Secrets of Samudra Manthan: The Importance of Kurma Avatar

Kurma Avatar

అ ల నాడు —

క్రూర రాక్షనపీడ పడలేక దేవతలందరూ పరమశివుని, ప్రజాపతినీ ముందుంచుకుని. మహావిష్ణువును ప్రార్థించి తమ క్లేశాలు తొలగించుమని వేడగా :

కాలం మారి మనకు బలం చేకూరేవరకూ శత్రువులతో స్నేహంగా ఉండి సమయం. వచ్చినప్పుడు ప్రతీకారం తలపెట్టాలి. రోజులు సరిగా లేకపోతే పాముకూడా ఎలకకు భయపడుతుంది.

వారూ మీరూ కలిసి పాలసముద్రంలో నర్వ ఓషధులూవేసి, మందరగిరి కవ్వంగా వాసుకి త్రాడుగా మధంచాలి. అందువల్ల మీకు అమృతఫలం సిద్ధిస్తుంది. వారికి క్లేశాలు మిగులుతాయి. మథన వేళ హాలాహలం పుడుతుంది. అయినా భయంలేదు. వెళ్ళిరండి, అన్నాడు నారాయణుడు.

దేవతలందరూ సంతోషహృదయంతో వెళ్ళి అనురేశ్వరుడయిన బలిని సేవిస్తూ కాలం గడుపుతున్నారు. అయినా కొందరు రాక్ష సులుద్వేషంతో దేవతానంహారానికి ప్రయత్నిం చగా బలి వారిని శాంతింప జేశాడు.

అలా ప్రశాంతంగా కొంతకాలం గడిచాక, దేవేంద్రుడొకనాడు వారందరికీ శ్రీర సాగరమథనంవల్ల అమృతం లభిస్తుందనీ అందుకు ఉభయపక్షాలు కృషిచెయ్యాలనీ అన్నారు.

అందరూ ఉత్సాహంతో బయలుదేరి, మందరగిరిని త్రవ్వి మోనుకు రాబోగా అది మహాభారమై దానిక్రిందపడి కొందరు అవయవహీనులుకాగా కొందరు ప్రాణాలే వదిలారు.

అది గ్రహించి నారాయణుడు గరుడారూఢుడైవచ్చి, ఆ మహామందరగిరిన చిన్న బంతిలా చేతపుచ్చుకొని తెచ్చి క్షీరసాగరంలో వదిలాడు.

అప్పుడందరూ వాసుకిని ప్రార్థించి, ఆయనకు కూడా అమృతంలో భాగమిస్తామని తాడుగా చేసి మధనం ఆరంభించారు.

ఆరంభించే వేళ దేవత లందరూ పడగవైపు నడవగా రాక్షమలు కోపంతో: మేం తోక పట్టి నీచులం కాదు, మీరే తోకదగ్గరకు రండి, అన్నారు..

దేవతలు అంగీకరించారు.
మథన సాగుతూండగా వాసుకి:

ఓ మహావీరులారా! ఈ మందరగిరి కింద నిలిచే స్థలం లేనట్టుగా, దిగిపోతుంది. నన్ను వదలండి!’ అని అరిచాడు, అందువల్ల వారందరూ గిరిని ఎత్తడానికి సమస్త శక్తిని మేల్చుకున్నారు.

వారి శ్రమచూసి నారాయణుడు విశాలదేహంతో కూర్మరూపం ధరించి గిరిక్రింద భాగాన కుదురుగా నిలిపాడు.

అంతతో వారందరూ ఒకరి కొకరు ఉత్సాహం కలిగిస్తూ మళ్ళీ మధనం ప్రారంభించారు.

గిర గిర గిర తిరుగుతోంది మందరగిరి, అటూ, ఇటూ, ఆ ధ్వనికి దేవ దానవ వీరులు ఉత్సాహధ్వానాలు తోడై బ్రహ్మాండం బ్రద్దలయే భీతి పుడుతోంది.

ఎడమ కుడి మునుపు తిరుగుచు

కుడి ఎడమను వెనుక తిరుగు కడ లెడల మరలు అమరులు తొడి తొడి ఫణి పణము మొదలు తుదియును దిగువన్….

అలా ఆ గిరీంద్రం కవ్వంలా తిరుగుతూంటే, సముద్రంలోని జీవరాశి అంతా చెల్లా చెదరై పశించి పోతున్నది. ఆ ఊపులో లేచే ఉత్తుంగ తరంగాలలో కొన్ని జలజంతువులు ఆకాశాని కెగురుతున్నాయి.

అంతలో సాగరమధ్యంనుండి హాలాహలజ్వాలలు రేగగా దేవ దానవులు భయ భ్రాంతులై వాసుకిని విడిచి దూరతీరాలకు పోయారు.

రేగిన హాలాహల జ్వాలామాలలు బ్రహ్మాండ మంతనూ భస్మం చేయటోగా అందరూ. హాహారవాలతో పరమశివుని ప్రార్థించారు.

