Gajendra పాలసముద్రంలో త్రికూటం అనే అతి విశాలమయిన పర్వతం ఉంది. దానికి శిఖ రాలు మూడు. ఒకటి బంగారుకాంతితో, ఒకటి ఇనుముతో, మూడవది రజతకాంతితో అలరారుతున్నాయి.
ఆ కొండచివరల వివిధరత్నాలు, ధాతువులు ఎంతో శోభతో కనిపిస్తాయి.
సెలయేళ్ళ చప్పుళ్ళతో, మవానవ లీనే పూలునిండిన లతలతో, మహావృక్షాలతో అలరారే ఆ శిఖరాలమీద గగనచారు లయిన కన్నరులు విహరిస్తుంటారు.
ఆ శిఖరంమీది వృక్షాలు ఎప్పుడూ పల్లవాలతో, మొగ్గలతో, పూలతో, పండ్లతో వసంతశోభను సాక్షాత్కరింప జేస్తాయి.
ఆ కొండమీది అడవులలో అడవిదున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగుబంట్లు, ఆదిగా గల క్రూరమృగాలతోపాటు ఎన్నోవేల ఏనుగులుకూడా ఉన్నాయి.
ఆఏనుగులు గుంపులుగా బయలుదేరి నడుస్తూంటే అంధకార దేవత నడయాడుతున్న ట్టు
అవి కదలి వస్తూంటే వాటి చుట్టుప్రక్కల మరే మృగమూ ఉండడానికి వీలులేదు. అలా అవి గుంపులు గుంపులుగా బయలుదేరి ఆహారం గ్రహించి, జలపానార్థం బయలు దేరాయి.
వెడుతూ వెడుతూండగా ఒక గుంపు చీలిపోయింది. అందులోని ఆడు ఏనుగులన్నీ గజరాజు వెంట సాగి, సాగి ఒకచక్కని నరోవరం చూశాయి. తామరలు అలరారుతున్నాయి.
వున్నాయి. అతి విశాలహ్రదం కావడంవల్ల అందులో ఎచ్నెన్నో జలచరాలతో మొవళ్ళుకూడా
అలసివున్న ఏనుగులగుంపు సంతోషంతో సరోవరంలోదిగి హాయిగా జలక్రీడలు పొగించాయి.
తొండంబుల పూరించుచు
గండంబుల జలుకొమచు గళ గళ రవముల్
మెండుకొన వలుదకడుపులు నిండన్
వేదండకోటి నీటింద్రా వెన్.
వేడుకతో ఆ గజేంద్రుడు తొండంనిండా నీరు పీల్చి, ఆకాశవీధికి చిమ్ముతూంటే ఆవేగానికి పైకిలేచిన కర్కాటక, మీనాలు రోదసిలోని మీన, కర్కాటాలను పట్టినట్టున్నాయి.
ఆ క్రీడ సాగుతున్నవేళ,
ఒక్కసారిగా నరోవరమధ్యంలో తరంగాలు లేచాయి.
భయంకరారావంతో తోకచప్పుడు చేయగా నుడిగుండా లేర్పడ్డాయి. ఆ కల్లోలానికి గట్టువవున్న చెట్లు ఊగిసలాడాయి. అంత ఆర్భాటంతో ఒక పెద్దమొనలి వచ్చి గజేంద్రుని కాలుపెట్టింది.
పట్టును విడిపించుకొని, తొండంతో ఏనుగు దెబ్బతీయగా, మొసలి చాకచక్యంగా వచ్చి దాని ముందుకాళ్లను పట్టుకుంది. అంతతో ఏనుగు తవదంతాలతో దానిని కుమ్మివిడిచిపెట్టగా, అది వెనుకపాటున లేచి ఏనుగు తోకను చీల్చింది.
అలా అవి ఒకదానినొకటి పీడిస్తూ సరోవరం అంతా కలయదిరుగుతున్నాయి.
