దశరథమహారాజుకు ముగ్గురు భార్యలు. అందులో పట్టమహిషి కౌసల్యకు రామ చంద్రుడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు.
వారికి నునుగుమిరాల వయను వచ్చింది. ఆ రోజులలో విశ్వామిత్రమహర్షి వచ్చి, తన యాగరక్షణకు రామ లక్ష్మణులను తీసుకువెళ్ళాడు. వెళ్ళేదారిలో అడ్డువచ్చిన దానిని తాటకను రాముడు సంహరించాడు.
యజ్ఞవిఘ్నకారులలో సుబాహుని హతమార్చి మారీచుని వాయువ్యాప్తంతో సముద్రం ఒకి పారేశాడు.
అనంతరం విశ్వామిత్రునితో మిథిలానగరం చేరి, అక్కడి శివధనుస్సును చెరకు గడలా విరిచి, జనుపుత్రి సీతను వివాహమాడాడు.
ఎదురువచ్చిన మహావీరుడు పరశురాముని నిలబెట్టి తన ప్రతాపం ప్రదర్శించాడు.
సీతాసహితుడై అయోధ్యచేరి కాలం గడుపుతూండగా మహారాజు రామునికి పట్టాభి ఇకం తలపెట్టాడు. కైక తన వరాలు గుర్తుచేసి, రాముని అడవికివంపింది. రామ ద్రుని వెంట సీతా, లక్ష్మణులుకూడా వచ్చారు. భరతుడు రాజయాడు.
రాముడు మునుల ఆశ్రమాలు దర్శిస్తూ, చిత్రకూటంవద్ద కొంతకాలం గడిపి, పవిత్ర -తమీతీరాన మునిజనావాసమైన దండకారణ్యం చేరాడు.
అక్కడ పర్ణశాలలో ఉండగా రావణుని చెల్లెలు శూర్పణఖవచ్చి రామునికామించగా క్ష్మణుడు దాని ముక్కు చెవులు కోని వంపాడు.
ఆ వార్తవిని దాని బంధువులు ఖర దూషణాదులు పదునాలుగువేలమంది దాడికిరాగా నా రందరినీ రామభద్రుడు నేలకూల్చాడు.
శూర్పణఖవెళ్ళి సీతాదేవ సౌందర్యాన్ని వర్ణించగా రావణుడు తనమంత్రి మారీచుని మోయలేడిగా వంపి రామ లక్ష్మణులను వంచించి సీతను అపహరించాడు.
సీతను అవహరించకుండా అడ్డువచ్చిన జటాయువు రావణఖడ్డానికి బలిఅయాడు.
జటాయువుకు దహనసంస్కారం జరిపి, సీతాన్వేషణ సాగిస్తూ రామ లక్ష్మణులు జెష్కింధలో ఋశ్యమూకం మీద సుగ్రీవునితో స్నేహంచేసి, సుగ్రీవుని భార్యను హరించిన వాలిని నేలకూల్చి, సుగ్రీవుని వానరరాజ్యాధిపతిని చేశారు. సీతాన్వేషణకు హనుమంతుని పంపాడు రాముడు.
వాయువందనుడు అవలీలగా సముద్రందాటి లంకలో ప్రవేశించి, జానకీదేవివి -దర్శించి, అక్షకుమారాది రాక్షనులను సంహరించి, లంకకు విప్పుపెట్టి, తిరిగివచ్చి రాము నికి సమాచారం చెప్పాడు.
ఆయన వానర భల్లూక సేనలతో సముద్రతీరం చేరి, దారి యిమ్మని సముద్రుని కోరినా ఆ సముద్రుడు ఉలశక, పలకక ఊరుకున్నాడు. రాముడు క్రోటోద్రిక్తుడై రనుప్సందుకోగా సముద్రుడు ఎదురుగా వచ్చి అనేక విధాలస్తుతించి
కట్టుము సేతువు
లంకం జుట్టుము, నీ బాణవహ్ని
సురవైరి తలల్ గొట్టుము నేలంబడ చే పట్టుము నీ అబల అధిక భాగ్యప్రబలన్
అనగా రాముడు సేతునిర్మాణానికి ఆజ్ఞ యిచ్చాడు.
వానరులు మహావృక్షాలు పెకలించి సముద్రంలో వేస్తూ, వాటిమీద బండరాళ్ళు, వరిచి సేతువు నిర్మించి, లంకలో అడుగుపెట్టారు. రావణుని సోదరుడు విభీషణుడు శరణువేడగా రాముడు అనుగ్రహించాడు.
