Why Bharata Is One of the Greatest Characters in the Ramayana

ఋషభుని కుమారులలో పెద్దవాడైన భరతుడు సింహాసనం అధిరోహించి రాజ్యపాలనను ధర్మబద్ధంగా నిర్వహించాడు. విశ్వరూపుడనే రాజు కుమార్తె వంచజని అనే తరుణిని వివాహం చేసుకొని అయిదుగురు కుమారులను పొందాడు.Bharata

సర్వకర్మలను వేదధర్మానుసారం పరమేశ్వరార్పణగా నిర్వహిస్తూ, తన రాజ్యంలో ప్రజలందరికీ సుఖశాంతులను కలిగించాడు. పూర్వ వంశీకుల కీర్తిని నిలబెట్టి, తన రాజ్య సంపదలను కుమారులకు పంచి పెట్టి, అనంతరం పులహాశ్రమానికి వెళ్లాడు. అక్కడ పురుషోత్తమునిపై మనస్సు నిలిపి, రాగద్వేషరహితుడై హరిపాద సేవలో జీవితం గడిపాడు.

ఒక రోజు ఆశ్రమ సమీపంలోని గండకీ నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా, ఆ నదికి నీరు త్రాగడానికి ఒక లేడి వచ్చింది. అది నిండు గర్భిణిగా ఉంది. నీరు త్రాగుతుండగా అకస్మాత్తుగా సింహం గర్జన వినిపించడంతో భయంతో ఒక్కసారిగా ఎగిరి గంతేసింది.

కడుపులోని లేడిపిల్ల నదిలో పడింది. లేడి ప్రాణాలు పదిలింది. ఆ దృశ్యం చూసిన భరతుని మనసు దయార్ద్రమైంది. నదిలోని లేడిపిల్లను బైటికి తెచ్చాడు. దాన్ని ఆశ్రమానికి తీసుకొచ్చి లాలించి, పెంచుతున్నాడు.నిరంతరం ఆయన దృష్టి ఆ లేడి కూనపైనే లగ్నమై ఉండటంతో మిగిలిన జపతపాలు అన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి.

దాని సేవయే జీవిత పరమార్థంగా భావించి సాగుతున్నాడు. అది పెరిగి పెద్ద చయింది. దానితోనే ఆటపాటలు. దానిని ఏ క్రూరమృగమూ ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపలా కాస్తూ అతడు బ్రతుకుతున్నాడు.

అంతలో ఒకనాడది ఆశ్రమం విడిచి దూరంగా పోయింది. ఎంతో మమకారంతో పెంచుకునే లేడికూన కనిపించక దిగులుతో వెదకడం మొదలు పెట్టాడు. ఈ ఆశ్రమ పరిసరాల్లో పెరిగే లేత పచ్చిక తింటూ, హాయిగా గంతులు వేస్తూ ఇక్కడే తిరిగే ఇది ఎక్కడికి పోయిందో!

ఏ క్రూరమృగమయినా చీల్చుకుతినేసిందేమో! ఎప్పుడూ నన్ను విడిచి ఉండని, తల్లి లేని ఆ కూన ఇప్పుడు ఎలాంటి బాధలు పడుతుందో! పూజకు తెచ్చిన పువ్వులు, పళ్ళను అది ముక్కుతో నాకినప్పుడు నేను కోపంగా మందలిస్తే అలిగి దూరంగా వెళ్లేది. కానీ నేను పిలిచిన వెంటనే మళ్లీ వచ్చి నా వెనుకనే నిలబడేది.

క్రూరమృగాలు హింసించకుండా చంద్రుడు తీసుకువెళ్ళ బాగ్రత్తగా రక్షిస్తున్నా అని పరిపరివిధాల బాధపడుతూ జపతపాలు మరిచిపోయాడు. సర్వేశ్వర నామ స్మరణ విస్మరించాడు. మోక్షమార్గానికి అంతరాయాలని భార్యాబిడ్డలను విడిచి వచ్చినవాడు ఈ లేడిపిల్ల వ్యామోహంలో పడ్డాడు. కొంత సేవు ఆ లేడి స్వేచ్ఛగా తిరిగి పచ్చికమేసి ఆశ్రమానికి వచ్చింది. ఎంతో సంతోషంతో దాన్ని దగ్గరగా తీసుకుని ముద్దులాడాడు. Bharata

అది మొదలు దాన్ని విడిచి పెట్టకుండా కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు: కాలంగడుస్తున్నది. భరతునికి అవసానకాలం సమిపించింది. ఆ సమయంలో వానిమనను పూర్తిగా లేడిపిల్లమీదనే లగ్నంఅయింది. ప్రాణాలు విడుస్తూ కూడా దానినే తలుచుకుంటూ ఉండడంవల్ల మరుజన్మలో లేడిపిల్లగా పుట్టాడు.

పూర్వజన్మ సంస్కారంవల్ల తనకీజన్మ లభించినందుకు చింతించి, ఆవాసనా బలంతో హరినామస్మరణంచేస్తూ నదీతీరాన మునుల ఆశ్రమ సమీపాన జీవితంగడివి కాలం సమీ పించగానే తమపు వదిలాడు.