కర్రి దిగుచు మకరి నరసికి
కరి దరికిని మకరి దిగుచు
కర కర్రి బెరయన్ కరికి మకరి
మకరికి కర్రి భరమవగా
అతల కుతల భటు లదరిపడన్
ఆ పోరాటాన్ని చూస్తూ నిలబడ్డాయి. ఆడ యేనుగులు.
నీరు నివాసస్థానమయిన మకరానికి బలం పెరుగుతున్నది. ఏనుగు నీరసిస్తున్నది.
సంసారవలయంలో వ్యామోహవర్తంలోపడి కొట్టుకునే జీవునివలే, ఆ మకరితో పోరలేక దీనావస్థలో పడింది, ఏనుగు.
ఇంక దీన్ని గెలవడం తన తరంకాదని నిశ్చయించుకుంది. ఈ విపత్తునుండి తనను రక్షించే దైవ మెవరా అని యోచించి, యోచించి:
ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపలనుండు లీని మె
ఎవ్వని యందు డిందు పరమేశ్వరు డెవ్వడు, మూలకారణం బెవ్వ డవాది మధ్య లయు డెవ్వడు
పర్వము తాన యైన వా డెవ్వడు.
వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్.
లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది అలోకంబగు
పెంజీకటి కవ్వ ల
ఎవ్వం డేకాకృతి వెలుగు నతని వే సేవింతున్
అని పరిపరివిధాల ప్రార్ధించి:
లా వొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె
ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చవచ్చె
తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవేతప్ప నితఃపరం బెరుగ మన్నింపందగుస్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద!
సంరక్షింపు భద్రాత్మ కా !
ని దీనంగా అర్థించగా
అల వైకుంఠపురంబులో నగరిలో
ఆ మూల సౌధంబు దావల
మందార వనాంతరామృత నరః
ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక
రమావినోదియగు ఆపన్నప్రసన్నుండు
విహ్వల నాగేంద్రము పాహి పాహి యన
కుయ్యాలించి సంరంభియై.
సర్వశక్తులూ ఉడిగి, అన్ని ప్రయత్నాలూ
విరమించి నిఖిలలోక రక్షకుడైన వారా యణుని ప్రార్థించే సమయాన, ఆ జగద్రక్షకుడు వైకుంఠంలో అంతఃపురంలోని కేళీమందిర సమీపంలో మందారవనమధ్యంలోని సరోవరతటాన చంద్రకాంత శిలావేదిపై హంసతూలికా తల్పంమీద లక్ష్మీదేవితో వరసనల్లాపా లాడుతున్నవాడు ఆడుతున్నట్లే బయలుదేరాడు.
ఎలా బయలుదేరాడు!
సిరికిం జెప్పడు శంఖ చక్రయుగమువ్
చేదోయి సంధింపడు
ఏ వరివారంబును జీరడు
అభ్రగపతిన్ బన్నింపడు
ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు
వివాద ప్రోత్థత శ్రీకుచోపరిచేలాంచలమైన
వీడడు, గ జ ప్రాణావనోత్సాహియై
లక్ష్మీదేవికి చెప్పలేదు.
శంఖ చక్రాలు ధరించలేదు.
పరివారాన్ని పిలవలేదు.
గరుత్మంతునికూడ ఆహ్వానించలేదు.
చెవులమీద చిందర వందరగా పడుతూన్న వినీల కేశాలు సవరించలేదు.
అలకలో వున్న లక్ష్మీదేవిని అనునయించడానికి పట్టుకున్న పైటచెంగు కూడా వదలకుండా బయలుదేరాడు.
ఇంకేముంది-The Divine Rescue of Gajendra: A Powerful Story of Faith
ఆయన వెనువెంట లక్ష్మీదేవి, ఆవిడతో అంతఃపుర పరివారం.