నీకంటె ఒండెరుంగము

నీ కంటెం పరులు గాననేరరు జగముల్

నీకంటె ఒడయ డెవ్వడు

లోకంబుల కెల్ల విఖిల లోకన్తుత్యా
అని దీనాలాపాలు చేస్తుంటే, ఆమహాశివుడు పార్వతీదేవినిచూసి

ఇందరి ప్రాణరక్షణ నా చేతులలో ఉంది. శరణన్నవారిని రక్షించడం మన కర్తవ్యం, ఇప్పుడి హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తాను, అనగా ఆ యిల్లాలు చిరునవ్వుతో అంగీకరించింది :

మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళ మనియును మేలని ప్రజకున్ మ్రింగ మనె సర్వమంగళ! మంగళ మాత్రంబు వెం తమది నమ్మినదో !

అంతే! ఆయన ఆ హాలాహలాన్ని చిన్న వేరేడు పండులా మ్రింగేశాడు.

తన ఉదరాన్ని నర్వభువనాలకూ నిలయం ఇచ్చేలా, కానీ లోపకు వెళ్ళకుండా కంఠంలోనే బిగించి బంధించాడు. అదికారణంగా ఆయన కాలకంఠుడు, గరళగ్రీవుడు అనే బిరుద నామాలతో ఆరాధ్యుడయ్యాడు.

దేవ దానవులు సంతోషంతో మళ్ళీ మథనం సాగించారు. అప్పుడు కామదేనువు పుట్టింది. మరికొంతసాగాక ఉచ్చైశ్రవం ప్రభవించింది. ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, శశాంకుడు; అనంతరం లక్ష్మీ దేవి ఆవిర్భవించింది.

ఐశ్వర్యదేవతామూర్తి శ్రీదేవి ఆవిర్భవించడంతో అందరూ ఆవిడకు సర్వభూషణాలూ, లాంఛనాలూ సమర్పించారు. మంగళస్నానం చేయించారు.

సముద్రుడు పట్టుబట్ట లివ్వగా వరుణుడు వైజయంతీమాల అర్పించాడు. విశ్వకర్మ సువర్ణాలంకారా లందించగా, వరస్వతీదేవి తారహారం అలంకరించింది. ప్రజాపతి పద్మం యిచ్చాడు. నాగజాతివారు కర్ణాభరణా లిచ్చారు. వేదాలు స్తోత్రం చేశాయి.

అఖిలలోక మోహనంగా వున్న శ్రీ దేవిని దేవ దానవులు బొమ్మలయి చూస్తూంటే మహావిష్ణువు చిద్విలాసంతో తిలకిస్తున్నాడు..
ఆ కుమార్తె రత్నం తన చుట్టూ సన్నివేశమై ఉన్న సిద్ధులు, సాధ్యులు, యక్షులు, రాక్షసులు, గరుడులు, గంధర్వులను చూసి

వీరిలో ఎవరిని వరించినా శాశ్వత సుఖ భోగాలుండవు. ఒకరికి ఆయుర్దాయం తక్కువ, మరొకరికి బహుభార్య లుంటారు, యింకొకరికి హృదయంలో దయ ఉండదు. వీరందరిలో ఏవో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి, అని మహావిష్ణువును తిలకించి :

ఈయనను వరిస్తే నిత్యమమంగళినై, నవతుల పోరు లేకుండా, చల్లగా, వైభవాలతో, మెత్తనిహృదయం కలిగి, సాధురక్షణ శీలుడై, అరిషడ్వర్గాలకు అతీతుడైన భర్తను పొందిన దాని నవుతాను, అనకుంటూ వెళ్ళి ఆయన మెడలో పూలమాల వేసింది.

మనసులోని కోరికతో తలయెత్తి చూసింది.

సిగ్గు ముసరగా తల వంచుకుంది.

మరికొంత సేపు తల యెత్తిందో, దింపిందో తెలియకుండా ఉంది.

ఆసమయాన సముద్రుడు కౌస్తుభమణిని తెచ్చి అల్లునికి కానుకగాయిచ్చాడు.

మణితో కన్యామణినికూడా పక్షస్థలం మీద విరాజిల్ల జేశాడు మహావిష్ణువు.

లక్ష్మి పరిణయం అయాక, దేవ దానవులు తిరిగి మధనం ఆరంభించారు.

అప్పుడు వారుణి పుట్టింది.

అది తమకు కావా లన్నారు దానవులు. అంగీకరించారు దేవతలు.

అనంతరం నీలిమేఘకాంతితో నవయౌవనంతో మణికుండల భూషితుడై నారా యణాంశతో అమృతకలళహస్తుడై ధన్వంతరి ఆవిర్భవించాడు.

అమృతకలశం చూస్తూనే అనురులు హుటాహుటి పోయి అది అందుకున్నారు.

అందుకున్న బృందంకంటే దుర్బలు అయినవారు:

ఇది చాలా అన్యాయం. దేవతలకు కూడా యిందులో భాగం ఉంది, అవి అరుస్తున్నారు.