ఆ పుణ్యఫలంపల్ల ఇంగిరస వంశీయులయిన వివ్రుల యింట్లో జన్మించారు. పుట్టింది మొదలు నిరంతరం హరినామన్మరణ చేస్తూ ఉండేవాడు, ఏ విధంగా అయినా కొడుకును వేదవేదాంగ విడుని దెయ్యాలని తండ్రి ఎంత ప్రయత్నించినా వాని మనస్సు అటు మరలలేదు.

తండ్రి గతించాడు. తల్లి ఆయనతో పరలోకం చేరింది. ఇంట్లోవున్న సవతితల్లి బిడ్డలు వానిని పరిపరి విధాల హింసించారు. శీతవాతాతపాలకు, సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతమయిన స్థితిని పొంచాడు. వానిని జడుడనీ, బధిరుడనీ, ఉన్మత్తుడనీ భావించేవారు. వాని సోదరులు వానిని వంటచేను దగ్గర కాపలా ఉంచారు.

ఆ రోజులలో ఒకనాడు ఆ నగరపు రాజు సంతావార్ధం నరబలి యివ్వాలని నిశ్చ సేవకులను పంపించాడు. చేసిగట్టున అమాయకంగా కూర్చున్న వీనినిచూసి వారు సంతోషంతో మంచి పరవశువు దొరికిందని తీసుకు వెళ్ళారు. వరి శుభ్రంగా తలంటి పోశారు. కొత్త బట్టలు కట్టబెట్టారు. మంచిగంధం పూశారు. పూలమాలలు వేశారు.

అలంకారాలు తొడిగారు, ముమఘుమలాడే రుచులుగల పిండివంటలతో భోజనం పెట్టారు. హారతులిచ్చారు. సాంబ్రాణి ధూపం వేశారు. కాళికాదేవి ముందు నిలబెట్టారు. రాజు సృషలుడు సంతోషంతో కరవాలం పుచ్చుకు వాని దగ్గరనిలబడి, శిరను బండించడానికి సన్నద్ధుడయాడు.

సర్వప్రాణులను తనవలె చూసుకుంటూ, పురుషోత్తముని ధ్యానంలో బ్రహ్మానందానుభూతితో ఉన్న ఆ బ్రాహ్మణ యువకుణ్ని బలిగా అర్పించడానికి తెచ్చిన రాజును, అతని అనుచరులను కాళికాదేవి తన కరాళ ఖడ్గంతో చీల్చి సంహరించింది.

ఆ బ్రాహ్మణ యువకుణ్ని బలి పశువుగా తీసుకొచ్చినప్పుడు అతడు ఎంత నిర్వికారంగా ఉన్నాడో, తన కళ్ల ఎదుట కాళికాదేవి భీకర తాండవం చేస్తున్నప్పటికీ అంతే ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు.

ఆమె కోపం శాంతించిన తర్వాత అతడు ఆలయం వెలుపలికి వచ్చాడు.

తిరిగి యధాప్రకారం తమ చేని గట్టుకు చేరి శాపలా కాస్తున్నాడు. ఆ సమయానికి అదే దారిని నిందుదేశపు రాజు కపిలమహాముని ఆశ్రమానికి వల్లకీ మీద వెళుతున్నాడు.

వల్లకీ మోసే బోయీలు ఈ అమాయకుని చూసి, తమకు కొంత విశ్రాంతి దొరుకుతుందని వానిని పిలిచి పల్లకీ భుజాన పెట్టారు.

నిశ్చింతగా మోస్తూనే పెడుతున్నాడు. మిగిలిన బోయీలతో నమంగా పడవలేక అడుగులు తడబడుతూంటే రాజుగారు కోపంగా మందలించారు. చిరునవ్వుతో ఆ దూషణలు విని నడక సాగిస్తున్నాడు.

నల్లకీకుదువు ఎక్కువై రాజుగారు మండిపడ్డారు. అప్పుడా విప్రవరుడు: మహారాజా ! దూషణభూషణలు శరీరానికే కాని వాకుకావు. ఆకలిదప్పులు ఐరా మరణాలు, రాగద్వేషాలు, నిద్రాజాగరణాలు, అహంకార మమకారాలు ఈ దేహం పున్నంత సేపే. జీవన్మృతులమే. ఓరి జీవన్మృతుడా! అన్నారు మీరు. నిజమే! నేచేశాదు. మనమందరం యజమాని సేవకసంబంధం వున్నదే కది దేహికే కాని బత్మకుకాదు.

మహారాజు మనను మరలింది. మూగ, గ్రుడ్డి, పిచ్చి, జడత్వం వున్న నన్ను ఏమని వింలాభం! అంటూండగా పల్లకి దిగి వాని కాళ్ళమీదపడి: మహానుభావా! ఈ రూపంలో వున్న మీరెవరు? కపిలమహర్షిని కాదుకదా? యమ దండానికి, ఇంద్రాయుధానికి, పరమశివునికి, శూలానికి భయపడను నేను. జ్ఞాన విధియైన వివ్రుడంటే నా మనస్సు గజగజలాడుతుంది.

