Vishnu’s Leelas కాలచక్రం తిరుగుతున్నది.

ఒకనాడు పార్వతీ సహితుడై పరమశివుడు వైకుంఠంచేరి మహావిష్ణువును పూజించి, ప్రార్ధనలతో.లోకేశ్వరా! పురుషరూపంతో చేసే నీ క్రీడలన్నీ చూశాం. నీ గాథలు విన్నాం. కాని క్షీరసాగరంవద్ద అమృతకలశంతో మోహినీరూపం ధరించావట. ఆ రూపం చూడాలని వేడుకగా ఉంది, అని అర్థించగా, చిరునవ్వుతో అంగీకరించి, అదృక్య డయాడు.
శ్రీమన్నారాయణుడు ఇంతలో ఏమయ్యాడా! అని ఆశ్చర్యంతో పరమశివుడు నలు వంకలా వెదకుతూ పూలతోటలో ప్రవేశించాడు.
ఆ తోటలో సువాసనలీచే పూలునిండిన లతలు అల్లుకున్న ఒక చెట్టు కొమ్మ నాను కొని జారిపోతున్న పలచని పైటచెరగుతో గాలికి కదిలే ముంగురులతో అందంగావున్న ఫాల భాగంలో కర్ణభూషణకాంతితో శోభిల్లే బుగ్గలతో మిల మిల లాడే తారలవంటి కన్నులతో జారే చీర సరిజేసుకుంటూండగా గల గల లాడుతూన్న బంగారుగాజులతో కందుక క్రీడ సాగించే, నవయౌవనాంగిని చూశాడు, శివుడు.
చూసిన క్షణంలో మహేశ్వరుని మనసు వశం తప్పింది. ఆయనను కికురించే ఊహతో ఆ యువతి తన చేతిలోని బంతితో గుండె లదుముకొని, చెక్కులద్దుకుని బుగ్గల మీద దువ్వుకుంటూ, కొనగోటితో బంతిని దువ్వుతూ, మళ్ళీ బంతితో ఆట మొదలుపెట్టి నవ్వుతూన్న కనులతో ఓరచూపులు విసురుతూ పరుగులు పెడుతూ మధ్యలో పూలతీగెలమీద. ఊయ్యాలలూగుతూ, సంపెంగల వాసనలు గ్రోలుతూ, వనంలోని చంద్ర శిలా వేదికలమీద విశ్రాంతిగా పరుండి, లేచి, పూలరేకులతో కట్టిన గవాక్షాల పొదరిండ్లలో తిరుగుతూ, అంత సేపు కన్నులు పరమశివునిమీదనే కేంద్రీకరించింది.
ఓరిమి చల్లగానే, పరమశివుడు ఒక అడుగు ముందుకు వేస్తూ ఆమె చేతిని పట్టుకున్నారు.
చేతికి అందినట్లే అంది చటుక్కున విడిపించుకొని పైటజారిన వెపంతో సిగ్గుగా పొదమాటుకు చేరగా, వెంబడించాడు గిరిజాపతి.
కిల కిల నవ్వుతూ, జారే పైట గాలికి వదలి, మళ్ళీ నవరిస్తూ, అంతలో దగ్గరకు రానిచ్చి, దూరంగా పరుగెడుతూ, గిర గిర త్రిప్పుతూంటే పరమశివునికి ఇంద్రియనిగ్రహం తప్పింది.
అంతతో ఆయనకు స్వస్వరూపజ్ఞానం రాగా మహావిష్ణువు మాయ అని తెలిసి, ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించి కైలాసానికి వెళ్ళాడు.
నారాయణుడు వైకుంఠం చేరాడు. అవీ ఆయన లీలావిశేషాలు, అని శుకుడు.
రాజేంద్రా!
ఇప్పుడు నడుస్తున్నది వైవస్వతమనువు పాలవ, గౌతమ, కశ్యవ, అత్రి, విశ్వామిత్ర, ఆమదగ్ని, భరద్వాజ, వశిష్ఠులు సప్తర్షులు. ఈ మన్వంతరంలో వామనావతారం ధరించాడు. మహావిష్ణువు.
ఇక ఎనిమిదవ మనువు సావర్ణి. అనంతరం దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మ కావర్ణి, భద్రసావర్ణి, దేవసావర్ణి ఇంద్రసావర్ణి మనువులుగా వస్తారు.
