Usha and Aniruddha Love Story: Usha Parinayam Explained in English

Usha and Aniruddha Love Story

మహారాజా ! ఇదివరలో నీకు నారాయణుడు వామునుడై బలిని పాతాళానికి పంపిన వినిపించాను.బలికి మారుగురు కుమారులు.

వారిలో పెద్దవాడు బాణుడు, వీడు తన భక్తితో రమశివుని మెప్పించి ఆయనను పరివారసమేతం తన రాజధానియైన శోణపురానికి రక్షకు కుగా తెచ్చాడు.

అంతతో తృప్తిపడక ఒకనాడు ఆయన ఎదుటనిలిచిపరమేశ్వరా! నీ అనుగ్రహంవల్ల నాకు లభించిన భుజశక్తికి ఎదురునిలిచి పోరాడ వాడు కనిపించడంలేదు. రోజు రోజుకీ నాకు యుద్ధం చేయాలనే దురద ఎక్కువవు ఉన్నది.

మవ్వుతప్ప నా ఎదుట నిలిచేవాడే లేడా అనగా ఆయన కోపంతో:ఓం మూర్ఖుడా! ఏనాడు నీ రథంమీరి జెండా క్రింద పడుకుందో ఆనాడు నిమ్మ చేవానితో యుద్ధం జరుగుతుంది. ఫో! అన్నాడు.

ఉన్నాడు. అది మొదలుగా ఆ పతాకం ఎప్పుడు నేలకు రాలుతుందా! అని ఎదురుచూస్తూనేఈ బాణానురుడికి ఉషాదేవి అనే కూతురుంది.

ఆ బాలిక అతిమనోహర రూపిణి,తూ సౌందర్యం అంతా రాసిచేసి ఆ కన్యకను బ్రహ్మదేవుడు సృష్టించాడా అన్నట్టునవయౌవనంలో విలాసంగా ఆట పాటలతో కాలం గడుపుతూన్న ఆమెకు ఒకసారి రాత్రి కల వచ్చింది.

ఆ కలలో నవమోహనాంగుడు ఆమెను ఆలింగనం చేసుకుని ఆనందింపజేశాడు. తెలవారి లేచింది మొదలు కలలో కనవద్ద ముందరాకారుని మీదవే మనసునిలిపింది.

అది గ్రహించిన చెలికత్తె చిత్రరేఖ తన చిత్రలేఖనకౌశలంతో సర్వలోకాలలోని సుందరుల రూపాలూ చిత్రించి తెచ్చి చూపగా ఆమె ఒక చిత్తరువును చూపి “వీరెవరే” అంది.

ఓహో! ఈయనా నీ మనోహరుడు. యదువంశీయుడయిన వాను దేవుని కుమా రుడు ప్రద్యుమ్నుడు.

ఆయన పుత్రు డీయన అనిరుద్ధుడు, అని“ఆకాశమార్గంలో ద్వారకకు వెళ్లి, తన మాయావిద్యతో రాత్రికిరాత్రే అనిరుద్ధుడిని తీసుకువచ్చి, ఉషాదేవి ఎదురుచూస్తున్న అంతఃపురంలో హంసతూలిక తల్పంపై ఉంచి వెళ్లింది.”అది మొదలుగా ఉషా-అనిరుద్ధులు హాయిగా కేళీవిలాసాలలో తేలియాడుతున్నారు.

కొంతకాలానికి ఉషాదేవి గర్భవతి అయింది. అది కనిపెట్టిన అంతఃపుర రక్ష కులు హుటాహుటి బాణుని చేరి పాదాలమీదపడి విషయం విన్నవించగా బాణాసురుడు తన యోధులను పంపాడు.యదువంశ వీరుడు శత్రువులందరినీ కడతేర్చగా బాణుడు తీవ్రక్రోధంతో వాగ పాశంతో అనిరుద్ధుని బంధించాడు. అదే సమయంలో వానిరథంమీది జెండా వేల కూలింది.

