Ramayana ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి కష్టాలు మరియు ప్రతికూలతలు సవాళ్లుగా మారుతాయి. కాన, విరుద్ధంగా, శ్రేయస్సు మరియు అనుకూలతలు ఇంకా పెద్ద సవాళ్ళుగా మారుతాయి.
కష్టాలు మన విశ్వాసాన్ని కోల్పోయేవిదంగా చేస్తే, సంతోషాలు మరియు సుఖాలు మన జీవిత ఉద్దేశ్యాలను మసకబారుస్తాయి.
సౌకర్యాలు నిర్లక్ష్యానికి దారితీస్తాయిసౌకర్యాలు మరియు సంతోషాలు ఎలా సవాళ్ళుగా మారుతాయో, రామాయణం మనకు సుగ్రీవుని కథ ద్వారా తెలియ చేసింది.
తన సోదరుడి అనుమానం మరియు తప్పుడు నిర్ణయం ద్వారా సుగ్రీవుడు రాజ్యం వదిలి, భయంతో జీవిస్తున్నాడు.
అలా జీవిస్తున్నప్పుడు, తన సోదరునితో సయోధ్య కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయిన తర్వాత, రామునితో మైత్రీ బంధాన్ని ఏర్పరచుకున్నాడు.
రాముడు కూడా అప్పటికే తన రాజ్యం అయోధ్య నుండి బహిష్కృతుడై,అపహరించబడిన తన భార్య సీతను వెతుకుతున్నాడు.
రాముడు, అన్యాయంగా జరిగిన తప్పును సరి చేసి, సుగ్రీవుడు రాజ్యాన్ని తిరిగి పొందడంలో సహాయం చేశాడు. దానికి బదులుగా, సుగ్రీవుడు సీతను కనుగొనడంలో రాముడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు.
సుగ్రీవుడు రాజుగా పదవిని చేపట్టేసరికి వర్షాకాలం ప్రారంభమైంది. కురుస్తున్న వర్షాల కారణంగా, నాలుగు నెలలు ప్రయాణం అసాధ్యమైంది.
కావున రాముడు మరియు సుగ్రీవుడు వర్షాకాలం ముగిసిన తర్వాత సీత కోసం అన్వేషణ ప్రారంభించాలని ఇరువురు అంగీకరించారు.
ఈ నాలుగు నెలలు సుగ్రీవుడు, రాముడిని తన రాజ్యంలోని రాజ భవనంలో ఉండమని ఆహ్వానించాడు.
కానీ రాముడు, తన పద్నాలుగు సంవత్సరాల వనవాస నిబంధనకు కట్టుబడి ఉండాలని కోరుకున్నాడు. అందుకని రాజ్యం వెలుపల ఒక గుహలో ఉన్నాడు.
సుగ్రీవుడు ఇంతకాలంగా తనకు లభించని సుఖాలు, సౌకర్యాలు ఒక్కసారిగా పొందేసరికి, ఈ నాలుగు నెలలు వాటిలో మునిగిపోయాడు.
ఇంద్రియ భోగాలతో తనను తాను మైమరచి, రాముడికి చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు.
కాలం గడిచిపోయింది మరియు వర్షాకాలం ముగిసిపోయింది. రాముడు చింతిస్తూ లక్ష్మణుడితో,
“ఓ సోదరా! సుగ్రీవుడు సీతను వెతకడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు నాకు కనిపించడం లేదు.
దయచేసి వానర రాజ్యానికి వెళ్లి, పరిస్థితిని పరిశీలించు” అన్నాడు.
లక్ష్మణుడు వెంటనే వానర రాజ్యానికి బయలుదేరాడు. కిష్కిందకు వెళ్లేదారిలో, సుగ్రీవుడి కృతఘ్నత భావం గురించి ఆలోచిస్తూ, లక్ష్మణుడు మండుతున్న కోపంతో ఊగిపోయాడు.
అతని కోపాన్ని చూసిన వానర సైనికులు రాజభవనానికి వెళ్లి రాజుని అప్రమత్తం చేశారు.ఇంతలో, సుగ్రీవుడు తన తెలివైన భార్య తార, మంత్రి హనుమంతుడు మరియు ఇతర సలహాదారులను సంప్రదించాడు.
వారు ఇదివరకే, ఎప్పుడైతే వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయో, సుగ్రీవుడికి తన వాగ్దానాన్ని గుర్తు చేశారు. అప్పుడు, సుగ్రీవుడు వెంటనే దూర ప్రాంతాల నుండి వానరులని పిలిపించమని ఆదేశించి.
