అజామీళుడుభారతవర్షంలో కన్యాకుబ్జమని ఒకనగరంఆ నగరంలో అజామీళుడు అనే ఓ విప్రుడుండేవాడు.తండ్రితాతలు సంపాదించిన సిరిసంపదలు కావలసినన్ని పున్నాయి.
అంతతో వయసు వచ్చింది మొదలు దీనికి జూదం, వేశ్యాగమనం బాగా అలవాటయాయి.
వేశ్యవు భార్యగా నిరంతరం అక్కడే ఉంటూ సర్వం నాశనం చేసుకున్నాడు.
ఆమెవల్ల పదిమంది బిడ్డలతండ్రి అయాడు.పరమ పవిత్రమయిన వంశంలో పుట్టినా ఆచార, సంప్రదాయాలు విడిచి పాపకర్మ లలో మునిగి తేలుతూండగా వార్ధక్యం వెత్తిమీదపడింది.
నీలికాంతులీనే జుత్తు తెల్లబూడిదలా అయింది. అవయవాలు పట్టుతప్పాయి. తం వణుకు మొదలయింది. చూపునన్నగిల్లింది.
పళ్ళుఊడాయి. ఆయాసంతో దగ్గు ఆరంభమయింది. ఎనిమిది పదులు దాటాయి.బిడ్డలలో చివరివాడయిన వానిమీద ప్రేమ ఎక్కువైంది. ఆబాలుని పేరు నారా యణుడు.
ముసలితనంలో ఎప్పుడూ వాని లాలనతోనే కాలంగడుపుతూండగా వానికికాలం చెల్లింది. కన్నుమూసేస్తూ కూడా ముద్దుల కొడుకుమీద ప్రేమతో నారాయణా! అంటూ ప్రాణాలు వదిలాడు.
ఎన్నోపాపాలు చేసిన కారణంగా వానిని సరకానికి తినుకుపోవడానికి యమకింక రులు వచ్చారు, భయంకరాకారులైఅంతిమక్షణంలో నారాయణస్మరణచేసిన కారణంగా విష్ణుచూతలూ వచ్చారు.
అప్పటికే యమదూతలు అజామీళుని దేహంనుండి జీవునిలాగి పాశబంధం వేశారు.వచ్చిన విష్ణు సేవకులు యమభటులను దూరంగా తరిమారు.వారిని ఆశ్చర్యంతో చూస్తూ యమకింకరులు:
అయ్యా! మీరెవరు? మా శరీరాకారాలు మాకెంతో ఆనందం కలిగిస్తున్నాయి. Yon. చక్ర, గదా, పద్మరాదులై, సీతాయిరాలు ధరించి కిరీటకాంతిలో విరాజిల్లే వరమ శాంతమూర్తులైన మిమ్ము చూచినకొద్దీ సంతోషం పెరుగుతున్నది.నిఖిలలోక ధర్మరక్షణకు ప్రజాపతిచే నియోగింపబడ్డ యమధర్మరాజు మాప్రభువు.
ఆయన అజామసౌరం వీనిని తీసుకు వెడుతూంటే మీరెందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నించి అంతతో ఆగక.ధర్మాధర్మ నిర్ణయం చేసేదివేదం.
అటువంటివేదం పరమేశ్వర స్వరూపం, ధర్మబద్ధమయిన సత్కర్మలు చేసినవాడే విప్రకులంలో పుడతాడు. ఈప్రాణి అటువంటి పదాచార సంపన్నమయిన వంశంలో పుట్టి శాంతస్వభావంతో ధర్మనిష్ఠతో గురువన్నిధానంలో శ్రద్ధనా వేదాధ్యయనం చేశాడు.
అతిథి మర్యాదలు నడిపాడు, భూతదయకలవాడు.అన్నీ అంతనిష్టగాన సాగించిన యౌవనం ప్రవేశించి, కామోద్రేకం కలిగే వయసువచ్చింది.ఆ రోజులలో ఒకనాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం దేవపూజకు పువ్వులూ, పళ్ళూ లేపడానికి నగరం వెలుపల ఉద్యానవవానికి వెళ్ళాడు.