వైవస్వతునికాలంలో శ్రీహరి వామనుడైన గాథవిను :
అమృత పానానంతరం శ్రీమన్నారాయణుని సహాయంతో దేవతలు రాక్షసులను పరాజితులను చేశారుకదా!
అది మొదలుగా బలిచక్రవర్తి తన దాసవగణాలతో భార్గవులను ఆశ్రయించి వారి సేవతో విశ్వజిద్యాగంచేశాడు.
ఆక్రతువు ముగియగానే అగ్నిహెూత్రుడు సంతోషంతో దివ్యరథంతో, సింహ పతాకాన్ని, అభేద్యకవచాన్ని ధనుర్భాణాలనూ బహూకరించాడు.
బలి శాంతచిత్తుడై వేదవేత్తలను వివిధదానాలతో తృప్తిపరచి, వారి ఆశీస్సులతో సర్వభోగాలూ పొందుతూ, దేవతల శత్రుగణాలన్నీ తన్ను చేరి సేవింపగా, సమయంచూసి దేవేంద్రుని మీదికి దాడి వెళ్ళాడు.
వస్తున్న దైత్య, దానవ, అనురబలాలను చూసి దేవేంద్రుడు బృహస్పతిని చేరి యోచించగా, ఆయన యిది యుద్ధానికి అదను కాదని, శత్రుపు చాలాబలంగా వున్నప్పుడు. వైదొలగడం మంచిదనీ, మళ్ళీ కాలం మారినప్పుడు అవలీలగా విజయం సాధించవచ్చుననీ, అనగా, ఆచార్యుని అభిమతానుసారం దేవగణాలు కామరూపాలతో అమరావతి వీడివెళ్ళాయి.
నిశ్చింతగా అమరావతిని ఆక్రమించి బలి తన పరిపాలన ఆరంభించాడు.
అనురగురువులు శిష్యవాత్సల్యంతో వానిచేత నూరు అశ్వమేధాలుచేయించారు.. తనరాజ్యంలో దరిద్రుడుండరాదనే నియమంతో బలిచక్రవర్తి అనేకావేకదానాలతో సర్వ ప్రజకు సంతుష్టి కలిగించాడు.
తన బిడ్డలకు కలిగిన దుర్దశకు చింతించి దేవతల తల్లి అదితి విచారిస్తూంటే ఆమె భర్త ఒకనాడు ధ్యావసమాధి వీడివచ్చి.
ఎందుకు విచారిస్తున్నావు. వేదవేత్తలకు ఏ కష్టాలూ రాకుండా, దేవపూజలకు అంతరాయం కలగకుండా, వయనువచ్చిన పిల్లలు పెద్దలను ఎదిరించకుండా, ఆకలిగొన్న వారిని ఆదరంతో చూస్తూ భోజనం పెట్టి తృప్తిపరుస్తూంటే ఏ ఆపదలూ రావు.
సునకున్నదాంట్లో గుప్పెడు మెతుకులో గుక్కెడు మజ్జిగయో ఇంతకూరముక్కయో ఎదుటివారికి యివ్వకుండా ఎవడుంటాడో వాడికంటె దరిద్రుడు లేడు.
వేదవిదులు తృప్తిపడితే మహావిష్ణువు నంతోపిస్తాడు. వారికి లోటుజరగడంలేదు. కదా, అని ప్రశ్నించగా జరిగినకథ అంతా చెప్పింది. అదితి..
అంతా వినీ ఆ బ్రహ్మవేత్త :
అమాయకురాలా! తండ్రి, కొడుకు, పుట్టుక, సంసారం, ఏమి టివన్నీ. అంతా ఆ శ్రీమన్నారాయణుని మాయ. ఆ వ్యామోహనముద్రంలోపడి కొట్టు మిట్టాడుతోంది. 6 680.
జనకుం డెవ్వడు, జాతు డెవ్వడు.
జను స్థానంబు లెచ్చోటు! సంజననం బెయ్యది,
మేను లే కొలది, సంసారంబు లే రూపముల్,
విమమా యింతయు విష్ణుమాయ
తలవన్ వే రేమియున్ లేదు
మోహనిబద్దంబు, నిదాన మింతటికి
జాయా విన్నబో నేటికిన్.
ఆ మాయలో పడినవారు మాయాకారణుడైన శ్రీహరిని సేవిస్తే ఆయన అనుగ్ర హిస్తాడు, అనగా అదితి.