వెంటనే మళ్ళీ భోగభాగ్యాలలో కూరుకుపోయాడు.

లక్ష్మణుడు, సుగ్రీవుని గదిలోకి ప్రవేశించి ఇంద్రియ భోగాలకు ఆశ్చర్యపోయాడు.
“ఓ సుగ్రీవా! కృతఘ్నత అనేది అన్ని పాపాల్లో కెల్లా అతి పెద్దది. తమ స్నేహితులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తు ఆనందించే కృతఘ్నులు ఖండించబడతారు” అని విమర్శించాడు.
లక్ష్మణుడి మాటలకు బదులు చెప్పేందుకు సుగ్రీవుని నోట మాట రాలేదు.
అప్పుడు తార జోక్యం చేసుకొని “దయచేసి సుగ్రీవున్ని క్షమించండి. గొప్ప ఋషులు కూడా కొన్ని సమయాల్లో ప్రలోభాలకు లోనయ్యారు.
అలాంటిది చాలా కాలము తర్వాత అకస్మాత్తుగా భోగాలు దొరికిన ఒక వానరుని చెప్పేదేముంది” అంటూ లక్ష్మణుడిని తన సౌమ్యమైన మాటలతో శాంతింప చేసే ప్రయత్నం చేసింది.
సీతను వెతకటానికి ఎలాంటి ప్రణాళికలేకపోవడంతో లక్ష్మణుడికి కోపం వచ్చిందని గ్రహించిన తార లక్ష్మణుడితో “ఓ లక్ష్మణా! ఇప్పటికే దూర ప్రాంతాల నుండి శక్తివంతమైన వానరులు కిష్కిందకి బయలుదేరారు.
త్వరలోనే వారందరు సీతను వెతకడానికి అన్ని వైపులా వెళారు అని చెప్పింది”.
అది విన్న లక్ష్మణుడు శాంతించాడు.రాముడు మరియు రావణుడి మధ్య యుద్ధానికి ముందు, సుగ్రీవుడు మరొక ప్రలోభాన్ని ఎదుర్కొన్నాడు.
రాక్షస రాజు రావణుడు తన తెలివితేటలతో కుట్రపన్ని, ప్రత్యర్థులలో చీలిక సృష్టించేందుకు ప్రయత్నించాడు.
వానరులకు మరియు రాక్షసులకు మధ్య ఒకరికొకరికి శత్రుత్వం లేదని చెప్పి, సుగ్రీవుని వద్దకు రహస్యంగా దూతలను బహుమతులతో పంపాడు.
పైగా, సుగ్రీవుడు యుద్ధ భూమి నుండి తన సైన్యాన్ని వెనక్కు తీసుకుంటే, పరస్పర సహాయానికి అనుకూలమైన ఒప్పందాన్ని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్ని రావణుడు ప్రతిపాదించాడు.
కానీ సుగ్రీవుడు నిరాడంబరమైన సైనిక శిబిరంలో నివసిస్తూ, రాముడికి సేవ చేస్తున్నందున అతనికి ఆ ప్రలోభం ఏమాత్రం ప్రభావం చూపలేదు.
అతను అన్నింటినీ తిరస్కరిస్తూ, రాముడి శత్రువు, నాకు కూడా శత్రువే అని బదులిచ్చాడు.
భక్తి నెమ్మదిగా తగ్గిపోవడంసౌకర్యాలు మన భక్తిని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి.
కొంతమంది దుర్మార్గులు ఆనకట్టలపై ప్రత్యక్షంగా దాడి చేస్తే, భద్రత దళాలు వారిని ఎదుర్కొని జలాశయాన్ని రక్షించడానికి చర్య తీసుకోగలవు.
కానీ ఆ దుర్మార్గులు, ఒక చిన్న గండికి కారణమైతే ఎవరు కూడా దాన్ని గుర్తించకపోవచ్చు – మరియు ఆ గండి ద్వారా పోయే నీరు చివరికి మొత్తం జలాశయాన్నే ఖాళీ చేయవచ్చు.
అదేవిధంగా భక్తిలో సాధన చేస్తునప్పుడు, మాయాశక్తులు నేరుగా వచ్చి మనకు అధార్మికమైన, భక్తి వ్యతిరేకమైన ప్రలోభాలను చూపించి ఆకర్షించడానికి ప్రయత్నిస్తే, మనం వాటిని స్పష్టంగాతిరస్కరించగలుగుతాం.
కానీ మాయాశక్తులు, సౌకర్యాలను ఆయుధంగా ఉపయోగించి మనపై దాడి చేసినప్పుడు, దేవుణ్ణి ప్రత్యక్షంగా తిరస్కరించమని చెప్పవు.
