Naraka (Hell) in Hindu Scriptures ఇప్పుడింక క్రూరకర్ములు, అధర్మపరులు, అయినవారిని శిక్షించే నరకవిశేషాలు చెపుతాను.
ఈ లోకాలన్నిటికీ దక్షిణంగా ఉన్నాయి వరకాలు. అక్కడే పితృదేవతలు నిరం తరం తమతమ వంశాల శ్రేయస్సుకోసం ఆశీర్వాదాలు వలుకుతూంటారు.
యముడు నరకాధిపతి. ప్రాణుల కర్మలను చూసి తగిన శిక్షలు అందిస్తాడాయన. మొత్తం ఇరవై ఎనిమిది వరకాలున్నాయి.
తామిస్ర, అంధతామిప్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్ర వన, సూకరముఖ, అంధకూప, క్రిమిభోజన, నందంశ, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, వూయోద, ప్రాణరోధ, విశనవ, లాలాదీక్షణ, సారమేయాదన, అవీచిరయ, రేతఃపాన,, యివి మహానరకాలు.
క్షారకర్తమ, రక్షోగణభోజన, శూలప్రోతి, దందశూక, ‘అవటనిరోధన, అపర్యా వర్తన, సూచీముఖాలు నరకాలు.
ఇతరుల భార్యలను, బిడ్డలను అపహసించి అవమానించే వారందరూ తామిత్ర నరకంలో తిండిలేకుండా, పర్వత శిఖరాలమీద నుండి దొర్లించబడుతూ, యమకింకరుల ఉక్కు పాదాలతో తన్నులు తింటూ ఉంటారు.
పరస్త్రీ సంగమం చేసిన వానిని అంధతామిశ్రంలో పడవేసి హింసిస్తారు.
సంసారపోషణకోసం యితరులను వంచించి ధనం సంపాదించేవాడు దొరవ వరకంలో యాతనలు పడతాడు.
తమ్మతిండి ముతింటూ ఎవరినీ హింసించకుండా బ్రతికే పశువులనూ, పక్షులనూ, హింసించేవారు మహారౌరవం అనుభవిస్తారు.
తన పొట్టనింపుకుందుకోసం ఎలుకలుండే కన్నాలుమూసి వాటిని చంపుతారి అటువంటి శ్రూరులందరూ కుంభీపాక నరకంలో మరుగుతూన్న నూనెమూకుళ్ళలో వేగుతారు.
తల్లిదండ్రులను, వేదవిదులను అవమానించి హింసించే వారికి కాలసూత్ర నరకంలో సుంటలమధ్య మాతేయోగం పడుతుంది. వివరీతంగా ఆకతి, దాహం కలుగుతాయి. నీరివ్వరు, తిండి పెట్టరు, కాలసూత్ర వరకంలో, చిక్కిన పశువులను బాధించి బరువు పనులు చేయించే మద్దులుకూడా ఈనరకంలోనే పడతారు. సనాతనధర్మం బోధించే వేదమార్గాన్ని విడిచి సాపండులై స్వేచ్ఛావిహారాన్ని ప్రచారంచేసి ఆచరించే వారిని అసిపత్రవనంలో పారేసి, యముకంకరులు కొరడాలతో కొడుతూ పరుగులు పెట్టిస్తాడు. ఈ అరణ్యంనిండా చురకత్తులే ఆకులుగా దట్టంగా పెరిగిన చెట్లుంటాయి. ఆకత్తులు చీరుతూంటే దుర్భరయాతన పడుతూ ఈ వరకంలో గడపాలి.naraka
దోపం చేశాడో లేదో తెలుసుకోకుండా నిష్కారణంగా దండించే వారితోపాటు, వేద విదులను హంసించేవారు కాలసూత్రనరికంలో పడతారు. వీరిని యమభటులు చెరకుగడలు పరిచినట్లు విరుస్తూ హింసిస్తారు.
జంతుహింస చేసేవారు అంధకూప సరకంలో పడి వివిద జంతువుల చేత, సర్పాల తేత, దోమలు, నల్లులూ, ఆదిగాగల క్రిమికీటకాలచేత బాధలు పడుతూంటారు.
