Prahlada Story: The Great Devotee Who Defied Hiranyakashipu
పరీక్షిన్నరేంద్రా!
హిరణ్యకశిపునికి నలుగురు కుమారులు.
వారిలో ప్రహ్లాదుడు పరమభక్తాగ్రేసరుడు.
భూతదయ వానికి చిన్ననాడే అలవడింది.
పరస్త్రీ లెవరుకంటబడినా కన్నతల్లిలా భావించి నమస్కరించేవాడు.
పెద్దలు కనబడితే వినయంగా తలవంచి నమస్కరించేవాడు.
కష్టాలలో వున్నవారిని తల్లిలా ఆదరించేవాడు.
గురువులను దైవంగా భావించి పూజించేవాడు.
స్నేహితులను సోదర్భంవతో చూసేవాడు.
చక్కనిరూపం, విద్యాగంధం, కావలసినంత సంపద వున్నాయి. దానికితోడు రాచ జిడ్డ, అయినా ఈషణ్మాత్రం గర్వంలేదు.
ఏది కావాలంటే అది చేతికి అందుతుంది, కాని యింద్రియాలను నిగ్రహించి చాంఛలు దూరంచేశాడు.
వయస్సు, బలంవున్నాయి కాని కామక్రోధాలు పట్టనివ్వడు. నిరంతరం హరినామస్మరణమేతప్ప మరొక దృష్టిలేదు.
గుణవిధియగు ప్రహ్లాదుని గుణము లనేకములు కలవు గురుకాలమునన్ గణుతింప నశక్యంబులు.
ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.
దేవేంద్రుడు సైతం ప్రహ్లాదుని గుణగణాలను కీర్తించేవాడంటే ఆబాలుడు ఎంతటి సద్గుణ సంపన్నుడో తెలుసుకోగలవు. వరాయణుడు. పరిప పరిహాసానికికూడా అబద్ధమాడని సత్యవ్రత
హరినామస్మరణతో సర్వాన్నీ మరచిన సమయంలో ఆ శ్రీహరి తనప్రక్కనే ఉన్నట్లు అనిపించి దగ్గరవున్న స్నేహితులను మరిచేవాడు.
మహావిష్ణువు తనముందు ఆడుతున్నట్లు అనిపిస్తే చెలికాండ్రతో ఆడుతూ ఆడుతూ అలా నిలబడిపోయేవాడు.
లక్ష్మీనాధుడు తనతో మాట్లాడుతున్నట్లనిపించి ఎదుటివారి ప్రశ్నలకు జవాబిచ్చే వాడుకాదు.
వారాయణుడు తనగుండెలో వున్నట్లు భావించి యిరుగు పొరుగులను మరిచేవాడు. శ్రీహరి నామామృత పానమత్తుడై అలానిశ్చలంగా ఉండేవాడు.
పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్
కామించుచున్ హానలీలా నిద్రాదులు సేయుచుం తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్
సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా!
తనకు పరమవిరోధియైన శ్రీహరిమీద అంతభక్తితో ఉండే కుమారుని మనను మార్చడానికి తగిన విద్య బోధింపజేయాలని భావించి, ఒకనాడు కొడుకును రావించి.నాయనా ! విద్యవల్లజ్ఞానం వస్తుంది. చదువురానివాడు అజ్ఞానంలో ఉంటాడు. మంచిచెడ్డల వివేకం యిచ్చే విద్య నువ్వు గురువులవద్ద చదవాలి :
చదువని వాడజ్ఞుండగు చదివిన నద సద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించెద ఆర్యులొద్ద చదువుము తండ్రీ!
అని తమ కులగురువైన శుక్రాచార్యుల వారి కుమారులు చండామార్కులను
రావించి :
ఆర్యా! ఈ పసివాడికి నా శక్తిసామర్థ్యాలు తెలియడం లేదు. మరీ అజ్ఞానంలో ఉన్నాడు. మీరు మా గురువులు. మా శ్రేయస్సు కాంక్షిచే మీకంటే మాకు ఆప్తబంధువులూ స్నేహితులూ ఎవరున్నారు !
అందుచేత ఈ బాలుని మీ దగ్గర ఉంచి చక్కని నీతి శాస్త్రం బోధించండి, అని అప్పగించాడు.
విద్యాభ్యాసం సాగుతున్నది.
గురువులు చెప్పిన దానిని యధాతధం చదివి వినిపిస్తున్నాడు. ఏనాడూ వారితో వాద ప్రతివాదాలకు దిగలేదు. ఎందుకంటె యిదంతా అనవనరం. హరి చరణారవిందమే శరణ్యం అని త్రికరణశుద్ధిగా నమ్మినవానికి యీ తర్కాలన్నీ వృధా అని ఎరిగినవాడు కదా!
కొన్ని రోజులయాక హిరణ్యకశిపుడు కుమారుని విద్యాగంధం ఎలా వున్నదీ చూడాలని పిలిపించి అడిగాడు.
వాయనా !
తనయుల సంభాషణలు జనకులకు కర్ణభూషణాలు, సంతోష కారణాలు, దుఃఖ శోషణాలు, కనక యింతవరకూ నువ్వు చదివిన వేద, శాస్త్ర,, నీతి విషయాలలో ఏది నీకు బాగా మననుకు పట్టిందో వివరించు అన్నాడు.
