
Vastrapaharanam అలా ఎన్నెన్నో లీలలు చూపుతూ, గో, గోపగణాలకు కలిగే ఆపదలను తొలగిస్తూ, యశోదాదేవికి పసిబిడ్డగా వేడుకలు చూపుతున్నాడు.
ఆకాలంలో గోపికలందరూ శాత్యాయనీ వ్రతంచేసి కృష్ణునే తమభర్తగా అను గ్రహించమని ఆ శక్తిని ప్రార్థించి, మాసాంతాన యమునానదిలో స్నానంచేస్తున్నారు.
వారందరూ యమునగట్టున విడిచిన వారి చీరలు దొంగిలించి గోపబాలుడు ఒక చెట్టుఎక్కి కూర్చున్నాడు. అది గమనించిన గోపికలు :
మా మా వలువలు ముట్టకు మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్ మా మాన మేల కొనియెదు మా మానస హరణమేల! మానుము కృష్ణా! అని అనేక విధాల అర్థించారు.
అప్పుడు కృష్ణుడు నవ్వుతూ :
మీరందరూ ఎవరిని భర్తగా కోరి వ్రతంచేశారో చెప్పండి. సిగ్గుపడకుండా మీ మనసులో ఉన్నది చెప్పి, అలానే ఇటువస్తే విచీరలిస్తాను, అన్నాడు.
వచ్చారు. వారందరూ కొంత సేపు గుసగుసలతో గునుగుళ్ళుపడి చివరకు నదిలోంచి ఈవలకు
చంచ త్పల్లవ కోమల కాంచన నవరత్న ఘటిత కంకణ రుచి రోదంచిత కర సంచాదిత పంచాయుధగేహ లగుచు పడతులు వరునన్.
ప్రౌఢలు ముందునడువగా, ముగ్ధలు వెనుకవచ్చి నిలువగా :
మీరంతా చేతులుజోడించి నమస్కరించాలి, అన్నాడు గోపబాలుడు.
అందరూ చేతులెత్తి నమస్కరించగా, వారి చీరలు వారికిచ్చి మీనోముఫలం సిద్ధిస్తుంది, అని అభయమిచ్చాడు.
అలా వారందరికీ ఆనందం కలిగిస్తూ, ఒకసారి గోవర్ధనం ఎత్తి, వరుణుడు అప హరించుకు పోయిన నందుని విడిపించి తెచ్చి, శరద్రాత్రులలో పరిసరవనంలో వేణుగానంతోగోపికాజనాన్ని సంతోషతరంగాలలో తేలియాడిస్తూ, అంతలో అదృశ్యంకాగా వారందరూ ఆవేదనాభర హృదయాలతో :
నల్లనివాడు, పద్మనయనంబులవాడు కృపారసంబు పై జల్లెడువాడు .
మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మా పధనం తెచ్చి, ఓ మల్లియలార ! మీ పాదలమాటున లేడుగదమ్మ చెప్పరే!
అంగజువైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదు రంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వుతూపులకు అగ్గముసేని లవంగ లుంగ నారంగములార!
మీ కడకు రాడుగదా ! కృపనున్నజూపరే!
అంటూ గోపికాగీతలు వినిపించారు. అనంతరం రానక్రీడలు నడిపించాడు. సుదర్శన గంధర్వునికి శాపవిమోచనం కలిగించాడు. శంబచూడుడవే గుహ్యకుని సంహరించాడు. వృషభానురుని యమసదనం చేర్చాడు.
కృష్ణుడు దేవకీనందనుడని తెలిసి కంనుడు తన ముఖ్యభటుడైన కేశదానవుని వంవగా వాడుకూడా కృష్ణునిచేతులలో ప్రాణాలు వదిలాడు.
అది విని కంనుడు తన కనుసన్నలలో నడిచే చాణూరముష్టికులనే మల్లయుద్ధ విశారదులతో సంప్రదించి, అక్రూరుని రావించి, గోకులానికి వెళ్ళి బలరామ, కృష్ణులమా, నందునీ యిక్కడ జరిగే మల్లయుద్ధానికి రమ్మని కబురు పంపాడు.
అక్రూరుడు కంసుని మూర్ఖత్వానికి విచారించి, కృష్ణదర్శన సంతోషంతో రథా రూఢుడై బృందావనంచేరి బలరామ కృష్ణులను చూచి వారితో వందుని యింటికి చేరాడు.
స్వాగత సత్కారాలు పూర్తి అయాక, కందుడు ధనుర్యాగం పేరిట పంపిన ఆహ్వాన విషయం వివరించాడు. ఈ వార్తవింటూనే గోపికాజనం అందరూ కన్నులనీరుపెట్టారు.
ఎలా అయినా కృష్ణుని కదలకుండా ఆపాలని ప్రయత్నించారు. వారందరినీ ఓదార్చి బలరామసహితుడై కృష్ణుడు యదువంశపు పెద్దలతో ప్రయాణమయాడు.
