Appreciation: A Simple Habit That Creates Big Impact

Appreciation

మెచ్చుకోలు అనేది ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతనిలోని మంచి. ధోరణులను, మంచి లక్షణాలను అభివృద్ధి పరచి అతను మరింత స్థిరంగా సేవ చేయడానికి దోహదం చేసే పద్ధతి.

ఒక వ్యక్తిని మీరు ఎంతగా మెచ్చుకుంటే మీరంతగా అతను అందించే నిధులను వెలికి తీస్తారు.మెచ్చుకోలు అనేది మీ ఊర్ధ్వాత్మతో ప్రారంభం అవుతుంది.

మీరు మీ అంతర్ మూలం నుంచి గ్రహించిన నిర్దేశకత్వానికి, రక్షణకు కృతజ్ఞత వ్యక్తీకరించడం. మీ ఊర్ధ్వాత్మను అభినందిస్తూ మెచ్చుకోవడం ద్వారా మీరు దానితో ఉన్నత అనుసంధానం పొంది దాని కాంతిలో ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తారు.

చాలా మందికి అంతర్ మూలం పట్ల ఎరుక ఉండదు. అంతర్ మూలాన్ని మెచ్చుకోవటం మీకు, మూలానికి మధ్య బంధం సృష్టిస్తుంది.

ఆ బంధం ద్వారా మీరు, మీ అనేక చర్యలలో పరిశీలన, నిర్దేశకత్వం, ప్రేరణ, ప్రోత్సాహలను పొందుతారు.

అది మిమ్మల్ని ఒంటరితనం, నైరాశ్యం, విచారాలను అధిగమించడంలో తోడ్పడుతుంది.మీలో చాలా మంది మీ సమయం గడపడానికి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు.

కానీ మీ ఊర్ధ్వాత్మతో బంధం ఏర్పడితే మీ లోపల ఒక మిత్రుడు ఉన్నట్లు సమృద్ధితో ఉన్నట్లు రక్షణ నిర్దేశకత్వాలు పొందుతున్నట్లు భావిస్తారు.

ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మీ జీవితాన్ని నిర్మాణాత్మక మరి సృజనాత్మక విధానాలలో నడిపిస్తాయి.

మీరు జీవితం కోసం చేసే మంచి పనులన్నిటినీ మెచ్చుకుంటూ అవన్ని మూలానికి మీ అంతర్ ఉనికికి మీ దివ్యత్వానికి చెందినవి అని గుర్తుంచుకోండి.

ఆ గొప్పతనం అంతా మీది కాదు మీలోని దివ్యత్వానిది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను, మీ దేశంలోని వ్యక్తులను, వారందరూ మానవాళి కోసం చేస్తున్న మంచినీ మెచ్చుకోండి.

ఆ విధంగా చెయ్యడంలో మీ లోపల నూతన విలువలు పెంపొంది మీ ఆత్మలోపల నూతన ఉన్నత పొరలు వికసిస్తాయి.

మెచ్చుకోలు అనేది విత్తనాల పై నీరు చల్లటం వంటింది. తద్వారా అవి ప్రేరణ వృద్ధి చెందుతాయి.

మీ చేతలు మాటలు వాటికీ ప్రేరణనిస్తాయి. కొందరిలో సరికాని లక్షణాలను చూసినా వారు వాటిని గుర్తించి వదులుకోవడంలో తోడ్పడండి.

వారి ఓటములను, అపజయాలను చూడటానికి క్షమను సాధన చెయ్యండి. దాని ద్వారా వారి ఊర్ధ్వాత్మ వారితో బంధం పెంచడానికి అవకాశం వస్తుంది.కుటుంబ బంధాలలో మెచ్చుకోలు అద్భుతాలను సృష్టిస్తుంది.

పరస్పర మెచ్చుకోలుతో సభ్యులున్న కుటుంబం చక్కటి పూల తోట వలే ఉంటుంది.

సరైన బంధాలు లేని కుటుంబాల నుంచి నేరస్తులు ఉంటారు. మెచ్చుకోలు అనేది సకారాత్మక మరియు సృజనాత్మకత జీవితానికి మొదటి మెట్టు. మెచ్చుకోలు అనేది కార్యాలలో కూడా మంచి ఫలితాలనుఇచ్చి విజయం వైపు నడిపిస్తుంది.

విమర్శ, చిన్న బుచ్చటం, సమూహాలను, సంస్థలను నిర్వీర్యం చేస్తాయి. గుణఇతరులను మెచ్చుకొని వారి హక్కులని గౌరవించటం తెలిసిన వారు, వేర్పాటు ఆసక్తుల కోసం కాక మొత్తం కోసం పని చేస్తారు. మెచ్చుకోలు మనలోని సరికాని లక్షణాలను పోగొట్టి, మనం పురోగమనం నిరోధించే అడ్డంకులన్నింటిని తుడిచి వేస్తుంది.

ప్రకృతి పట్ల కూడా మెప్పు ఉండాలి. ప్రకృతిని మెచ్చుకునే వారందరూ నదులు, చెరువులు, సముద్రాలు, బావులు, గాలి పరిశుభ్రంగా ఉండేటట్లు చూస్తారు. ప్రకృతిలో కాలుష్యానికి కారకులుగా ఉండరు.

ఆరోగ్యవంతమైన ప్రకృతి ద్వారా మాత్రమే సహజ ఆరోగ్య జీవితం సంభవమని వారికి తెలుసు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలను మరి పక్షులు, పుష్పాలను, నదీ తీరాలను వారు ఆస్వాదిస్తారు.సహకారానికి వెన్నుదన్నుగా నిలచేది మెచ్చుకోలే.

మెచ్చుకోలు కలిగిన వ్యక్తి కుటుంబ ఐక్యతకు, స్వేచ్ఛ ప్రకృతికి, ప్రపంచ శాంతికి సహకారం, తోడ్పాటు, సేవలను అందిస్తాడు. మెచ్చుకోలు అనేది వ్యక్తులలో ఇముడ్చుకునే తత్వాన్ని, సహకారాన్ని పెంపొందిస్తుంది.

మెచ్చకోలు మన శరీరాలను, మనస్సును, హృదయాన్ని బలోపేతం చేసే ఔషధం.మెచ్చుకోలు అనేది గొప్పతనానికి చిహ్నం.

అది వారిని అర్థం చేసుకొని ఒక గొప్ప లక్ష్యం కోసం, సహకారంలో ఉండడంలో మొదటి మెట్టు. అది మన ఆరోగ్యానికి, స్పష్టమైన ఆలోచనకు, సంపదకు దోహదం చేసే అంశం.ఆత్మాశ్రయ ప్రపంచంలో జీవితం అంతా ఒక్కటే, శత్రువులు లేరు శతృత్వం అనేది మీ సారంలో సంఘర్షణ చెల్లించవలసి ఉంటుంది.

మెచ్చుకోలు కలిగిన వారు మానవాళిలో ఐక్యతకు, సంపదకు దోహదం చేస్తారు. వారు విశ్వపు సృజనాత్మక శక్తుల సహశ్రామికులు.Appreciation

Leave a Comment