ప్రహ్లాదుడు : తండ్రి! ఈ దేహధారులందరూ తమ యిల్లు అవే చీకటి కూపంలో పడి, స్వపరభేదాన్ని వీడలేక, మతి చలించి తిరుగుతున్నారే తప్ప, నర్వమూ విష్ణుమయం అని భావించి హాయిగా ప్రశాంతమైన వనంలో వివసించడం మేలు అని తెలుపు కోలేక పోతున్నారు.
హిరణ్యకశిపుడు ఫకాలున నవ్వి, ప్రహ్లాదుని దగ్గరగా తీసుకుని :
నాయనా! సాధారణంగా లోకంలో పసిపిల్లలు ఎదుటవారు ఏది చెపితే అది విని పిస్తారు చిలకలా, వీకీ బోధలెవరు చేశారు? మనకు విష్ణువు పరమ విరోధి. ఆ నామ స్మరణం మన కనవసరం.
దేవతలను హింసించడం, దేవేంద్రుని పాదాక్రాంతుని చేయడం, మునులను క్లేశాల పాలుచేయడం, అలానే శ్రీహరిని ఆరాధించే వారందరినీ బాధించవలసిన నువ్వు హరీ, గిరి అంటూ చెడిపోకు, అది మన వంశానికే కళంకం, అని మందలించాడు.
ప్రహ్లాదుడు తన గురువు వైపు తిరిగి
గురుదేవా! ఈ ప్రపంచంలో కొందరు అవివేకులు విష్ణమూర్తి శక్తి తెలియక మోహ ములో పడి యిది వాది, వారు పరాయివారు అనే భేదభావంతో కొట్టుమిట్టాడుతుంటారు. బ్రహ్మాదులు తప్ప ఆ పురుషోత్తముని దర్శించగలవారు లేరు.
ఇనుము అయస్కాంతం దగ్గరకు చేరేటట్లు నా మనన్సు శ్రీమన్నారాయణుని వైపే నడుస్తున్నది. అందులో నా ప్రమేయం లేదు.
మరొక్కమాట —
మందార మకరంద మాధుర్యమున తేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనువె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోకిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు
అంబు జోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరవేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల.
అంటూండగా చండామార్కులు క్రోధంతో:
ఔరా! నిండా అయిదేళ్ళు దాటని బాలుడవు. మేం చెప్పిన శాస్త్ర విషయాలలో ఒక్కటికూడా చెప్పకుండా ఎమేమో చెపుతున్నావు. ఏవిటీ అన్యాయం.
నిజానికి వీడు దానవేశ్వరునికి కుమారుడు కాడు. పరమ శత్రువు. దానవ చందనవనంలో పుట్టిన ముళ్ల చెట్టు వాడివి
రాక్షస వంశ నాశనంచేసే నారాయణుని స్మరించే ఈ బాలునికి హిత వచనాలతో బుద్ధి మార్చలేము. తగిన విధంగా దండించి దారికి తేవాలి, అని హిరణ్యకశిపుని వైపు BOR:
మహారాజా! మన్నించండి. ఇకమీద వీనిని దండించి తల తిరిగేటట్లు చేసి రాజ నీతి బోధిస్తాం. అంతవరకూ అనుగ్రహించండి, అని ప్రహాదుని వెంటబెట్టుకుని వెళ్ళాడు.
కొంతకాలం రాజనీతి ఉపదేశించి, సామ, దాన, భేద, దండోపాయాలు పూర్తిగా బాలునికి అవగతం అయాయని విశ్వపించి, వాని తల్లి దగ్గరకు తీసుకువెళ్ళి, చక్కగా అలంకరింపించి బుజ్జగిస్తూ :
వాయనా! నీకు మేము ఏ విషయాలు భోధించామో అవే మీ నాన్నగారి దగ్గర వినిపించు. అక్కడ మళ్ళీ విష్ణుకథలు పాడి మా పరువు గంగపాలు చేయకు, అని వెమ్మ దిగా కొలువుకూటానికి తీసుకువచ్చారు.
సభకు వస్తున్న ప్రహ్లాదుడు అనుక్షణం శ్రీహరి స్మరణతో నర్వం మరిచిపోతున్నాడు. సాక్షాత్తూ హరిభక్తి యీ బాలుడుగా అవతరించిందా అన్నట్లున్నాడు. మనస్సులో శ్రీహరి రూపం, అంతటా హరి విశ్వరూపం చూస్తున్నాడు.
అటువంటి వానిని తండ్రి దగ్గరకు తీసుకువచ్చి, పాదాభివాదం చేయించి, తమ కర్తవ్యాన్ని అప్రమత్తంగా నిర్వర్తించామని చండామార్కులు చెప్పగా, హిరణ్యకశిపుడు కొడు కును దగ్గరగా తీసి, కౌగలించి, తొడమీద కూర్చుండబెట్టి, బుగ్గలు ముద్దాడి, శిరసువిద దువ్వుతూ, ఆనందంతో.
నాయనా ! ఇంతకాలం మీ గురువులు నీకు ఏ ఏ నీతిశాస్త్ర విషయాలు బోధించారో, అందులో విశేషం ఏమిటో చెప్పు. నువ్వు రాజనీతి కోవిదుడవై వినాడు వాకు సంతోషం కలిగిస్తావా, అని ఎదురుచూస్తున్నాను. ఒక్కసారి నీ విజ్ఞానం అంతా నాకు వినిపించు, అన్నాడు.