బాణుడు యింతకాలానికి నా యుద్ధకండూతి తీర్చే వీరుడు వస్తున్నాడని సంతోషంతో ఎదురు చూస్తున్నాడు.ఇక్కడ ద్వారకలో —అనిరుద్ధుడు అదృశ్యమయిన నాటినుంచీ అందరూ ఆందోళన పడుతున్నారు.

ఒకనాడు నారదుడు వచ్చి నముచిత మర్యాదలు పొంది, కుశలప్రశ్నల సందర్భంలో అనిరుద్ధుని గురించి చెప్పగా కృష్ణుడు బాణానురువిమీద దండయాత్రకు బయలుదేరాడు.ఆయన వెంట బలభద్ర, సాత్యకి, ప్రద్యుమ్నాదులతో యదు, వృష్ఠి, భోజ, అంధక వీరు లందరూ సాగుతూంటే భగీరథుని వెన్నంటి వచ్చే గంగాతరంగిణిలా కనిపించారు.

యోధనరులందరూ మ హెూత్సాహంలో శోణపురం చేరి రణభేరీ మ్రోగించి పరాక్రమించడంతో బాణాసురుడు క్రోధోద్రిక్తుడై సంగ్రామనన్నద్ధుడుకాగా భక్తజనవశంకరు డయిన శంకరుడు తన భూత ప్రేత పిశాచగణంతో తోడువచ్చాడు.

ఉభయబలాలూ యుద్ధం ఆరంభించాయి. ప్రతిపక్షంలోని సమబలులను యాదవ వీరులు ఎదుర్కొన్నారు.పరమ శివ గణాలను చెల్లాచెదరుచేసి వాసుదేవుడు విజృంభిస్తున్నాడు.వీరుల సింహవాద హుంకారాలు.మదమత్తేభాల భీకర ఘీంకారాలు,వీరయోధుల శంటినీ టంకారాలు, హద్దు హేషారావాలు,పటహ కాహళ లేరీ భంకారాలు.భూ నభోంతరాలు దద్దరిల్లుతున్నాయి.

హరి, హరుల సంగ్రామకేళి చూప కుతూహలంతో, మర,గరుడోరిగ, చారణ, పెద్ద, సాధ్య, కిన్నెర, కింపురుష, గంధర్వగణాలు గగనవీధిలో నిలిచాయి.వర్షమశివుని బ్రహ్మాస్త్రాన్ని దానితోనే ఉపసంహరించాడు వాసుదేవుడు.

దాయవ్యం కృష్ణుని పర్వతాస్త్రంతో తగ్గింది. శిఫుని ఆగ్నేయం కృష్ణుని ఐంద్రార్థంతో నిలబడింది. ఆయన పాశుపతం సందించగా వారాయణాస్త్రంలో నిరోధించాడు.

క్రీడ చాలించి కృష్ణుడు సమ్మోహనం ప్రయోగించగా పరమశివుడు వృషభవాహనం మీదనే మూర్చపోయాడు. అదేసమయంలో చూడవవీరులు విజృంభించి శత్రు సేనను పరాదూతంచేశాను.బాణుడే స్వయంగా ధమస్సు నందించి రాగా హసురేపుడు ప్రళయ భీకరంగా సాంచజన్యం పూరించాడు.

శత్రుసేవలు చెవరి బెదరి పారిపోయాయి.బాణుడు సహస్రకరాలతో ఎదురువచ్చి శరవర్షం కురుపించగా వాసుదేవుడు అన్ని శస్త్రాస్త్రాలను తుత్తునియలు చేశాడు.

ఆ సహనచర్యకు బాణానుసుడు తెల్లబోయి చేసేదిలేక కొయ్యబారి నిలబడ్డాడు.అప్పుడు బాబు తల్లి కోటకి జుట్టు విరబోనుకుని వివన్తయై కృష్ణునియెదుట నిలబడగా ఆయన ముఖం వెనుకకు తిప్పుకున్న అదునులో బాణుడు పలాయనం పశించాడు.

అప్పటికి మూర్ఛతేరిన పరసశిపుడు శైవల్వరం ప్రయోగించగా శృమురు వైష్ణవ జ్వరంతో దాన్ని పరాస్తం జేశాడు.సంపాడు.