రథాలు సాగిసాగి మధురానగరానికి చేరి రాజవీధులలో వెడుతుంటే, ఆ భవనాలలోని కాంతాజనం కృష్ణ సందర్శనాభిలాషతో ఎలావున్నవారు అలా వచ్చి గడపలలో నిలబడి:
వీడటే! రక్కసి విగతజీవగ
చన్ను వాలు ద్రావిన మేటి బాలకుండు
వీడటే! నందుని వెలదికి
జగమెల్ల ముఖమున జూపిన ముద్దులాడు
వీడటే! మందలో వెన్నలు దొంగిలి
దర్శించి మెక్కిన దావరీడు
వీడటే! అలయించి వ్రేతల మానంబు
నూరలాడిన లోక మందరుండు
వీడు లేకున్న పుర ఘటవీన్డలంబు
వీని పొందని జన్మంబు విగతఫలము
వీని పలుకని వచనంబు విహగ రుతము
వీని చూడని చూడ్కులు వృథలువృథలు
అనుకున్నారు, ఆనందతన్మయులై.
కొంత దూరం సాగిసాగి ఒక రజకుని యిల్లుచేరి, అక్కడున్న చీని చీనాంబరాలు తమకు కావాలనగా, వాడు కోవంతో కంసమహారాజు ధరించే విలువయిన వస్త్రాలు కట్టే తాహతు మీ కెక్కడుంది? అని గద్దించగా, వానిని మర్దించి ఆ వస్త్రాలు ధరించి,
అక్కడి నాయకు డిచ్చిన అమూల్యాంబరాలు కూడా స్వీకరించి, పూలమాలలు కట్టడంలో నేర్పరి అయిన సుదాముని యింట స్వాగతమర్యాదలు స్వీకరించి, వాడిచ్చిన సుగంధ సుమమాలలు అలంకరించుకుని ముందుకు సాగుతూండగా ఎదురుగా కుబ్జ కొనిపించింది.
దానిని చూసి కృష్ణుడు:
ఎవరి దానవమ్మాయీ! నీపేరేమిటి? ఇన్ని చందన లేపనాలు ఎవరికోసం తీసుకెడు తున్నావు! ఓ పద్మదళనయనా! అవి మాకిస్తే నీకు చక్కదనం వస్తుంది.
అన్నాడు.శుబ్ద :- ఓ మనోహరాశారా! అందరికీ అంది లెక్కడమంచి వస్తాయి. వేను కంసుని దాసిని, నన్ను త్రివిక్ర అంటారు. లేపవ విద్యలో నాకు మంచి వేర్చున్నది. ఈ చందనపు పూతలతో మీరు కూడా సంతోషించగలరు. అంది.
కృష్ణుడు సంతోషంలో చందనాలేవనాలన్నీ వూరుకుని, ఆమెను చేరి ఒక కాలితో ఆమె పాఠం త్రొక్కిపట్టి రెండు వ్రేళ్ళతో ఆమె చుబుకం పట్టి పైకి లాగాడు.. అంతే! దాని వంకర లన్నీ పోయి చక్కని చుక్కలా విలబడింది..
దాని ఆకారం దానికే పరమసంతోషం కలిగించగా,
శుద్ధ:- సందశరాకారా! వెన్నంత చేసిననువ్వు ఒకమారు నా ఇంటికి వచ్చి సంతోష పెట్టు, అని ఉత్తరీయంపట్టగా, ఆమెను లాలించి, మళ్ళీ వస్తాడిని ముందుకుపొగాడు.
నెమ్మదిగా నడచి నడచి, కంసిని ఆయుధశాలలో అడుగు పెట్టి అక్కడ దేవేంద్రుని ధనస్సులా వెలిగే చాపాన్ని విరిచాడు కృష్ణుడు ఆధ్వనికి మధురానగరం గజగజ బాడింది. కంమని గుండె విబ్బరం జారింది..
ఆ రాత్రికి విశ్రమించి ఉదయమేలేని ఉత్సాహంలో ధనుర్యాగమండపానికి వచ్చారు, బలరామకృష్ణులు,
ఆ రంగస్థలముఖద్వారంలో వున్న కువలయాపీడం అనే మత్తగజాన్ని ‘వారి మార్తికి పడిపించాడు మావటీడు.
చూస్తూనే కృష్ణుడు జట్టుముడివైది, కాసెకోకగట్టిగాకట్టి, మధురుమీదజారే ముంగురులు వెనుకకు త్రోసి, యుద్ధోత్సాహంతో ముందుకురూకి, సింహగర్జనచేసి దాని రెండు దంతాలూ ఊడబెరికి, కొండంపట్టి నరగిరత్రిప్పి విసరగా అది గిలగిల తన్నుకుంటూ నెలకూలింది.
చచ్చిన మత్తేభాన్నీ, చంపి వచ్చిన యదువంశీ యోదులను చూచిన కంపెని మనస్సు వ్యాకుల మటుంది.
మల్లయుద్ధ విశారదుడైన బాబూరుడు వారిని చూచి, కెబ్బ చరిచాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ!