అది వసంతమాసం.వనంలో లతలన్నీ సుగంధనుమాలతో నిండివున్నాయి.వానిలో తేనె త్రాగడానికి ఝుంకారాలతో తుమ్మెదలు తిరుగుతున్నాయి.
ఫలవృక్షాల మీద కోకిలలు, చిలుకల కలకూజితాలు వినవస్తున్నాయి.అటువంటి వనం నగరంలోని విలాసినీ జనానికి ఆటపట్టు అక్కడకే విటులందరూ చేరుతూంటారు.ఫలాలూ, పువ్వులూ, దర్భలూ తీసుకుని వస్తున్నాడి అజామీళుడు.ఆ సమయంలో ఆవనంలో ఒకపూవు పాదరింట నడివయసులోవున్న ముందరాంగిరి ఆలింగనం చేసుకుని ముద్దులు కురిపించే ఒక యువకుని చూశాడు.
ఆ కామిని బాగా మద్యం త్రాగివుంది. అందువల్ల దాని కన్నులు ఎర్ర కలువట వలెవున్నాయి. మత్తులో వుండడంవల్ల అది మరీ మీరి మీరిక వెళ్ళి ప్రియుడికి ఉద్రేకం కలిగిస్తున్నది.మైకలలో వారిరువురూ ఒళ్ళుతెలియకుండా క్రిందా మీదా పడుతూ నవ్వుతూ కులాసాగా గడుపుతున్నారు.దానిజుట్టు ముడివీడి ముఖంనిండా చిందర వందరగా పడింది.
చేతుంగాజులు గల గల లాడుతున్నాయి. మువ్వలపడ్డాణం మిల్లుకుల్లు మంటున్నది.అటువంటి సన్నివేశం చూపిన యౌవనుడెవడికయినా మనను చెదురుతుంది. అప్పటికి నూనూగు మీసాల వయసులో వున్న అజామీళుని గుండెలో మన్మథుడు విల్లెక్కు పెట్టి వున్నాడు.అంతే! కామోద్రేకం కలిగిన వాడికి మంచిచెడ్డల విచక్షణపోతుంది.పోయింది. అజామీళునికి,సర్వమూ మరిచి పోయాడు.
పువ్వులూ, పళ్ళూ, దర్భలూ జారవిడిచాడు. అదిమొదలుగా వాని జీవితం మారిపోయింది.వేదాంత చర్చలు మాని కామినీ ఙన చర్చలో పడ్డాడు.శాస్త్ర పాఠతర్కం వదిలి ప్రణయ తర్కం ఆరంభించాడు.తన సంసారం వదిలి దాని సంసారభారం మీద వేసుకున్నాడు అన్నారు.Ajamila
ఇంతటి పాపకర్మలు చేసిన బూ ధూర్తుడికి యమదండనతోకాని వ్రాయశ్చిత్తంకాదు,అప్పుడు విష్ణుదూతలు:వివాదం బాగానేవుంది, కాని కన్నబిడ్డల మంచిచెడ్డలు చూస్తూ వారి శ్రేయస్సు కోరవలసిన జననీ జనకులే వారికి కీడుతలపెడితే వారెవరితో మొరపెట్టుకుంటారు.
లోకంలో వివేకంకల వారేది చేస్తే మిగిలినవారు అదే చేస్తారు. అటువంటివారు చెప్పినమాట సత్యం అవుతుంది.నమ్మికతో స్నేహితుని తొడమీద తలపెట్టి నిద్రపోయేవానిని చంపడం కంటే ద్రోహం వుంటుందా! మనసుతో మనను కలిపి స్నేహుచేసినవారికి మేలు చెయ్యాలి కాని కీడు తలపెట్టకూడదే!ఒక్క పరమరహస్యం ఏమిటంటేప్రాణంపోయే సమయంలో నారాయణ నామస్మరణ చేసిన వాడికి కోటిజన్మల పాపాలు నశిస్తాయి.