అందుకనే వాటిని మనం గుర్తించలేము మరియు తిరస్కరించలేము.Sugriva and laxmana
అలాంటి ప్రలోభాలు నెమ్మదిగా మన భక్తిని నాశనం చేస్తాయి. అవి మన ప్రాధాన్యతలలో సుఖాలను పైకి చేర్చి, భగవంతుణ్ణి మరియు భక్తిని క్రిందకి దిగజారుస్తాయి.
మనం భగవంతుని సేవ కోసం ప్రపంచంలోని వనరులను సంపాదించి, ప్రారంభంలో వాటిని ఆ సేవలో వినియోగించవచ్చు.
కానీ క్రమంగా వాటిని ఉపయోగిస్తూ, అసలు ఉద్దేశ్యాన్ని మరిచిపోతాము లేదా వదిలేస్తాము – ఇది మనకు భక్తి వ్యతిరేకమైన ఉద్దేశ్యాలతో కలిగినది కాక, మనలో పెరుగుతున్న సుఖ భావన మరియు నిర్లక్ష్యం, భక్తి సంకల్పాన్ని సూక్ష్మంగా నాశనం చేస్తుంది.
అలాంటి నాశనాన్ని మనం తపస్సు ద్వారా ఎదురుకోవచ్చు.
భౌతిక సౌకర్యాలకు, సుఖాలకు నియంత్రణ లేకుండా అలవాటు పడటం ప్రతికూలత కాగా స్వయంగా మరియు స్వచ్ఛందంగా వాటిని వదులుకోవడం అనుకూలత లేదా తపస్సు.
తపస్సు అనేది ఆధ్యాత్మికంగా మన ఉద్దేశ్యాలను పదిలంగానే నిలబెట్టడంలో సహాయపడుతుంది.
ఇది మహాభారతంలోని ఒక సంఘటన ద్వారా బాగా స్పష్టమవుతుంది.పాండవులు అరణ్య వాస చివరి దశలో ఉన్నప్పుడూ, వారు హిమాలయాలను అధిరోహించి కుబేరుని స్థానం వరకు చేరుకున్నారు. కుబేరుడు దేవతల కోశాధికారి. అతడు చాలా తోటలను కలిగి ఉన్నాడు.
వారు కోరుకున్నంత కాలం అక్కడే ఉండమని కుబేరుడు పాండవులను కోరాడు. పాండవులు నిజానికి ఇంకా అరణ్యవాసంలోనే ఉన్నపట్టికీ, ఆ దివ్య తోటలలోని నివాసం, భూమిపై వారు అనుభవించిన కఠినమైన జీవనంతో పోలిస్తే చాలా సౌకర్యవంతమైనది.
కానీ అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత భీముడు మరియు అర్జునుడు, ధర్మరాజు వద్దకు వెళ్లి భూమిపై అరణ్యాలకు తిరిగి వెళ్లామని అభ్యర్థించారు.
సుఖాల మధ్య ఉండటం వల్ల తమపై జరిగిన ఆకృత్యాలను మరిచిపోయి, వారి యుద్ద స్పూర్తిని కోల్పోతామని మరియు దానివల్ల తమ రాజ్యాన్ని అన్యాయంగా స్వాధీనం చేసుకున్న కౌరవులను ఎదుర్కోలేకపోవచ్చని వారిద్దరు భావించారు –
కౌరవులు వారి రాజ్యాన్ని అన్యాయంగా తీసుకున్న వారు కావడంతో వారిని ఎదుర్కొనడం అవసరమని వారు గ్రహించారు.పాండవులు తమ రాజ్యాన్ని యుద్ధం లేకుండా తిరిగి పొందాలని ఆశించారు కానీ, వారేమీ ఆశావాదులు కాదు.
దుర్యోధనుడు వారి పట్ల చాలా అసూయపరుడైనందున, రాజీ పడటానికి అవకాశం లేకపోయింది.
అందువల్ల, వారు శారీరకంగా మరియు మానసికంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, ధర్మరాజు తన ఇద్దరు సోదరులు చెప్పిన దానితో ఏకీభవించాడు.
త్వరలోనే వారందరు కఠినమైన అరణ్యంలో జీవితం కొనసాగించడానికి బయలుదేరారు.
బాహ్యంగా చూడటానికి, సుగ్రీవుడికి మరియు పాండవులకు ఎదురైన పరిస్థితులు, వారి ప్రతిస్పందనలు పూర్తి విభిన్నంగా కనిపిస్తాయి.
సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు, కానీ పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయారు. అంతేకాకుండా, సుగ్రీవుడు భగవంతుని పట్ల తన బాధ్యతను మర్చిపోయాడు.
కానీ పాండవులు తమ కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలని కోరుకున్నారు. వారు తమ రాజ్యాన్ని దక్కించుకొని, ధర్మబద్ధంగా పరిపాలించడం ద్వారా భగవంతుడిని సేవించి కీర్తించవచ్చనని భావించారు.
ఈ రెండు సంఘటనల పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, వాటి వెనుక నేపథ్యం మాత్రం ఒకటే. సౌకర్యాలతో,
సుఖాలతో తృప్తి చెందడం వల్ల మన జీవిత లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని మరిచిపోతాము. సుగ్రీవుడు సౌకర్యాలతో, భోగాలలో తేలిపోతూ బాధ్యతలను విస్మరించాడు. పాండవులు అలా జరగకుండా వారు సుఖాలను, సౌకర్యాలనువదులుకున్నారు.
నిజానికి, తపస్సు అనేది అలసత్వంకి వ్యతిరేకంగా భరోసా పత్రంలా పనిచేస్తుంది.సాంకేతిక స్వర్గం?ఈ కాలంలో సుఖాలు ప్రధానంగా సాంకేతికతో లభిస్తాయి. ఇది తరచుగా మనలో నాస్తిక భావాన్ని పెంచుతుంది.
మనకు కావాల్సినవన్నీ కొన్ని క్షణాల్లో, కొన్ని నొక్కులతోనే పొందగలుగుతామనే నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఇది, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, ఆధ్యాత్మిక స్వర్గానికి ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా ప్రచారం చేయబడుతోంది.
కానీ మనం కొన్ని బటన్లను నొక్కడం ద్వారా ఎక్కువ విషయాలను తాత్కాలికంగా నియంత్రించవచ్చునేమో కానీ, మన లోపలి ప్రపంచాన్ని మాత్రం ఏమీ నొక్కినా నియంత్రించలేము. మన మనసు, భావోద్వేగాలు చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్టు, మన జీవన సాధనాలు, మన జీవిత ఉద్దేశ్యాన్ని చాలా దూరం చేశాయి. మన శాస్త్రీయ శక్తి, మన ఆధ్యాత్మిక శక్తి మించి పోయింది.
మన దగ్గర, దారి తప్పని క్షిపణులు, దారి తప్పిన మనుషులు ఉన్నారు.
ఈ కాలంలో మనుషులు అత్యాధునిక సాంకేతిక స్వర్గాన్ని ఆశిస్తూ మానవత్వాన్ని, దైవత్వం నుంచి ఎంత దూరం చేస్తున్నారో, అంతే ఎక్కువగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు.
మానసిక ఆరోగ్య సమస్యలను ప్రస్తుత శతాబ్దపు అతిపెద్ద సమస్యగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.ఏమైనప్పటికీ భక్తి, సాంకేతిక విజ్ఞానానికి వ్యతిరేకి కాదు.
రామాయణ, మహాభారత కాలంలో కూడా చాలా అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య, సాంకేతికత యొక్క ప్రాబల్యం కాదు, దేవుని గురించి స్పృహ లేకపోవడం వల.
ఆధునిక సాంకేతికత, దేవుని వైపు చిన్న చూపును అధికం చేస్తుంది.కొన్ని సంక్లిష్ట విషయాలను చిన్న చిన్న భాగాలుగా విభజించడం ద్వారా వాటిని చక్కగా వివరించవచ్చు.
అలా, యంత్రాల గురించి వివరించడానికి బాగుంటుంది కాని ప్రతి విషయాన్ని వివరించలేము.
కొంతమంది దీనిని ప్రతి దానికి ఆపాదించుతారు. వారు సృష్టిలోని ప్రతి కార్యం కేవలం అణువు లేదా పరమాణువు కదలికల ద్వారా జరుగుతుందని భావిస్తారు.
అలా ప్రతిదీ మన చేతుల్లోనే ఉందనుకుంటూ దైవిక మేధస్సును తిరస్కరించిడం ద్వారా, సాంకేతిక విజ్ఞానాన్ని దేవుడు ఇచ్చిన బహుమతిగా కాకుండా, మానవుని కృషిగా భావిస్తారు.
అలా అనుకునే వారు, మానవుడు కనిపెట్టిన సాంకేతిక ఉత్పత్తులన్నీ కూడా (ఉదాహరణకి విమానాలు, చరవాణులు ప్రయాణించడానికి మరియు సంభాషించడానికి) గురుత్వాకర్షణ శక్తి, గతి నియమము లాంటి సహజ సూత్రాలపై ఆధారపడి ఉంటాయి అని చెప్తుంటారు.
