Praise and Worship: A Path to Spiritual Growth

praise and worship meaning, importance of praise and worship, benefits of praise and worship,daily,worship routine,spiritual growth tips,devotion and faith,how to worship God daily,inner,peace through prayer,spiritual healing methods,devotional practices

ప్రశంస ఎంతో ముఖ్యమైనది! కానీ మనుష్యులకు ఆ విషయం తెలియదు. ఏ పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం ప్రశంసను బోధించదు. 

ఏ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు మనోవైజ్ఞానికవేత్త లేదా వైద్యుడు దాని గురించి మాట్లాడరు. అయినా ప్రశంస అనేది ప్రకృతి మానవాళికి ఇచ్చిన రహస్యాలలో ఒకటి. 

మీరు ప్రశంసను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు మీ జీవితం మొత్తం మారటాన్ని గమనిస్తారు.

ప్రశంస అనేది పరిణామాన్ని, మార్పును సరైన సంబంధాలను పెంపొందించే క్రమంలో మీ జీవిత లక్ష్యాన్ని గుర్తించడానికి దోహదం చేసే గాఢమైన మెచ్చుకోలు. 

ఇదంతా సౌందర్యభరితం! ప్రశంస ద్వారా మాత్రమే మీరు మీ శరీరాన్ని అహాన్ని అతిశయాన్ని దాటి మార్పు చెందుతారు. ఇదెంతో ముఖ్యం.

మనుష్యులు తమ ఇంటి పునాదుల వద్దనే కూలబడి ఉండాలి. అనుకుంటారు. అందువలన వారికి ప్రశంస ఇష్టం ఉండదు. ఆ చీకటిలో, ప్రకృతి యొక్క ఆ మూలంలోనే వారు ఆనందంగా ఉంటారు.

మీరు ఎవ్వరైనప్పటికీ ప్రశంస మిమ్మల్ని వెలికి తెస్తుంది. మీరు ఒక ప్రత్యేకమైన విషయానికి, విలువకు అతుక్కొని ఉంటే, మీరు ఒక గాఢ

ప్రశంసను ఏ విషయంపట్ల అయినా పెంపొందించుకున్నప్పుడు మీరు ఆ విలువను మార్పు చెందిస్తారు.

1. ప్రశంస అనేది ఇతరులలో విలువలను, ప్రకృతి సౌందర్యాన్ని చూసి వాటిని వెలుపొందించి రక్షించే సామర్థ్యం, క్రమంగా ఆ విలువలు ఎంతో ముఖ్యమైనవి వాటిని పరిరక్షించి పెంపొందించాలి అన్న చైతన్య స్థాయికి మీరు చేరుకుంటారు.

కానీ సాధారణంగా మనం దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. 

దానికి బదులు మనం మెచ్చుకోవడం ప్రారంభిస్తే మన సామర్థ్య స్థాయిలలో మరొక పొర విచ్చుకుంటుంది. 

మానవాళిలోనూ, ప్రతిదానిలోనూ విలువలు మెరుగుపడటం అనేది మీ స్వీయ కొనసాగింపును పెంపొందిస్తుంది. 

మీ విలువలు పెంపొందటం అనేది మిగిలిన అందరి విలువలు పెంపొందటానికి దోహదం చేస్తుంది.

ప్రకృతిని ఆరాధించండి. ప్రకృతి సౌందర్యాలను ప్రశంసించి రక్షించి పెంపొందించండి. ఈ విషయం మనకు ఇంతకు ముందే చెప్పబడినట్లయితే ప్రతి చోట ఈ కాలుష్యం, వినాశనం ఉండేది కాదు.

ఒక చోటు నుంచి మరొక చోటుకు అంత చెత్త తరలింపబడేది కాదు. ఆ చెత్త సరే, నిరంతరం మన హృదయాలు, మనస్సులు చర్యల ద్వారా వెలువరించబడే చెత్త సంగతి ఏమిటి? ప్రతీక్షణం, ప్రతీచోట మీరు ఈ చెత్తను కుమ్మరిస్తూనే ఉన్నారు. 

దీనిని నిరోధించే ఏ చట్టం లేదు. మీకు కావలసినది ఏదైన మీరు ఆలోచించవచ్చు, భావించవచ్చు. అయితే ప్రశంస అనేది ఉంటే మీరు ప్రకృతి సౌందర్యాన్ని పెంపొందించవచ్చు. 