వాధా! నారాయణ సేవావ్రత విధానం బోధించండి, అంది.
ఆవుపాలు ఆహారంగా తీసుకొని, పన్నెండు రోజులు కఠిన నియమంతో ఆరాధించవలసిన పద్ధతిని పూర్తిగా బోధించాడాయన.
కన్నబిడ్డల కష్టాలు గట్టెక్కించడం కోసం ఆ పతివ్రతా శిరోమణి విద్యుక్తంగా వ్రతం పూర్తిచేసింది.
చతుర్భుజ రూపంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిన ప్రకారం దేవతలకు సుఖ-శాంతి ప్రసాదించడానికి అంగీకరించాడు.
దానవ సంహారంకంటే వారిని నిర్వీర్యులను చేసి దేవతలకు అధిపత్యం యిచ్చే సంకల్పంతో అదితి గర్భాన ప్రవేశించి ఆమె బిడ్డగా వామనుడై శ్రావణ శుద్ధ ద్వాదశినాడు మధ్యాహ్నం ప్రభవించాడు. వామనుడు.
శ్రీ మన్నారాయణుడు తనగ ర్భాన శిశువైన తరుణంనుండి ఆ యిల్లాలు సంతోషంతో
నన్ను గన్న తండ్రి నా పాలి దైవమ
నా తపః ఫలంబ నా కుమార
వాదు చిన్నవడుగ నా కులదీపక
రా గదయ్య భాగ్యరాశి పగుచు
అలా ఆవిడ లాలించి పాలిచ్చి పెంచుతూండగా సప్తమహర్షులు విజయంచేసి ఉప వయవం జరిపించారు.
సూర్యుడు సావిత్రీమంత్రం ఉపదేశించాడు. బృహస్పతి దండంయిచ్చాడు. బ్రహ్మ కమండలు వీయగా, సరస్వతి జపమాల యిచ్చింది.
ధనపతికుబేరుడు భిక్షాపాత్ర యిచ్చాడు, పార్వతీదేవి పూర్ణభిక్ష పెట్టింది.
రోజులు గడుస్తున్నాయి. తన యింటికి వచ్చే విప్రు లందరూ బలిచక్రవర్తి దానాన్ని గురించి పొగుడుతూంటే విని, తల్లి దండ్రుల అనుమతితో దేవతలకు శ్రేయస్సు కలిగించే ఊహతో, లక్ష్మీవల్లభుడైన ఆదినారాయణుడు వామనావతారంతో బ్రహ్మచారిగా భిక్షా పాత్రతో బలిచక్రవర్తి యజ్ఞంచేసే ప్రాంతానికి చేరాడు..
యజ్ఞశాలాప్రాంగణంలో ప్రవేశించే ఆ వామన బ్రహ్మచారిని చూసిన వారందరూ ఆశ్చర్యంతో పరమశివుడో, ప్రజాపతియో, శ్రీమన్నారాయణుడో, సూర్యభగవానుడో, అగ్ని భట్టారకుడో యీ రూపంతో వస్తున్నా డనుకున్నారు.
వస్తూ తార్కికులతో కొంత సేవు చర్చలు జరిపి, మరొకలో వేదపఠనంచేసి, కొందరిని కుశలప్రశ్నలువేసి నెమ్మదిగా బలిచక్రవర్తిని సమీపించి కుడిచేయి అభయముద్రతో వత్తి. స్వప్తి వాక్యాలతో ఆశీర్వదించాడు.
దానవేశ్వరుడు వినయంగా పాదాలుకడిగి పాదోదకం శిరమున జల్లుకుని:
ఓ బ్రహ్మచారీ! నీ రాకతో మా జన్మ చరితార్ధ మయింది. ఇంతకూ నువ్వు ఎవరిబిడ్డపు, పే రేమిటి? ఏం కోరి వచ్చావు. ఏది కావలసినా అడుగు. నా రాజ్యం అయినాసరే నీకు ధారవోస్తాను అన్నాడు.
చిరునవ్వుతో వామనుడు :
దానవేశ్వరా! ఎవరి వాడనవి చెప్పను, నా అంతవాణ్ణి వేనే!
ఎక్క డుంటాననికదా? ఎలా తెలుస్తుంది, అంతటా ఉండేవానికి! ఏం చదువుతున్నావంటే చరవని దేముంది!