వెనకనే గరుత్మంతుడు; శంఖ చక్ర గదా శార్థాలు. వారదుడు, విష్వక్సేనుడు వారితోపాటు నగరంలోని ఆబాలగోపాలం బయలుదేరారు.
అలా నెడుతున్న లక్ష్మీదేవి మనస్సు పరిపరి విధాల ఊహలు సాగించింది.
dar దుష్ట దుశ్శాసనుల కబంధహస్తాలలో చిక్కుకొని ఏయిల్లా లయినా మొర పెట్టుకున్న
మళ్ళీ మూర్ఖు డెవడయినా వేదాలు దొంగిలించాడేమో-క్రూర రాక్షమలు అమరావతి మీద దాడికి వచ్చారో….
మహాభక్తులను హింసించి విడిరా నీ హరి అని దండించే రాక్షనుడు మళ్ళీ బయలుదేరాడేమో-
అనుకుంటూ ఆయన వెంట సాగుతూ
అడిగెదనని కడువడి జను
అడిగిన తను మగుడ ముడుపడని
పడయుడుగున్ – వెడవెడ చిడిముడి
తడబడ అడుగిడు అడుగిడదు
జడిమ నడుగెడు వెడలన్
అలా గగనవీధిలో సంచరిస్తూ !’ అంటూ ప్రార్థించాయి.
వీ రెవరినీ చూడకుండా, వారి పలుకులు వినకుండా ఆయన హుటాహుటి గజేంద్ర రక్షాదీక్షితుడై సరోవరప్రాంతం చేరి విన్ఫులింగాలు జిమ్మే సుదర్శన చక్రం ప్రయోగించిన మరుక్షణంలో అది సూర్యకాంతిలో వెళ్ళి మొసలితలను ఖండించింది.
కేంద్రుడు ఒక్కసారి ఊపిరిపీల్చి కొలను వెలువడి ఒడ్డుకువచ్చి తన కరిణీ బృంద 40లో ఎలబడ్డాడు.
శ్రీహరి పాంచజన్యం పూరించాడు. అది దుష్ట శక్తులకు హృదయ విదారకమై నజ్జమలను ఉల్లాస తరంగిత హృధయులను చేసింది.
అనంతరం నారాయణుడు తన కరస్పర్శతో గజేంద్రుని అనుగ్రహించాడు.
పరీక్షిన్మహారాజా!
దేవలుని కాసంవల్ల మకరి జన్మ యెత్తిన హూ హూ అనే గంధర్వుడు శ్రీహరి కదు ణలో శాపవిముక్తుడై గంధర్వరూపంతో వెళ్ళిపోయాడు.
ఇంద్రద్యుమ్నుడనే రాజు ఆగస్త్యమహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మయెత్తి ఈ విధంగా శాపవిముక్తుడై వైకుంఠం చేరాడు.
అప్పుడు నారాయణుడు నవ్వుతూ లక్ష్మీదేవిని చూసి,
నీ పైటచెంగుకూడా వీడకుండా వచ్చేటప్పుడు ఏమనుకున్నావు నువ్వు; బాలా! నిరంతరం నన్ను స్మరించే వారిని నేను మరువనని ఎరుంగుదువు కదా, అనగా :
స్వామి! దీనుల మురలువిని వారిని రక్షించే నీ వెంట రావడంకంటె యింకేమీ నాకు అవసరంలేదు. అంది శ్రీదేవి.
గజరాజ మోక్షణమును నిజముగ పఠియించునట్టి
నియతాత్ములకున్ గజరాజ వరదు డిచ్చును.
గజతురగ స్యందనములు కైవల్యంబుస్
తామస మన్వంతరంలో గాథ అది.
అనంతరం యీయన తమ్ముడు రైవతుడు మను వయాడు. తరువాయి చాక్షుషమనుపు పాలించాడు.
ఈ మనువుకాలంలో క్షీరసాగరమథనవేళ శ్రీహరి కూర్మావతారం ధరించాడు.
ఆ వృత్తాంతం విను.