ప్రహ్లాదుడు :
చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ వే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి!
త్రికరణాలతో హరివి స్నేహితునిగా భావించి హరిసేవా దృష్టి పెంచుకుని, ఆయన నామస్మరణంతో, వందనంచేస్తూ, అర్చించి, దానులమై, ఆత్మజ్ఞానంతో, సంకీర్తనంతో, చింతనతో సర్వాత్ముడైన హరిని నమ్మడమే నజ్జనులకు శ్రేయస్కరమయిన మార్గం,
హరిభక్తి లేని వారికివన్నీ ఎలా ఉంటా యంటే, గ్రుడ్డివానికి వెన్నెలవలె, చెవిటివానిముందు శంఖనాదంలా, మూగవానికి సద్గ్రంధ బోధలా, నపుంసకునికి సుందరాంగితో పొత్తులా.
కృతమ్నులతో బంధుత్వంలా, బూడిదైన హవిర్భాగంలా, లోభిదగ్గర ధనంలా, పంది ముందు నుగంధంలా ఉంటాయి.
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనారు వర్ణించు జిహ్వ జిహ్వ మరరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి తవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవ దేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు తండ్రి హరి జేరు మనియెడి తండ్రి తండ్రి!
దానవేంద్రా!
హరిసేవకు నోచుకోని శరీరం వున్నదే అది గాలి నింపిన తోలుతిత్తి.
విష్ణ సంకీర్తనం ఎరుగని నోరు ఢం ఢం ధ్వని చేసే తక్క.
హరిని పూజించని హస్తాలు కర్రతో చేసిన గరిటెలు, కమలాపతిని చూడని కన్నులు శరీరమనే గోడకు కొట్టిన కన్నాలు.
శ్రీపతిని గురించి యోచించని జన్మ గాలిబుడగ.
విష్ణుభక్తి ఎరుగని విద్వాంసు డున్నాడే వాడు ద్విపాద పశువు.
ఆ విధంగా ప్రహ్లాదుడు భక్తి పారవశ్యంతో మాట్లాడుతుంటే హిరణ్యకశిపుని ఆగ్రహం పెరుగుతున్నది. కన్నులు ఎర్రబడుతున్నాయి.
విష్ణు గాథా సంకీర్తనంలో వున్న ప్రహ్లాదునికి అవేమీ కనిపించడంలేదు. అంతా పరమేశ్వరరూపమే గోచరిస్తున్నది. తన అనుభూతితో మాట్లాడుతూనే ఉన్నాడు.
నాన్నా! శ్రీహరికి దాన్యం చేయడం అనే మారుతం కదలకుండా సంహరమనే కారుమేఘాలు చెల్లా చెదరుకావు.
సంసార తాపత్రయమనే దావాగ్ని చల్లారాలీ అంటే విష్ణు సేవామృత వర్షం కురియాలి.
రావాలి. మనం చేసే పావసముద్రాలు ఇంకిపోవాలంటే శ్రీహరి అనుగ్రహమవే బడబాగ్ని
అనుకోకుండా వచ్చిపడే ఆవదల అంధకారాలు వైదొలగాలనుకుంటే లక్ష్మీపతి స్తోత్రమతే నూర్యకిరణాలు రావాలి.
నిష్కళంకమూ, పునరావృత్తి రహితమూ అయినముక్తినిధిని కనుక్కోవాలంటే ఆ శాపాణి స్మరణమనే అంజనం కావాలి. అంతకన్న బారిలేదు, అని తన్మయుడై చెపుతున్నాడు.
తన తొడమీద కూర్చుని నిర్భయంగా ఆడాలుడు పలికే ప్రతిపలుకూ ఒక ములుకులా గ్రుచ్చుకుంది హిరణ్యకశివునికి.
ఎర్రబడిన కన్నులనుండి విస్ఫులింగాలు వెలువడుతున్నాయి. పళ్ళుపటపటలాడాయి, బుగ్గలుపొంగుతున్నాయి, పెదవి కొరుకుతున్నాడు, కొరుకుతూ, హిరణ్యకశివుడు.
గురువందనా ! నాబిడ్డను నీతిశాస్త్ర కోవిదుని చేస్తామని తీసుకువెళ్ళి మీరు నేర్పిన విద్యలా యివి ! వేదవిరులయిన విప్రవంశీయులని నమ్మినందుకు మంచి ప్రాయశ్చిత్తం చేశారు, అని హంకరించగా
అప్పుడు చండామార్కులు:
దానవేశ్వరా ! మన్నించండి. ఈతప్పు మాదికాదు. మేముకాని, మాఆశ్రమంలో మరెవరకాని ఇటువంటివి భోధించలేదు. ఇది ఈ బాలునికి జన్మతః లభించిన స్వభావం. కాబట్టి దీనికి తగిన పరిష్కారం యోచించండి అని అన్నారు.
హిరణ్యకశిపుడు: బాలకా! నువ్వు నాకొడుకుపై పుట్టి మనపంగాన్ని ద్వేషించే ల శ్రీహరిని ఎందుకు ధ్యానిస్తున్నావు? మనగురువులుకూడా నీకిది భోధించలేదే!