అలా ఉండగా వారిలో బలిష్ఠుడయినవాడు ఆ కలశాన్ని సంగ్రహించగా, అంతకన్న బలిష్ఠుడు దాన్ని లాక్కున్నాడు. అలా చేతులు మారుతున్నది కలశం.
ఇటు దేవతలు దీనవదనులై మహావిష్ణువును ప్రార్థించగా ఆయన చిరునవ్వుతో ఆశ్వాపించి, అంతలో జగన్మోహినీరూపం ధరించి, అమృతకలశం పట్టుకుని వెళ్ళే అనురులవైపు అడుగులు వేశాడు.

మిల మిలలాడే కన్నులతో ఓరచూపులు కలస్వనంతో పెదవులు కదిలిస్తూ చిరునవ్వులు ఉత్తుంగ వక్షోజాలపై పైట జార్చి సిగ్గుగా సరిజేసుకుంటూ హంసగమనంతో అందరినీ అలరిస్తూ నడుస్తూ వస్తూంటే అందరూ ఆ దివ్యమోహన రూపాన్ని చూస్తూ నిలబడిపోయారు.

ఎవరికివారికి ఆమె తననే చూస్తున్న దనిపించింది. అందరూ ఆమె చుట్టూచేరి కన్ను లప్పగించి:

ఇందరం కలిసి అమృతం ఓయువతీ! మేమందరం అప్ప చెల్లెళ్ళ బిడ్డలం. సాధించాం. అది నీ చేత పెడతాం, మాకందరికీ నమంగా పంచిపెట్టు, అన్నారు.

ఓ మహావీరులారా!

అందగాడు కంటబడితే వాని వెంటబడిపోయే ఆడదానిని నేను. నామీద అంత నమ్మకంఉంటే మీ మాటనేవెందుకు కాదవాలి, అంటూ తేవెచినుకుల పలుకులతో, ఒయారంగా అమృతకలశం అందుకుంది.

అందరూ స్నాన సంధ్యాదులు ముగించివచ్చి, తూర్పుముఖంగా దర్భాననాలమీద కూర్చున్నారు.

అప్పుడా జగన్మోహిని దేవతలనూ, రాక్షమలనూ రెండు పంక్తులలో కూర్చోబెట్టి, తొందరపడకుండా, అనురులను కరుణామృతకటాక్షవర్షంతో, శృంగార చేష్టలతో, వావి వరుసలు కలిపి పలుకుల తేవెతో తృప్తిపరుస్తూ, దేవతలకు త్వరత్వరగా అమృతం అందిస్తు న్నది. ఏం మాట్లాడితే ఆ యువతికి ఎంత కోపం వస్తుందో అని అనురులు ఆనందంగా ఆ దివ్యమోహనరూపాన్ని చూపులతో జుర్రుకుంటున్నారు.

దేవతలపంక్తిలో మార్య చంద్రులమధ్య రహన్యంగా చేరిన రాహువు దగ్గరకు జగ న్మోహిని వచ్చేసరికి పీ రిద్దరూ సంజ్ఞతో రాహువు రాక్షనుడన్న సూచన చేయగా, క్షణ కాలంలో నదర్శనంతో రాహువు శిరస్సు గగనానికి చేరింది. అది అనురులకు తెలియనేలేదు.
అంతలో అమృతం పూర్తి అయింది. అమరులయారు దేవతలు.

జగన్మోహిని లేదు.

మహావిష్ణువు మందహాసంతో చూస్తున్నాడు.

రాజేంద్రా!

హరిభక్తులకు తప్ప అమృతం లభించదు. ఎంతటి బలసంపన్నులయినా ఆయన కరుణలేనివారు అనురులవలె శ్రమపడతారే తప్ప ఫలం పొందలేరు, అవి శుకయోగీంద్రుడు :

అనంతరం మహావిష్ణువు లక్ష్మీయుతుడై గరుడవాహనా రూఢుడై వైకుంఠం చేరాడు.

దానవగణాలన్నీ తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దేవతలతో యుద్ధానికి

బయలుదేరాయి.Kurma Avatar

ఉభయులమధ్య ఘోరమైన పోరు సాగుతోంది. అత్యంత బలంకల అనురుల ధాటికి తాళలేక దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థించగా ఆయన గరుడారూఢుడై వచ్చి దేవతలపై కరుణార్ద్ర దృష్టులు ప్రవరించగా వారందరూ దివ్యబలంతో రాక్షససంహారానికి ఉపక్రమించారు.

వారి విజృంభణంతో దానవ సేన పరాజితమై పలాయనమంత్రం పఠించింది- ఇదీ “క్షీరసాగర మథన వృత్తాంతం, అన్నాడు.

ఆ యుద్ధంలో మరణించిన అనురులందరినీ మృతనంజీవనితో పునర్జీవితులను చేశాడు.

శుక్రాచార్యులవారు.

లోకమర్యాద తెలియని దానవేశ్వరుడు బలి, తన పరాజయాన్ని ఆలోచించక, నిశ్చింతంగా నిష్క్రమించాడు.

Leave a Comment