వానరవీరులు లంక చుట్టుముట్టారు.
సరోవరంలో మత్తగజం ప్రవేశించి హాయిగా యీదులాడుతూ కలచిపారేసినట్లు రాక్షసరాజధానిలో వానరయోధులు కల్లోలం లేపారు.
లక్ష్మణుని శరాఘాతాలకు రావణనుతుడు అతికాయుడు నేలకూలాడు. రాముని చేతిలో కుంభకర్ణుడు ప్రాణాలు వదిలాడు.
అనంతరం వచ్చిన ఇంద్రజిత్తు లక్ష్మణుని బాణాగ్నికి ఆహుతి అయాడు.
అప్పుడు రావణుడు విమానంమీద రాగా దేవేంద్రుడు తన రథాన్ని పంపిరామునికి సాయపడ్డాడు.
దివ్యరథంమీద రాముడు తూర్పదిక్కున వెలిగే మార్యునివలె ప్రకాశిస్తూ:
రావణా! మాయలేడితో మోసగించి, మాయానన్యాసిపై వనమధ్యంలో ఆడదాన్ని అవహరించడంకాదు. రణరంగంలో రాముని ముందు నిలువుతూ, ధనుస్టంను ఏర్పరిచి బాణాన్ని వదిలాడు
దశరథు సూనం చేసిన విశిఖము హృదయంబు దూర వినశుండగుచున్ దశకంధరుండు కూలెను దశవదనంబులను ర క్త ధార లు దొర గవ్.
అంతతో లంకానగరంలో హా హా రవాలు చెలరేగాయి. రాక్షసనారీజనం అందరూ గణరంగంలో తమ తమ నాథుల దేహాలపైబడి గోలు గోలున విలపించారు.
రావణుని పట్టమహిషి మండోదరి :Rama Avatar
పరస్త్రీ వ్యామోహాంధులు యిహపరాలకు చెడి యిలానే గతిస్తారు, అంటూ యింత సేపు ఏడ్చింది.
చేశాడు. అనంతరం రాముని ఆజ్ఞానుసారం విభీషణుడు అన్నగారికి దహన సంస్కారాలు
రాముడు లోకులకు విశ్వాసం కలిగించడానికి జానకిని అగ్నిపరిశుద్దను చేసి, లంకకు విభీషణుని అధిపతిని చేసి, పుష్పకారూఢుడై వానరయోధులందరితో బయలుదేరి భరతుడున్న నందిగ్రామం చేరాడు.
అప్పుడు భరతుడు రాముని పాదుకలు శిరసున పెట్టుకుని తెచ్చి, ఆయన పాదాల వ్రాలి ఆనందబాష్పాలతో కడిగాడు.
అనంతరం అందరూ అయోధ్యచేరారు. రాముడు ముందుగా తల్లులకూ పెద్దలకూ అభివాదాలు అర్పించాడు.
నగరం అంతా పరిశుభ్రంగా తడిపించి, అలంకరించి, మంగళవాద్యాలతో రామ పట్టాభిషేకం సాగించారు.
తండ్రి క్రియ రామచంద్రుడు
తండ్రుల మరపించి ప్రజల తా రక్షింపం – తండ్రుల నందరు మరచిరి తండ్రిగదా రామచంద్ర ధరణిపు డనుచున్
అలా సర్వప్రజారంజకంగా ఆయన ఏలుబడి సాగుతోంది.
సిగ్గుపడుట గల్గి సింగారమును కల్గి భక్తి కల్గి చాల భయముకలిగి నయము ప్రియము కలిగి వరనాథు చిత్తంబు సీత తనకు వశము చేసికొనియె.
ఆ యిల్లాలితోకూడి రామభద్రుడు సత్రతువులు సాగించి హెూతకు తూరుపు దిక్కును, సామగానం చేసినవానికి ఉత్తరదిగ్భాగాన్ని, బ్రహ్మపీఠం నిర్వహించిన వేద వేత్తకు దక్షిణదిశనూ, అధ్వర్యునికి పశ్చిమదిగ్భాగాన్నీ ధారవోశాడు. మిగిలిన ధన, కనక, వస్తువులు, వాహనాలను విప్రశ్రేష్ఠులకు దానం చేశారు.