ప్రహ్లాదుడు : తండ్రీ! గృహస్థులై సంసారవిషయంలో పడి జన్మలెత్తుతూ, మరణిస్తూ ఆచక్రభ్రమణం నుండి బైటపడలేక గిలగిలలాడే వారికి యిటువంటి విషయాలు ఒకరు చెపితే తెలుస్తాయా! వారికి స్వతహా ఈ బుద్ధి రావేరాదు.
గ్రుడ్డివాని వెంటబడి పోయేగ్రుడ్డివానికి ఏం కనిపిస్తుంది. అలానే కర్మబద్ధులై నడిచే వారికి విష్ణుస్వరూపం గోచరించదు. నిరంతరం ఆ నారాయణుని చరణకమలాలు కొలిచే వారికి ఆపాదవరాగం సోకి సర్వకర్మలూ నశిస్తాయి.
మహారాజా! సర్వశాస్త్రాలు శోధించగా తేలిన విషయం ఒకటే.
అలుబిడ్డలనే మహా మకర మత్స్యాలతో నిండిన ఈపంసార సాగరం దాటాలంటే.. మారవుని అనుగ్రహమచే నావకావాలి. మరోమార్గంలేదు.
అంటూండగానే రాక్షసేశ్వరుడు తనరెండు చేతులతో ప్రహ్లాదుని క్రిందికిపడద్రోసి, తన అనుచరులను చూస్తూ:
చూశారుకదా వీడిపద్ధతి, తనపినతండ్రిని చంపిన శ్రీహరిని కీర్తిస్తూ ఎంత తన్మయు రపుతున్నాడో. వీడు పుత్రరూపంలో నన్నువట్టిన మహావ్యాధి. వీడి తలవరికిరండి..
శరీరంలో ఏ అవయవమయినా చెడితే దాన్ని ఖండించి మిగిలిన అవయవాలకు నక్షచేస్తాడు. వైద్యుడు. అలావేబూ కులద్రోహిని సంహరించి మిగిలిన వారికి మేలు చెయ్యాలి, అని ఆజ్ఞాపించాడు.
క్రూరరాక్షనులు ప్రహ్లాదుని మండుటెండలో నిలబెట్టి వాడి కూలాలతో పాడిచారు. ఎంతపాడిచినా ఆ హరిభక్తుని శరీరం కందలేదు, రక్తపుచుక్క కారలేదు. కన్ను చెదరిలేదు. చర్మం చిరగలేదు, ఏమాత్రం బాధలేదు వానికి, వారుఅలాపొడుస్తూంటే
ఓ శేషశాయీ! దైత్యమర్దన ! జగదీశ! ఆపన్న శరణ్య! నిఖిల పావనమూర్తీ! అని ప్రార్థిస్తున్నాడు.
శ్రీహరినే మనసులో నిలిపి నిలబడ్డాడు.
మదగజం చేత త్రొక్కించారు.
విషంక్రక్కే వాడికోరల కోడిత్రాచులచేత కరిపించారు.
ఆకాశాన్నంటే మంటల గుండాలలో త్రోయించారు.
పోటుమీద వున్న సముద్రంలో ముంచేశారు.
విషం పెట్టారు. ఎత్తైన కొండలమీదనుండి దొర్లించారు.
మండుటెండలలో నిలబెట్టారు.
కుండపోత వానలో వదిలేశారు.
మంచుగుట్టలమీద పడుకోబెట్టారు.
ఝంఝా మారుతానికి ఎదురునడిపించారు.
గోయిత్రవ్వి పాతి పెట్టారు.
అన్నఆహారాలు లేకుండా చేశారు.
గదలతో కొరడాలతో హింసించారు.
ఇన్ని చేసినా హరిభక్తితో పున్నప్రహ్లాదుని శరీరం ఏ మాత్రం వాడలేదు.
అది హిరణ్యకశిపునికి మరింత బాధ కలిగించింది.
వీడికి జీవనౌషధాలు తెలియవు. రక్షించేవారు లేరు. ఎన్ని చేసినా అమ్మా! అని అరవడు, ముఖకాంతి తగ్గదు. శరీరంలో ఏ రోగమూలేదు. ఇటువంటి ప్రాణిని సంహరించడం ఎలా!
వీడిలో ఏదో దివ్యశక్తి ఉంది. అది నా పాలిట మృత్యుదేవతకావచ్చు, అని ఆక్షణంలో విచారం ఆవహించింది. ఆలోచించాడు.
అది గ్రహించి చండా మార్కులు: దానవేశ్వరా!
నీ కనుబొమలు బిగిస్తే దిక్పాలకులు తలలువంచారు. నీ ప్రతాపానికి పర్వ లోకాలూ దాసోహం అన్నాయి. అటువంటి నీకు వీడెంత.
చిన్నపిల్లలు అజ్ఞానంలో దారి తప్పినడిసే వృద్ధులయిన గురువులవద్ద చక్కని శిక్షణ పొంది సరయిన దానికి వసారు. గురువులు శుక్రాచార్యుల వారు వచ్చేవరకూ వేలి ఉందాం.. ఆయన ఈ బాలునికి తగిన రీతిని నీతి శాస్త్రం బోధిసారు. అవగా హిరణ్య కశిపుడు అంగీకరించాడు.