ఆర్యా! నేను కపిల మహాముని సన్నిదిలో తత్వం గ్రహించడానికి వెడు తున్నాను. మీరెవరో చెప్పి నన్ను ధన్యుని చేయండి, అని ప్రార్ధించాడు.

అప్పుడా యోగి: మహారాజా! నేనెవరినని చెప్పను. ఈ ఉపాధియైన దేహం నిత్యం కాదుకదా! ఇది వున్నంత సేపే దీనికి నామరూపాలు, పొయ్యిమీద కుండ పెట్టి క్రిందమంట పెడతాం. ఆ వేడికి కుండ కాలుతూ లోనికి వీటిని మరగబెడుతుంది. ఆకాశతో అందులో బియ్యం అన్నంగా మారుతాయి.

అలాగే దేహము మరియు ఇంద్రియాలు కలిసి జీవుని కార్యాలను నిర్వహిస్తాయి. సంసార యాత్రలో దేహమనే ఘటాన్ని శిక్షించి, రక్షించేది జీవుడనే రాజు. అయితే అతడు దుష్కర్మలను విడిచి, పురుషోత్తముని ఆరాధన చేసుకుంటే మళ్లీ జన్మబాధ ఉండదు. ఈ విధంగా బోధించగా రాజు తన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాడు.

అప్పుడా యోగి: మహారాజా! ఈ ప్రపంచం అంతా మిధ్య అంటున్నారు వివేకులు. అది తెలియక ఇదే సత్యమని భావించే భ్రమలో నీవున్నావు. కర్మకాండలతో గాని, వేదాంతబోధతో గాని నిజమైన తత్వం పూర్తిగా గ్రహించబడదు. అది స్వప్నంలో కనిపించే ముఖం వంటిది; కన్ను తెరిచిన వెంటనే ఆ కల అంతరించిపోతుంది.

కదా! ఈ మనస్సు ఎంతవరకు విషయసుఖాలను కోరుతుందో అంతవరకు జీవుడు భూతప్రపంచంలోని సంసార వలయంలో భ్రమిస్తూ ఉంటాడు. వాటిని విడిచి పరమగురువైన శ్రీహరి చరణారవింద సేవలో మనస్సు లగ్నమైతే ఇక వానికి బంధాలు ఉండవు. మహారాజా! నేలపై ఆనుకునే పాదాలకంటే వాటిని మోయే పిక్కలు గొప్పవి.

వాటికంటే మోకాళ్లు గొప్పవి, మోకాళ్లకంటే తొడలు గొప్పవి, తొడలకంటే కటిప్రదేశం గొప్పది. దానికంటే రొమ్ము, దానిమీద కంఠం, ఆపై శిరస్సు గొప్పవి. వాటికంటే ఈ పల్లకీ బొంగులు, వాటికంటే పల్లకీ గొప్పది. ఆ పల్లకీలో కూర్చున్న నీవు రాజునని భావిస్తూ, అన్నింటికంటే గొప్పవాడినని అనుకుంటున్నావు.

కాని స్థావర జంగమాలన్నిటికి ఆధారం ఈభూమి అని మరువకూడదు. ఈ వృధిని ఎలా ఏర్పడింది? పరమాణువుల సంయోగం వల్ల ఏర్పడిన దానినే మన మనస్సులోని అజ్ఞానం మహత్తుగా, కాలంగా మరియు అనేక విధాలుగా భావింపజేస్తుంది.

ఇదంతా మాయ. నిత్యమూ శాశ్వతమూ అయినది స్వప్రకాశమయిన భాగవతశబ్దం మాత్రమే। దానినే బ్రహ్మ అన్నారు. ఈ బ్రహ్మను భాగవతుల పాదసేవతో, హరినామస్మరణతో మాత్రమే పొందగలం.

ఇది తెలియక మనుషులు సంసారచక్రంలో పడిపోయి సంతానాన్ని కనిగి, వారి పోషణ కోసం పగలు రాత్రి కష్టపడుతూ జీవితం యొక్క పరమార్థం ఎరుగక యాతన పడుతుంటారు.

ఆ పురుషోత్తముని సేవ చేయలేక పాపాండులతో కలిసి తిరుగుతూ, వారి ప్రభావంతో అనేక కష్టాలకు లోనవుతారు.

“నీవు రాజుననే అహంకార భావాన్ని విడిచి, జ్ఞానఖడ్గంతో అజ్ఞానాంధకారాన్ని ఛేదించు” అని ఉపదేశించగా ఆ రాజుకు జ్ఞానోదయం కలిగింది.

సర్వమూ విడిచి నారాయణ చరణసేవతో వైకుంఠం చేరాడు. ఆ విప్రవరుడు కూడా శ్రీహరి వదాన్ని అందుకున్నాడు.

Leave a Comment