అంతతో అది కేశవుని పరిపరి విధాల స్తోత్రం చేయగా ఆయన అనుగ్రహించి బాణాసురుడు మళ్ళీ మధ్యందిన మార్తాండునివలె యుద్ధ భూమికిరాగా వాసుదేవుడు సుదర్శనం ప్రయోగించాడు.

అది బాణుని వేయికరాలలో వాలుగింటిని విడిచి మిగిలిన వాటిని ఖండించింది. ఈ దృశ్యం చూసి పరమశివుడు స్వయంగా కృష్ణుని ఎదుటనిలిచి అనేక ప్రార్థనలు చేయగా వాసుదేవుడు :

“నా భక్తుడైన ప్రహ్లాదుని వంశీయులను ఎప్పటికీ హానిచేయనని నేను అతనికి వరం ఇచ్చాను.”కవక బాణుని విడిచి పెడుతున్నాను.

ఇది మొదలుగా ఈ బాణుడు శివభక్తులలో అగ్రే నరుడుగా కీర్తి పొందుతాడు; అని సాగనంపాడు.బాణాసురుడు వాసుదేవునికి అంజలి ఘటించి సముచిత మర్యాదలతో నగరానికి కొనిపోయి తనకుమార్తె ఉషాదేవిని అనిరుద్ధుని కిచ్చి విధ్యుక్తంగా వివాహం జరిపించి;

అందరికీ యథోచితంగా కానుక లర్పించి తృప్తి పరిచాడు.అప్పుడు వాసుదేవుడు నవ వధూవరులతో యదువీరులతో రథారూఢుడై ద్వారకా నగరానికి విజయం చేశాడు, అని శుకయోగీంద్రుడు ఉషాని రుద్ధ వివాహ గాథను ముగించి, అనంతర కథ ఆరంభిస్తున్నాడు.కాలచక్రం తిరుగుతున్నది.

తిరుగుతూండగా ఒకనాడు ప్రద్యుమ్న, సాంబ, గద ఆదిగాగల యదువంశ రాకుమా రులు విహారార్థం ఉద్యాన వనానికి వెళ్ళి, హాయిగా క్రీడలు సాగించి, అలసి, దాహంతో ఒక చోట పెద్దముయ్యి చూశారు.

సమీపించి లోపలకు చూడగా ఆ బావిలో నీరు లేకపోగా పర్వతమంత ఊసరవెల్లి కనిపించింది. దాన్ని పైకి తియ్యాలని వారందరూ కలిసి ప్రయ త్నించి, ప్రయోజనంలేక వెళ్ళి వాసుదేవునికి చెప్పారు.

వింటూనే ఆయన ఆశ్చర్యంతో ఆ బావి దగ్గరకు వచ్చి చూసి, దాని తోకపట్టి గడ్డిపరకలా బయటపడేశాడు.

ఆయన కరస్పర్శతోనే అమర పురుషరూపంతో అది యీవలకు రాగా అందరూ. ఆశ్చర్యచకితులై చూస్తూంటే, సర్వలోక విషయకోవిదుడైన వాసుదేవుడు వారి కుతూహలం. చూసి ఆ పురుషుని కథ అడిగాడు.

మహాపురుషా! సర్వమూ తెలిసినా ఏమీ తెలియనట్లు నటించే నీ లీలామానుష రూపానికి నమస్కారం.నేను ఇక్ష్వాకు మహారాజు కుమారుడను.

నన్ను సగ్నుడంటారు. ఈ వృతివిలో ఎవ్వరూ చేయనన్ని గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు చేశాను. వానీ, కూప తటాకాలు నిర్మించాను. నిరతాన్నదానంతో పంచమహా యజ్ఞాలు చేశాను.

ఆత్మస్తుతి ఉచితంకాదు.ఇలా ఉండగా ఒకసారి ఒక వేదవేత్తకు దానం చేసిన గోగణంలో ఒకటి దారి తప్పి వచ్చి వా మందలో కలిసింది.