ప్రహ్లాదుడు మళ్ళీ చండామార్కులు వారి ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ధర్మార కామాలు బోదిస్తున్నాడు. ఇవన్నీ రాగద్వేషాలు కల గృహస్థులకు కాని తనకు కాదని తన ధ్యానం తాను సాగిస్తూనే వారి పాఠాలు వారికి అప్పగించే వాడు.
ఒకనాడు తన తోడి బాలకులందరినీ కూర్చోబెట్టి ప్రహ్లాదుడు.
మిత్రులారా! మన వయసు వారెందలో మరణించడం మీరు చూస్తున్నారు. మన గురువుగారు ఎందుకూ కొరగాని విషయాలు బోధిస్తూ అదేపరమార్థంగా చెపుతున్నారు. ఇవన్నీ విడిచి, మనందరికీ అవసరమైన విషయాలు చెపుతాను. వినండి
ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల ప్రాణులున్నాయి. అన్నిటిలో ధర్మకార్యాచరణ యోగ్యమయినది మానవజన్మ. అందులో పురుషుడై పుట్టడం మరీ అదృష్టం.
అయితే మన ఆయుర్దాయం మారేళ్ళు. అందులోనగం నిద్ర అనే అంధకారంలో పోతుంది. మిగిలిన -యారైలో ఇరవై ఏళ్ళు బాల్య, శిశోరావస్థలలో గడుస్తుంది. ఇంక మనకు మిగిలింది ముప్పది -వత్సరాలు.
ఈ మూడు దశాబ్దాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు బంధించి ఎన్నెన్నో వాంఛలలో ముంచి అవి తీరడం కోసం కొందరు సేవకులవుతున్నారు.
మరికొందరు దొంగతనం చేస్తున్నారు. ఈ రెండూ చెయ్యని వారు వ్యాపారంచేసి ధనం సంపాదిస్తున్నారు. ఈ సంపదల కోసం ప్రాణాలయినా వదలడానికి సిద్ధపడతారు.
అందుకోసం తమ ధీరత్వాన్ని హరించే సంసారంలో పడి, భార్యావ్యామోహంలో చిక్కుకుంటారు. తియ్య తియ్యని పలుకులతో పిల్లలతో గడుపుతారు. శీలము, వయస్సు, సౌందర్యముకల కుమార్తెలను కంటారు. వినయ వివేక విద్యాసంపన్నులయిన కుమారుల కోసం తాపత్రయపడతారు. చెప్పిన పనులు చేసే సోదరుల కోసం ఆరాటపడతారు.
అమరాగ మమకారాలు కల తల్లిదండ్రుల కోసం తాపత్రయపడతారు, ధన, కనక, వస్తు, వాహనాలు, పశువులు, సేవకులు, తండ్రి, తాతలు సంపాదించిన సొమ్ములు వీటన్నిటినీ వదులుకోలేక, సంసారంనుంచి బైటపడలేక, ఈ చుట్టుముట్టిన దారాలతో పాలె గూడులో చిక్కిన ఈగలా గిజ గిజ కొట్టుకుంటూ ఉంటారు.
అందుచేత ఈ కొమార వయస్సులో బహుజాగరూకులమై ఉండాలి. మనం ఆశించ కుండానే దుఃఖాలు మీదపడినట్లే, సుఖాలువస్తాయి. అందుచేతి ముఖసంతోషాల ‘శం తాపత్రయం అవవసరం.
సర్వానికీ శ్రీహరి ఉన్నాడని నమ్మి ఆయన నామం స్మరిస్తూ సంకీర్తన చెయ్యాలి. అలానారాయణ చరణ సేవ చేసే మోక్షం పొందగలం.
చూస్తున్నారు కదా మన పెద్దలందరినీ, ఈ సంసార విషవలయంలో పడి ఎలా అవస్థలు పడుతున్నారో! ఈ జననమరణ చక్రం నుండి బయటపడాలంటే చక్రధారి చరణ సేవయే పరమోత్కృష్టపథం, మహామహులు కూడా తరించలేని భవజలధిని తరించ డానికి నారాయణ స్మరణమే మార్గం.
ఈ విషయాలన్నీ నేను వారద మహర్షి వల్లనిన్నాను.
చాలాకాలం క్రితం మాట. —
అప్పుడి దానవేశ్వరుడు తపోదీక్షలో వున్నాడు.
“Indra! ఇది ఏమి పని? నీకు వైరం Hiranyakashipuతో గాని, ఈ అబలతో కాదు. అంతేకాదు, ఈమె గర్భవతి. కనుక ఆమెను విడిచిపెట్టు.”
అది విన్న దేవేంద్రుడు ఇలా చెప్పాడు:
“మహామునీంద్రా! ఈమె గర్భవతి కావడం వల్లనే బంధించాను. ఈమె గర్భంలో ఉన్న శిశువును ప్రసవ సమయాన సంహరించి, తరువాత ఈమెను విడిచిపెడతాను. ఆ శిశువు హిరణ్యకశిపుని కుమారుడు కదా! అలా చేస్తే ఆ పీడ తొలగిపోతుంది.”