నేనెవరికీ ఏమీ కాను, అందరూ నా వారే. ఒకప్పుడు సిరి ఉండేది. ఇప్పుడూ అప్పుడూ సజ్జనుల సన్నిధానంలో ఉంటాను.
ఇక దానం విషయంలో నిన్నుచెప్పి వేరొకరిని చెప్పాలి. మీ వంశంలో దయార్ద్ర హృదయం నీ ఒక్కడికే ఉంది..
హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు మీ ముత్తాతలు. అయినా నీకు మీ తాత ప్రహ్లా దుని బుద్ధులే వచ్చాయి. సంతోషం.
ముల్లోకాలూ ఏలుతున్నావు. మహాదాతగా ఖ్యాతి పొందావు, వేదవిదులకూ, బీదసాదలకూ, దాన ధర్మాలు చెయ్యని రాజ్యాలూ, సంపదలూ వ్యర్థం అని గ్రహించావు
ఇంక నా కేం కావాలనికదా అడిగావు. ఒంటిరివాణ్ణి, నా కేం కావాలి. ఒకటి, రెండు అడుగుల భూదానం చేస్తేనే, నేను బ్రహ్మలోకం వరకు చూస్తాను.
అనగా బలి:: ఓ బ్రహ్మచారీ! ఇంతటి దాతను అంతేవా అడిగేది? అన్నాడు.
మాట్లాడకుండా నవ్వుతూ నిలబడ్డాడు. వామనుడు.
చిన్న వాడివి. బాగా ఆలోచించి అడుగు. భూమండలమా! త్రిభువనసామ్రా
జ్యమా! రథ, గజ, తురగ వాహనాలా, కన్యకామణులా, ఏం కావాలో కోరుకో, అన్నాడు.Vishnu’s Leelas
వామనుడు: రాజేంద్రా! నేను బ్రహ్మచారిని, తాటాకుగొడుగు, రాగికమండలుపు, యజ్ఞో పవీతం అన్నీ అందరూ యిచ్చారు. ఇంక నువ్వు చెప్పిన రాజ్యాలు, రాజ లాంఛనాలూ, రమణీమణులు బ్రహ్మచారికి దేనికయ్యా. దొరికినదానితో తృప్తి పడనివానికి సప్తద్వీపాలు చే జిక్కినా సంతృప్తి ఉండదు.
ఇవ్వాలని ఉంటే మూడడుగుల వేల ధారపొయ్యి. తమరు చక్రవర్తులూ, మహా దాతలూ అని చెప్పి నా అవసరానికి మించి అడగనా!
అంటూండగా బలి సంతోషంతో దానం యివ్వడానికి సన్నద్ధుడయాడు.
అదిచూస్తే శుక్రుడు.. మహారాజా! ఈ బ్రహ్మచారి ఎవ రనుకుంటున్నావు? సాక్షాత్తూ లక్ష్మీవల్లభుడు. దేవకార్యార్థం యిలా అవతరించి విన్ను మాయ చేస్తున్నాడు.
సువ్విచ్చే మూడడుగులకూ, ఒకపాదంతో భూవలయం, రెండవ పాదంతో ఊర్ధ్వ లోకాలూ ఆక్రమిస్తాడు.
దాన మిస్తానని యివ్వకపోతే వరకం సిద్ధిస్తుందని అనుకుంటున్నావా !
దానం చేసి సర్వనాశనం అయేస్థితివస్తే అది దానమే కాదన్నారు ప్రాజ్ఞులు. మనసంపదను అయిదు భాగాలు చేసి అర్థ, కామాలకూ, ధర్మానికి కీర్తికి, ఆశ్రయించు కున్నవారికి సమంగా యివ్వాలని నీతివేత్తలు చెపుతున్నారు.
సర్వనాశనం అయేదశలో ఆడిన మాట తప్పితే అనృతదోషంలేదు.
ఆత్మ అవేచెట్టుకి మూలం అనృతం. అందుచేత అనత్యం వల్ల ఆత్మచెడదు. ఈ చెట్టున ఫల, పుష్పాలే సత్యం. అంటే మ్రానువుంటేకదా పువ్వులూ పళ్ళూ ఉండేది. అదే లేకపోతే యివి లేవే.