అది తెలియక వేను ఈ గోపుతో మరికొన్ని గోవులను ఇంకొక ద్విజశ్రేషునికి దానం చేశాను.వారిరువురూ దారిలో కలిసి ఆ గోవుకోసం పోట్లాడుకొని నా దగ్గరకురాగా నా నాన్ని మన్నించి లక్షగోపులు తీసుకోమని ప్రార్థించాను. వారు వినక “నా అవరాధం నవ్నే వేధించుగాక” అని వెళ్ళారు.

నా ఆయుపు చెల్లి నేను పరలోకానికి పోగా, నీ అధర్మానికి ప్రాయశ్చిత్తం చేసుకురా, అని భూలోకానికి పడద్రోశారు.అది మొదలుగా ఈ ఊసరవెల్లి జన్మతో యింతకాలం గడిపాను.

నీ అమ గ్రహంతో హస్తస్పర్శతో నేను ధన్యు ణ్ణయ్యాను, అని అనేకవిధాల ప్రార్థనలు చేసి, దేవతా విమానంమీద అమరపురి చేరాడు.పరీక్షిన్నరేంద్రా! తెలిసికాని తెలియకకాని వేదవిదుల విషయంలో ధర్మంతప్పి చరించటంకంటే ప్రమాదంలేదు.

అంతకన్న వివహనం చేయడం మేలు. ఎందుకంటే గరళానికి విరుగుతుంది. కాని అధర్మానికి లేదు, అన్నారు. శిశయోగేంద్రుడు.

బలరాముడు బంధుజనదర్శవార్షం వ్రేపల్లెకు పోయి అక్కడ ఆత్మీయులతో రుణంగా ఉన్నరోజులలో, ఒకనాడు……కరూశ దేశాధిపతియైన పౌండ్రక నామదేవునిదూత ద్వారకానగరానికివచ్చి, రాజసరా మధ్యంలో :

మా మహారాజు పేరునే పెట్టుకుని, ఆవనవలెనే అలంకరించుకునే వారి గర్వం అంచాలో పేరు మార్చకుంటావో తెల్లునుకు రమ్మన్నాడు, అని అతిగా ప్రేలడంతో వారు దేవుడు కుపితుడై అధిక ప్రసంగాలు అనవసరం.

ఎవరెంతటివారో యుద్ధంలో తేల్చుకుందాం,అని సేనాసమేతం దాడి బయలుదేరాడు.

పౌండ్రకుడు వరిఘ, పట్టిన, ముసల, ముద్గర, పరశు, భిందివాలాద్యాయుధాలతో వాసుదేవుని నిరోధించగా ఆ పురుషోత్తముడు విలాసంగా సర్వశస్త్రాలను తుత్తునియలు చేశాడు.

శత్రురథాన్ని ముక్కలుచేసి, అశ్వాలతో సారథిని వేలకూల్చి, పౌండ్రకుని శిరస్సునుదూదిపింజలా తేలించి వాని నగరంలో పడగొట్టాడు.

అదిచూసి వాని కుమారుడు సుదక్షిణుడు తండ్రికి పరలోక క్రియలు పూర్తిచేసి వాసుదేవునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించి, పరమశివుని భక్తితోపూజించి తన కోరిక తెలిపాడు.పరమశివుడు : Usha and Aniruddha Love Story

నాయనా ! నక్రమంగా అభిచారహెూమం సాగిస్తే అగ్ని హెూత్రుడునిన్ను అనుగ్రహించగలడు, వెళ్ళిరా అన్నాడు.నుదక్షిణుడు తీవ్రనిష్ఠతో సాగించిన అభిచార హెూమంతో తృప్తుడైన అగ్ని ప్రళయ వేళ పుట్టే అవలజ్వాలలతో ద్వారకను చుట్టుముట్టగా యాదవులందరూ కృష్ణుని శరణు వేడారు.

ఆయన సుదర్శనజ్వాలలతో సుదక్షిణుని అనలజ్వాలలు చల్లార్చి సుదక్షిణుని హతమార్చాడు; ద్వారకావాములందరూ వానుదేవుని పరిపరి విధాల అభినందించారు.

Leave a Comment