అప్పుడు నారదమహర్షి స్వల్పంగా నవ్వి ఇలా అన్నాడు:
“దేవాధీశా! ఆగర్భంలో ఉన్న బాలుడు రాక్షసేశ్వరుని కుమారుడే అయినా, అతడు మహా హరిభక్తుడు. జన్మాంతర వాసన బలంతో అతడు భగవంతుని భక్తిగా జన్మిస్తాడు.”వానిని ఏ ఆయుధాలు కడతేర్చవు. కవక విడిచిపెట్టు; అనగా దేవేంద్రుడు మాఅమ్మను వదలివెళ్ళాడు.
Narada మహర్షి మా తల్లిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్లి ఓదార్చి, ప్రతిరోజూ ఆమెకు ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు. ఆమె నిద్రపోతూ ఉండగా నేను ఆ ఉపదేశాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడిని. ఆ బోధనలు నా మనసులో చెరిగిపోని విధంగా నిలిచిపోయాయి.
ఈ ఆత్మ నిత్యమైనది, శుద్ధమైనది, నాశనరహితమైనది. అది వికారం చెందదు. అది స్వయంగా ప్రకాశించేది, దేనితోనూ సంబంధం లేనిది, పరిపూర్ణమైనది. అందువల్ల దీనికి భిన్నమైన ఈ దేహంపై మమకారం పెంచుకోకూడదు.
ఎలా అంటే—బంగారు గనుల నుండి తవ్విన రాళ్లను అగ్నిలో కరిగించి స్వర్ణకారుడు బంగారాన్ని వెలికితీయునట్లు, అలాగే ఆత్మను ఆశ్రయించిన ఈ దేహాన్ని త్యజించి బ్రహ్మభావాన్ని పొందాలి.
ఈ సంసారం అంతా ఒక కల. ఇందులో నిద్ర, మేలుకొలుపు అనే అంతకన్న మాయ. ఈ అజ్ఞానాంధకారాన్ని జ్ఞానజ్యోతితో పారద్రోలాలి. భగవత్వాన్నిధ్యం పొందాలంటే దానికి మార్గాలున్నాయి.
గురుశుశ్రూష చేయడం, సర్వస్వాన్ని త్యజించగల మనస్సు కలిగి ఉండడం, సజ్జనులతో సహవాసం చేయడం, ఈశ్వరుని ప్రతిమ ముందు కూర్చొని ఆరాధించడం, శ్రీహరి గాథలను శ్రద్ధగా వినడం, ఆయనపైనే అనురాగం కలిగి ఉండడం, ఆయన గుణాలను మరియు లీలలను కీర్తించడం, నారాయణుని పదపద్మాలపై ధ్యానం చేయడం — ఇవన్నీ భక్తులు తప్పనిసరిగా ఆచరించవలసినవి.
కామం, క్రోధం, లోభం, మోహం, మదం వంటి దుర్గుణాలను విడిచి, ఇంద్రియాలను జయించి, భక్తితో జీవిస్తే మనం పరమాత్మను చేరగలం.
భక్తి పారవశ్యంలో వైకుంఠవాసా! జనార్ధనా! గోవిందా! వానుదేవా ! నారాయణా అని ధ్యానం చేస్తే సర్వంమరిచి పోగలం. భక్తితోనే ఆయన అనుగ్రహం లభిస్తుంది. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శాచశీలతవములం చిక్కడు యుక్తివి-భక్తిని చిక్కినక్రియ అచ్యుతుండు సిద్ధము నుండి!
అందుచేత మనమందరం స్వేచ్ఛగా హరినామ సంకీర్తనం చేస్తూ దైవానుగ్రహాన్ని పొందుదాం” అని చెప్పి, రహస్య ప్రదేశాల్లో వారికి హరినామ సంకీర్తన చేయిస్తూ, Vishnu కథలను వినిపిస్తూ అందరినీ భక్తిమార్గంలో నడిపిస్తున్నాడు.
కొన్ని రోజులకు ఈ విషయం గురువులైన Chanda and Amarka కు తెలిసింది. వారు జరిగిన సంగతులన్నింటిని Hiranyakashipu కు తెలియజేశారు.
ఆ మాటలు విన్న హిరణ్యకశిపుడు తోక త్రొక్కిన త్రాచుపాములా ఎగిసిపడి, కన్నులనుండి నిప్పులు చిమ్ముతూ, గాలిని గట్టిగా పీలుస్తూ, మండుతున్న దావాగ్నిలా తీవ్రమైన కోపంతో Prahlada ను పిలిపించాడు నేను ఆజ్ఞాపిస్తే తప్ప మార్యుడు వేడికిరణాలు వెదజల్లడు. వాయువు సైతం మనక భయపడి చల్లగా కదులుతూంటాడు. మన అనుగ్రహంతో అగ్ని హెూత్రుడు. వెలుగుతున్నాడు. నామాటకాదని యముడు సైతం ఎవరిప్రాణం హరించలేడు.
మన ముందర దేవేంద్రుడు తలవంచి నిలబడాలి. గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, రాక్షసగణాలన్నీ గజగజ వణుకుతూ నా పాదాలపై పడాలి.
అలాంటి నా ముందర నీవు మాత్రం ఇంత నిర్భయంగా ఎలా నిలబడుతున్నావురాదిక్పాలకులు సైతం నామాటకు ఎదురు చెప్పరే! వాడెవడో వైకుంకుడు సర్వశక్తి సంపన్నుడంటున్నావే. దేవగణాలన్నిటినీ నేను చీకాకు పరిచినా కదిలిరాడేం!