అటువంటి పుణ్యం వీడు చేసుకున్నాడు.పుణ్యమూలంబులన పాయపోషకంబు లభిమతార్ధంబు లఙ్ఞానహరణకరము లాగమాంతోపలబ్ధంబు లమృత సేవ లార్త శుభములు హరినామకీర్తనములు.
అటువంటి శ్రీమన్నారాయణనామాన్ని, ప్రాణావసానసమయంలో స్మరించిన దీనికంటె పుణ్యాత్ముడులేడు, అని అజామీళునికి యమపాశ విముక్తి కలిగించి వారు వెళ్ళారు.
యమకింకరులు ప్రశాంతంగా యమునిచేరి తాము విన్నదంతా వివిపించారు.
అజామీళుడు కన్నులు నులుముకు లేచాడు.క్షణాలక్రితం విష్ణు సేవకులు చెప్పిన మాటలన్నీ మననులో కదిలాయి.
జీవితంలో తనసాగించిన క్రూరకర్మలన్నీ తలచుకుని కొంత సేపు బాధపడి, పశ్చాత్తాపాగ్నిలో అవి భస్మంచేసుకుని, సర్వసంగ పరిత్యాగియై, గంగానదిలో స్నానంచేసి, అక్కడ ఆలయంలో పద్మాసనాసీనుడై యోగనిష్టతో శరీరాన్ని విడిచిపెట్టాడు.
విష్ణుదూతలు వానిని దివ్యవిమానంమీద వైకుంఠం తీసుకువెళ్ళారు.పరీక్షిన్మహారాజా ! నారాయణ నామస్మరణ ఎంతటి మహత్తర మయినదో విన్నావా! అటువంటి అజామీళుని గాథ చదివినా, విన్నా పాతకాలు నశిస్తాయి, అన్నాడు.యోగీంద్రా ! యమకింకరుల మాటలు విని వారి ప్రభువు యమధర్మరాజు ఏనున్నాడో తినిపించండి, అని కోరగా:
రాజేంద్రా !యమకింకరులు తమ ప్రభువును సమీపించి, నమస్కరించి, వినయంగా తలవంచి:స్వామీ! ఈనాడు జరిగిన విషయం చూస్తూంటే మాకు చాలా ఆశ్చర్యంకలిగింది.
మానవకోటి చేసే కర్మలకు శిక్షవేసేది మీరొక్కరే అని యింత వరకూ భావించాం. కాని మీరుకాక మరెవరో వున్నట్టు అనుమానం కలుగుతున్నది.
అలా అయితే తమరిని దండధారి అనడం పైపై గౌరవంగా నమ్మక తప్పదు.ముల్లోకాలకూ మీరే శాసకులు అని విశ్వసించిన మాకు యిటువంటి పరాభవం చేసిన ఆ శాసకులెవరు? అని ప్రశ్నించాడు.యమధర్మరాజు :
కింకరులారా! ఆశ్చర్యమూ, అన్యాయమూ ఏమి జరగలేదు.
ఇంద్ర, అగ్ని, వరుణ, మార్య, చంద్రాదులకంటే, బ్రహ్మ, మహేశ్వరాదులకంటే అధికుడైన మహామహుడొకడున్నాడు. ఆయన శ్రీమన్నారాయణుడు.
ఆ మహావిష్ణువు తత్వాన్ని మహేశ్వరుడు, ప్రజాపతి, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీమ్మడు, మనువు, బలి, జనకుడు, ప్రహ్లాదుడు, వ్యానుడు, ఆయన కుమారుడైన శ్రీ శుకుడు యీ పన్నెండుగురే తెలుసుకోగలిగారు.