ఈ సహజ సూత్రాలు మానవమేధస్సులో ఉద్భవించవు. అవన్నీ భగవంతుని మేధస్సు నుంచే పుడతాయి.
అందువల్ల వివేకం గలవాడికి ప్రతి సాంకేతిక విజయం, మానవ మేధస్సుకు సాక్ష్యం మాత్రమే కాదు భగవంతుని మేధస్సుకు నివాళి కూడా.
అలాంటి జ్ఞానాన్ని, వివేకాన్ని పెంపొందించుకోవడానికి మనం స్థిరమైన తపస్సును ఆచరిస్తూ శాస్త్ర పఠనం ద్వారా, ధ్యానం ద్వారా భగవంతునిపై మనస్సును కేంద్రీకరించాలి.
ఆ విధంగా దైవత్వం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, సాంకేతికత వెనుక గల ఆధ్యాత్మికతను మనం చూడగలుగుతాము. తద్వారా సుఖాల నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము.ఆధ్యాత్మికీకరణ – తిరస్కరణ కాదుభక్తి, ప్రపంచాన్ని తిరస్కరించమని చెప్పదు.
దాని మూలమైన భగవంతునితో సంబంధం ఏర్పర్చుకొమ్మని కోరుతుంది. కొన్ని సాంప్రదాయాలు,
ఈ ప్రపంచాన్ని, అన్ని కష్టాలకు కారణంగా చూపిస్తూత్యజించాలని సూచిస్తే, భక్తి సాంప్రదాయం మాత్రం సానుకూలంగా, భగవంతునికి సేవ చేయడానికి లభించిన ఒక అవకాశంగా చూపిస్తుంది.
భౌతికంగా, ఆధ్యాత్మికంగా ప్రతిదీ భగవంతుని నుండే వస్తుంది. అంటే ప్రతిదీ కూడా భగవంతుని శక్తిగా తన సేవలో ఉపయోగించబడాలి.
భక్తి, కష్టాలను ఎక్కువ చేసి చూపదు అలాగే సుఖాలను తక్కువ చేసీ చూపదు.
భక్తి, మనల్ని మనం నిజంగా అర్థం చేసుకుని, ఏ పరిస్థితినైనా సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహిస్తుంది.
తీవ్రమైన కష్టాలు, భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాలు రెండింటిని కుదిపేస్తాయి. అదేవిధంగా సౌకర్యాలు మరియు సుఖాలు వాటికవే ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదం కావు.
కోరికల పరంగా కాకుండా అవసరం కొరకు మాత్రమే, సౌకర్యాలను మరియు సుఖాలను వినియోగించడం ద్వారా, మనస్సు కలతల నుండి విముక్తి చెంది భగవంతునిపై ధ్యానించడానికి ఉపయోగపడుతుంది.
రాజ్యసుఖాలు సుగ్రీవునిలో భాద్యతల పట్ల అలసత్త్వాన్ని ప్రేరేపించినప్పటికీ, అతని సలహాదారులెవ్వరు అతన్ని భౌతిక సుఖాలను వదులుకోమని కోరలేదు.
దానికి బదులు రాముడికి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోమని, అతనికి ఆచరణాత్మకమైన సేవను అందించమని అడిగారు.
అదేవిధంగా మనకున్న సౌకర్యాలు, సుఖాలను భగవంతుని కృపగా,దేవుణ్ణిచక్కగాసేవించడానికిప్రేరణలుగా భావించవచ్చు.
అంతేగాని, వాటిని భక్తికి దూరం చేసే ప్రలోభాలుగా చూడనవసరం లేదు. దేవుడు నాకు సేవ చేయడానికి అనుకూలమైన పరిస్థితిని ఇచ్చాడు, కావున నేను తన మీద ప్రేమ పెంచుకొనుటకు ఈ వనరులను ఉపయోగించాలి.
అతని కీర్తిని వ్యాపింప చేయడానికి మరియు అతని మీద స్మరణను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అని మనము భావించాలి.
తార, హనుమంతుడు మరియు లక్ష్మణుడు అందరూ సుగ్రీవుడికి తన బాధ్యతను గుర్తుచేసి, తన తప్పును సరిదిద్దుకోవడానికి సహాయం చేశారు.
అదేవిధంగా మనకు కూడా భగవంతుని పట్ల మన బాధ్యతనుగుర్తు చేసేస్నేహితులు మరియుమార్గదర్శకులు ramayana