈ పాపము లన్నియు నాకు కలుగుగాక!” అని వాగ్దానము చేసి, పోయివచ్చుటకు, వ్యాధుని అనుమతిని అర్థించెను.

అమృతోపమానములైన ఆ జింకమాటలను విని, వ్యాధుడు ఆనందబాష్పములతో, పోయివచ్చుటకు జింకకు అనుమతినిచ్చెను. నీరుత్రాగి ఆ జింక తనయింటికి వెళ్లెను.

వ్యాధుడు శివనామస్మరణచేస్తూ  బిల్వపత్రములను శివలింగముపై వేయుచు, ఆ వృక్షముపైననే కాలము గడపుచుండెను. ఈవిధముగా నాల్గు జాములలోను శివునకు పూజ జరిగెను. 

వ్యాధుని పాపరాశియంతము సమూలముగా భస్మమయ్యెను. 

అప్పటికి తెల్లవారెను. సూర్యభగవాను డుదయించు చుండెను. కొంతసేపటికి 3వ ఆడుజింక ఆ సరోవరము దగ్గరికి వచ్చెను. దానిని చంపుటకు బాణమును గురిపెట్టగా అది యిట్లు చెప్పెను. 

“అయ్య! నన్ను చంపవద్దు. 

నా బిడ్డకు పాలిచ్చి వెంటనే యిక్కడికి వత్తును. ఆపై నీ యిష్టము వచ్చినట్లు చేయుము” అని ప్రార్ధించెను. వ్యాధుడు ఆ సమయములో  ఈ జింక ఎట్టి ధర్మములను చెప్పునో వినవలెనను కుతూహలముచే జింకను ప్రతిజ్ఞాపూర్వకముగా మాట యిమ్మని కోరెను. అప్పు డాజింక ఇట్లు చెప్పెను. 

“గడ్డివామికి, గ్రామముకు నిప్పు పెట్టువారు, గోమాతకు ఉపయోగపడునీటిని అడ్డగించువారు, క్షయరోగపీడితులగుదురు. 

ఇతరుల వస్తువులను దొంగలింపగోరువారు, మంచివారికి జరుగు సమ్మానమును చూచి అసూయపడువారు, నేత్రరోగములతో బాధపడుదురు. 

పుస్తకములను దొంగలించువారు మూగవా రగుదురు. భక్తులను నిందించువారినోరు దుర్గంధపూరితమగును. ద్రవ్యమును ఖర్చు చేయక లుబ్ధు డగువాడు బుసగొట్టుచున్న మహాసర్పమగును. బీక్షకై వచ్చిన యతిని బయటికి పంపు పాపి, శివుని ఆగ్రహమునకు పాత్రుడగును. 

వానిసంతతి, సంపద దగ్ధమగును. వడ్డించిన విస్తరివద్దనుండి బయటికి అతిథిని పంపువాడు మహాపాపి యగలను.

 నేను నీకు ఈచిన మాట తప్పినచో ఈ చెప్పిన పాపము లన్నియు నాకు లభించుగాక!” అని చెప్పిన జింక యొక్క మాటలు విని గద్గదకంఠుడయి జింక పోయి వచ్చుటకు వ్యాధుడు అనుమతించెను. 

ఆ జింక నీరుత్రాగి యింటికి పోయి తన బిడ్డకు పాలిచ్చి దానిని తృప్తిపరచెను.

గర్భిణిగానున్న ఆడుజింక ప్రసవించెను. రెండవ ఆడుజంక తన ఆశయము తీర్చుకొని, సంతసించెను. వీటి యజమానుడైన మగజింకతో ఆ మూడుజింకలను చూచి తామిచ్చిన మాట ప్రకారము వెంటనే వ్యాధుని వద్దకు పోవలసినదిగా ఆనతియిచ్చెను. 