ధనసంపదలతో తులతూగేవాడు బంధుమిత్రులకు పెట్టకుండా ఉనతిండితాను చూప కుంటూ బ్రతుకుతాడు. వాడిని క్రిమిభోజన నరకంలో త్రోసి అందులోని క్రిములే ఆహారంగా పెడుతూంటారు.
ఏ పని చెయ్యడానికి నడ్డిపంగక దొంగతనంతో జీవించేవారిని తపోర్మిలో పడవేసి కాలుతున్న ఇనుపగుళ్ళతో బాదుతారు.
వావి వరుసలు లేకుండా వంగమంచేసే స్త్రీ పురుషులను ఉక్కుకొరడాలతో కొడుతూ, మండుతూన్న ఉక్కు విగ్రహాలను కౌగిలింపజేస్తారు.
కొందరు కాముకులు పశువులతో నంగమం చేస్తారు. వారిని వజ్రకంటక సదృశంగా ఉండే ఆకులుగల జువ్విచెట్టుకి కట్టి పాడుస్తారు.
పాపండులతో సహవాసంచేసి ధర్మవథం తప్పిన వారిని వైతరణీ నదిలో ముంచుతారు. ఈ సది మలమూత్ర రక్తమాంనపూరితమై ఉంటుంది.
వేదవేదాంగాలు అధ్యయనం చేసినవారు తీవ్రపట ప్రవృత్తితో పరస్త్రీ సంగమల చేస్తే వారిని మలమూత్ర లాలాజల శ్లేష్మభరితముయిన రూపంలో ముంచుతూ, అతిహేంది. సయిన పదార్థాలు ఆహారంగా యిస్తారు.జాగిలాలను పెంచి వానితో వేట సాగించే వారివి వాడిశూలాలతో పొడుస్తూ
బాదిస్తారు.
ఆడంబరంకోసం పశువులను చంపి క్రతువులు చేసేవారిని పదునుగల రంపాలతో కోన్తూంటారు.
కొందరు రాజవంశీయులు, చోరులుకలిసి సంపన్నులను హింపించి దోపిడీలు చేస్తారు. ఇళ్ళుతగల బెడతారు, క్రూరుల నియోగించి సాధువులను చంపిస్తారు.వీరందరినీ యమలోకంలోని జాగిలాలు తమ కోరలతో చీల్చి తినేస్తాయి
లంచాలుపట్టి దొంగసాక్ష్యాలు చెపుతారే, అటువంటివారిని వీదీనరకంలో ఎత్తైన పర్వత శిఖరం ఎక్కించి కాళ్ళు పైకిఎత్తిపట్టి తలక్రిందికి పెట్టి వదులుతూంటే అజీవి బండరాళ్ళమీద పడిముక్కలు ముక్కలై మళ్ళీ అతుక్కుంటుంది. ఆప్రాణిని అలాపడవేస్తూనే హింసిస్తారు.
పతివ్రతలను కామించేవారిని, విలాసంగా మద్యపాన, సోమపానాలు చేసేవారిని గుండెలమీద త్రొక్కుతూ, నిప్వులమీద ఎర్రగాకాలుస్తూ, మరుగుతున్న ఉక్కును నోట్లో పోస్తారు.
ధూర్తులు కొందరు వేడుకగా జంతుహింన చేస్తారు. వీరిని దందకూక వరకంలో అయిదుపడగల పాములు కాటువేసి బాధలు పెడతాయి.
అతిథి అభ్యాగతులను క్రూరంగా చూసేవారిని గ్రద్దలు, కాసులూ వాడిముక్కు లతో పాడిచి హింసిస్తాయి.
సిరిసంపదలున్న వాడు దానధర్మాలు చేయకుండా లోభంతో బ్రతికితే సూచీముఖ -వరకంలో వేసి గట్టి తాళ్ళతో బంధించి పీడిస్తారు.
ధర్మమార్గాన సత్యవ్రతంతో సాధుశీలంతో పరోపకారపరాయణులై జీవించేవారు స్వర్ణ భోగాలనుభవిస్తారు.
జలజ భవాదిదేవ మునినన్ను తీర్ధపదాంబుజాత! ని ర్మలనపరత్నమాపురవిరాజిత ! కౌస్తుభ భూషణాంగ! ఉ జ్జ్వల తులసీమరందమద వాననవానిత దివ్యదేహ ! శ్రీ నిలయశరీరకృష్ణ ! ధరణీధర! భానుశశాంకలోచనా!