“కులగురువుల బోధలను తృణీకరించి, దానవబాలురందరికీ హరినామ సంకీర్తన నేర్పిస్తూ ఎంత పెద్ద ద్రోహం చేస్తున్నావో తెలుసా? ఏకైక వీరుడిగా వెళ్లి చతుర్దశ భువనాలను జయించిన నన్నే ఎదిరించే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు నీకు దిక్కు? ఎవరి బలాన్ని నమ్ముకుని ఈ అక్రమానికి దిగావు?” అని గంభీరంగా గర్జించాడు.. ప్రహ్లాదుడు నవ్వుతూ! దానవేశ్వరా! బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహా దులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బల మనురేంద్రా!
రక్షణలేని వారికి ఎవడు రక్షకుడో, దిక్కులేనివారికి ఎవడు దిక్కో, బలవంతులకూ బలహీనులకూ, బ్రహ్మాదులకూ ఎవడు బలమో—ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు బలం.”తండ్రీ! అసలు శత్రువు లెవరయ్యా ! నీమనస్సే నీకు పరమశత్రువు, ముందు దాన్ని జయించు. తామన ప్రధానమయిన రాక్షనభావం విడిచిపెట్టు.
“లోకాలన్నీ నిమిషాల్లో జయించినా, నీ ఇంద్రియాలను మాత్రం వశపరుచుకోలేకపోయావు. నీలో ఉన్న అరిషడ్వర్గాలే నీకు నిజమైన శత్రువులు. ముందుగా ఆ అంతఃశత్రువులను జయించు.
అప్పుడు నీకు బయట శత్రువు అనే వాడు ఉండడు. వివేకంతో కర్మబంధాలను విడదీసుకొని సంసారవలయం నుంచి బయటపడి, పురుషోత్తమునిపై భక్తిని నిలుపుకో.” అని Prahlada చెప్పాడు.
అది విన్న Hiranyakashipu మరింత కోపంతో ఇలా గర్జించాడు:
“ఓరి మూర్ఖుడా! చంపితే చంపు అన్నట్టు మొండిగా నిలబడి ఇవేంటి బోధలు!”ఈ భువన భవనంలో నన్నమించినవాడు లేడు. నా తమ్ముని చందిన నారాయణుడెవ్వడో, వాడెక్కడుంటాడో చెప్పు.
ముల్లో కాలూ వెదకినా వాడు కనబడలేదు. ఇదిగో, ఇప్పుడే నా కరవాలంతో నీ శిరస్సును ఖండిస్తాను.వాడెవడున్నాడో నీకుదిక్కు రమ్మను అన్నాడు.
ప్రహ్లాదుడు మందహాసవదనుడై, శ్రీహరిని మనసాధ్యానించి: రాక్షసేశ్వరా! ఆయన ఎక్కడున్నారని అడుగుతున్నావా! సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు లేనిచోటు లేదే! కలడంభోధి, కలండుగాలి, కలడాకాశంబునన్ కుంభినిం కలడగ్ని దిశలం పగళ్ళనిశలన్ ఖద్యోతచంద్రాత్మలం కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగవ్యక్తులందంతటం కలడీశుండు కలందు తండ్రి వెదుకంగా వేల ఈయాయెడన్.
ఇందులో ఉన్నాడా? లేడా? అనే సందేహం వద్దు. చక్రధారి అయిన Vishnu సర్వవ్యాపి. ఎక్కడ వెదికినా అక్కడే ఉన్నాడు. అందుకే సర్వత్రా ఆయననే దర్శించగలం, దానవాగ్రణీ! విను.” అని Prahlada చెప్పాడు.
అలా చెప్పగా, ఆ మాటలు విన్న Hiranyakashipu కోపంతో రోమాలు నిక్కబొడుచుకుని, కన్నులు తామ్రవర్ణంగా మెరుస్తూ నిలబడ్డాడు.ఢింభకా! అంతటా పున్నాడంటున్నావే. అయితే ఈ సభామండపంలోని రాతి స్తంభంలో వున్నాడా. అని హుంకరించాడు. ప్రహ్లాదుడు: తండ్రీ!
“చతుర్ముఖ ప్రజాపతి నుండి కాలికింద ఉన్న గడ్డిపరక వరకు అన్నింటిలోనూ నిండి ఉన్న Vishnu ఈ స్తంభంలో ఉన్నాడా అని అడగడం ఎందుకు? చూడు, ఆయన కనిపిస్తాడు.”అంభోజాననుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబుననుండు, ప్రోడ! విపులస్తంభంబునందుండడే!
“ఈ స్తంభంలో శ్రీహరి అంతర్గతుడై ఉన్నాడనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన నిర్భయత్వాన్ని కాపాడటానికి నేడు ప్రత్యక్ష స్వరూపంలో అవతరిస్తాడు” అని Prahlada చెప్పాడు.
అది విన్న Hiranyakashipu వజ్రంలాంటి తన అరచేతితో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. అంతే! ఆ క్షణంలోనే Narasimha స్వరూపంలో Vishnu ఆ స్తంభం నుండి ఆవిర్భవించాడు.