ప్రశంస అనేది మీ ఆధ్యాత్మిక విలువలను వెలికితీస్తుంది.

2. ప్రశంస అనేది భవిష్యత్ను చూడగల సామర్థ్యం. తల్లులకు ఈ సామర్థ్యం ఉంటుంది. ఎదిగే క్రమంలో పిల్లలు ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన తల్లులు వారిని వదిలిపెట్టరు. 

భవిష్యత్లో ఆ బిడ్డలు ఎన్నో విలువలతో దేశానికి, మానవాళికి, సౌందర్యానికి ప్రతినిధులుగా వెలుగొందుతారని వారికి తెలుసు.

 తల్లి భవిష్యత్ని దర్శించి ప్రశంసిస్తుంది. అటువంటప్పుడు ఆమె పిల్లల అల్లరి చూడదు. 

మన స్నేహితులకు కూడా ఇదే వర్తిస్తుంది. కానీ మనం ముందుగా వాళ్ళ మూర్ఖత్వం పై దృష్టి పెట్టి నొప్పిస్తాం. అది ప్రశంస శక్తిని అణగారుస్తుంది.

భవిష్యత్ ఎప్పుడు ప్రశంసనీయమే. అది మనలోని పరిపూర్ణతకు సన్నిహితంగా వెలుగుతుంది. అదెంతో సూక్ష్మమైనది. 

అనేక జన్మ పరంపర మీరు మరింత పరిణామశీలతతో, పరిపూర్ణతతో, సౌందర్యభరితంగా, నక్షత్రంగా తయారవుతారు.

3. ప్రశంస అనేది మీరు ప్రశంసించే దానితో మారిపోయే విధానం. మీరు దేనిని ప్రశంసిస్తున్నప్పటికి క్రమంగా దానిలాగా మారిపోతారు. 

ఇక్కడ చీకటి శక్తుల ప్రభావం గాఢంగా ఉంటుంది. అవి మీరు ప్రశంసిస్తున్న దానిని కనుగొనే దాన్ని వికటింపచేయటం ద్వారా మీ నుంచి ప్రశంస శక్తిని దొంగిలిస్తారు. 

మన సినిమాలలోనూ, టెలివిజన్ కార్యక్రమాలలోనూ జరుగుతున్నది అదే.

ప్రశంసను బోధించే లేదా వ్యాప్తిచేసే కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఉంటే ప్రపంచమే మారిపోతుంది. ప్రశంసించదగిన విషయాలు భోధించబడకపోవడం వలన వినాశక శక్తులు తయారవుతున్నాయి. 

ఒక నాయకుని ప్రతిబింబంతో లక్షలాదిమంది మారుతారు.మీరు దేనినైనా ఆరాధించినప్పుడు దానిని రక్షిస్తారు. 

వజ్రాలను ఎవరైనా ఎందుకు రక్షిస్తారు? వజ్రం అనేది మీరు ఇతరులలో చూస్తున్న విలువ. దానిని మెచ్చుకోవాలంటే మీరు దానిని చూడగల్గి ఉండాలి.

విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని ఫణంగా పెట్టగల్గి ఉండాలి.

4. ప్రశంస మీ పరిధులను, అహాన్ని, అసూయని, అధిగమింప చేస్తుంది. అసూయని అధిగమించడానికి ప్రశంసను మించిన గొప్ప పరిష్కారం లేనేలేదు. 

అద్భుత నైపుణ్యాలు, సంపద, సౌందర్యం కలిగిన వారిని చూసినప్పుడు వారి కృషిని, శ్రమను అభినందించడం అలవాటు చేసుకోండి. 

ప్రశంస మిమ్మల్ని మీరు ప్రజలలో అనేక మంది ప్రజలతో వేలాది ప్రజలతో గుర్తించుకునేటట్లు చెయ్యటంతో క్రమంగా మీ అహం కరిగిపోతుంది. దానితో మీరు మీ పరిమితులను, అహాన్ని, అతిశయాన్ని పోగొట్టుకుంటారు. 