వారిజాక్షులందు వైవాహికము లందు
ప్రాణ విత్త మాన భంగ మందు
చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు అఘము పొంద తదివ
అని బోధించే ఆచార్య శుక్రునివైపు చూసి బలిచక్రవర్తి:
ఆచార్య! తమరు గృహస్థ ధర్మం భోధించారు. కాని, భూదేవి ఏమన్నది. ఎటువంటి దుష్కార్యాలు చేసేవారి నయినా భరించగలను కాని అసత్యవాదిని ఒక్కణ్ణి బిరించలేను, అని,
రణరంగలో వెనుదిరిగి పోవడం కంటె చావుమేలు, అలానే అసత్యం పలకకుండా జీవితం సాగించడం మేలు.
రైతుకు బాగా సారవంతమయిన భూమితో మంచివిత్తనాలు దొరికితే ఎంత సంతోషిస్తాడో, దాత తన సంపదలు ధారవోయడానికి పాత్రుడయిన వ్యక్తి దొరికితే అంత ఆనందిస్తాడు.
అదీకాక
కారే రాజులు రాజ్యముల్ కలుగవే
గర్వోన్నతిం బొందరే! వా రేరీ?
సిరి మూటగట్టుకొని పోవంజాలిరే !
భూమిపై పేరైనం గలదే! శిబిప్రముఖులున్
ప్రీతివ్ యశఃకాములై యీరే కోర్కులు
వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!
ఆచార్యా!
సృష్టి మనతో ఆరంభం కాలేదు, మనతో అంతమూ కాదు. ఎందరో రాజులు పాలించారు. ఎన్నో రాజ్యాలు వెలకొల్పారు. కాని ఒక్కరి పేరులేదే! ఈనాటికీ పేరున్న వారు వెనుక ముందులు చూడకుండా సర్వన్వం దానం చేసిన శిబిప్రముఖులేకదా!
మరొక్క మనవి.
ఇప్పుడు నా ఎదుట చెయ్యిజాపి భిక్ష వేడుతున్న దెవరు? మీరే చెప్పినట్లు చతుర్దశ భువనాలకూ క్రీగంటి చూపుతో సర్వైశ్వర్యాలు యిచ్చే శ్రీదేవి శిరనుమీద మృదు పుగా పూలగుత్తులుంచే హస్తం క్రిందై ఆపైన నా చెయ్యి దాన మిచ్చే అదృష్టానికి నోచు కుంది. ఇంతకంటే ఏం కావాలి.
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై
కపోల తటిపై, పాలిండ్లపై
అంశోత్త రీయంబుపై, పాదాబ్జంబుల పై సూత్నమర్యాదం
చెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేలాదే!
రాజ్యము గీజ్యమున్ నతతమే !
కాయంబు నా పాయమే !
గురుదేవా! ప్రళయం వచ్చినా, భూఖండం నిర్మూల మయినా, వంశవాశనం అయినా ఏమయినా నేను దానం యిచ్చి తీరుతాను
మేరువు తలక్రిందైనన పారావారంబు లింకబారిన లో లో ధారుణి రజమై పోయిన తారాధ్వము ఖండమైన తప్పక యిత్తున్
ఎన్నడూ ఎవరినీ ఏమి అడగనివాడు; నా అనేవారు లేని వికాకి విద్యల సారం తెలిసిన బ్రహ్మచారి చేయిచాపి ‘దేవా’ అంటూంటే కాదనలేను,
అని తన సత్యనిష్ఠను ప్రకటించగా, శుక్రాచార్యులు కోపంతో:
ఈనాడు నామాట కాదన్న ఫలంగా అచిరకాలంలో పదభ్రష్టుడ వవుకావు. అని శపించాడు.
అయినా చలించలేదు, బలిచక్రవర్తి..
అప్పటికే మహారాణి వింధ్యావళి బంగారు కలశంతో వీరుతేగా, బ్రహ్మచారికి పాదాలుకడిగి, ఆ జలాలు శిరమున జల్లుకుని:
“విప్రాయ ప్రకటవ్రతాయ
భవతే విష్ణు స్వరూపాయ
వేదప్రామాణ్యనిదే!
త్రిపాద ధరణిం దాస్యామి “
అని కమండలుపులోని జలం ధారపోస్తుండగా, శుక్రుడు ఆ రంధ్రానికి అడ్డువెళ్ళాడు. అది తెలిసి, శ్రీహరి తన చేతిలోని దర్భపుల్లతో లోపలకు పొడిచాడు. దానితో ఆయన ఏక క్షేత్రం డయాడు.