ఆయన భయంకరంగా గర్జించి, జూలు విరజిమ్ముతూ, కళ్ళలో అగ్నిజ్వాలలు మెరిపిస్తూ, భ్రూవిలాసం బిగించి, నాలుకను గిర్రున ఆడించాడు. ఒక్క దూకులోనే హిరణ్యకశిపుని పట్టుకుని, గరుడుడు త్రాచుపామును చీల్చినట్టు తన పదునైన గోళ్లతో చీల్చివేశాడు. అతని ప్రేగులను బయటికి తీసి మెడలో హారంలా వేసుకుని, భయంకరాకారంతో సింహాసనంపై కూర్చున్నాడు ఆ ఉగ్రనరసింహమూర్తి.
అలా ప్రచండ జ్వాలామాలల వంటి నేత్రాలతో ఉన్న ఆ భయంకరమైన రూపాన్ని సమీపించడానికి ఎవరికీ ధైర్యం కాలేదు. అప్పుడు వివిధ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు వచ్చి ఆ మహోన్నత రూపాన్ని దర్శించి ఆశ్చర్యంతో చేతులు జోడించారు. అనంతరం Shiva, Brahma, Indra తదితర దేవతలందరూ కలిసి నరసింహమూర్తిని స్తుతించారు.
అప్పుడుకూడా ఉగ్రరూపంలో వున్న ఆయన దగ్గరకు లక్ష్మిదేవిని పంపించారు. ఆవిడ కొంచం దూరంగా నిలబడి వచ్చి ఇంతవరకూ వేనెన్నడూ యింతటి మహోగ్రరూపాన్ని చూడలేదు. ఆయన కొంచం శాంతించాక వెడతాను అంది.
ఆ ఉగ్రరూపంలోని తీవ్రతను తగ్గించగలవాడు పరమభక్తాగ్రేసరుడైన Prahlada ఒక్కడే అని దేవతలందరూ నిర్ణయించారు. అప్పుడు ప్రహ్లాదుడు చిరునవ్వుతో నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్లి ఆ Narasimha మూర్తి పాదాల వద్ద అంజలి బంధం చేశాడు. వెంటనే ఆ ఉగ్రకోపం చల్లారిపోయి, ప్రహ్లాదుని వైపు కరుణతో నిండిన దృష్టిని ప్రసరించాడు.
ప్రహ్లాదుడు ఆనందభరిత హృదయంతో అనేక ప్రార్థనలు చేయగా Vishnu అతనిని అనుగ్రహించి,
“నీ కర్మబంధాలు సడలిన తరువాత నీవు వైకుంఠాన్ని పొందుతావు” అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.
పరమభక్తుడైన ప్రహ్లాదుని చరిత్రను వినినా, చదివినా నారాయణుని అనుగ్రహం లభిస్తుంది. ధర్మమార్గంలో నడుస్తూ, ఏ ప్రాణినీ హింసించకుండా, దొరికిన దానితో తృప్తిపడుతూ నిరంతరం నారాయణుని స్మరించే వారిని ఎవ్వరూ ఏమి చేయలేరు.
నర్వమూ ఆయన కరుణయే అనుకునే వారికి ఏబాధాలేదు. అన్నిబాధలకూ హేతువైన మనన్సును నిగ్రహించాలి.
సర్వబంధాలను విడిచిపెట్టి, సన్యాసిగా ప్రశాంతమైన ప్రదేశంలో పద్మాసనంలో కూర్చొని, వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను స్వల్పంగా పైకెత్తి, నాసాగ్రంపై దృష్టిని నిలిపి ‘ఓంకారం’ను జపిస్తూ, రేచక–పూరక–కుంభక ప్రాణాయామాల ద్వారా ప్రాణాపానాలను నియంత్రించిన వాని మనస్సు ప్రశాంతంగా నిలుస్తుందిఅప్పుడది బ్రహ్మానుభూతి పొందుతుంది. ఈ శరీరం రథం. బుద్ధి సారధి. ఇంద్రియాలు గుర్రాలు మనను పగ్గం.
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ — ఇవే శరీరంలోని పది వాయువులు. ధర్మం, అధర్మం ఇవి చక్రాలవంటివి.
శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఇవే వాటి సంచార ప్రదేశాలు.జీవుడే రధికుడు, ప్రణవమంత్రమే ధనుస్సు, శుద్ధజీవుడు బాణం. దీని లక్ష్యం బ్రహ్మానుభూతి.
రాగద్వేషాలే వీని శత్రువులు, అందువల్ల ఈ శరీరరథాన్ని తన నియంత్రణలో ఉంచుకుని, భాగవతుల పాదపద్మాలను సేవిస్తూ, అదే ఖడ్గముగా చేసుకొని నారాయణుని అనుగ్రహబలంతో రాగ–ద్వేషాది శత్రువులను నిర్మూలించి, శుద్ధజీవశరాన్ని ప్రణవమనే ధనుస్సుకు సంధించి బ్రహ్మపదాన్ని చేరాలి.
అలా చేయని వాడిని ఇంద్రియాలనే గుర్రాలు, బుద్ధినే సారథిగా చేసుకుని తమకు అనుకూలంగా నడిపిస్తూ సంసారకూపంలో తిప్పి, విషయసుఖాలనే శత్రువుల మధ్యలో విడిచిపెడతాయి. అందువల్ల వాటికి అతీతంగా శ్రీమన్నారాయణుని నామసంకీర్తనను కొనసాగిస్తూ మన జన్మను చరితార్థం చేసుకోవాలి.