ఆధిపత్యధోరణులన్ని ఇతరుల విలువను, సౌందర్యాన్ని దర్శించిన వెంటనే మీరు ప్రతిచోట ఉండే ఉన్నత ఆత్మతో గుర్తుంచుకోవడం వలన మీ అహం, 

అతిశయం ఆవిరి అవటం మొదలు పెడతాయి. మీరు దీనిని ఉపయోగించటం మొదలుపెడితే మీకు ఆధ్యాత్మిక, భౌతిక, ఉద్వేగిక, మానసిక ప్రయోజనాలు చేకూరుతాయి.

ఆ విధంగా కాక మీరు విమర్శ, నింద, అసహ్యం, కోపాలను ప్రదర్శిస్తే మీ వ్యక్తిత్వంలో అవే చోటు చేసుకుంటాయి.

రెండు బలమైన శక్తులు చీకటి. కాంతి ఉన్నాయి. మీరు కాంతిని ఆరాధిస్తే మీకంటే ఉన్నతంగా మారతారు. చీకటి వైపు తిరిగితే అల్పులు అవుతారు.

5. మీలో భక్తిని సృష్టిస్తుంది. 

భక్తి మీ ఊర్వాత్మ యొక్క రేడియోధార్మికత. మీరు దేనినైనా ప్రశంసించిన క్షణంలో మీ ఊరాను మేలుకొని మీరు మీ నిమ్న విభాగాల నుంచి ఉరికే ఊరాత్మగా మారుతారు. ఈ మనోహర విధానాలు ఉన్నత మనస్తత్వ శాస్త్రాలు మార్మికమనస్తత్వ శాస్త్రాలు, మన ప్రకృతిలో నిజమైన మార్పును తెస్తాయి. 

భక్తి అనేది మీ ఊర్హాత్మ యొక్క రేడియోధార్మికత. దానికి వ్యక్తిత్వంతో ఏ సంబంధం లేదు. అది మట్టిలోనుంచి మీ మాణిక్యాన్ని తీసి దానిని సూర్యకాంతిలో ఉంచడం వంటిది. 

ఇప్పుడు మీ వాస్తవ ఆత్మ సూర్యకాంతిలో ఉంది.

6. మీరు ప్రశంసిస్తున్న విషయాన్ని కొనసాగించటం కోసం మిమ్మల్ని త్యాగాలకు పురిగొల్పుతుంది. ప్రశంసకి నిలబడటం ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తుంది. 

ఈ ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవడం ద్వారానే మీరు మీ తత్వాన్ని మార్చుకోగలరు. 

అదొక్కటే మార్గం.

మీరు నిలబడిన విలువను పరిరక్షించడానికి, పెంపొందించడానికి మీరు ఎన్నో అసహ్యాలను, పరిమితులను ఎదుర్కొని వాటిని అధిగమించడం ద్వారా మార్పు చెందుతారు. 

సంక్షోభ సమయంలోనే మార్పు వస్తుంది. 

కాంతి, చీకటి శక్తుల మధ్య పోరాటంతో ఏర్పడిన ఆ సంక్షోభంలో మీరు ప్రకాశించి మార్పు చెందుతారు.

7. ప్రశంస మీ గ్రంథులను ఉన్నతంగా పని చేసేటట్లు చేస్తుంది. అది చిరాకును, విషాల తయారీని ఆపుతుంది. మీరు విమర్శిస్తున్న ప్రతిసారీ ప్రతికూల మార్గంలో ఉంటూ విషాన్ని తయారు చేస్తారు.

8. మీరు ఆగి, మీ దశను మార్చి ప్రశంసను అలవర్చుకుంటే ఇక చికాకులే ఉండవు. చికాకులు లేకపోతే మీ గ్రంథులు చక్కగా పనిచేస్తాయి.

అనేకానేక గ్రంథుల సమస్యకు ప్రతికూలత, విమర్శ, ద్వేషం, అసూయలే కారణం. ప్రశంసకు వీలైనదానిని కనుగొనండి. అది చికాకును, విషాన్ని పోగుచేసుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది.

9. ప్రశంస సరైన మానవ సంబంధాలను సృష్టిస్తుంది. నేను మిమ్మల్ని విమర్శిస్తే మీరు నా దగ్గరికి మళ్ళీ రావాలనుకోరు. దానికి బదులు మిమ్మల్ని ప్రశంసించి ప్రేమిస్తే మన మధ్య సరైన మానవ సంబంధం ఏర్పడుతుంది.