ఉపనిషత్తులు బోధించిన ఆ పురాణ పురుషుని భాగవత దివ్యధర్మం మరెవరికీ తెలీదు.మీరు చూశారు కదా! వారాయణ న్మరణఫలం. మృత్యుపాశ బంధితుడైన అజామీళుని రక్షించి ప్రాణదానం చేసిందంటే హరినామ పారాయణ ఎంత మహత్తర మయినదో!క్రూరబుద్ధి, పాపాచారరతుడూ అయిన అజామీళునికే రక్షణ యిచ్చిన నారాయణ మంత్రాన్ని నిర్మల మనస్సుతో జపిస్తే మరెంతటి ఉత్తమ ఫలం లభిస్తుందో తెలుసుకోలేక క్లేశాల పాలవుతున్నారు నరులు.
పర్యవసానంగా-ఎప్పుడయినా సరే మీరు విష్ణుపద సేవా పరాయణుల జోలికి వెళ్ళకండి.వారాయణ స్మరణ చెయ్యని వారినీ, నామసంకీర్తనం వినని వారినీ, హరినామ న్మరణతో జీవితం ధన్యం చేసుకునే పుణ్యాత్ములను పరిహసించే వారినీ బంధించి తెచ్చి మన నరకాలలో చిత్రహింసలు పెట్టండి.
పాపబుద్ధులూ, పాపాచారులూ, అయినవారినే నరకానికి తీసుకురండి. అంతే! హరి భక్తులను, వారి బంధుమిత్రులనూ మనం హింసించకూడదు. వారందరూ నారాయణపథం పొందుతారు, అని ప్రభోదించాడు…మహారాజా! మరొక విశేషం చెపుతాను.
ప్రచేతసుని కుమారులు ప్రాచీన బర్తి ఆదిగాగలవారు ఒకప్పుడు సముద్రంనుండి యీవలకు వచ్చి, భూమినిండా ఆవరించిన వృక్షాలను చూసి ఆగ్రహంతో అగ్నివి కల్పించి అన్ని చెట్లనూ తగులబెట్టడం ఆరంభించారు.
అదిచూసి చంద్రుడు వారిని వారించి:మహనీయులారా! ఏం చేస్తున్నారు మీరు. ఈ వృక్షాలలో ప్రాణికోటికి అవసర మయిన బలమిచ్చే ఓషధులు ఆహార రూపంలో విక్షేపించాడు ప్రజాపతి. వాటిని దగ్ధం చేయకండి. మానవులకు నాలుగుకాళ్ళ జంతువులు ఆహారంగా యిచ్చాడు.
అందుచేత జీవకోటికి జవసత్వాలిచ్చే చెట్లను నాశనం చెయ్యకండి. ఇదిగో ఈ వృక్షాల మండి పుట్టిన అప్పరి కన్యను మీకు భార్యగా యినున్నాను. అన్నాడు.
ఆమెవల్ల దక్షుడు పుట్టి ప్రజలను సృష్టించాడు.ఆయన చలువ వల్లనే దేవ, దానవ, యక్ష, రాక్షన, గరుడ, గంధర్వ, కిన్నర, టపురుషాదులు పుట్టారు. పక్షులూ, పాములూ, పర్వతాలూ, అన్నీ ఆయన సృష్టియే.ఇంత సృష్టి సాగినా ఆయనకు తృప్తి కలగలేదు.వింధ్య పర్వత ప్రాంతంలో అఘమర్షణ తీర్థంలో స్నానంచేసి హరినామ స్మరణలో కూర్చున్నాడు.
ఆయన తపస్సుకు సంతోషించి —సర్వేశుడు సర్వాత్ముడు సర్వగతుండ చ్యుతుండు సర్వమయుండై నర్వంబు చేరి కొలువగ సర్వగుడై దక్షునకు ప్రనన్నుండయ్యెన్.పురుషోత్తముడు ప్రత్యక్షం కాగా దక్షుడు సంతోషంతో ఆయన పాదాలమీద వ్రాలి ఆనందంతో ఏమీ పలకలేక పోయాడు.