నీతో నే మంటాను, మా బలరాముడు ముష్టికునితో పోరాడుతాడు,
అనగా వాడు అట్టహాసం చేసి, వేలెడులేని మీకు మాకో యుద్ధమా! అంటూ మీదికి రాగా, అన్నదమ్ము లిద్దరూ వారితో కొంతసేపు పోరాడి నేలకూల్చారు. వారు వెత్తురు కక్కుతూ కూలిపోగా. కందుడు ఆవేశంతో:
కంస వధ
ఈ యాదవ బాలు రిద్దరినీ కోట ఆవలకు తరిమికొట్టండి.
నందుణ్ణి బంధించి, వసుదేవుని సంహరించి, నా తండ్రి ఉగ్రసేనుని కూడా బంధించండి.
అని అరుస్తున్నాడు.
చూశాడు కృష్ణుడు.
కొండమీద తిరిగే జింకను పట్టడానికి దూకే సింహంలా మల్లయుద్ధ రంగస్థలంలో వున్న కంనుని మీదికి దూకి, గరుత్మంతుడు నాగేంద్రుని పట్టినట్లు జుట్టు బిగబట్టి ఒక్క ఊపు ఊపగా,
ఆ తలమీద మణికిరీటం వేలకు జారింది. అంతతో ఆగక విదిలించి విసిరేసరికి ప్రాణాలు వదలి అల్లంతదూరాన పడ్డాడు.
అదిచూసి క్రోధోద్రిక్తులై కంనుని సోదరులు ఆయుధాలతో మీదికిరాగా బలరాముడు పరిఘాయుధంతో వారిని నేలకూల్చాడు.
మరణించినవారి దహనసంస్కారాలకు ఆజ్ఞాపించి, చకచక చెరసాలకు వెళ్ళి దేవకీ వసుదేవులను విడిపించి, నమస్కరించి, కొంత సేపు వారితో ఇష్టాగోష్ఠి సాగించి, తాతగా రయిన ఉగ్ర సేమని చేరి,
తాతా! యయాతి మహారాజు శాపం కారణంగా మా యదువంశానికి సింహాసనాధి కారంలేదు. మీరే ఈ ఆసనం అలంకరించి అందరినీ సంతృప్తులను చేశాడు. ప్రజారంజకంగా పరిపాలించండి, అని
కొన్నాళ్ళయాక నందునితో:
ఇంతకాలం మేము మీదగ్గరే ఉన్నాం. కొంతకాలం మా కన్నతల్లిదండ్రులను సేపించి వారికి సంతోషం కలిగించి మళ్ళీ బృందావనానికి రాగలం. మీరు వెళ్ళి రండి,
అని వారందరిని వారి వారి చివాసాలకు పంపుతూ ఎన్నెన్నో కానుక లిప్పించాడు.
అనంతరం వసుదేవుడు తన కుమారులకు సముచితకాలంలో పురోహితులు గర్తుల వారిచేత ఉపనయన సంస్కారంచేయించి, గోదానాలూ, నువర్ణదానాలూ జరిపించి,
సర్వ జనులకూ తృప్తిగా అన్నదానం చేశాడు.తరువాయి బలరామ, కృష్ణులు కాశీనగరం వెళ్ళి అక్కడ సాందీపని అనే గురువు వద్ద పేద, ధర్మశాస్త్రాలు, ధనుర్వేదమూ అభ్యసించారు.
విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వారు గురుదక్షిణగా ఆయన కోరిక సనుసరించి వారు. గురువుగారి అనుమతితో మధురానగరానికి తిరిగి వచ్చిన అనంతరం ఒకనాడు
ఉద్ధవుని పిలిచి:
ఆర్యా! నందవ్రజంలోని గోపశాంత లందరూ ఈ లోకవాంచలెమా లేకుండా వం తరం నా మీదవే మనసు నిలుపుతూంటారు. వారిదగ్గరకు పోయి నేను త్వరలోనే న్నానని చెప్పి వారికి ఆశ్వాసస కలిగించు, అని పంపాడు.
ఉద్దవుడు నందవ్రజం చేరగానే అక్కడి పెద్దలందరూ వారికి ఆదర సత్కారాలు జరిపించి, కుశల ప్రశ్నలు పూర్తిచేసి, అన్న పాఠాలతో సంతృష్ణుని చేశారు.
త్వరలోనే కృష్ణుడువచ్చి యశోదమా, నందునీ సంతోషింపజేస్తాడని చెప్పి ఆనందం కలిగించాడు.
ఆరాత్రి సుఖంగా నిద్రించాడు.
ఉదయమే గోపకాంతలు చల్ల చిలికేవేళకు లేచి సాధికాలు హర్తదేది, కాళిక పవిత్ర ప్రదేశంలో మఖాసీమపై ఉన్న ఉద్దవునిచూసి గోవభామలు కొందని, పర్మగర్భంగా కృష్ణనివిద తమకు కలిగిన పాలయలుక వ్యక్తం చేశార.Vastrapaharanam