 ఏ చర్చులలోనూ ఈ ప్రశంసల గురించిన విషయాలు ఉపయోగించరు. పరస్పరం ప్రశంసించుకోండి. నేను మీ లోపల దైవాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి.

ఉపనిషత్తులలో ఒక చోట “నేను నా భార్యను ప్రేమిస్తున్నాను; ఆమె నా భార్య కనుక ప్రేమించడం లేదు; ఆమె సర్వాత్మలో భాగం కనుక ఆమెను ప్రేమిస్తున్నాను” అని వ్రాయబడింది.

10. ప్రశంస అనేది ఇతరులలోని పుష్పాలకు, మొక్కలకు ఎరువు వెయ్యడంవంటిది. వారిలో చిన్న గులాబిని చూసినప్పుడు దానికి ఎరుపు వేసి కొంచెం నీరు పోసి రక్షించండి. 

మీరు పరస్పరం పుష్పాలను పోషిస్తే అద్భుతమైన పూలతోటలో నివసిస్తారు. ఎదుటి వారిని చిన్నబుచ్చటం తక్కువ చేసిమాట్లాడటం మనల్ని బుద్ధిహీనులుగా చేస్తుంది. ప్రశంసించడం అనేది వారిలో సహృదయత పుష్పాలను పెంచటం.

11. మనుష్యులను ప్రశంసిచటం వలన వారికి మానసిక స్వస్థత చేకూరుస్తాం. శరీరం నుంచి ఉద్వేగాల వరకు ఆ పైన ఆత్మవరకు ఇది పని చేస్తుంది. 

అది ఒక లేజర్ కిరణంలా ఉపయోగపడుతుంది. మీ పరిసరాలలో మీ ప్రశంసవల్ల ప్రశాంతతతో కూడిన అభివృద్ధి ఉంటుంది.

12. ప్రశంస అనేది ఎదుటివారిలో జీవితాన్ని కొనసాగించే అంశాలను పెంపొందిస్తుంది. ఇదెంతో ముఖ్యమైనది. 

వారిలోని కొన్ని కణాల పై సూక్ష్మ జీవులు, క్రిములు, వైరస్లు దాడి చేసినా మీరు ఆ వ్యక్తిని ప్రశంసిస్తే ఆ కణాలు నిద్రాణంగా మారిపోతాయి. 

ప్రతివారు దీనిని ప్రయోగించి చూడండి. ఏమి జరుగుతుందో గమనించండి. వారి లోపాలకు మీరు ఈ విధమైన శక్తిని పంపుతారు. 

ప్రశంస అనేది ప్రతీదానిలోని దివ్య చిహ్నాలను చూసే ప్రతిదాంట్లోనూ దైవాన్ని కనుగొనడం.

13. ఇతరులను ప్రశంసించటం ద్వారా మీరు మీ లోపల ప్రశంసించబడే అంశాలను పెంపొందించుకుంటారు. మీరు ఇతరులలోని ప్రశంసించగల అంశాల పై కేంద్రీకరించినపుడు మీ మనస్సు వాటితో నిండిఉండి అవి మీ లోపల వ్రేళ్ళూనుకోవటం ప్రారంభిస్తాయి. ప్రశంస అనేది ఆయస్కాంత క్షేత్రమే కాక ప్రభావశక్తి కూడా.

14. ప్రశంస అనేది మీరు చూస్తున్న ప్రతిదాంట్లోనూ దివ్య చిహ్నాలు లేదా సంకేతాలను దైవపు ఉనికిని కనుగొనే విధానం. వాస్తవానికి మీరు దేనినైనా ప్రశంసించడానికి కారణం అది మిమ్మల్ని అత్యంత ప్రశంస పూర్వకమైన దానికి చేర్చడం. worship routine,spiritual growth tips,devotion

మీరు ప్రశంసించటం పెంపొందించటం ద్వారా మీరు ప్రశంస మూలాన్ని చేరుతారు. ఇతరులను ప్రశంసించటం ద్వారా మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రశంసించుకుంటారు.

 మీరు ఇతరుల పట్ల మీ గౌరవాన్ని పెంచటం మాత్రమే కాక మీలోనూ ఇతరులలోనూ ప్రశంస అంశాల మూలగౌరవాన్ని పెంచుతారు.