అది తెలిసిన నారాయణుడు: దక్ష ప్రజాపతీ! చతుర్ముఖుడు, పాలాక్షుడూ,ఇంద్రుడూ, మనువులు, ప్రజాపతులూ వీరందరూ నా విభూతిరూపాలు, ఇంద్రియాలను నిగ్రహించి చేసే సంధ్యావందనమనే తపన్సు నా హృదయం.
ధ్యాన జపమే నా శరీరం శబ్దమే నా ఆకారం.సత్ప్ర్కతువులే నా అవయవాలు. ధర్మమే నా ఆత్మ దేవతలు నా ప్రాణాలు, వేదాలు నా రూపం.నా మాయవల్ల బ్రహ్మ పుట్టాడు.
దానివల్లవే నిఖిల లోకాలు పుట్టాయి. బ్రహ్మ తపన్సుచేసి మిమ్ము సృష్టించాడు. మీరు ప్రజాపతులయారు. ఈ ప్రజానృష్టికోసం నీకు అసిక్ని అనే యువతిని యిచ్చాను.
దీనితో నంసారం సాగించి నృష్టి కొనసాగిస్తున్నావు. ఈ పుట్టిన ప్రాణికోటి అంతా దాంపత్య జీవనంతో సంతానవృద్ధి చేస్తూంటూంది, అని అదృశ్యుడయాడు.అనంతరం దక్షునికి పుట్టిన కుమారులు సింధునది సముద్రంలో కలిసి పశ్చిమ దిశగాపోయి అక్కడ నారాయణ నరోపరంలో స్నానం చేసి తపోదీక్ష ఆరంభించారు.
అక్కడకు నారదుడువచ్చి —జ్ఞానంలేని పనివారు మీరు. పరతత్వం తెలుసుకోకుండా అజ్ఞానంలో పడి సంసార విషయ సుఖవలయంలో పడకండి, శాశ్వతమైన పరమపురుషధామం చేరే ప్రయత్నం చేయండి.అని ఉపదేశించగా వారు విరక్తులై శ్రీనారాయణుని చరణసేవలో లీనమయ్యారు.ఇది విని దక్షుడు శోకిస్తుంటే చతుర్ముఖుడువచ్చి, నాయనా! శోకం విడిచి మరి కొందరు కుమారులను కని వారి చేత ప్రజావృద్ధిసాగించు, అని అదృశ్యమయాడు.దక్షుడు శబళాశ్వులనే కుమారులను సృష్టించాడు.
వారు తమ తండ్రి ఆజ్ఞపాలించే ఊహతో నారాయణ సరోవరానికి వెళ్ళి తపోదీక్ష వహించారు.నారదుడు మళ్ళీ వచ్చి వారికి కూడా వైరాగ్యం భోధించగా వారు సర్వం విడిచి తమ అన్నలు వెళ్ళిన దారినే పరమపథం చేరారు.ఆవార్త విని దక్షుడు ఆగ్రహంతో నారదుని చేరి :పసివారిని అపమార్గం పట్టించే నీకు ఏలోకంలోను స్థానంలేకుండా పోవుగాక, అని శపించాడు.వారదుడు సంతోషంతో వెళ్ళాడు.
దక్షుడు తిరిగి విచారిస్తూండగా చతుర్ముఖుడు ప్రజానృష్టిమార్గం ఉపదేశించాడు. అప్పుడు దక్షుడు అరవైమంది కుమార్తెలనుకని, యమునికి పదిమందినీ, కశ్యపునికి పద ముగ్గురినీ, చంద్రునికి ఇరవైయేడుగురినీ, భూత, అంగీరన, కృశాశ్వులకు యిద్దరిద్దరినీ యిచ్చి మిగిలిన నలుగురినీ కశ్యపునికే యిచ్చాడు.వీరి వల్ల సర్వప్రాణికోటి ప్రవృద్ధమయింది.( ఈ నృష్టి వివరాలు మూల భాగవతంలో చదువతగ్గవి)