తమ పిల్లలతో పాటు ఆ జింకలన్నియు వ్యాధుని వద్దకు వచ్చెను. మగజింక ముందు నిలబడి మొదట తన్ను చంపవలసినదిగా బోయవానిని ప్రార్ధించెను. అపుడు ఆడుజింకలు “ఓ వ్యాధుడా! అట్లు చేయుట ధర్మముకాదు. భర్తకంటే ముందుగా భార్యలు చనిపోవుట ఉచితము” అని చెప్పగా తల్లిదండ్రుల మాటలు విన్న చిన్న పిల్లలు అంతఃకరణశుద్ధితో ముందు నిలిచి “మొదట మమ్ములను చంపుము. 

ఎందువలన ననగా తల్లిదండ్రులను పోగొట్టుకొన్న పిల్లల జీవితము మహాదుః ఖభాజనముకదా” అని ప్రార్ధించిరి.

ఆ బిడ్డలు చెప్పిన మాటలకు ఈ వేటగాని హృదయము కరిగిపోయెను. వెంటనే వాని కన్నుల ను ఏకధారగా అశ్రువులు రాల నారంభించెను. 

మిక్కిలి దయారచిత్తముతో వ్యాధుడు “ఓ పవిత్రజీవులారా! ధర్మఫలదర్శకమైన మీ హితబోధ విని నేటికి నేను వరమవవిత్రుడనైతిని, జన్మజన్మాంతరములనుండి చేసిన పాపము లన్నియు దగ్ధమై, నాశరీరము పవిత్రమయ్యెను. నా పాలిటికి తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నియు మీరే! అలుబిడ్డలతో చేరిన సంసారము కేవలము భ్రాంతినిలయము.

శివ! శివ! శివపదని ఎప్పుడు ప్రాప్తమగునో!” యని ప్రేమభరితముగా చెప్పుచు నిలబడెను. ఆ సమయమునకు సరిగా కైలాసము నుండి విమానము ఒకటి వచ్చెసింది. దానిలో ప్రమథులు కూర్చొనియుండిరి. వారిమధ్య పంచముఖములు, పది భుజములు, వ్యాఘ్ర చర్మమును ధరించిన సర్వమంగళ

కర్తయగు శ్రీ శంకరుడు దివ్యమైన తేజస్సుతో విరాజిల్లు చుండెను. కిన్నరులు మధురమనోహరమైన వాద్యములను వాయించ నారంభించిరి. విద్యాధరులు రాగాలావన చేయదొడగిరి. పుష్పవృష్టి కురిసెను. జింకలన్నియు దివ్యశరీరములను పొందెను. వానిని చూచిన వ్యాధుడు వారికి సాష్టాంగనమస్కారముచేసెను. 

వాని మనోభావములు మారిపోయెను. లోహము స్పర్శమణియొక్క స్పర్శచేత బంగారగునట్లు వ్యాధుడు శివరూపమును ధరించి నిలిచెను. వానిని కూడ విమానములో కూర్చుండజేసిరి. తరుదివ్య శరీరములతో జింకలుకూడ విమానమెక్కను. 

దేవసమూహమంతయు ఆ శివభక్తులను స్తుతించ నారంభించిరి. శివరూపమును పొందిన వ్యాధుడు శివలోకము నలంకరించెను. 

జింకలు నక్షత్రమండలమును అలంకరించెను. ఈనాటికి నక్షత్రమండలం లో జింకలు మృగశీర్ష నక్షత్రముగాను, దాని వెనుక ప్రకాశించు నక్షత్రము వ్యాధుడుగాను ప్రకాశించు చుండుటను పుణ్యవంతులు చూడగలుగుచున్నారు.

శ్రీ వ్యాసభగవానుడు పవిత్రమైన ఈ కథను స్కాంద పురాణాంతర్గతబ్రహ్మోత్తరఖండమందు లింగకారణమున పేర్కొన్నారు. 

వరమేశ్వరుని కృపా విశేషమున దానిని సంగ్రహముగా ఇందు పొందుపరచితిని. 

శివరాత్రి మహిమ అనంతము. ఈ కథలను భక్తి శ్రద్ధలతో పఠించు వారిని పరమ శివుడు సర్వదా సంరక్షించును” అని వివరించెను.Om Namah Shivaya

సమాప్తము

శ్రీ సాంబ సదాశివార్పణ మస్తు!

Leave a Comment