15. నాయకత్వం అనేది మీ సహశ్రామికుల భవిష్యత్ పై మీ ప్రశంస కేంద్రీకరణను నిలిపిఉంచటం. దాని ద్వారా మీరూ, వారూ తమ భవిష్యత్

సౌందర్యానికై కృషి చెయ్యడానికి తోడ్పడుతారు.

16. స్వీయ కేంద్రీకృతం, మూఢభక్తి వేర్పాటువాదులకు ప్రశంస నివారణ వంటిది. స్వీయ కేంద్రీకరణ, మూఢభక్తి వేర్పాటువాదాలు కలిగిన వారు ఇతరులలోని మంచి లక్షణాలను, విలువలను కనుగొనడానికి నిరాకరిస్తారు. 

ఆ విధంగా ఉండటం వలన వారి దుర్గుణాలలో మునిగి పోయి ఇబ్బందులకు గురై నాశనం అవుతారు.

17. ప్రశంస అనేది సహ శ్రామికులను, రక్షకులను నిర్దేశకులను గొప్ప పరిశ్రమ చేయగలిగిన వారందరినీ ఆకర్షించే బలమైన అయస్కాంతాన్ని సృష్టిస్తుంది. 

ప్రశంస లేకపోవడం వల్ల మనం ప్రజలను తిరస్కరించి గాయపరుస్తాం. మనకు సహాయం చేయదలచుకున్నవారిని కోల్పోతాం.

18. ప్రశంస అనేది ఇతరులు మార్పు చెందటంలో మీరు పడే శ్రమకు అదృశ్య శక్తులను ఆకర్షించి తోడ్పడేలా చేస్తుంది. మనుష్యులు తమ కోసమే పని చేస్తున్నాము అనుకుంటారు. అది ఒక భ్రమ, మన శ్రమ అంతటిలోనూ అదృశ్య శక్తులు ఎంతో పాలుపంచుకుంటాయి. 

చీకటి శక్తుల దాడుల నుంచి మనల్ని రక్షిస్తాయి.

19. మీ చైతన్యవు కేంద్రీకరణను ఉన్నత తలాలకు పెంపొందించడానికి ప్రశంస ఒక విధానం. మిమ్మల్ని సవాలు చేసే దానిపట్ల మీకు ఆరాధన ఉంటుంది. 

Cఉన్నత ప్రశంస విషయాలు మీకు సవాలు విసరటమే కాక మిమ్మల్ని అవి లభించే తలాలను అనుభూతి చెందడానికై ఆహ్వానిస్తాయి.

20. ప్రశంస నెమ్మది నెమ్మదిగా పోటీని ఓడించి సహకార దృక్పథానికి బాట వేస్తుంది. అది సహకారాన్ని సృష్టిస్తుంది. 

అందరి మేలు కోసం పరిశ్రమిస్తుంది. మనలో అసూయ, అత్యాశ, స్వార్ధం ఉన్నప్పుడే పోటీ ఉంటుంది. ఇతరులను, వారి శ్రమను గుర్తించి ప్రశంసించినప్పుడు అవి అంతమైపోతాయి.

21. ప్రశంస అనేది మిమ్మల్ని, అన్ని జీవ రూపాలలో ఉన్న ఏకాత్మకు సేవ చేసేటట్లు చేస్తుంది.

22. ప్రశంస లేకపోవటం అంటే నిర్లక్ష్యం, భేదం, పట్టించుకోకపోవడం.

23. ప్రశంస పరిణామ క్రమాన్ని బలోపేతం చేసి మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది.

25. ప్రతి మనిషిలోనూ ప్రశంసించగలిగిన దైవత్వం ఉంటుంది. అది మంచితన, సహనం, విజయాలకు మూలం ,కొన్ని సార్లు అనేక పరిమితులకు లోబడి ఉంటుంది. ప్రశంస ద్వారా ఆ ప్రశంసించదగిన దైవాత్వన్ని వెలికి తేవచ్చు.

పది ప్రశంస సోపానాలు

1. శ్రద్ధ

2. గుర్తింపు

3. కృతజ్ఞత

4. ప్రతిఫలం

5. మెచ్చుకోలు

6. సవాలు

7. ఉన్నతీకరణ

8. రక్షణ

9. త్యాగం

10. కనుగొనటం

ఈ చర్యల ద్వారా ఆ దివ్యత్వం వ్యక్తిలోని ప్రకాశత్వం, సౌందర్యం, మంచితనం వెల్లడి అవుతాయి.

Leave a Comment