యజ్ఞాంతానికి ఆయన ధరించిన రెండు వస్తాలే ఆయనకు మిగిలాయి. జావకీదేవిక మెడలో మంగళమాత్రం మిగిలింది. అంత ఉదారంగా సర్వస్వమూ ధారవోసిన రామ భద్రునికి అంజలి ఘటించి వారందరూ తమ తమ రాజ్యాలు రామునికే ధారవోసి,
స్వామి, మా అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతి ప్రసాదించు, అనగా స్వామి అనుగ్రహించాడు.
మునులందరూ తమ ఆశ్రమాలకు వెళ్ళారు.
రాముడు సత్య ధర్మకవచంతో రాజ్యం పాలిస్తున్నాడు.
ఒకవా డాయన రాత్రివేళ తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని తిరుగుతూండగా ఒక చోట, ఒక పురుషుడు తన భార్యతో!
ఓసీ, దుర్బుద్దీ ! పరాయియింట యింతకాలం గడిపి వచ్చిన నిన్ను ఏలడానికి నేను వెర్రిరాముణ్ణి కాను, ఫో! నీ యిష్టం వచ్చిన చోటికి, అన్నాడు.
విన్నాడు రాముడు, భవనానికి వస్తూనే రాత్రికి రాత్రి నిద్రలో వున్న సీతను వాల్మీక మహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మన్నాడు.
అప్పటికే గర్భవతిగా వున్న సీతాదేవి ఆ ఆశ్రమంలో లవ కుశులను ప్రసవించింది. వారికి మహర్షి జాతకర్మాదులు జరిపించి వేద వేలాంగ విద్యలుబోధిస్తున్నాడు.
అయోధ్యలో లక్ష్మణునికి అంగదుడు, చంద్రకేతుడు పుట్టారు. భరతునికి దక్షుడు, పుష్కలుడు కలిగారు. శత్రుఘ్నుని కుమారులు నుబాహు, శ్రుత సేనులు వీరందరూ కుల గురువులవద్ద సర్వవిద్యలూ అభ్యసిస్తున్నారు.
వాల్మీకి మహర్షి నన్నిధిని అన్నివిద్యలూ వేర్చిన కుశ లవులు మధురగంభీరగళంతో మహర్షి ఉపదేశించిన రామకథ గానం చేస్తూ ఒకనాడు రాముని యజ్ఞశాలలో కూడా గానంచేశారు.
వింటూన్న రామునిహృదయం ద్రవించి, కన్నుల నీరు నిండగా :
చిన్నియన్నలార ! శీతాంశు ముఖులార వళినదళ విశాల వయనులార!
మధురభామలార! మహిమీద ఎవ్వరు
తల్లి తండ్రి మీకు ధన్యులా ర !
అనగా వారు:
రాజచంద్రా! మేము మహర్షి వాల్మీకి సమమలము, రాఘవేశ్వరులయాగం చూడా లని వచ్చాం, అన్నారు.
రాముడునవ్వి : రేపు ఉదయం మీ తండ్రిని చూడవచ్చు. ఈ పూటకు విశ్రాంతి తీసుకోమని చెప్పి, ఆయనను విశ్రాంతి భవనానికి పంపించాడు.
మరునాడు ఉదయం వాల్మీకి సీతితో కుశ లవులను వెంటబెట్టుకుని రామునిచేరి:
సీత ముద్దరాలు చిత్త వాక్కర్మంబు లందు సత్యమూర్తి అమలచరిత పుణ్యసాధ్వి విడువ బెలదు చేశాను రవికులాబ్దిచంద్ర ! రామచంద్ర !
అన్నాడు.
లక్షణంలో సీత తనబిడ్డలన వాల్మీకికి అప్పగించి, భూమిలోకి వెళ్ళిపోయింది.
అదిమొదలుగా రామభద్రుడు బ్రహ్మచర్యనియమంతో, కొంతకాలం రాజ్యం పాలించి వైకుంఠం చేరాడు.
నల్లని వాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులున్ విల్లును దాల్చువాడు కడు విప్పగువక్షమువాడు మేలు పై జల్లెడువాడు నిక్కివ భుజంబులవాడు యశంబు దిక్కులం జల్లెడువాడువైన రమునత్తము డిచ్చుత మాక భీష్టముల్
రఘువంశం అలా పొగిసాగి చివరకు మరువు అనే రాజయోగితో ఆగింది. ఈ యన యోగసిద్ధితో కలాపగ్రామంలో వున్నాడు. కలి యుగాంతంలో ఈయన రఘువంశాన్ని మళ్ళీ ఉద్దరిస్తాడు.