జలధారవిడుస్తూ బలి:
ఓ బ్రహ్మచారీ! భూధానం చేసేవారు దానం గ్రహించేవారూ ఉభయులూ వర్వ సాసవిముక్తులై స్వర్గంలో శాశ్వతరోగా లనుభవిస్తాను కనక ఈ దానంగ్రహించి సర్వలోక కీర్తిపొందు, అన్నాడు.
దానవేంద్రా! సువ్విచ్చిన మూడడుగుల దావంతో ముల్లోకాలూవచ్చినంత సంతోషం పొందుతున్నాను, అన్నాడు బ్రహ్మచారి.
బలి చిరునవ్వు నవ్వాడు.
ఉదకధారపడిన ఉత్తరక్షణంలో
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై
నభోవీధిపై సంతై తోయదమండలాగ్రమున కల్లంతై
ప్రభారాశిపై సంతై చంద్రుని కంతయై
ద్రువునిపై నంతై మహర్వాటిపై వంతై
సత్యపదోన్నతుం డగుచు
బ్రహ్మండాంత సంవర్ధియై.
ఉంది. శ్రీమన్నారాయణుడు అలా త్రివిక్రమరూపం ధరిస్తూంటే నూర్యబింబం గొడుగులా అంతలో శిరోరత్నం, మరుక్షణంలో కర్ణభూషణం, గళహారం, భుజకీర్తి, చేతి కడియం, కటిస్థలాన అలంకరించే బంగారుగుంట, అంతలో కాలిఅందె. చివరకు పాదపీఠం అయింది.
ఒకపాదంతో భూమినీ, రెండవపాదంతో నకలగగనాన్నీ ఆక్రమించగా, దానవ సేవానులు వివిధాయుధపాణులై యుద్ధ సన్నద్ధులయారు.
చిరునవ్వుతో వారిని బలిచక్రవర్తి శాంతింపజేశాడు.
అప్పుడు త్రివిక్రముడైన వామనుడు:
రాజేంద్రా! మూడడుగు లిచ్చావు. రెండడుగులకే బ్రహ్మాండం సరిపోయింది, అవగా ఆ రాత : స్వామీ! ఆ పాదం నాతలపై ఉంచండి, ఏప్రాణికయినా మృత్యువు ప్రాణస్నేహితుడు, యముడు ఆప్తబంధువు, యమకింకరులు సేవకులు. ఈ రహస్యం తెలియక సంసారబంధంలో కొట్టుకునే వారిని ఏమనగలను.
చుట్టాలు దొంగలు. మతులు ఋనిష్ఠులు,
కాంతలు సంసారకారణములు. ధనము లస్థిరములు,
తను వ8 చంచలము,
అని వినయంగా పలుకుతూండగా ప్రహ్లాదుడువచ్చి
శ్రీమన్నారాయణా! ఇంతవరకూ వీనిని ఇంద్రపదవిలో ఉంచి యివ్వ దళకు తేవడం చాలా బావుంది. అహంకార, గర్వకారణమైన ఆ పదవులుతప్పించి బంధవిమో చనం కలిగించిన కరుణామయుడవు, అంటున్నాడు.
అప్పుడు వింధ్యావళి వామనుని పాదాలవ్రాలి పతిభిక్ష వేడగా, అప్పుడే వచ్చిన ప్రజాపతి బ్రహ్మ అర్థించగా నారాయణుడు:
సావర్ణిమనువు కాలంలో బలి ఇంద్రపదవిని అధిష్ఠిస్తాడు. అంతవరకూ జరా మరణ రోగభీతిలేకుండా తన దనుజగణంతో నుతలంలో విశ్వకర్మనిర్మించిన భవనంలో ఉంటాడు, అన్నాడు.
నేవాడు. -బలిచక్రవర్తి నిర్మలానందంతో శ్రీహరి చరణారవిందాలకు నమస్కరించి సుతలం
అనంతరం లోకాలకూ, లోకపాలురకూ వామనుని అధిపతిని చేసి, దేవేంద్రునికి అమరావతి యిప్పించి పరమశివ, ప్రజాపతులు, దేవర్షులు తమ తమ నివాసాలకు చేరారు.
ఇది వామనాcతారకథ.
